కాటేసిన కరెంట్‌! | Three Die With Electric Shock | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంట్‌!

Published Mon, Aug 27 2018 3:14 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Three Die With Electric Shock - Sakshi

గట్టు : గోపి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు  

గట్టు (గద్వాల) : ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర ఏబీ స్విచ్‌ ఆఫ్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువరైతు బోయ గువ్వల తిమ్మప్ప అలియాస్‌ గోపి(35)కి గంగిమాన్‌దొడ్డి శివారులో ఎకరా విస్తీర్ణంలో సీడ్‌ పత్తి సాగుచేశాడు. ఉదయం సీడ్‌ పత్తి పొలానికి పురుగు మందు పిచికారీ చేసి ఇంటికి వస్తుండగా పక్క పొలానికి చెందిన రైతు మారెప్ప తన బోరు మోటార్‌కు ఉన్న సర్వీస్‌ వైరు తెగిపోయిందని చెప్పాడు.

దీంతో సర్వీస్‌ వైరును సరి చేసేందుకు గోపి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకు వెళ్లి ఏబీ స్విచ్‌ ఆఫ్‌ చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు వెంటనే గట్టులోని పీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. గోపికి భార్య సుజాతతోపాటు ముగ్గురు కుమార్తెలు సంధ్య, మంజు, వెన్నెల ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. 

నాయకుల పరామర్శ 

బాధిత కుటుంబ సభ్యులను సహకార సంఘం అధ్యక్షుడు రాముడు, మండల కోఆప్షన్‌ సభ్యుడు నన్నేసాబ్, నాయకులు హన్మంతు, రామకృష్ణారెడ్డి, కృష్ణ, బజారి, రామునాయుడు, హన్మంతురెడ్డి, మారెన్న తదితరులు పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం గోపి మృతదేహానికి గద్వాల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గోపి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

వంటపాత్రలో నీళ్లు పోస్తుండగా.. 

మన్ననూర్‌ (అచ్చంపేట): వంట పాత్రలో నీళ్లు పోస్తుండగా షాక్‌కు గురై ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ కథనం ప్రకారం.. అమ్రాబాద్‌ మండలం మాచారం గ్రామానికి చెందిన బాల్‌లక్ష్మమ్మ(65) కొన్నేళ్లుగా మన్ననూర్‌లోని హోటళ్లలో పాచి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. ఆదివారం స్థానిక గోల్డెన్‌ హోటల్‌లో పనిచేస్తుంది. ఈ క్రమంలో రాఖీ పండగ ఉండటంతో త్వరగా పనులు ముగించుకుని వెళ్లాలనే ఉద్దేశంతో వంట పాత్రలు కడిగేందుకు ఓ పాత్రలో నీళ్లు పోస్తుండగా పక్కనే ఉన్న రిఫ్రిజరేటర్‌ నుంచి షాక్‌ తగిలింది. ఆమె కేకలు వేయడంతో దుకాణ యజమాని వచ్చి కాపాడే ప్రయత్నం చేయగా ఆయన కూడా షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన బాల్‌లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. బాల్‌లక్ష్మమ్మ భర్త గతంలోనే మృతి చెందగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పొలిశెట్టిపల్లిలో యువరైతు

బల్మూర్‌ (అచ్చంపేట): వ్యవసాయ పొలానికి నీ రు పారించేందుకు తండ్రితోపాటు వెళ్లిన ఓ యు వకుడు విద్యుతాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని పొలిశెట్టిపల్లిలో శ నివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ స భ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకారపు రమేష్‌(23) శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన తండ్రి బాలస్వామితో కలిసి మొక్కజొన్న పంటకు నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ బోరు మోటార్‌ స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తో కింద పడిపోయాడు. గమనించిన తండ్రి, కు టుంబ సభ్యులు కలిసి ర మేష్‌ను అచ్చంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యలోనే మృతిచెందాడు. 

మూణ్నెళ్ల క్రితమే వివాహం 

రమేష్‌కు మూడు నెలల క్రితమే కొండారెడ్డిపల్లికి చెందిన లక్ష్మితో వివాహమైనట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. పెళ్లి తీపి జ్ఞాపకాలు మరువక ముందే రమేష్‌ అకాలమృతితో వారి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై రమేష్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తె లిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ధర్మనాయక్, నాయకులు లక్ష్మయ్య కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement