
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అడ్డాకుల మండలం కుందూరులో ముగ్గురు యువకులు శ్రీరామలింగేశ్వరస్వామి పుష్కరిణిలో పడి మృతి చెందారు. జాతర సందర్భంగా పుష్కరిణిలో స్నానానికి వెళ్లిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు సోదరులు మహబూబ్‌నగర్ కు చెందినవారుగా గుర్తించారు.