three died
-
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు. -
130 కిలోమీటర్ల వేగం.. నిద్రమత్తు... ముగ్గురు మృతి
సాక్షి, చిత్తూరు, తవణంపల్లి: బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిపై తవణంపల్లె మండలం నర్తపుచేను చెరువు వద్ద శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. వివరాలు.. బాపట్ల జిల్లా నాగులుప్పులపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన అశోక్‌బాబు(33), భార్య మౌనిక (29), కుమారుడు ప్రభవ్ (3) కారులో బెంగళూరు నుంచి గుంటూరులోని అత్తగారింటికి బయలుదేరారు. నర్తపుచేను దగ్గరకు వచ్చేసరికి కారు అదుపుతప్పి పక్కన సరీ్వసు రోడ్డులో ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదతీవ్రతకు డ్రైవింగ్ చేస్తున్న అశోక్ తల, మొండెం వేరయ్యాయి. పక్కసీట్లో ఉన్న భార్య, కుమారుడి తలలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఘటనాస్థలం.. రక్తసిక్తం ప్రమాదస్థలం బీతావహంగా తయారైంది. ఛిద్రమైన శరీరాలతో రక్తసిక్తంగా మారింది. కారు పైభాగం ట్యాంకర్ కిందకు వెళ్లిపోవడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. డ్రైవింగ్ చేస్తున్న అశోక్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తూ ట్యాంకర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. కారులో రెండు సెల్ఫోన్లు దొరికినా, అవి లాక్ అయి ఉన్నాయి. దీంతో ఆ ఫోన్లకు కాల్ వచ్చేవరకు పోలీసులు వేచి ఉండాల్సి వచ్చింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎస్పీ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసరెడ్డి వివరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బంధువుల ఇంటికొస్తూ.. నాగులుప్పలపాడు : చిత్తూరు జిల్లా తవణంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అశోక్ బాబు స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 20 ఏళ్ల కిందట అశోక్‌బాబు తల్లిదండ్రులు అద్దంకి ఆంజనేయులు, వెంకాయమ్మ కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చి వెళుతుంటారు. అశోక్‌బాబు పదో తరగతి వరకు నాయనమ్మ వద్ద ఉంటూ ఉప్పుగుండూరు పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత చదువుల తర్వాత బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మౌనికతో ఐదేళ్ల కిందట వివాహమైంది. గుంటూరులో అత్తగారింటికి వస్తున్న అశోక్‌బాబు కుటుంబం ప్రమాదంలో మృత్యువాత పడటంతో బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
-
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్ (11), కార్తీక్ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు. దీపక్ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్ఐ నవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి
సాక్షి, రామంతాపూర్: నగర శివారులోని చౌటుప్పల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణానికి గురయ్యారు. వారంతా రామంతాపూర్ నెహ్రూనగర్‌లోని ఎలక్ట్రికల్ గృహోపకరణాల అధీకృత సర్వీస్ సెంటర్లో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న యువకులు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకుకున్నాయి. వివరాలివీ... హరీష్(25), సల్మాన్(24), ఆసీఫ్(24)లు శుక్రవారం రాత్రి హరీష్ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బైక్‌పై నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ ధర్మాజిగూడెం వే బ్రిడ్జి వద్ద ఓ లారీ రివర్స్ చేస్తూ వారి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సర్వీస్ సెంటర్ పై అంతస్తులో నివసిస్తూ పనిచేసుకుంటున్న హరీష్ స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి. సల్మాన్‌ది గజ్వేల్. మేడ్చల్ జిల్లా గౌరవరంకు చెందిన ఆసీఫ్ సర్వీస్ సెంటర్ యజమాని సలీంకు సమీప బంధువు కావడంతో రామంతాపూర్‌లోని భరత్‌నగర్‌లోని ఆయన గృహంలోనే ఉంటున్నాడు. ఆసీఫ్ అంత్యక్రియలు రామంతాపూర్‌లో నిర్వహించారు. చదవండి: బైక్ పై వెళ్తున్న దంపతులపై అకస్మాత్తుగా దూసుకెళ్లిన గేదె -
ముగ్గురిని కాటేసిన కరెంట్: కన్నీటిలో ‘కన్నికాపురం’
కడుపులు మాడ్చుకున్నాం. కష్టాలకోర్చి చదివించాం. మీకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తుంటే ఎంతో పొంగిపోయాం. త్వరలోనే ఉద్యోగాలు తెచ్చుకుని ఆసరాగా నిలుస్తారని ఆశపడ్డాం. ఇక మాకు కష్టాలు ఉండవని కలలుగన్నాం. కానీ ఆ దేవుడు మా ఆశలను చిదిమేశాడు. చేతికొచ్చిన కొడుకులను తీసుకెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు కొడుకా..? అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన చూపరులను కంటతడి పెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పాలసముద్రం: మండలంలోని కన్నికాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో సోమవారం ముగ్గురు మృతిచెందడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన చిన్నబ్బమందడి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కంకర అవసరం కావడంతో వేల్కూరు నుంచి టిప్పర్‌లో తెప్పించి అన్లోడ్ చేయిస్తున్నాడు. అంతలోనే పైనే ఉన్న కరెంటు వైర్లు టిప్పర్‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై డ్రైవర్ మనోజ్ (34) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో గ్రామస్తులు దొరబాబు (23), జ్యోతీశ్వర్ (19) ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో ముగ్గురూ మృత్యువాత పడడంతో గ్రామంలో తీరని విషాదం అలుముకుంది. ఆశలన్నీ వారిపైనే గ్రామానికి చెందిన సీదల బాలాజీనాయుడు, ఉష దంపతులకు దొరబాబు, సోమేశ్, చంద్రిమ పిల్లలు. దొరబాబు పెద్దవాడు. సోమేష్, చంద్రిమ కవలలు. ఇంటర్ చదువుతున్నారు. పెద్దకుమారుడి భవిష్యత్తు కోసం తపించారు. ఉన్నకొద్దిపాటి పొలంలో పంటలదిగుబడి అంతంతమాత్రంగా రావడంతో అప్పులపాలయ్యా రు. కానీ పిల్లల చదువుకు వెనకడుగు వేయలేదు. పస్తులుంటూ కూడబెట్టి పెద్ద కుమారుడు దొరబాబును తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని ఓ బీటెక్ కళాశాలలో చదివించారు. గతేడాది ఫస్ట్‌క్లాస్‌లో పాసవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డారు. కష్టాలు తీరుతాయని సంబరబడ్డారు. ఇంతలోనే విధి వారి ఆశలను చిదిమేసింది. అప్పటివరకు కళ్లెదుట కలియదిరుగుతూ మాటలు చెప్పిన కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడంతో తల్లడిల్లిపోయారు. ఇక అదే గ్రామానికి చెందిన వెంకటేష్ నాయుడు, రోహిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పవన్‌కుమార్ పెద్దవాడు. చిన్నవాడైన జ్యోతీశ్వర్ చదువుల్లో మేటి. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ పూర్తిచేశాడు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి రోహిణి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె సక్రమంగా నడవలేని స్థితి. ఇద్దరు పిల్లలూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఉపాధి పనులకెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. ఇంతలో అనుకోని ప్రమాదం ఓ కుమారుడిని కబళించడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదిలా ఉండగా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ, పెద్దకాలువ గ్రామానికి చెందిన మనోజ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. మృతులు ముగ్గురూ అవివాహితులు. లాక్డౌన్ లేకుంటే..! కరోనా లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో దొరబాబు, జ్యోతీశ్వర్ కూడా ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్ లేకుంటే పిల్లలు చదువుల కోసం వెళ్లేవారని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఘోరం: కారులోనే ముగ్గురు సజీవదహనం
మండ్య: రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కాగా, ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని మళవళ్లి తాలూకా హలగూరులో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన కేజీ హళ్లి నివాసి షేక్ కైజల్ (45) కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. భార్య మెహక్(33), కుమార్తెలు షేక్ ఐహిల్ (6) మెహైరా (11), సుహాన (12)తో కలిసి ఓ పని నిమిత్తం జిల్లాలోని కొళ్లెగాల హనూరు వచ్చారు. శుక్రవారం ఉదయం బెంగళూరు బయల్దేరారు. హలగూరు భారతీయ పెట్రోల్ బంక్ వద్ద కారు నియంత్రణ తప్పి రోడ్డు పక్కన సేఫ్టీ స్టోన్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంటలో బోల్తా పడింది. కారు నుంచి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. షేక్ కైజల్, సుహాన, షేక్ ఐహిల్ మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలైన మిగతా ఇద్దరిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్
దొడ్డబళ్లాపురం: సురక్షిత పరికరాలు లేకుండా భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. హరీష్ అనే కాంట్రాక్టర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్వహణను చూస్తుంటాడు. పట్టణ పరిధిలోని న్యూ నేతాజీ స్కూల్ వెనుక డ్రెనేజీలో సమస్య ఏర్పడింది. దీంతో మంజునాథ్ అనే వ్యక్తి ఇద్దరు కార్మి కులు, రాకేశ్‌లను బెంగళూరు నుంచి పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మ్యాన్‌హోల్‌లో దిగి పనులు చేస్తుండగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. అగి్నమాపక సిబ్బంది, రామనగర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో బాధితులను బయటకు తీసి రామనగర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వర్క్ ఫ్రమ్ హోంతో ఇంటికి రాగా ముగ్గురు కరోనాకు బలి
సాక్షి బళ్లారి: కరోనా రక్కసి మృత్యుతాండవం చేసింది. ఒక కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బళ్లారి జిల్లాలో కురుగోడు తాలూకా పరిధిలోని మదిరే గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రుద్రప్ప కుమారుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. లాక్డౌన్ ప్రకటనతో పాటు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో నెల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడే కుమారుడికి కరోనా సోకింది. ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ కోలుకున్నాడు. అయితే కుమారుడి ద్వారా తల్లి సునీతమ్మ (45), చెల్లి నందిని (18)కి, తండ్రి రుద్రప్ప (56)కు కరోనా సోకింది. సునీతమ్మ, నందిని కంప్లిలో చికిత్స పొందుతూ 15 రోజుల కిందట మృతి చెందారు. తాజాగా బళ్లారిలో చికిత్స పొందుతున్న రుద్రప్ప మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ముగ్గురి మృతి కలకలం: అంతా ‘మిస్టరీ’ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు వ్యక్తుల అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వివాదాస్పదమైంది. కల్తీ కల్లు కారణమని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త రంగంలోకి దిగి సదరు కల్లు డిపో బాధ్యులతో కలిసి బాధిత కుటుంబాలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పలువురు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందినట్లు సమాచారం. 7వ తేదీన ఒకరెనుక ఒకరు.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు (55), పింజరి సిద్దయ్య (47), వెంకన్న (60)కు కల్లు తాగే అలవాటు ఉంది. దాదాపుగా ప్రతి రోజూ వీరు కల్లు తాగుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ముగ్గురు రోజు వారీగానే ఈ నెల ఏడో తేదీన కల్లు తాగి సాయంత్రం వారివారి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరెనుక ఒకరు మృతి చెందారు. తెల్లారి ఉదయం గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వీరి మృతికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ఏ విషయం బయటికి రాలేదు. కానీ ఆ ముగ్గురి అనుమానాస్పద మృతిపై ఇటీవల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు? అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందడంతో ఉలిక్కిపడిన కల్లు డిపో పెద్దలు వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా కుటుంబాలతో సంప్రదింపులు జరిపేలా జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.10 వేలు, 50 కిలోల బియ్యం అందజేసినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎక్సైజ్ అధికారుల పాత్రపైనా అనుమానాలు ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురి మృతి విషయం వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ నెల 24న గ్రామాన్ని సందర్శించారు. నేరుగా కల్లు డిపోకు వెళ్లి శాంపిళ్లు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందు కలిపినట్లు తమకు ఆధారాలేవీ లభించలేదని.. అనుమానంతో శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. ఇక్కడ అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందిన విషయాన్ని వెల్లడించకపోగా.. దాచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలోని మృతి చెందిన బాధితుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మరో ఆరుగురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఉందని వారు చెప్పారు. దీన్ని బట్టి తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్ర ఉందా.. గద్వాల జిల్లాలో సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పారీ్టకి చెందిన నాయకుల మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు. జల్లాపురంలో ముగ్గురి అనుమానాస్పద మృతికి సంబంధించి అధికార పార్టీ శ్రేణుల్లో చర్చ ఈ ముగ్గురి నేతల చుట్టే సాగుతోంది. ఇందులో ఏమైనా కుట్ర జరుగుతోందా.. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు.. వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై సదరు జిల్లా కీలక ప్రజాప్రతినిధి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘రాజకీయ కక్షలతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు చనిపోయిన విషయం వాస్తవమే. మేము ఆ సమాచారం తెలుసుకొని గ్రామానికి వెళ్లాం. అక్కడి పరిస్థితిని చూసి అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం. అంత్యక్రియల కోసం ఇద్దరికి డబ్బులు పంపించాం. అందులో ఒక్కరు మాత్రమే తీసుకున్నారు. పదేళ్లుగా గ్రామంలో పెళ్లిలు, శుభకార్యాలకు, మట్టి ఖర్చులకు ఇస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇస్తున్నాం. కానీ ఒక బీసీ నాయకురాలు ఎదగడం ఇష్టం లేని కొందరు రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారు. విచారణ చేసి నిజనిజాలు వెలికితీయాలని మేము పోలీసులను కోరాం.’ అని తెలిపారు. -
కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తితో సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా బుధవారం ఒక్కరోజే రాజకీయ, సాహిత్య, మీడియా రంగాలకు చెందిన ముగ్గురు మృతిచెందారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ రచయిత అనీశ్ దేవ్ (70), మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఏక్నాథ్ గైక్వాడ్ (81), తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ మంత్రిగా పని చేశారు. ఒకసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఇక పశ్చిమబెంగాల్‌కు చెందిన అనీశ్ దేవ్ ప్రముఖ రచయిత. ఆయన 18వ ఏట నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. బెంగాలీ సాహిత్య రంగంలో గొప్ప సేవలు అందించారు. ఆయనకు బెంగాల్ ప్రభుత్వం 2019లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే.. చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు -
షాక్ అయ్యాం
బుధవారం రాత్రి చెన్నైలో ‘ఇండియన్ 2’ సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ క్రేన్ కూలిన చుట్టుపక్కలే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తదితర తారాగణం ఉన్నారట. మరోవైపు దర్శకుడు శంకర్ తన టీమ్‌తో మానిటర్లో షాట్ చెక్ చేసుకుంటున్నారట. శంకర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కమల్ స్పందిస్తూ– ‘‘నేను చాలా ప్రమాదాలను చూశాను కానీ ఇది చాలా తీవ్రమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధను వర్ణించలేం’’ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయిల విరాళం ప్రకటించారాయన. ‘‘ఈ ఘటనకు చాలా షాక్ అయ్యాను. ఇంకా తేరుకోలేకపోతున్నా. అంతా క్షణికంలో జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఏమీ జరగకుండా సురక్షితంగా ఉండి, ఈ ట్వీట్ చేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞురాలిని. ఈ ఘటనతో జీవితం విలువ, సమయం విలువ అర్థం అయింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు కాజల్. -
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
విషాదం: ముగ్గురు యువకుల మృతి
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం ముత్యంపేట్ గ్రామంలో ముగ్గురు యువకులు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఒకరిని కాపాడటానికి మరోకరు బావిలోకి దిగి ముగ్గురు యువకులూ మరణించారు. మొదట రాజేష్ (26) అనే వ్యక్తి బావిలోకి దిగాడు, అతను ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ (25) లోపలికి దిగాడు. వారిద్దరూ బయటకు రాకపోవడంతో వారిని కాపాడేందుకు మహేష్ (18) బావిలోపలికి దిగాడు. చివరికి ముగ్గురూ మృతి చెంది వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చారు. అయితే వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బావిలో విషవాయువులు ఏమైనా ఉన్నాయా?, లేక ఊపిరాడక చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా మృతదేహాలను బయటకు తీయడానికి ఎవరినీ బావిలోనికి దిగనీయడం లేదు. జేసీబీ యంత్రాలతో వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు సరదగా ఉన్న ముగ్గురు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లారీని ఢీకొట్టిన కారు,ముగ్గురు మృతి
-
గాజులరామరంలో నీటి గుంతలో పడి ముగ్గురు మృతి
-
ట్రామ్‌రైలులో కాల్పులు
ది హేగ్: న్యూజిలాండ్‌లో నరమేధం ఘటన మరవకముందే నెదర్లాండ్స్ నెత్తురోడింది. నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్ పట్టణంలో సోమవారం ట్రామ్‌రైలులో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మేయర్ జాన్‌వాన్ జానెన్ ప్రకటించారు. ఈ చర్య ఉగ్రదాడేనని భావిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపిన తరువాత దుండగుడు పారిపోయాడని, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి ప్రజల రాకపోకల్ని నియంత్రించి, దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బాధితులకు సత్వర సాయం అందించేందుకు అక్కడికి హెలికాప్టర్లను పంపించామని చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ భవనం ముందు ఉగ్ర వ్యతిరేక బలగాలు తనిఖీలు విస్తృతం చేశాయి. కెమెరాలతో కూడిన జాకెట్లు వేసిన జాగిలాలతో ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని పెద్ద పట్టణాల్లో ఒకటైన ఉట్రెక్ట్‌లో ట్రామ్ పట్టాలపై వస్త్రాలతో కప్పిన మృతదేహాలు ఉన్న చిత్రాల్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని మార్క్ రుటె తన అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని, అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. దేశంలో అసహనానికి చోటులేదని, ఈ దాడిలో ఉగ్ర కోణాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు. అనుమానితుడి అరెస్ట్.. సోమవారం ట్రామ్‌రైలులో దాడికి అనుమానితుడిగా భావిస్తున్న టర్కీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు, గోక్‌మన్ టానిస్‌గా గుర్తించిన అతని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నలుపు రంగు దుస్తులు, గడ్డంతో అతను ట్రామ్‌లో ప్రయాణిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దాడి తరువాత ఉట్రెక్ట్ పట్టణంలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు విమానాశ్రయాలు, ఇతర కీలక భవనాలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాల్లో అడపాదడపా ఉగ్ర దాడులు జరిగినా, నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఘటనలు అరుదే. గత ఆగస్టులో 19 ఏళ్ల అఫ్గాన్ పౌరుడు అమ్‌స్టర్‌డ్యామ్ ప్రాంతంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఇద్దరు అమెరికన్లను గాయపరిచాడు. -
లారీని ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా..
కార్తీక పున్నమి వెలుగులో దివ్యదేవుని దర్శనభాగ్యం దొరికిందన్న ఆనందం మరుక్షణంలో ఆవిరవుతుందని గుర్తించలేకపోయారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో యాత్ర విశేషాలు పంచుకుందామనుకున్న వారి యాత్ర విషాదంగా మారుతుందని తెలుసుకోలేకపోయారు. మంచు తెరలను చీల్చుకుంటూ కారులో రయ్యిమని దూసుకొస్తున్న వారికి లారీ రూపంలో మృత్యువు తమ ముందే ఉందని గమనించలేకపోయారు. శనివారం వేకువజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద లారీని వెనకగా కారు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. తెల్ల వారుజామున ఎర్రని నెత్తుటి ముద్దలుగా మారి జిల్లా గుండెలపై కన్నీటి తడి మిగిల్చారు. ‘దేవుడా.. మా కుటుంబ సభ్యుల ప్రాణాలను అర్ధంతరంగా కొండెక్కించావా’ అంటూ బంధువులు గుండెలవిసేలా రోదించారు. చిలకలూరిపేటరూరల్: దైవదర్శనానికి వెళ్లి వస్తున్న వారి జీవితాలపై విధి విషం చిమ్మింది. రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని తాతపూడి వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాల మేరకు.. అరుణాచలం వెళ్లి అనంతలోకాలకు .... తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన ఇమ్మంది సోమశేఖర్, పలివెల సుబ్బారావు, పల్లి దినేష్, రేగుల సత్యసారథి స్నేహితులు. ఈ నెల 21వ తేదీ గురువారం రాజమండ్రి నుంచి కారులో తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంకు వెళ్ళారు. సుబ్బారావు, సోమశేఖర్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరిలో సారథి కారు నడుపుతున్నాడు. పక్కనే సీట్లో దినేష్ కూర్చున్నారు. వెనుక సీట్లో సుబ్బారావు, సోమశేఖర్ ఉన్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు తాతపూడి బ్రిడ్జి వద్ద కారు ముందు వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వేగంగా వస్తున్న కారు.. లారీని వెనక నుంచి ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రేగుల సత్యసారథి(28), కారు యజమాని పల్లి దినేష్(31), పలివెల సుబ్బారావు,(30) అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యప్ప దీక్షలో ఉన్న మరో వ్యక్తి ఇమ్మంది సోమశేఖర్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. బెలూన్స్ తెరుచుకున్నా.. వేగంగా లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఇందులోనే వారు ఇరుక్కుపోయారు. దీంతో బెలూన్స్ తెరుచుకున్నా బయటకు రాలేక మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎస్ విజయ చంద్ర, ఎస్ఐలు ఉదయ్‌బాబు, వపన్‌కుమార్, ఆర్టీవో అమరానాయక్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుటాహుటిన తరలివచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఇటీవలే కారు కొనుగోలు చేసి.... రాజమండ్రి పేపర్ మిల్లులో సివిల్ కాంట్రాక్టులు నిర్వహించే పశ్చిమ గోదావరి జిల్లా కోవూరుకు చెందిన మృతుడు పల్లి దినేష్‌కుమార్ భార్య శృతి పేరుతో అక్టోబర్ నాలుగో తేదీన కారు కొనుగోలు చేశాడు. నవంబర్ ఐదో తేదీన రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తయినా నేటికీ కారును టీఆర్ పేరుతో కొనసాగిస్తున్నారు. విడదీయరాని స్నేహం ... పలివెల సుబ్బారావు రాజమండ్రిలోని పేపర్ మిల్లులో కాంట్రాక్ట్ కార్మికుడిగా, సోమశేఖర్, పల్లి దినేష్‌లు సివిల్ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య చాలా కాలంగా స్నేహం కుదిరింది. మృతుడు సుబ్బారావుకు గతేడాది వివాహమై రెండు మాసాల క్రితం కుమారుడు జన్మించాడు. మరో మృతుడు పల్లి దినేష్ పశ్చిమ గోదావరి జిల్లా కోవూరులో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రేగుల సత్యసారథి రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండలం గోకవరం వాసి. స్నేహితులంతా ఒక్కసారి మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. -
కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ స్వైర విహారం
-
డివైడర్‌ను ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
ఘోర ప్రమాదం..
గజ్వేల్: మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35)తో పాటు మరో 24 మంది కలిసి చేర్యాల మండలం నాగపురిలో ఆత్మహత్యకు పాల్పడిన మల్లేశం అంత్యక్రియలకు వెళ్లేందుకు టాటా ఏస్ (ట్రాలీ ఆటో)లో బయలుదేరారు. కాగా, మృతుడు మల్లేశంకు పాములపర్తి గ్రామానికి చెందిన కనకమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇదే క్రమంలో మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో పుట్టిల్లు పాములపర్తి గ్రామంలో ఉన్న అతని భార్య కనకమ్మ వారితో కలిసి వెళ్లింది. మార్గమధ్యంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే మసీదు మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఆపారు. మండలంలోని దాచారం గ్రామం నుంచి తమ బంధువొకరు వస్తారని చెప్పడంతో ఆయన కోసం ఎదురు చూసే క్రమంలో 10 నిమిషాల పాటు వాహనం నిలిపారు. వెనుక వైపు నుంచి బస్సును ఓవర్టేక్ చేసి దూసుకొచ్చిన లారీ.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఆటోను సుమారు 20 మీటర్ల దూరానికిపైగా ఈడ్చుకుపోయి రోడ్డు కిందకు పడిపోయింది. ప్రమాదంలో అక్కారం కిష్టయ్య, అక్కారం సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కారం పోచయ్య గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచాడు. కిష్టయ్యపైకి లారీ దూసుకెళ్లడంతో అతని మెదడు, శరీరభాగాలన్నీ నుజ్జునుజ్జయి భీతావాహ వాతావరణం నెలకొంది. హాహాకారాలు.. ఆర్తనాదాలు ప్రమాదస్థలి వద్ద క్షతగాత్రుల హాహాకారాలు, ఆర్తనాదాలు, మృతుల బంధువుల రోదనలతో దద్దరిల్లింది. ఆటో వెనకాల బైక్‌పై వస్తున్న మృతుడు కిష్టయ్య కుమారుడు కనకయ్య తండ్రి తల చిద్రమై పడిఉండడం చూసి కుప్పకూలిపోయాడు. ‘మా నాయన సచ్చిపోయిండే దేవుడా..’ అంటూ గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. రిమ్మనగూడకు చెందిన పలువురు యువకులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో అప్పటికప్పుడు ఆటోల్లో వెంటవెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గజ్వేల్ సీఐ ప్రసాద్, గౌరారం, గజ్వేల్, కుకునూర్‌పల్లి ఎస్ఐలు ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, పరమేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబీకులను గజ్వేల్ ఆస్పత్రి వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పరామర్శించారు. సిద్దిపేట సీపీ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహశీల్దార్ బాల్‌రెడ్డి సైతం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదకరమైన మలుపే కారణం రిమ్మనగూడలో శుక్రవారం చోటుచేసుకున్న విషాదానికి ప్రమాదకరమైన మలుపే కారణమని తెలుస్తోంది. మసీదు వద్ద ఉన్న ఈ మలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలో ఈ మలుపును సరిచేసే విషయాన్ని సంబంధిత యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. వాహనాల వేగం మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా పరిణమించి ఇళ్లపైకి దూసుకొస్తున్నాయి. ఈ ఘటనలో ఆటో రోడ్డు చివరన నిలిపి ఉండటం, పక్కన స్థలం లేక రోడ్డు ఎత్తుగా ఉండి కింది భాగమంతా గుంత మాదిరిగా ఉండడం వల్ల లారీ బస్సును ఓవర్టేక్ చేసి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో కిందికి వెళ్లిపోయి ప్రాణనష్టం జరిగింది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం కూడా మరో కారణం. మే 26న ఇదే గ్రామంలోని ఫార్మసీ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సు క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడం.. తాజాగా మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. -
నెత్తురోడిన రహదారులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. పోతు నూ రు స్టేజీ వద్ద కారు ఢీకొని బాలుడు.. వల్లభాపురం వద్ద బైక్ అదుపు తప్పి ఒకరు.. ఏపీలింగోటం సమీపంలో ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో మరొకరు మృతిచెందారు. కారు ఢీకొని బాలుడి దుర్మరణం పెద్దవూర(నాగార్జునసాగర్) : కారు ఢీకొని ఓ బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం పెద్దవూర మండలం పోతునూరు గ్రామ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పో తునూరు గ్రామానికి చెందిన రొయ్య మల్లయ్య కూతురు నాగమ్మను చందంపేట మండలం గుంటిపల్లికి చెందిన బయ్య మల్లయ్యకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. రాఖీ పండుగకు తన సోదరులకు రాఖీలు కట్టడానికి గాను బయ్య నాగమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలి సి ఆదివారం తన పుట్టిల్లు పోతునూరు గ్రామానికి వచ్చింది. వీరితో పాటు తన అక్కాచెల్లెళ్లు సైతం రాఖీలు కట్టడానికి రావడంతో ఆదివా రం అంతా ఉత్సాహంగా గడిపారు. సోమవా రం తన సోదరుడు డబ్బులు ఇవ్వడంతో పిల్లలను తల్లిగారింటి వద్ద ఉంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు తన భర్త మల్లయ్యను వెంట తీసుకుని పెద్దవూరకు షాపింగ్ చేయడానికి వచ్చా రు. పిల్లందరూ రోడ్డు దాటి సమీపంలో ఉన్న ఏఎమ్మార్పీ మైనర్ కాలువకు స్నానాలు చేయటానికి వెళ్లారు. ఈ క్రమంలో మిగిలిన పిల్లలు కాలువలో స్నానాలు చేస్తుండగా బయ్య శివకుమార్(8) ఇంటికి రావడానికి రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో శివ అంతెత్తున ఎగిరి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కారు డ్రైవర్ బాలుడిని తన కారులో చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించడంతో వారు బోరున విలపించారు. మృతుడు గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దూది రాజు తెలిపారు. బైక్ డివైడర్‌ను ఢీకొని ఒకరు.. చివ్వెంల (సూర్యాపేట) : అదుపు తప్పి బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ సంఘటన చివ్వెంల మండలం వల్ల భాపురం గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంపుల గ్రామానికి చెందిన పేరెల్లి నాగ య్య (34) బైక్‌పై సూర్యాపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వల్లభాపురం గ్రామం వద్ద హైదరాబాద్ – విజయవాడ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగయ్య తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు, ప్రైవేట్ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలుచివ్వెంల (సూర్యాపేట) : మండల పరిధిలో సో మవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదా ల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడడంతో భార్యాభర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. విజయవాడకు చెందిన భార్గవ్ తన భార్య లక్ష్మితో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గుంజ లూరు గ్రామ స్టే జీ వద్దకు రాగానే హైదరాబాద్–విజయవాడ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. తిర్మలగిరి శివారులో ప్రైవేట్ బస్సు.. జి.తిర్మలగిరి గ్రామ శివారులో జాతీయ రహదా రిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు వేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడిం ది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజుతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి హాని జరుగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం నార్కట్‌పల్లి(నకిరేకల్) : నార్కట్‌పల్లి మం డలం ఏపీలింగోటం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మం డలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కా రింగ్ కృష్ణయ్య (45) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడ నుంచి హైదరాబా ద్‌కు బొగ్గు లోడుతో ఒక్కడే వెళ్తూ మార్గమధ్యలో ఏపీలింగోటం గ్రామ శివారులో టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేయిస్తున్నాడు. ఆదేదారిలో వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొనడంతో లారీడ్రైవర్ అక్కడికక్కడే మృ తి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కృష్ణయ్య మరణంతో కుటుం బం వీధిన పడనుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎస్ఐ గోవర్ధన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు కేతేపల్లి(నకిరేకల్) : 65 నంబరు జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ వద్ద సోమవారం సా యంత్రం ఆటోను కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్లపహాడ్ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు కేతేపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాల ముగిసిన అనంతరం కొర్లపహాడ్ గ్రామం వెళ్లేందుకు ఆరుగురు విద్యార్థులు కేతేపల్లిలో ఆటో ఎక్కారు. ఈక్రమంలో ఆటో కొర్లపహాడ్ బస్‌స్టేజీ సమీపంలోకి చేరుకోగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కా రు ఆటోను వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్ కొప్పుల ఉమేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎడ్ల కర్ణాకర్, సూరారపు ప్రగతి, వం టెపాక నవ్యలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కేతేపల్లి ఎస్ఐ రజనీకర్ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీ సుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ప్రాణం తీసిన అతివేగం
భూత్పూర్ (దేవరకద్ర): వాహనదారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. అతివేగం కారణంగా క్వాలీస్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం జెలదుర్గం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన షేక్ నడిపి జమాల్‌వలీ, షేక్ జలీల్, జమాల్ బాష, హుస్సేన్, జహీనాబీ, షేక్ హబీబ్‌లు కలిసి ఆదివారం క్వాలీస్‌లో హైదరాబాద్ వెళ్తున్నారు. పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి కుడిచేతివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న షేక్ నడిపి జమాల్ వలీ(50), షేక్ జలీల్(5) అక్కడికక్కడే మృతిచెందగా.. జమాల్ బాష, హుస్సేన్, జహీనాబీ, òషేక్ హబీబ్ గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. లారీని ఢీకొని వ్యక్తి.. జడ్చర్ల: స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి వెనక నుంచి లారీని ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లెబోయిన్పల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూత్పూర్ మండలం కొత్తమొల్గరకు చెందిన చిన్న కాశన్న(50), పెద్ద కాశన్నలు స్కూటీపై శనివారం రాత్రి జడ్చర్లకు వస్తుండగా మల్లెబోయిన్పల్లి శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న చిన్న కాశన్న అక్కడికక్కడే మృతిచెందగా.. పెద్ద కాశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108లో ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తర లించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. రూ.1.14 లక్షల నగదు చిన్నకాశన్న వద్ద లభించిన బ్యాగులో రూ.1.14 లక్షల నగదు ఉన్నట్లు 108 అంబులెన్స్ సిబ్బంది శివారెడ్డి తెలిపారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి నగదు అప్పగించారు. -
కాటేసిన కరెంట్!
గట్టు (గద్వాల) : ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువరైతు బోయ గువ్వల తిమ్మప్ప అలియాస్ గోపి(35)కి గంగిమాన్‌దొడ్డి శివారులో ఎకరా విస్తీర్ణంలో సీడ్ పత్తి సాగుచేశాడు. ఉదయం సీడ్ పత్తి పొలానికి పురుగు మందు పిచికారీ చేసి ఇంటికి వస్తుండగా పక్క పొలానికి చెందిన రైతు మారెప్ప తన బోరు మోటార్‌కు ఉన్న సర్వీస్ వైరు తెగిపోయిందని చెప్పాడు. దీంతో సర్వీస్ వైరును సరి చేసేందుకు గోపి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు వెంటనే గట్టులోని పీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. గోపికి భార్య సుజాతతోపాటు ముగ్గురు కుమార్తెలు సంధ్య, మంజు, వెన్నెల ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నాయకుల పరామర్శ బాధిత కుటుంబ సభ్యులను సహకార సంఘం అధ్యక్షుడు రాముడు, మండల కోఆప్షన్ సభ్యుడు నన్నేసాబ్, నాయకులు హన్మంతు, రామకృష్ణారెడ్డి, కృష్ణ, బజారి, రామునాయుడు, హన్మంతురెడ్డి, మారెన్న తదితరులు పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం గోపి మృతదేహానికి గద్వాల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గోపి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వంటపాత్రలో నీళ్లు పోస్తుండగా.. మన్ననూర్ (అచ్చంపేట): వంట పాత్రలో నీళ్లు పోస్తుండగా షాక్‌కు గురై ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఎస్ఐ రామన్‌గౌడ్ కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన బాల్‌లక్ష్మమ్మ(65) కొన్నేళ్లుగా మన్ననూర్లోని హోటళ్లలో పాచి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. ఆదివారం స్థానిక గోల్డెన్ హోటల్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో రాఖీ పండగ ఉండటంతో త్వరగా పనులు ముగించుకుని వెళ్లాలనే ఉద్దేశంతో వంట పాత్రలు కడిగేందుకు ఓ పాత్రలో నీళ్లు పోస్తుండగా పక్కనే ఉన్న రిఫ్రిజరేటర్ నుంచి షాక్ తగిలింది. ఆమె కేకలు వేయడంతో దుకాణ యజమాని వచ్చి కాపాడే ప్రయత్నం చేయగా ఆయన కూడా షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన బాల్‌లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. బాల్‌లక్ష్మమ్మ భర్త గతంలోనే మృతి చెందగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పొలిశెట్టిపల్లిలో యువరైతు బల్మూర్ (అచ్చంపేట): వ్యవసాయ పొలానికి నీ రు పారించేందుకు తండ్రితోపాటు వెళ్లిన ఓ యు వకుడు విద్యుతాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని పొలిశెట్టిపల్లిలో శ నివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ స భ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకారపు రమేష్(23) శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన తండ్రి బాలస్వామితో కలిసి మొక్కజొన్న పంటకు నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ బోరు మోటార్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో కింద పడిపోయాడు. గమనించిన తండ్రి, కు టుంబ సభ్యులు కలిసి ర మేష్‌ను అచ్చంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మూణ్నెళ్ల క్రితమే వివాహం రమేష్‌కు మూడు నెలల క్రితమే కొండారెడ్డిపల్లికి చెందిన లక్ష్మితో వివాహమైనట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. పెళ్లి తీపి జ్ఞాపకాలు మరువక ముందే రమేష్ అకాలమృతితో వారి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై రమేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తె లిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ధర్మనాయక్, నాయకులు లక్ష్మయ్య కోరారు.