Published
Thu, Feb 23 2017 7:58 AM
| Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి
వైఎస్ఆర్ కడప: కానగూడురు-టంగుటూరు మధ్య గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.