రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
శింగనమల: అనంతపురం జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శింగనమల మండలం లోలూరు క్రాస్ రోడ్డు వద్ద బెంగళూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇద్దరు చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.