drowned
-
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మృతి
-
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
అపస్మారక స్థితిలో రాత్రంతా రోడ్డుపైనే..
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మందుల కోసం వెళ్లి వరద నీటిలో మునిగిన ఓ యువకుడు.. రాత్రంతా రోడ్డుపైనే ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నక్కా ప్రభుదాస్ తన కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్ కాలనీ బ్లాక్ 129లో నివసిస్తున్నాడు. బుడమేరుకు వరద రావడంతో సమీపంలో నివసిస్తున్న ఆయన అత్త సామ్రాజ్యం కూడా వారి వద్దకే వచ్చింది. ప్రభుదాస్ కుమారుడు ప్రశాంత్(24) గత ఆదివారం సాయంత్రం అమ్మమ్మ మందుల కోసం వరద నీటిలో ఆమె ఇంటికి వెళ్లాడు. మందులు తీసుకుని తిరిగి వస్తూ నీళ్లలో పడిపోయిన ప్రశాంత్‌ను స్థానికులు కాపాడి.. ఓ పడవలో ఎక్కించారు. ఆ పడవ నడిపే వ్యక్తి ప్రశాంత్‌ను నైనవరం ఫ్లై ఓవర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే స్పృహ తప్పిన ప్రశాంత్ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. సోమవారం ఉదయం పది గంటలకు తెలిసిన వ్యక్తి.. ప్రశాంత్‌ను గుర్తించి ఇంటికి చేర్చాడు. ప్రశాంత్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. తన కుమారుడికి వైద్యం కోసం దాతలు సాయం చేయాలని ప్రభుదాస్ కోరుతున్నాడు.పడవలోనే ప్రసవంతల్లీబిడ్డ క్షేమంనిండు గర్భిణికి నొప్పులు వస్తున్నాయని..ఆమెకు సహాయం అందించాలని వీఎంసీ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం వచి్చంది. ఆమెను బోటులో ఆస్పత్రికి తరలిస్తుండగానే అందులోనే డెలివరీ అయ్యింది. వాంబే కాలనీకి చెందిన షకీనాబీకి శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు నొప్పులు వచ్చాయి. ఆమెను సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు తరలించే దారిలో, నొప్పులు అధికంగా రావటంతో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన బోటులోనే షకీనాబీకి ప్రసవమైంది. విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం అజిత్ సింగనగర్ ఫ్లై ఓవర్ వద్దకు బోటును తీసుకువచ్చాక అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. –పటమట (విజయవాడ తూర్పు) -
Maharashtra: నీట మునిగిన పురాతన ఆలయాలు
మహారాష్ట్రలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని ముంబైలోని పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పూణే, నాసిక్, సాంగ్లీ, కొల్హాపూర్‌లలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. థానే, లోనావాలా, మహాబలేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ బృందాలను సమాయత్తమయ్యాయి.నాసిక్‌లో కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు గంగాపూర్ డ్యామ్ పొంగిపొర్లుతోంది. గోదావరి నది ఉప్పొంగడంతో గోదా ఘాట్ వద్దనున్న పలు చారిత్రక ఆలయాలు నీట మునిగాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా గోదా ఘాట్‌లోని దుకాణాలను మూసివేశారు. #WATCH | Maharashtra: Various temples were inundated under the Godavari river in Nashik, following incessant rainfall in the region. pic.twitter.com/oHjGYbTvDs— ANI (@ANI) August 5, 2024 -
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్‌సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం. -
రష్యాలో భారతీయ వైద్య విద్యార్థుల మృతి
మాస్కో: రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఓ నదిలో భారత్‌కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. వీళ్లంతా బతికే అవకాశం లేదని రెస్క్యూ టీం చెబుతోంది. ఇప్పటికే ఒక మృతదేహానికి వెలికి తీసింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన ఈ నలుగురు సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత నీటిలో మునిగిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా.. ఒక విద్యార్థిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు. విద్యార్థుల మృతదేహాల్ని వెలికి తీసి.. వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. -
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు -
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ముగ్గురు కార్మికులు గల్లంతు
సాక్షి, సిద్దిపేట జిల్లా: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికులు గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి, యాదమ్మల కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: కూతురు ప్రేమ వ్యవహారం.. ఉన్మాదిగా మారిన తండ్రి ఏం చేశాడంటే -
సాత్నాల వాగులో రిమ్స్ పీజీ వైద్యుడి గల్లంతు.. మృతదేహం లభ్యం
సాక్షి, ఆదిలాబాద్: సెల్ఫీ సరదా పీజీ వైద్యవిద్యార్ధి ప్రాణాలు తీసింది. ఆదివారం శివ్‌ఘాట్ సందర్శనకు వెళ్లి సాత్నాల వాగులో గల్లంతైన ఆదిలాబాద్ రిమ్స్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్థోపెడిక్ వైద్యుడు భుక్యా ప్రవీణ్ (27) మృతదేహం సోమవారం లభించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రవీణ్ రిమ్స్‌లో పీజీ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం కావడంతో తొమ్మిది మంది మిత్రులు ఆదిలాబాద్ వినాయక్ చౌక్ నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలం మీదుగా శివ్‌ఘాట్ వెళ్లారు. పక్కనే ఉన్న సాత్నాల వాగు వద్ద కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం వాగు అందాలను సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రవీణ్ ఫోన్ వాగులో పడిపోవడంతో, దాని కోసం అందులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయా డు. అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు స్నేహితులు వాగులోకి దిగగా ఉక్కిరిబిక్కిరి కావడంతో బయటకు వచ్చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో గాలింపు కష్టంగా మారినట్లు తెలిపారు. నేడు మళ్లీ ఐదుగురు గజ ఈతగాళ్లతో అన్వేషణ చేపట్టగా ప్రవీణ్ మృతదేహం లభించింది. వాగులో నుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. కాగా సిరిసిల్లా జిల్లాకు చెందిన తల్లిదండ్రులకు పోలీసులు ప్రవీణ్ గల్లంతు సమాచారం ఇచ్చారు. వారు వాగువద్దకు చేరుకొని కొడుకు మరణ వార్త విని, మృతదేహం చూసి తీవ్రంగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి భరోసానిస్తాడని భావించామని, తీరా ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఇదిలా ఉండగా ప్రవీణ్‌నుక కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుల్లో ఒకరైన కార్తీక్ అస్వస్థతకు గురికావడంతో రిమ్స్‌లో కోలుకుంటున్నాడు. ప్రవీణ్ తప్ప మిగిలిన ఎనిమిది మంది సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
గోదావరిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత) -
నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు
సాక్షి, నల్లగొండ: హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువకులు నాగార్జున సాగర్‌లో గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని చంద్రకాంత్ (20), నాగరాజు(39), వాచస్పతి(26)గా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరు నల్గొండ వాసులు కాగా, మరొకరు హాలియకు చెందిన వ్యక్తి. ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. -
కృష్ణానదిలో విద్యార్థుల గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కృష్ణానదిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. యనమలకుదురు దగ్గర ఘటన జరిగింది. ఈతకు వెళ్లి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం ఈత కొట్టడానికి కృష్ణానది దిగువ పాయలకు విద్యార్థులు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లినట్టు సమాచారం. క్షేమంగా ముగ్గురు విద్యార్థులు బయటపడ్డారు. గల్లంతైన ఐదుగురిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, అధికారులు చేరుకున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే? -
నదిలో మునిగి ఇద్దరు పిల్లల మృతి
మధిర/ పెనుబల్లి: రెండు వేర్వేరుచోట్ల నలుగురు విద్యార్థులు నీటమునిగారు. వీరిలో ఇద్దరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద నదిలో మునిగి ఇద్దరు ఖమ్మం జిల్లా పిల్లలు చనిపోగా, ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కాల్వలో పడి గల్లంతయ్యారు. మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో జెల్లా కృష్ణారావు ఆధ్వర్యాన సరస్వతి విద్యాలయం కొనసాగుతోంది. ఈ విద్యాలయానికి చెందిన విద్యార్థులను నాలుగు ఆటోల్లో కృష్ణారావు శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్దకు విహారయాత్ర నిమిత్తం తీసుకువెళ్లారు. వీరితోపాటు తన వద్దకు ట్యూషన్ వచ్చే ఉన్నతపాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి శీలం వెంకట నర్సిరెడ్డి(12) కూడా వెళ్లాడు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలంతా సరదాగా గడిపాక కొద్దిసేపట్లో తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే వెంకటనర్సిరెడ్డి, సరస్వతి పాఠశాలలో నాలుగో తరగతి చదివే జస్వంత్ కలిసి సమీపంలోని మున్నేరు నదిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. అక్కడ పొక్లెయినర్‌తో తవ్విన లోతైన గుంతలో ఆ ఇద్దరూ ప్రమాదవశాత్తు పడిపోయారు. స్థానికులు కొందరు ఆ విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి ఒడ్డుకు చేర్చారు. కానీ, అప్పటికే వారు మృతి చెందారు. విహారయాత్రకు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా రావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకట నర్సిరెడ్డి(ఫైల్), జస్వంత్ (ఫైల్) సాగర్ కాల్వలో పడి.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెన కుంట్లకి చెందిన బీటెక్ విద్యార్థి తల్లపురెడ్డి నరేంద్రరెడ్డి, డిగ్రీ విద్యార్థి అవులూరి నాగనరేందర్‌రెడ్డి శనివారం గ్రామ సమీపంలోని తుమ్మలపల్లి వద్ద నాగార్జునసాగర్ కాల్వలో స్నానం చేయడానికి శనివారం వెళ్లారు. అయి తే, వీరికి ఈత రాకపోవడంతో కాల్వలో పడి గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విష యం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘటనాస్థలానికి చేరుకుని నీటి ప్రవాహం తగ్గించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. -
భీమిలీ బీచ్ లో విషాదం ..
-
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్: కొండగావ్ జిల్లాలో విషాదం.. డ్యామ్‌లోకి స్నానానికి దిగిన నలుగురు విద్యార్థుల గల్లంతు
-
విషాదం: బర్త్‌డే వేడుకలకు వెళ్లివస్తూ.. వ్యవసాయ బావిలో పడ్డ కారు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ చౌరస్తా వద్ద గొల్లపల్లి–జగిత్యాల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలో శనివారం రాత్రి సుమారు 11.45గంటల సమయంలో కారు అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. ఇందులో ఒకరు గల్లంతవగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని మల్యాలకు చెందిన సామల్ల కిశోర్, మరోనలుగురు యువకులు కలిసి కిశోర్ అక్క కూతురు జన్మదిన వేడుకల కోసం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు వెళ్లారు. వేడుకల్లో పాల్గొని రాత్రి కారులో తిరిగి వస్తున్నారు. రోదిస్తున్న కుటుంబసభ్యులు ఈక్రమంలో లక్ష్మీపూర్ శివారులోని నల్లగుట్ట కమాన్ వద్ద రోడ్డును ఆనుకుని ఉన్న వ్యవసాయబావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కారుతోపాటు సామల్ల కిశోర్, ఈశ్వర్, సాయిరఘు, గడీల సందీప్, చందు బావిలో పడిపోయారు. సాయిరఘు, సందీప్, చందు, ఈశ్వర్ సురక్షితంగా బయటపడ్డారు. కిశోర్ బావిలో గల్లంతయ్యాడు. నీటిని తోడేస్తున్న అగ్నిమాపక సిబ్బంది బావినుంచి బయటకు వచ్చిన నలుగురు యువకులు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పైపుల ద్వారా నీటిని తోడేస్తూనే క్రేన్ సాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గల్లంతైన కిశోర్(22) కోసం కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రాణాలు తీసిన ఈత సరదా
హయత్‌నగర్: ఈత నేర్చుకునేందుకు బావిలో దిగిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్కే నగర్‌కు చెందిన మోదుగుల పరశురాం, మోదుగుల నర్సింహ అన్నదమ్ములు. వృత్తిపరంగా వీరిద్దరూ డ్రైవర్లు. ఇద్దరికీ ఇద్దరు చొప్పున కుమారులున్నారు. నర్సింహ చిన్న కొడుకు దుర్గాప్రసాద్ (12) తట్టి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పరశురాం కొడుకు శ్రీకాంత్ (15) అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం నర్సింహ పెద్ద కొడుకు రాఘవేందర్‌తో కలిసి చిన్న కొడుకు దుర్గాప్రసాద్, పరశురాం కొడుకు శ్రీకాంత్‌లు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లిద్దరూ నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని పసిగట్టి బావిలోనే ఉన్న రాఘవేందర్ కేకలు వేయడంతో సమీపంలోనే పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు హుటాహుటిన వచ్చి దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లను నీటిలోంచి బయటికి తీశారు. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే వీరిద్దరూ మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మొదటి రోజునే దుర్ఘటన జరగడం విద్యార్థుల కుటుంబ సభ్యులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. -
‘ఈత’రాన్ని మింగేసిన చెరువు
ధర్మపురి: ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలివి.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్ (12), నవదీప్ (12)తో పాటు నల్గొండ జిల్లా దోసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్ (13) ఆదివారం ఉదయం పాఠశాల పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. గతేడాది మిషన్ కాకతీయ కింద చెరువులో మట్టి తీయడంతో నీటి లోతు తెలియలేదు. దీంతో చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామస్తులకు చెరువు పక్కన చెప్పులు కనిపించడంతో ఆందోళనతో కేకలు వేశారు. సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు.. గ్రామస్తుల కేకలు విని మూడు మృతదేహాలను బయటికి తీశారు. శరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి, యశ్వంత్ ఎంపీపీఎస్ పాఠశాలలో 4వ, తరగతి, నవదీప్ ధర్మపురిలోని కేరళ ఇంగ్లిష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్నారు. బతుకుతెరువు కోసం నవదీప్ తండ్రి కిషన్ రెండేళ్ల క్రితం, శరత్ తండ్రి సత్తయ్య 10 నెలల క్రితం దుబాయ్ వెళ్లారు. యశ్వంత్ తల్లిదండ్రులు వారం క్రితం స్వగ్రామం నల్గొండ జిల్లాకు వెళ్లారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు చెరువు వద్దకు తరలివచ్చి కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. -
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
-
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్ (11), కార్తీక్ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు. దీపక్ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్ఐ నవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. -
అమరావతి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
సాక్షి, చెన్నై : అమరావతి నదిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తారాపురం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వివరాలు.. తిరుప్పూర్ నగరం పరిధి లోని మంగళం ఇడుంబి ప్రాంతానికి చెందిన 13 మందితో కూడిన బృందం దిండుగల్ మాంపారైకు వెళ్లి.. సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో మధ్యాహ్నం వేళ అమరావతి నదిలో స్నానానికి ఈ బృందం సిద్ధమైంది. తారాపురం పరిసరాల్లో అమరావతి నదిలో స్నానానికి నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నా, వాటిని వీరు పట్టించుకోలేదు. చదవండి: Jallikattu: రంకేసిన.. పౌరుషం.. బుసకొట్టిన బసవన్న.. కార్తీక్‌కు కారు గిఫ్ట్ బైపాస్ రోడ్డును ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో 8 మంది స్నానానికి దిగారు. హఠాత్తుగా బురదలో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు నీట మునగడాన్ని ఒడ్డు నుంచి చూసిన మిగిలిన వారు కేకలు పెట్టడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే నది లో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో రక్షించడం కష్టతరంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. సాయంత్రం ఆరు గురి మృతదేహాలను గుర్తించారు. ఇద్దరు కొన ఊపిరితో బురదలో కూరుకుపోయి ఉండడంతో వారిని తారాపురం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారిలో ఇడంబి ప్రాంతానికి చెందిన మోహన్, రంజిత్, శ్రీధర్, యువన్, అమీర్, చక్రవర్తి ఉన్నారు. వీరి మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కను రక్షించబోయి.. ఎస్సార్బీసీలో పడి యువకుడు గల్లంతు
అవుకు: శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)లో పడిన పెంపుడు కుక్కను రక్షించబోయి ఓ యువకుడు నీళ్లలో కొట్టుకోపోయాడు. రామవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రామవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణమ్మ కుమారుడు మాసుబాకల నరేష్ (18).. ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో మంగళవారం గేదెలను మేపటానికి వెళ్లాడు. వెంట ఉన్న కుక్క గ్రామ శివారులోని ఎస్సార్బీసీలో పడిపోయింది. దానిని రక్షించటానికి వెళ్లిన ఆయువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్రేన్ సహాయంతో ఈతగాళ్లను కాలువలోకి దించి రాత్రి వరకు గాలించారు. అయినా, యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. -
స్వర్ణముఖి నదిలో ముగ్గురు చిన్నారుల గల్లంతు
సాక్షి, తిరుపతి: స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతవ్వగా, ఒకరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన మరో ముగ్గురు ధోని(17), గణేష్(15), యుగంధర్(14) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నికిత్ సాయి అనే బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట మండలం జీ పాలెం వద్ద ఘటన చోటుచేసుకుంది. హరిజనవాడకు చెందిన చిన్నారులుగా గుర్తించారు. చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి.. ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి ఆరా.. చిన్నారుల గల్లంతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇంఛార్జ్ కలెక్టర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో మాట్లాడారు. గల్లంతయిన చిన్నారులను రక్షించేందుకు తక్షణం గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. ముగ్గురు యువకులు గల్లంతు కావడం బాధాకరమన్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బలగాలు పిలిచామన్నారు. -
కొడిగట్టిన నవ‘దీపం’
అనంతపూర్: ప్రమాదవశాత్తు నీటిలో పడిన బాలుడిని కాపాడబోయి ఓ పండుటాకు రాలిపోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ‘నవదీపం’ కొడిగట్టకుండా ప్రాణాలకు తెగింన వృద్ధుడి సాహసమూ గంగ పాలైంది. పెన్నమ్మ ఒడిలో రెండు నిండు ప్రాణాలు శాశ్వతంగా నిద్రపోయాయి. చౌళరు శోకసంద్రమైంది. వివరాలు.. హిందూపురం మండలం చౌళరుకు చెందిన తలారి నరసింహప్ప కువరుడు నవదీప్ (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుం ఇంటికి చేరుకున్న బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పెన్నానదిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి పోయాడు. ఆ సమయంలో చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న వృద్ధుడు నరసింహమూర్తి (65) అప్రమత్తమై వెంటనే నీటిలో దిగాడు. నీటిలోపల బాలుడి కోసం గాలిస్త ఊపిరి ఆడక అతను విగతజీవిగా మారాడు. అప్పటికే చిన్నారుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నానదికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. కాసేపటికి వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న హిందూపురం రరల్ పోలీసులు, అగ్నివపక సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నీటి గుంతలో గాలింపు చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వృద్ధుడి సాహసం వృథా కావడంపై పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహం కనిపించగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
చేపలవేటకు వెళ్లి.. మృత్యుఒడికి
సాక్షి, వికారబాద్: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చిగురాల్‌పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంపల్లి నర్సింలు(43) గ్రామ శివారులోని చెరువులో నిత్యం చేపలు పడుతుండేవాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు గ్రామానికి చెందిన పసుల నరేష్‌తో చేపల వేటకు వెళ్లాడు. నీటిలోకి వెళ్లిన నర్సింలు ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో నరేష్ గ్రామంలోకి వచ్చి విషయం స్థానికులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాలించారు. ఎంతవెతికినా మృతదేహం లభించకపోవడంతో ఎస్ఐ విఠల్‌రెడ్డి చెరువులో దిగి గాలించి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కిరణా వ్యాపారం.. ఆశలన్నీ కొడుకుపైనే.. కళ్ల ముందే..
సాక్షి,శ్రీకాకుళం రూరల్: సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ సంఘట న పెదగనగళ్లవానిపే ట తీరంలో ఆదివారం చోటు చేసుకుంది. శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలోని బోడెమ్మ కోవెల ప్రాంతంలో నివాసం ఉంటున్న కాశం రమేష్ కిరణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నవాడైన సురేంద్ర (17) నగరంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్నా డు. కార్తీక మాసం కావడంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి పెదగనగళ్లవాని పేట సమీపంలోని సరుగు తోటల్లో పిక్నిక్ జరుపుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సముద్రంలో స్నానాలకు దిగారు. అలలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో సురేంద్ర గల్లంతైనట్లు ప్రత్యేక సాక్షు ల ద్వారా తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల వరకూ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. -
చేపల వేటకు వెళ్లి నలుగురు గల్లంతు
పళ్లిపట్టు(చెన్నై): చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన నలుగురిలో ముగ్గురిని గ్రామస్తులు కాపాడగా, యువకుడు మృతిచెందాడు. 18 గంటల తర్వాత మంగళవారం అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పళ్లిపట్టు సమీపంలోని వెంకట్రాజుకుప్పానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సాయంత్రం లవ నదిలో చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారి కేకలు విన్న స్థానికులు ముగ్గురిని కాపాడారు. గల్లంతైన బాలాజీ (22) కోసం అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం ఉదయం పళ్లిపట్టు–షోళింగర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. మృతదేహం లభించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే.. -
మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్..
సాక్షి, కరీంనగర్: మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కే.తారకరామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరులు సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఘటన విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహలు లభ్యమయ్యాయి. మరోకరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. -
చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి
బెంగళూరు: బీదర్ జిల్లా గోడివాడ దర్గా సమీపంలో ఉన్న చెరువులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సలీంబాబా నగర్ బస్తీకి చెందిన జునైద్‌ఖాన్ (21), అతని సోదరుడు ఫహాద్‌ఖాన్(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్ జునైద్(16), కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన హైదర్‌ఖాన్ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు కారులో బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో గోడివాడకు దర్గా వద్దకు చేరుకున్నారు. పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ముందుగా హైదర్ వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించారు. చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..? అతన్ని కాపాడే క్రమంలో వీరు కూడా నీటిలో మునిగిపోయారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్లో విషాదం నెలకొంది. కుటుంబభ్యుల రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు కళ్లముందు తిరిగిన యువకులు ఇక లేరనే బాధను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి -
సెల్ఫీ తీసుకుంటూ.. గోదావరిలో పడి..
నందిపేట్(ఆర్మూర్): సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి ఇద్దరు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు కాపా డారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ శివారులో ఈ సంఘటన జరిగింది. రాజస్తాన్‌కు చెందిన దేవసి కేతారాం, దేవసి ఈరారాం, దేవసి సుజారాం, మోహన్‌లాల్, మీరారాం, జాంతారాం మూడేళ్లక్రితం నందిపేట్‌కు వలస వచ్చారు. ఇక్కడ వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి నదీతీరంలో సరదాగా గడిపేందుకు ఈ ఆరుగురు కలసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయ సమీపంలో నది ఒడ్డు వద్ద కేతారాం, ఈరారాం, జాంతారాం సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నదిలో పడిపోయారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వీరు నదిలో కొట్టుకుపోయారు. దీంతో ఒడ్డున ఉన్న మిగతా ముగ్గురు సాయం కోసం కేకలు వేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఉమ్మెడకు చెందిన రామడ బుచ్చన్న, బుచ్చ శేఖర్ వీరి అరుపులువిని అక్కడికి చేరుకున్నారు. నదిలో కొట్టుకుపోతున్న జాంతారాం ను ఒడ్డుకు చేర్చారు. మిగతా ఇద్దరిని కాపాడే ప్రయ త్నం చేసినా ప్రవాహం దాటికి వారు గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గల్లంతయిన ఈరారాం నందిపేటలోని ఓ ఎలక్ట్రికల్ షాప్‌లో పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కిరాణ దుకాణంలో పని చేసే కేతారాం అవివాహితుడు. యువకులు గల్లంతయింది ఈ ప్రాంతంలోనే.. -
ఇద్దరు బాలికలను మింగిన చెరువు..
ఆ చెరువు తన మృత్యు దాహం తీర్చుకుంది. ఒక బాలిక చావు నుంచి తప్పించుకుందని సంతోషించే లోపు ఇద్దరిని మింగేసింది. చెల్లి ప్రాణాలను తిరిగి ఇచ్చినట్టే ఇచ్చి అక్కను తీసుకెళ్లిపోయింది. సరదాగా స్నానం చేయడానికి వచ్చిన నలుగురిలో ఇద్దరిని చంపేసి మిగ తా ఇద్దరికి జీవిత కాల భయాన్ని అందించింది. బిడ్డలను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. సాక్షి,శ్రీకాకుళం(లావేరు): మండల పరిధి యాతపేట గ్రామంలో ని జగ్గు చెరువులో మునిగి పెంటమాని వనజ (9), వనుము యమున(9) అనే ఇద్దరు బాలిక లు బుధవారం మృతి చెందారు. లావేరు స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. యాతపేట గ్రామానికి చెందిన పెంటమా ని వనజ(9), వనుము యమున(9), పెంటమా ని యషశ్రీ, శిరీషలు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. బుధవారం మ ధ్యాహ్నం బడి విడిచిపెట్టాక పూజ సామాన్లు చెరువులో కలపడం కోసం వీరు నలుగురు గ్రా మంలోని జగ్గు చెరువుకు వెళ్లారు. పూజ సామాన్లు కలిపేసిన తర్వాత స్నానానికి దిగారు. వనజ, శిరీషలు ఒడ్డునే స్నానం చేస్తుండగా.. యమున, యషశ్రీలు కాస్త లోపలకు వెళ్లారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో లోలోపలకు వెళ్లిపోయారు. దీన్ని గమనించిన యషశ్రీ అక్క వనజ వెంటనే స్పందించి చెరువు లోపలకు వెళ్లి చెల్లిని ఒడ్డుకు తీసుకువచ్చింది. యమునను కూ డా కాపాడదామని ప్రయత్నించి విఫలమై ఆమె తో పాటు లోపలకు వెళ్లిపోయింది. వీరు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఒడ్డునే ఉన్న పిల్లలు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు విష యం చెప్పారు. వారు హుటాహుటిన చెరువు వద్దకు వచ్చి స్థానికులతో కలిసి వెతకగా మునిగిన చోటే ఇద్దరూ దొరికారు. వెంటనే 108లో వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే ఇద్దరూ చనిపోయారని వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వెంటనే లావే రు స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ రాజేష్, హెచ్‌సీ రామారావులు యాతపేట గ్రామానికి వెళ్లి చెరువును పరిశీలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ను ప్రమాదం ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. గుండెలవిసేలా రోదన.. వనజ, యమునలు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసే లా రోదించారు. పెంటమాని పైడిరాజు, రాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె వనజ. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె చెరువులో పడి మృతి చెందడంతో వారి రోదన ఆపడం ఎవరి తరం కా లేదు. వనుము రాజారావు, రాములు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నా రు. ఒక్కగానొక్క కుమార్తె అయిన యమున ఇలా చిన్న వయసులోనే చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అత్త హత్య కేసులో కోడలి అరెస్ట్ -
రికార్డుస్థాయి వాన: మళ్లీ మునిగిన ఓరుగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, వరంగల్: వర్షం ఓరుగల్లును ముంచెత్తింది. కాలనీలను అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిసిన వర్షంతో మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులను చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. గత ఏడాది జూలై 11న అత్యధికంగా 105 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. ఇప్పుడు అంతకుమించి 140 మి.మీ వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. నగర, శివారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. తెల్లవారుజామున తెరిపివ్వడంతో ఇంట్లోకి చేరిన నీటిని ఎత్తిపోయడంతోపాటు తడిసిన బియ్యం, సామగ్రిని ఆరబెట్టుకున్నారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం) ముద్దయిన కాలనీలు.. భారీ వర్షానికి వరంగల్, హనుమకొండలోని పలు కాలనీలు నీటమునిగాయి. అధికారుల అంచనా ప్ర కారం సుమారు 33 కాలనీలు ఇంకా నీటిలోని నాని పోతున్నాయి. ముంపు కాలనీల్లో రెస్క్యూ బృందా లు నిరంతరం శ్రమిస్తూ యుద్ధప్రాతిపదికన ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రహదారులపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. (చదవండి: పెళ్లి కావాల్సిన వధువు: కన్నీటిసంద్రంలో కుటుంబం) జనజీవనం అతలాకుతలం.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామన నాలుగు నుంచి ఐదున్నర గంటల వరకు ఏకధాటిగా నగరంలో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన కాలనీలు, వాడల్లోని ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరింది. సోమవారం తెల్ల వారుజామున ఆయా కాలనీవాసులు చాలా మంది నీటిలో తడిసిన బియ్యం మూటలు, గ్యాస్ స్టవ్‌లు, టీవీలు.. తదితర సామగ్రిని సర్దుకొని బంధువుల ఇళ్లకు వెళ్లడం కనిపించింది. కొందరు సామగ్రిని ఇళ్లపై ఆరబెట్టుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలు దాటినా జిల్లా ప్రభుత్వ విభాగాధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడలేదు. దీంతో ఆహారం కోసం వరద బాధితులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని నిర్ణయించారు. బాధితులకు రోడ్డుపైనే ఆహారం ఏర్పాటు చేసి అందించారు. కొన్ని ప్రాంతాల్లో పులిహోర ప్యాకెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. భారీగా నష్టం.. భారీవర్షం ధాటికి నగరంలోని కొన్ని గుడిసెలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా వీధుల్లో మోకాలి లోతున నీరు ప్రవహించడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు వరదలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పోయినా.. ఆ వాహనాలు స్టార్ట్ కాని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోని టీవీలు, ఫ్రిజ్‌లు నీటిలో తడిసిపోవడంతో పనిచేయడం లేదు. పెంచుకున్న కుక్కలు కూ డా వరదలో చిక్కుకున్నాయి. సకాలంలో వాటిని యజమానులు గుర్తించి ఇంటిపైకి తీసుకెళ్లారు. ఉప్పొంగిన చెరువులు.. ఖిలావరంగల్ రాతికోటకు ఆనుకొని ఉన్న అగర్తాల చెరువు భారీ వర్షంతో నిండింది. ఆ నీరు నగరంలోని పలు కాలనీలకు వెళ్లడంతో నీట మునగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగశాయిపేటకు సమీపంలోని బెస్తం చెరువు పొంగి ప్రవహించింది. ఆ నీరు రంగసముద్రం, భద్రకాళి చెరువు మీదుగా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు సమీపంలోని నగరం చెరువులో కలిసింది. ఈ క్రమంలోనే పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేట రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్న కట్టమైదాన్ చెరువు అలుగుపోసింది. ఆ నీరు చిన్నవడ్డెపల్లి చెరువు, కొటె చెరువు మీదుగా నగరం చెరువులో కలుస్తోంది. ఈ చెరువులకు వరద నీరు పోయే నాలాల వెంట వెలిసిన అక్రమ నిర్మాణాలతో కుచించుకుపోవడంతో వరదనీరు సాఫీగా వెళ్లడం లేదు. ఫలితంగా ఆయా నాలాల చుట్టూ ఉన్న కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. టోల్‌ఫ్రీ నంబర్‌తో సహాయం వరద బాధితులు, ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు 9701999645 మొబైల్, 7997100300 వాట్సాప్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కార్యస్థానం వదిలి వెళ్లొద్దని, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
సరదా ఈత.. కన్నవారికి కడుపుకోత!
సరదా ఈత రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. చెట్టంత కొడుకుల్ని దూరం చేసి తల్లిదండ్రులకు గర్భ శోకం మిగిల్చింది. మొహర్రం పండుగ ఆనందాన్ని ఆవిరి చేసి ఆ కుటుంబాన్ని దుఃఖ తీరాలకు చేర్చింది. గుండెను పిండేసే ఈ విషాద ఘటన చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె సమీపంలోని దేవర చెరువులో జరిగింది. చిన్నమండెం: చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామానికి చెందిన దొరస్వామి నాయక్, లక్ష్మి దేవి కొన్నేళ్ల నుంచి తిరుపతిలో స్థిరనివాసం ఉంటున్నారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో దొరస్వామి నాయక్ తన ఇద్దరు కుమారులు తరుణ్‌నాయక్(18), ఉపేంద్రనాయక్(16), కుమార్తెతో కలిసి మొహర్రం పండగ కోసం బంధువులైన సద్దలగుట్టపల్లెకు చెందిన చంద్రానాయక్ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం సరదా కోసం సద్దలగుట్టపల్లెకు సమీపంలో ఉన్న దేవరచెరువు దగ్గరకు వచ్చారు. తరుణ్, ఉపేంద్ర ఇద్దరూ ఈత కొట్టేందుకు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. వారు నీటిలో మునిగిపోయిన విషయాన్ని ఒడ్డు పైనుంచి గమనించిన చెల్లెలు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన వారు గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులకు, అగ్నిమాపక శాఖాధికారులకూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. స్థానిక యువకులైన రెడ్డిబాబు, పవన్, కాలీతో కలిసి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వేగావతి కాలువలో పడి..ఇద్దరు యువతులు మృతి
సాక్షి,విజయనగరం: పశు పోషణే వారి జీవనాధారం. రోజూ వలే శనివారం ఉదయం గేదెలను మేత కు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో ఇద్దరు గిరిజన యువతులను కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పాచిపెంట ఎస్ఐ ఎం.వెంకటరమణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాడవలసకు చెందిన ఇద్దరు గిరిజన యువతులు తోరిక గాయత్రి(17), సంగిరెడ్డి నాగమణి (25) తోటి కాపరులతో కలిసి (ఆరుగురు కాపరులు) గేదెలను కర్రివలస పంచాయతీ అమ్మవలస గ్రామ పొలాల వైపు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి గేదెలను ఇంటికి తోలుకువస్తుండగా మార్గం మధ్యలోని అమ్మవలస సమీపంలో కర్రివలస వేగావతి ఆయకట్టు ఎడమకాలువలో దిగాయి. ఇటీవల కురిసిన వర్షా లకు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇసుక తవ్వకాలు, పూడికల తొలగింపుతో కాలువ లోతు ఎక్కువ గా ఉంది. గేదెలను ఒడ్డుకు చేర్చే ఆత్రుతలో కాలువ లోతును గుర్తించకుండా ఇద్దరూ నీటిలో దిగారు. అంతే.. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. కళ్లముందరే మునిగిపోతున్న యువతులను కాపాడేందుకు తోటి కాపరుల ప్రయత్నం ఫలించలేదు. వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అప్పటివర కు తమతో సరదాగా గడిపిన యువతుల మృతితో బోరున విలపించారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో మృతదేహాల ను పంచనామా నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. వీరి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
దుసపాటిలొద్ది జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలో ఉన్న దుసపాటి లొద్ది జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఒకరు నీట మునిగి పోతుండటంతో అతడిని రక్షించడానికి వెళ్లి మరొకరు నీటిలో మునిగిపోయాడు. ఎస్సై కొప్పుల తిరుపతిరావు కథనం ప్రకారం.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం సందర్శనకు వచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తుండగా మునిగెల నరేశ్ (24) ప్రమాదవశాత్తు గుండంలో పడిపోయాడు. అతను ఎంతకూ బయటకు రాక పోవడంతో మిగతా మిత్రులు ఆందోళనకు గురై అక్కడే ఉన్న పర్యాటకులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో పాటు రెస్క్యూ టీంను అక్కడికి పంపించారు. రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. చీకటి కావడంతో గాలింపు నిలిపి వేశారు. గల్లంతైన నరేశ్‌కు తల్లి సమ్మక్క ఉంది. తండ్రి సింగరేణిలో పనిచేస్తూ మృతిచెందడంతో ఆ ఉద్యోగం నరేశ్‌కు వచ్చింది. గత కొంతకాలంగా గోదావరిఖనిలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మూడు నెలల క్రితం భూపాలపల్లికి డిప్యుటేషన్‌పై వచ్చాడు. కాపాడటానికి వెళ్లి..: నరేశ్ నీటిలో మునిగి గల్లంతు కావడంతో జలపాతం చూడటానికి వచ్చిన రవికుమార్‌చారి (30) అనే యువకుడు అతడిని కాపాడటానికి నీటిలో దిగాడు. అయితే అతను కూడా గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన రవికుమార్‌చారి అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు. వారించినా వినకుండా..: ఈ జలపాతం రిజర్వ్ ఫారెస్టులో ఉండడంతో అటవీ శాఖ సిబ్బంది పర్యాటకులను అక్కడికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు వారిస్తున్నారు. అయినా వినకుండా చాలా మంది వెళ్తున్నారు. గతంలో ఇక్కడ ఒకరు గల్లంతై చనిపోగా, తాజాగా ఇద్దరు గల్లంతయ్యారు. -
విషాదంగా మారిన ఫ్రెండ్షిప్ డే
నందిపేట్(ఆర్మూర్): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్(19), ఉదయ్(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. -
స్నేహితుల దినోత్సవం రోజున విషాదం..
సాక్షి, నిజామాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. పోచంపాడు బ్యాక్‌వాటర్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నందిపేట్ మండలం జిజి నడ్కూడ శివారులో ఘటన జరిగింది. మృతులను అర్సపల్లికి చెందిన యువకులుగా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రాణం తీసిన ఈత సరదా..
సాక్షి,బేతంచెర్ల: స్నేహితులతో సరదాగా ఈతకెళ్లిన ఓ విద్యార్థి మృత్యువాతపడ్డాడు. మండల పరిధిలోని బలపాలపల్లె గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. పెద్దనాగి గాల్ల చిన్న మద్దయ్య, దస్తగిరమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడో వాడైన నరసింహ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం తోటి మిత్రులతో కలిసి హెచ్. కొట్టాల గ్రామ సమీపాన ఉన్న పొలం నీటి తొట్టిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. నరసింహకు సరిగా ఈత రాకపోవడంతో తొట్టిలోని నీటిలో మునిగిపోయాడు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని నరసింహను బయటకు తీసి హుటాహుటిన బేతంచెర్ల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడిని మింగేసిన నీటి బకెట్ సి.బెళగల్: బుడిబుడి అడుగులతో సందడి చేసిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న నీటి బకెట్ మృత్యుపాశమై ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన సి.బెళగల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాజు, ఇందిరలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. భర్త రాజు బుధవారం తన పనులు ముగించుకుని ఇంట్లో నిద్రిస్తుండగా, భార్య దుస్తులను శుభ్రపరిచేందుకు బకెట్లో నీటిని నింపింది. అయితే ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో ఆమె కూడా ఇంట్లో నిద్రించింది. కాగా రోజులాగానే ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్న కుమారుడు ప్రియానంద్ (2) మధ్యాహ్న సమయంలో నీటి బకెట్లో తలక్రిందులుగా పడి మృతి చెందాడు. నిద్రలేచిన తల్లిదండ్రులు నీటి బకెట్లో పడి ఉన్న కుమారుడిని చూసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలపటంతో బోరున విలపించారు. వారి రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. -
యాదాద్రి : రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు
-
కాళ్లకు బురద అంటిందని క్వారీ గుంతలోకి.. నలుగురు గల్లంతు
-
చిత్తూరు : ఫోన్ మాట్లాడుతూ బావిలో పడ్డ వ్యక్తి ని కాపాడిన ఫైర్ సిబ్బందీ
-
నీటమునిగి ఐదుగురు చిన్నారుల మృతి
చెన్నై: వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు చిన్నారులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. తెన్కాశి జిల్లా ఆలంగుళం సమీపంలోని షణ్ముగపురానికి చెందిన ధర్మరాజ్ (36) కుమారుడు భువన్ (05), ధర్మరాజ్ తమ్ముడు కన్నన్ కుమారుడు ఇషాంత్ (05), అదే ప్రాంతానికి చెందిన బంధువు భూపాలన్ కుమార్తె షణ్ముగప్రియ (05) ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు భువన్, ఇషాంత్, షణ్ముగప్రియ ఇంటి సమీపాన కొలను వద్ద ఆటాడుకునేందుకు వెళ్లారు. కట్టడ పని చేస్తున్న ఓ కార్మికుడు భోజనం చేయడానికి చేతులు కడుక్కునేందుకు కొలను వద్దకు వెళ్లగా భువన్ నీటిలో తేలుతున్నట్లు గమనించి అతన్ని ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఇంతలో విషయం తెలుసుకున్న బంధువు అక్కడకు వచ్చి ఇషాంత్, షణ్ముగప్రియ కోసం గాలించి వారిని కూడా వెలుపలికి తీసుకువచ్చాడు.. తర్వాత ముగ్గురిని ఆలంగుళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు వారంతా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆలంగుళం డీఎస్పీ పొన్నివళవన్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తెన్కాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపి విచారణ జరుపుతున్నారు. మరో సంఘటన ఆలంగుళం సమీపంలోని మారందైకి చెందిన సురేష్, వళ్లి దంపతులకు కుమారులు మదన్ (07), రాహుల్ (05) ఉన్నారు. ఇద్దరు తాత, అవ్వలు రామయ్య, గణపతి అమ్మాళ్‌లతో పశువుల మేతకు వెళుతుంటారు. గురువారం రామయ్య తెన్కాశి ఆసుపత్రికి వెళ్లడంతో చిన్నారులు గణపతి అమ్మాళ్తో పశువులు మేపేందుకు వెళ్లారు. సమీపాన ఉన్న కాలువలో నీరు తాగేందుకు వెళ్లగా మదన్ కాలువలో పడిపోయాడు. దీనిని గమనించిన తమ్ముడు రాహుల్ అవ్వకు తెలపడంతో స్థానికులు మదన్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆలంగుళం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తెన్కాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అలాగే నెల్లై పారయడికి చెందిన బాలకృష్ణన్ కుమార్తె కయల్(4) ఇంటి సమీపంలోని కాలువలో స్నానం చేసేందుకు వెళ్లింది. నీటిలో మునిగి మృతి చెందింది. శుద్ధమల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
గోదావరిలో నలుగురు విద్యార్ధుల గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం
సాక్షి, పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం సమీపాన ఆదివారం గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్ (15), యర్రంశెట్టి రత్నసాగర్ (15), పంతాల పవన్ (15), ఖండవిల్లి వినయ్ (15) గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం ముగ్గురు విద్యర్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి, మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాల్లో బండారు నవీన్, రత్నసాగర్, పంతాల పవన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు లంకల గన్నవరానికి చెందిన పదో విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనాలు చేసి ఆ నలుగురు విద్యార్థులు గోదావరి తీరానికి ఆడుకొనేందుకు వెళ్లారు. రాత్రి ఏడు గంటలవుతున్నా తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి తీరాన ఒక విద్యార్థి సైకిల్ ఉండటంతో అనుమానంతో ఇసుక తిన్నెల్లో గాలించారు. అక్కడ నలుగురు విద్యార్థుల దుస్తులు, మాస్కులు, రెండు సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ నలుగురు విద్యార్థులూ గోదావరిలో స్నానానికి దిగి, గల్లంతైనట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. చదవండి: నీట మునిగి 8 మంది దుర్మరణం -
లంకల గన్నవరం గోదావరిలో నలుగురు విద్యార్థులు గల్లంతు
-
విషాదం: పెన్నానదిలో నలుగురు గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి యువకులు ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. గల్లంతైనవారిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కడపలోని బెల్లంమండి వాసులుగా గుర్తించారు. చదవండి: మాన్సాస్ భూముల వ్యవహారంపై విచారణ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం -
విషాదం.. చెరువులో జారిపడి అన్నాదమ్ముల మృతి
సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. ఇద్దరు అన్నదమ్ములు చెరువులో మునిగి మృతి చెందారు. యాడారం గ్రామంలో అంత్యక్రియలకు హాజరై జనగామ శివారులోని బురుకుంట చెరువులో కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో 12 ఏళ్ల బెల్లెడ కార్తీక్ ఒకరు, కాగా మరొకరు 15 ఏళ్ల బెల్లెడ సంతోష్. తల్లిదండ్రులు రామస్వామి, శ్యామలలతో కలిసి పిల్లలు అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వీరి తల్లిదండ్రులతో పాటు కార్తీక్, సంతోష్ లు చెరువులోకి వెళ్లారు. కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందారు. పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోవడంతోనే ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్ జనగామ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్నాడు. సంతోష్ బిక్కనూర్‌లోని రెసిడెన్షియల్లో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్నాడు. అన్నదమ్ములు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి నట్లు పోలీసులు తెలిపారు. చదవండి:విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై. -
విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై..
-
విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై..
అప్పటివరకూ బుడిబుడి అడుగులతో కళకళలాడిన ఆ ఇళ్లు బోసిపోయాయి. ముద్దులొలికే చిన్ని నవ్వులు ‘అదృశ్య’మయ్యాయి. ఏమైందో అర్థంకాని తల్లి మనసులు తల్లడిల్లాయి. కూలీనాలీ చేసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు చెంగుచెంగున గెంతుతూ అమ్మా అంటూ ఒడి చేరతారని ఆశపడ్డాయి.. భర్తలు దూరంగా ఉంటున్నా బిడ్డలే సర్వస్వంగా భావించి బతుకులీడుస్తున్న ఆ మాతృమూర్తుల గుండెలను అంతలోనే పిడుగులాంటి వార్త పిండేసింది. కన్నీరుమున్నీరు చేసింది. ముగ్గురు పిల్లల దుర్మరణంతో ఈదర గ్రామం గుండె చెరువయ్యేలా రోధించింది. శోకసముద్రంలో మునిగిపోయింది. ఈదర(ఆగిరిపల్లి): ఈదరకు చెందిన కగ్గా జ్యోతి భర్తతో విడిపోయింది. రెండేళ్లుగా తన ఇద్దరు ఆడపిల్లలు శశిక(11), చంద్రిక(9)లే ప్రాణంగా జీవిస్తోంది. కూలీనాలీ చేసుకుని వారిని పెంచుకుంటోంది. సోమవారం జ్యోతి కూలి పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో జ్యోతి పని చేసే మేస్త్రీకి ఆమె అక్క ఫోన్ చేసి పిల్లలు కనబడటం లేదని చెప్పింది. దీంతో పని నుంచి ఇంటికి వచ్చిన ఆమె పిల్లల కోసం ఊరంతా వెతికింది. వీరితోపాటు సమీప బంధువు గండికోట పంగిడమ్మ కుమారుడు జగదీష్ (8) కూడా కనిపించలేదు. దీంతో బంధువుల సాయంతో పిల్లల కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో జ్యోతి ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు నూజీవీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఆరు బృందాలుగా ఏర్పడి హనుమాన్ జంక్షన్ సీఐ కె.సతీశ్ ఆగిరిపల్లి ఎస్ఐ చంటిబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం శోభనాపురం అల్లూరమ్మ చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఓ రైతు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పిల్లల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆడుకుంటూనే వెళ్లి.. శశిక, చంద్రిక, జగదీష్ ముగ్గురూ జ్యోతి ఇంటి ముందు సోమవారం మధ్యాహ్నం ఆడుకున్నారు. ఈదర గ్రామం నుంచి బొద్దనపల్లి ఆర్సీఎం చర్చి మీదుగా వారు ఆడుకుంటూ వెళ్లడాన్ని కొందరు గ్రామస్తులు చూశారు. ఆ తర్వాత వీరు శోభనాపురం అల్లూరమ్మ చెరువు వైపు వెళ్లి స్నానం చేసేందుకు చెరువులోకి దిగి మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చెరువులో ముందుగా శశిక, చంద్రిక మృతదేహాలు లభ్యం కాగా, మరి కొంత దూరంలో జగదీష్ మృతదేహం లభ్యమైంది. ప్రమాద స్థలాన్ని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్ సీఐ కె.సతీశ్, తహసీల్దార్ వీవీ భరత్‌రెడ్డి పరిశీలించారు. ఆ తల్లులకు పిల్లలే సర్వస్వం శశిక, చంద్రిక తల్లిదండ్రులు, గండికోట జగదీష్ తల్లిదండ్రులు విడిపోవడంతో ముగ్గురు పిల్లలు వారి తల్లుల వద్దే ఉంటున్నారు. ముగ్గురూ బొద్దనపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లులిద్దరూ బిడ్డలనే సర్వస్వంగా భావిస్తున్నారు. కూలి పనులు చేసుకుని వారిని చదివించుకుంటున్నారు. పిల్లల మృతితో గుండెలవిసేలా రోధిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావట్లేదు. చదవండి: కోడలిని వేధించిన పాపం..! -
చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య
-
వైద్యుడి కుటుంబంలో ఊహించని విషాదం
మదనపల్లె: వృత్తిబాధ్యతల్లో తలమునకలైన వైద్యులు కొందరు ఆదివారం సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్ట ణానికి సమీపంలోని రామిరెడ్డిగారిపల్లె చెరువుకు విహారయాత్రగా వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నిండుకుండలా ఉన్న చెరువులో కేరింతలు కొడుతూ పిల్లలతో ఆడుతూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వైద్యులు ఇందుకూరి అనిల్‌రెడ్డి, కవిత దంపతుల ఏకైక కుమారుడు ఇందుకూరి పునీత్‌రెడ్డి(12) చెరువులో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. అప్పటి దాకా అరుపులు, కేకలతో సరదాగా గడుపుతున్న కొడుకు క్షణాల వ్యవధిలో మృత్యువాత పడడంతో రోదనలు మిన్నంటాయి. వాహనాలు తెచ్చేందుకు వెళ్లి.. సొసైటీ కాలనీలో దంతవైద్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కవిత అంజన క్లినిక్ నిర్వహిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు ఇందుకూరి పునీత్‌రెడ్డి(12) వశిష్ట స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. నెలలో ఒక ఆదివారం పట్టణంలోని కొందరు వైద్యులు కుటుంబసభ్యులతో కలిసి సమీప ప్రాంతాలకు పిక్నిక్కు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని రామిరెడ్డిగారిపల్లె పిచ్చలవాండ్లపల్లె చెరువులో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈత కొడుతూ చాలాసేపు సంతోషంగా గడిపారు. ఇళ్లకు బయలుదేరే ముందు కాసేపు గడిపి వస్తామని పిల్లలు చెప్పడంతో వాళ్లను చెరువులో వదిలి వాహనాలు తెచ్చేందుకు పెద్దవాళ్లు బయటకు వచ్చారు. బాలుడు పునీత్‌రెడ్డి ఈత కొడుతూ చెరువులో కొంత ముందుకు వెళ్లి గుండుపై కూర్చునేందుకు ప్రయత్నించాడు. అది పాచిపట్టి ఉండడంతో కాలుజారి లోతులోకి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు, వైద్యులు హుటాహుటిన చెరువులోకి దిగి బాలుడిని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. భయంతో నీళ్లు మింగడం, ఊపిరాడకపోవడంతో చెరువులోనే బాలుడు చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ఎదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. బాలుడి తాత ఈశ్వర్‌రెడ్డి జనతాక్లినిక్ పేరుతో తక్కువ ఫీజుతో సేవలందించిన డాక్టర్‌గా గుర్తింపు పొందారు. మృతి చెందిన బాలుడిని అంత్యక్రియల నిమిత్తం డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి స్వస్థలం తంబళ్లపల్లె నియోజకవర్గం చౌడసముద్రంకు తరలించారు. డాక్టర్ అనిల్‌కు పలువురి పరామర్శ.. పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడన్న విషయం దావానంలా వ్యాపించింది. విషయం తెలిసి పలువురు పీఅండ్‌టీ కాలనీలోని డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. విషాదంలో మునిగిపోయిన బాలుడి తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, జబ్బల శ్రీనివాసులు, గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, బోర్వెల్ వెంకటేష్, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, డిష్ రామకృష్ణారెడ్డి, బాలగంగాధరరెడ్డి, ఎల్ఐసీ సుధాకర్, దేవతాసతీష్, రెడ్డి జనసంక్షేమ సంఘం సభ్యులు రోజానాగభూషణరెడ్డి, సాంబశివారెడ్డి, అంకిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్ -
మే 23న కూతురి పెళ్లి.. అంతలోనే జలసమాధి
సాక్షి, జగిత్యాల/ మేడిపల్లి (వేములవాడ): దైవ దర్శనానికి వేకువజామునే సొంతూరుకు బయల్దేరిన ఓ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించినా తేరుకునే లోపే మృత్యువు కాటేసింది. నీట మునిగి ముగ్గురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. ‘‘అమ్మకు ఈత రాదు. అమ్మను తీసుకొని బయటకు వెళ్దాం..’’అని తండ్రి ధైర్యం చెప్పినా... తేరుకొని బయటపడే ప్రయత్నం చేసే లోపే కారులో నీరు నిండిపోయింది. దంపతులు, కూతురు దుర్మరణం చెందగా... కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన న్యాయవాది కటికనేని అమరేందర్‌రావు (55), ఆయన భార్య శిరీష (45), కూతురు శ్రేయ (23), కుమారుడు జయంత్ కలిసి సోమవారం స్వగ్రామమైన కోరుట్ల మండలం జోగన్ పెల్లికి బయల్దేరారు. ఊరిలో సోమవారమే ప్రారంభమైన వేంకటేశ్వరస్వామి ఉత్సవా లకు హాజరయ్యేందుకు తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరారు. ఆ తర్వాత 15 నిమిషాలకే కారు అదుపుతప్పి మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో రోడ్డు పక్కనున్న ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది. ఆ సమయంలో అమరేందర్‌రావు కారు నడుపుతుండగా, కుమారుడు జయంత్ పక్కన కూర్చున్నాడు. భార్య శిరీష, కూతురు శ్రేయ వెనుక సీట్లో కూర్చున్నారు. కారు కాలువలో పడి సుమారు 20 మీటర్ల దూరం వరకు వెళ్లి మోటారు పైపునకు తట్టుకుని ఆగింది. కుమారుడు జయంత్ కారు డోరు తీసు కుని... ఈదుకుంటూ సురక్షితంగా బయట పడినప్పటికీ అమరేందర్‌రావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ కారులో ఇరు క్కుపోవడంతో నీటిలోనే మునిగి మరణిం చారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు చనిపోయారు. చదవండి: (నా భార్యను నేనే చంపేశా.. ఇక దేనికైనా సిద్ధమే) కాలువలో పడ్డ కారును బయటకు తీస్తున్న పోలీసులు నిద్రమత్తులోనే ప్రమాదం తెల్లవారుజామునే జగిత్యాల నుంచి బయల్దేరిన కారు మేడిపల్లి మీదుగా కోరుట్ల మండలం జోగిన్‌పల్లికి వెళ్లేమార్గంలో కట్లకుంట వద్దనున్న ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి ముందు నుంచే కాలువలోకి దూసుకెళ్లింది. బ్రిడ్జి దగ్గరకు రాగానే నేరుగా బీటీ రోడ్డు వైపు వెళ్లకుండా కుడివైపునకు మళ్లించడంతో అదుపుతప్పి కారు కాల్వలో పడింది. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురికి ఈత వచ్చినా.. కారు కాలువలోకి దూసుకెళ్లగా.. అమరేందర్‌రావు, ఆయన భార్య, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఎవరూ కంగారు పడొద్దు. మన ముగ్గురికీ ఈత వస్తుంది.. అమ్మను మెల్లగా బయటకు తీసు కొద్దాం..’’అని అమరేందర్‌రావు పిల్లలకు చెప్పారు. కానీ.. కారు డోర్లు తీయలేక పోవడంతో లోపలే ఇరుక్కుపోయారు. కారులో నీళ్లు నిండుతున్నాయని శిరీష, శ్రేయలు కారు మునిగిపోయే సమయంలో అరిచినట్లు జయంత్ చెప్పాడు. మూడు నెలల్లో కూతురు పెళ్లి.. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శ్రేయకు వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ఇటీవలే పెళ్లి కుదిరింది. మే 23న పెళ్లి పెట్టుకున్నారు. సోమవారం జోగిన్‌పల్లిలో దైవ దర్శనం తరువాత హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి పనులు, షాపింగ్ పూర్తి చేసుకోవాలని అమరేందర్‌రావు కుటుంబీకులు భావించారు. ఈలోపే ప్రమాదం చోటుచేసుకొని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల ఆసుపత్రిలో మృతదే హాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధుశర్మ పరిశీలించారు. రెయిలింగ్ లేక ప్రమాదాలు ఐదు రోజుల క్రితం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజు పల్లి శివారులో ఎస్సారెస్పీ కాలువలో కారు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మరువకముందే సోమవారం జగి త్యాల జిల్లా కట్లకుంట శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సా రెస్పీ కెనాల్ మీదుగా వెళుతున్న రహదారులపై బ్రిడ్జీలకు ఇరువైపులా సుమారు 100 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 16న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివారులో ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంధువులు ప్రయాణిస్తున్న కారు కాలువలో పడి ముగ్గురు మృతిచెందారు. ఇక్కడే జనవరి 25న సుల్తానాబాద్‌కు చెందిన దంపతులు కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు. ఇదే ప్రాంతంలో వేర్వే రు ఘటనలో రెండు బైక్ ప్రమాదాల్లో నలుగురు మరణించారు. అమ్మను కూడా తీసుకెళ్దాం అన్నారు ‘కారులో బయల్దేరాక నాన్నకు నిద్ర వస్తోందని నేను డ్రైవ్ చేస్తానన్నాను. పర్లేదు బిడ్డా... టెన్షన్ పడకు నేను నడుపుతా అన్నారు. బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపుతప్పడంతో కాలువలో పడిపోయింది. వెంటనే నాన్నా కారు నుంచి బయటకు వెళ్దాం అన్నాను. ఏమీ కాదులే.. నీకు, నాకు, అక్కయ్యకు ఈతవచ్చు. అమ్మకు ఈత రాదు కాబట్టి ఆమెను తీసుకొని బయటకు వెళ్దాం అన్నారు. నాన్న ఆ మాట చెప్పేలోపే కారు నీటిలో మునిగిపోయింది. నేను డోరు తీసుకొని బయటకు వచ్చాను. కానీ నాన్న, అమ్మ, అక్క కారులోనే ఇరుక్కుపోయారు. కళ్లముందే అంతా అయిపోయింది.’ – జయంత్, కుమారుడు -
పతంగి కోసం వెళ్లి.. పెంటకుప్పలో పడి
ముంబై: సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అవును పండుగ ముందు నుంచి మొదలయ్యే పతంగుల సందడి ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పతంగులు సంతోషాన్నే కాదు.. అప్పుడప్పుడు విషాదాన్ని కూడా నింపుతాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా గాలిపటం ఎగురేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది. (చదవండి: వైరల్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం) షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. -
తల్లి ప్రాణం విలవిల; కళ్లెదుటే కొడుకు మృతి
సాక్షి, యాలాల: ఇద్దరు కొడుకులతో కలసి సరదాగా చెక్‌డ్యాం ప్రదేశాన్ని చూసొద్దామని వెళ్లిన ఓ తల్లికి తీరని విషాదం మిగిలింది. కళ్లెదుటే కొడుకు నీటమునుగుతుంటే తల్లిమనసు తల్లడిల్లింది. నిస్సహాయస్థితిలో ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌కి చెందిన హారూన్ హుస్సేన్, సైదా బేగం దంపతులకు షేక్ రిహాన్(11), సోఫియాన్ సంతానం. హారూన్ హుస్సేన్ సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాతతాండూరులో నివాసముంటున్న తన సోదరి ఇంట్లో శుక్రవారం జరిగిన విందుకు సైదాబేగం తన ఇద్దరు కొడుకులతో కలసి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం పాత తాండూరు శివారులో ఉన్న చెక్‌డ్యాం వద్ద సరదాగా కాసేపు గడిపి వద్దామని ఇద్దరు కొడుకులు, సోదరితో కలసి వెళ్లింది. చెక్‌డ్యాం సమీపంలో అక్కాచెల్లెళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా రిహాన్ నీళ్లలోకి దిగాడు. మోకాలి లోతు వరకు దిగిన రిహాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. సైదా బేగం గమనించి సహాయం కోసం కేకలు పెట్టింది. అక్కాచెల్లెళ్లకు ఈత రాకపోవడం, సహాయం చేసేందుకు సమీపంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బాలుడిని రక్షించలేకపోయారు. కొద్ది సేపటి అనంతరం బాలుడి మృతదేహాన్ని స్థానికులు నీటి నుంచి బయటికి తీశారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఇసుక కోసం తోడిన గుంతలతోనే ప్రమాదం! చెక్‌డ్యాం ప్రదేశంలో ఇసుక కోసం అక్రమార్కులు ఇష్టారాజ్యం గా తోడిన గుంతలే బాలుడిని మింగేశాయి. ప్రతి వేసవిలో చెక్‌డ్యాం నుంచి పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఇసుక కోసం తవ్వడంతో ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచాయి. అవగాహన లేనివారు నీళ్లలో అడుగుపెట్టి ప్రమాదవశాత్తు అందులోకి జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిన్నారి రిహాన్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: హైదరాబాద్‌లో సంచలనం రేపిన కిరాతక హత్య ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం -
దీపావళి పండగపూట విషాదం
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో దీపావళి పండగపూట విషాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ కాల్వలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. పండగ పూట జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల చొరవతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు. మృతులను సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. డ్యాం గేట్ల వద్ద స్నానానికి దిగిన సందర్భంగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మహబూబాబాద్: కళ్లముందే నీట మునిగిన కూతురు
-
కళ్లముందే నీటిలో కొట్టుకుపోయిన కూతురు
సాక్షి, మహబూబాబాద్: జలపాతాన్ని చూసి ఉల్లాసంగా గడుపుదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లముందే నీట మునిగింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్, శ్రీవిధ్య దంపతులు, కూతురు శివాని, కుమారుడు శివాజీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఫోటోలు దిగి సరదాగా గడిపారు. (చదవండి: శ్రీనివాస్ చనిపోయాడు.. ) తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శివానీ ఆచూకీ లభించకపోవడం రెండు జేసీబీల సహాయంతో ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. దాంతో విగత జీవిగా మారిన శివానీ కనిపించింది. ఆమె యానిమల్ హజ్బెండరీలో డిప్లమా చేస్తున్నట్టు తెలిసింది. కళ్లముందే తమ బిడ్డ జల సమాధి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ సమయంలో వాటిని సందర్శించడం మంచిది కాదని పోలీసులు ప్రజలకు సూచించారు. (చదవండి: ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ... ) -
విషాదం: పిల్లల కోసం తండ్రి జలసమాధి
లండన్: సహజంగా పిల్లలంటే తల్లికే ఎక్కువ ప్రేమంటారు. కానీ ఆ తండ్రికి మాత్రం పిల్లలంటే చచ్చేంత ప్రేమ. ఇంగ్లండ్‌లోని బ్రాడ్మౌత్లో ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్న 36 ఏళ్ల జొనాథన్ జాఫ్ స్టీవెన్స్ సోమవారం పిల్లలను తీసుకొని బయటకు వెళ్లాలనుకున్నారు. 12 ఏళ్ల లాసీ, 11 ఏళ్ల లారెన్, 10 ఏళ్ల జాక్‌ను తీసుకొని సమీపంలోని బార్మౌత్ సముద్ర తీరానికి వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు సముద్ర కెరటాలకు సరదాగా గంతులేస్తుండగా ఓ చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉండి పిల్లలను సముద్రంలోకి లాగేసింది. వెంటనే అప్రమత్తమైన స్టీవెన్స్ ప్రాణాలకు తెగించి ఒక్కొక్కరి చొప్పున ముగ్గురు పిల్లలను కాపాడి ఒడ్డుకు చేర్చగలిగారు. అప్పటికే నీటికి ఎదురీదలేగ అలసిపోయి ఆయాస పడుతున్న స్టీవెన్స్ కడసారి వీడ్కోలు అన్నట్లుగా ముగ్గురు పిల్లలవైపు చూస్తూ ఓ చిరునవ్వుతో నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని ఊహించిన 11 ఏళ్ల లారెన్ ‘లైవ్ గార్డ్స్’ వద్దకు పరుగెత్తికెళ్లి తన తండ్రిని రక్షించాలంటూ వేడుకుంది. వారు పరుగెత్తుకొచ్చి సముద్రంలోకి దూకారు. మరోవైపు నుంచి రిస్క్యూ బోటు కూడా వచ్చింది. కొన ఊపిరితో ఉన్న స్టీవెన్స్‌ను పట్టుకొని రెస్క్యూ బోటులో ఒడ్డుకు తరలించారు. అప్పటికి స్పహతప్పిన స్టీవెన్స్‌కు గుండెపై ఒత్తిడి తీసుకరావడం (సీపీఆర్) ద్వారా రక్షించేందుకు ప్రయత్నించారు. దాంతో లాభం లేకపోవడంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ హెలికాప్టర్లో స్టీవెన్స్‌ను బ్యాంగర్లోని గ్యానెడ్ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. తమ తండ్రి నిజంగా హీరోనని, తమ ముగ్గురు ప్రాణాలను రక్షించారని ఆయన చనిపోవడం తట్టుకోలేక పోతున్నామని 12 ఏళ్ల కూతురు లాసీ మీడియాతో వ్యాఖ్యానించగా, ‘తాను మునిగిపోతూ మమ్మల్ని కాపాడగలిగానన్న తప్తితో చివరిసారిగా చిద్విలాసంగా మావైపు చూస్తూ మా నాన్న నవ్వడాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’ అని లారెన్ వ్యాఖ్యానించింది. నెల రోజుల క్రితమే స్టీవెన్స్‌తో విడిపోయిన ఆయన భార్య లారా బర్ఫోర్డ్, అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని ష్రాప్‌షైర్‌లో తన చిన్న కుమారుడితో ఉంటున్నారు. పిల్లలు, స్టీవెన్స్ ప్రమాదానికి గురైన చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉందని తెల్సిందని, అక్కడ ప్రమాద హెచ్చరికలు ఎందుకు ఏర్పాటు చేయలేదని లారా బీచ్ అధికారులను ప్రశ్నించారు. -
నీట మునిగి ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు
-
నాయనా నన్నూ నీతో తీసుకుపోరా..
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో శుక్రవారం సరదాగా ఈతకు వెళ్లిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. అగ్ని మాపక సిబ్బంది కథనం మేరకు.. కొండామారిపల్లెకు చెందిన బైలు గంగిరెడ్డి, సుజాతమ్మ దంపతుల పెద్ద కుమారుడు మణికంఠ (21) అంగళ్లులోని ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చువుతున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు గణజగదీశ్వర్(21), సుధాకర్ కుమారుడు కిరణ్ సాయి (21)తో కలిసి శుక్రవారం గ్రామ సమీపంలోని బసినికొండ బైపాసు రోడ్డులో ఉన్న స్వామి చెరువుకు ఈతకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో మణికంఠ లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి తిరిగి గట్టుకు రాలేకపోయాడు. స్నేహితులు చూస్తుండగానే మునిగిపోయాడు. వారు గ్రామస్తులకు సమాచారం అందించి చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి కరుణాకర్ తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకుని చీకటి పడేవరకూ గాలించారు. శనివారం ఉదయం మళ్లీ గాలిస్తామని తెలిపారు. సంఘటనా స్థలం వద్దకు రూరల్ ఏఎస్ఐ మహదేవనాయక్ తదితరులు చేరుకుని ఘటనపై మణికంఠ స్నేహితులను ఆరాతీశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నాయనా నన్నూ నీతో పాటే తీసుకుపోరా.. నాయనా..! నన్నూ నీతోపాటే తీసుకుపోరా.. బిడ్డ బాగా చదువుకుంటున్నాడు. ఇంజినీర్ అయి బాగా చూసుకుంటాడని అనుకుంటే మాకంటే ముందే ఆ దేవుడు నిన్ను తీసుకుపాయనే.. ఇక మేమెట్ల బతకాలి తండ్రీ.. నీ చదువుకోసం మీ నాన్న సౌదీలో ఉంటూ నాలుగేళ్లుగా కష్టాలు భరించాడే.. నాలుగు రోజుల క్రితం సౌదీ నుంచి ఇంటికి వస్తుంటే విమానాశ్రయం నుంచే నేరుగా తిరుపతి క్వారంటైన్‌కు తీసుకుపోయారే.. నీ తండ్రికి చివరి చూపు కూడా లేకుండా చేశావా నాయనా.. నన్నూ నీతోపాటే తీసుకుపోరా.. అంటూ విద్యార్థి తల్లి సుజాతమ్మ చేస్తున్న రోదనలు చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
చిన్నారులను కాపాడి అన్న, చెల్లెలు మృతి
తూప్రాన్: విహారం విషాదాంతం అయింది. నీటిగుంత అన్న, చెల్లెలిని మింగేసింది. రెండు కుటుంబాలు ఆనందంగా ఉన్న తరుణంలో పెను విషాదం చోటు చేసుకుంది. మునిగిపోతున్న వారిని కాపాడి అన్న, చెల్లెలు విగత జీవులైన ఘటన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో జరిగింది. ఘనపూర్ గ్రామానికి చెందిన బిట్ల నర్సింహులు దేవుని మొక్కు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నరసింహస్వామి గుట్ట వద్దకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. తన ఇద్దరు చెల్లెళ్లయిన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన సునీత, నరేందర్ దంపతులు, కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత, వారి కుటుంబ సభ్యులను ఆహా్వనించాడు. దేవుని వద్ద మొక్కులు తీర్చుకొని భోజనాలు చేశారు. అనంతరం పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వినోద్‌కుమార్ అనే బాలుడితో పాటు మరో బాలిక గుట్ట కింద ఉన్న నీటిగుంతలో పడిపోయారు. తోటి పిల్లలు కేకలు వేయడంతో పక్కనే ఉన్న లలిత కుమారుడు ప్రశాంత్(22) వెంటనే గుంతలో పడి ఉన్న ఇద్దరు చిన్నారులను పైకి లాగేసి ఒడ్డున పడేశాడు. కానీ తరువాత అతడు ఆ గుంతలో మునిగిపోయాడు. దీన్ని గమనించిన అతని చిన్నమ్మ కూతురు పావని (17) అన్నను కాపాడేందుకు గుంతలోకి దిగి మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో పావనిని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పావని మృతి చెందింది. అలాగే నీటి గుంతలో పడి మృతిచెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు
సాక్షి, చెన్నై: ఓ మిత్రుడి పుట్టినరోజు వేడుక నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బర్త్ డే పార్టీకి వచ్చిన నలుగురు మిత్రులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. అందులో ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు చేరగా..మరో మృతదేహం కోసం గాలింపు సాగుతోంది. తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలోని మనలి బల్జిపాళయంకు చెందిన రాకేష్ (15) పుట్టినరోజు వేడుక శనివారం అయ్యింది. ఈ వేడుకలో పాల్గొనడానికి 8 మంది మిత్రులు రాకేష్ ఇంటికి శనివారం వచ్చారు. రాకేష్‌తో కేక్ కట్ చేయించి మధ్యాహ్నం ఎన్నూరు సముద్ర తీరంలోని కేవీకుప్పుం వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు మిత్రులు ఒడ్డునే ఉండిపోగా ధనూష్ (15), జయభారతి (15), గోకుల్‌నాథన్ (15), సునీల్‌కుమార్ (15) మాత్రం సముద్ర స్నానానికి వెళ్లగా ఓ రాక్షస అల వీరిని మింగేసింది. స్నానం చేస్తున్న మిత్రులు కనిపించకపోవడంతో ఒడ్డునున్న మిగిలిన మిత్రులు భయంతో కేకలు పెట్టగా..జాలర్లు వచ్చి ఆ నలుగురు కోసం గాలించారు. ధనూష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో ఓ మృతదేహం బయటపడగా, మరో మృతదేహం ఒడ్డుకు చేరింది. ఆ ఇద్దరినీ జయభారతి, సునీల్‌కుమార్‌గా గుర్తించారు. గోకుల్‌నాథ్ కోసం గాలిస్తున్నారు. -
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి..!
టోరంటో/మహేశ్వరం : కెనడాలో ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు విడిచాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్‌కు చెందిన బుస్సు జగన్మోహన్ రెడ్డి(29)గా తెలిసింది. కెనడాలోని టోరంటోలో ఓ సరస్సులో పడి అతను మృతిచెందినట్టు సమాచారం అందింది. 2012లో హైదరాబాద్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి అతను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. పూరి వివరాలు తెలియాల్సి ఉంది. -
డల్లాస్‌లో జరిగిన ప్రమాదంలో భారత విద్యార్థి మృతి
డల్లాస్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ భారత విద్యార్థి అక్కడ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల లింటో ఫిలిప్ నాలుగు నెలల కిందట మాస్టర్స్ కోసం డల్లాస్ వెళ్లాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు సుసాన్ ఫిలిప్, పీఎం ఫిలిప్ దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేస్తున్న లింటో శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి సాహసోపేతమైన కయాకింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. కయాకింగ్ అనేది నీటిలో ఒక చిన్న పడవపై చేసే ప్రయాణం. లేక్ రే హుబ్బార్డ్‌లో లింటో కయాకింగ్ చేస్తుండగా.. జలల ప్రవాహం అధికంగా ఉండటంతో అతని కయాక్ తిరగబడిందని డల్లాస్ పోలీసులు తెలిపారు. దీంతో లింటో నీళ్లలో కొట్టుకుపోయాడని వెల్లడించారు. గల్లంతయిన అతడి మృతదేహాన్ని గుర్తించిన రెస్యూ సిబ్బంది పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. -
నివురుగప్పిన నిర్లక్ష్యం.. ముగ్గురు చిన్నారుల బలి
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారులను బలితీసుకుంది. ఇళ్ల సమీపంలోగల నీటి గుంతల వద్దకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ఒకరిని రక్షించబోయి మరొకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులు నివర్ద్ కాంబ్లీ, కృష్ణ, సందీప్ సుభాష్‌ల కుటుంబాలు మహారాష్ట్ర నుంచి 10 ఏళ్ల కిందట హనుమాన్‌నగర్ కాలనీకి వలసవచ్చాయి. రోజూ కూలీ చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న తమ కుటుంబాల్లో అక్రమ మట్టి తవ్వకాలు చిచ్చురేపాయని చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మట్టిని తవ్వుకున్న అనంతరం గుంతల్ని పూడ్చకుండా వదిలివేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. -
వాటర్‌ఫాల్స్‌లో కొట్టుకుపోయిన యువకులు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం ప్రమాదం చోటు చేసుకుంది. శివపురి, గ్వాలియర్ పరిధిలోని సుల్తాన్‌ఘర్ జలపాతంలో కొంతమంది యువకులు కొట్టుపోయారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురిని రక్షించగలిగారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, హెలికాఫ్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15సెలవు దినం, మరోపక్క వర్షాల కారణంగా నిండుగా కళకళలాడుతున్న జలపాతాలు. దీంతో దాదాపు 20మంది యువకులు జలపాతానికి పిక్నిక్కి వెళ్లారు. అయితే హఠాత్తుగా వరద నీరు పోటెత్తడంతో 11మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పిక్నిక్ వెళ్లినవారు స్నానాలు చేస్తుండగా ఉధృతంగా నీరు కిందికి ప్రవహించడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. 100 అడుగుల ఎత్తు నుండి నీరు వేగంగా కిందికి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రెస్య్కూ టీం ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడిందనీ, పదకొండుమంది యువకులు కొట్టుకుపోయారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు. దాదాపు 30-40మంది ఇంకా అక్కడే చిక్కుకు పోయినట్టు చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రంనుంచి భారీగా కురుస్తున్న వర్షం, చీకటి సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా నీటికి దిగువకు వదలడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కావేరిలో మునిగి నలుగురు మృతి
సేలం: కావేరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు నీట మునిగి మృతి చెందగా ఒక బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మెట్టూరు సమీపంలోని కోల్నాయకన్ పట్టి గ్రామానికి చెందిన వాణిశ్రీ (19), ధనుశ్రీ (16)తోపాటు తిరుప్పూర్ జిల్లా విజయమంగళంనకు చెందిన శరవణన్ (35), ఆయన భార్య మైథిలి (32), కుమారుడు హరిహరన్ (9), రవినా (15) కావేరి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. స్థానికులు ధనుశ్రీని మాత్రమే కాపాడగలిగారు. గజ ఈతగాళ్ల సాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. హరిహరన్ కోసం ఆదివారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. -
గంగా నదిలో ఆరుగురు చిన్నారుల గల్లంతు
కాన్పూర్ : గంగా నదిలో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం కాన్పూర్‌లోని గంగా నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారులు, నీటిలో మునిగిపోయారు. వారంత కూడా 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల వారని తెలుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు, ఈతగాళ్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఆరుగురు చిన్నారులు నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశాం. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాలను కాన్పూర్‌లోని హాలెత్ హాస్పిటల్‌కు తరలించామన్నారు. -
ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
సాక్షి, విజయవాడ : సంగమం ఘాట్ వద్ద నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ నలుగురు విద్యార్థుల్లో ఒకరైన ప్రవీణ్ (18) తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను సెక్యురిటీగా పెడితే మా బాబు బతికే వాడని, ఘాట్ వద్ద సెక్యురిటీ, హెచ్చరిక బోర్డులని ఎందుకు ఏర్పాటు చేయలేదని పోలీసులను నిలదీశారు. ఏ ముహుర్తాన సంగమం ఘాట్ ఏర్పాటు చేశారో కానీ ఎంతో మంది బలైపోతున్నారని వాపోయారు. ఘటన జరిగిన తరువాత కాలేజీ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదనీ, ఈ దుర్ఘటనకు కాలేజీ యాజమాన్యంతో పాటు, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో పడవ ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా ప్రభుత్వం ఘాట్ వద్ద సెక్యురిటీని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. -
పుష్కరిణిలో పడి ముగ్గురు మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అడ్డాకుల మండలం కుందూరులో ముగ్గురు యువకులు శ్రీరామలింగేశ్వరస్వామి పుష్కరిణిలో పడి మృతి చెందారు. జాతర సందర్భంగా పుష్కరిణిలో స్నానానికి వెళ్లిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు సోదరులు మహబూబ్‌నగర్ కు చెందినవారుగా గుర్తించారు. -
ఈతకెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం
సాక్షి, దావణగెరె: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని దావణగెరె నగరానికి సమీపంలోని ఆవరగెరెలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఈత కొట్టేందుకు ఆవరగెరెకు చెందిన గిరీష్(10), ధృవ(10)లు చెరువులోకి దిగారు. అయితే బురదలో చిక్కుకుని ఊపిరాడక మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులో గాలింపు జరిపి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యానగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఖానాపూర్ : సుర్జాపూర్ పంచాయతీ పరిధి మేడంపెల్లిలోని సదర్మాట్ ఆనకట్ట వద్ద నీటిలో సరదాగా ఈత కొడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి తాళ్లపల్లి శ్రావణ్‌గౌడ్(25) మృతి చెందినట్లు ఎస్సై కొల్లూరి వినయ్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన శ్రావణ్, బోధన్‌కు చెందిన జశ్వంత్ మంగళవారం మెట్‌పల్లిలోని స్నేహితుడు గౌతమ్ ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సదర్మాట్ చూసేందుకు వెళ్లారు. సరదాగా ఈత కొడుతుండగా శ్రావణ్ అవతలి ఒడ్డువైపుకు వెళ్లి తిరిగివస్తూ నీటిలో మునిగిపోయాడు. స్నేహితున్ని కాపాడే ప్రయత్నంలో అక్కడే ఉన్న పలువురిని పిలిచేసరికే నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలియడంతో సీఐ అజ్మీరా పెద్దన్నకుమార్, ఎస్సై, స్థానిక నాయకులు అక్కడికి చేరుకొని ఈత గాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
హోలీ వేడుకల్లో అపశ్రుతి
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబరాల్లో మునిగితేలిన ఇద్దరు యువకులు రంగులు కడుక్కోవడానికి గోదావరిలో దిగి నీట మునిగి గల్లంతయ్యారు. స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మొరాంపూడి రాంప్రసాద్(19), బోటా రమేష్(19) స్నేహితులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్నానం చేయడానికి గోదావరికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు యువకుల బంధువుల రోదనలతో గోదావరి తీరం ఉద్వేగంగా మారింది. -
యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు
భీమవరం టౌన్ : భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకి యువతి, యువకుడు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఓ యువతి బైపాస్ రోడ్డులో వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకింది. ఆ సమయంలో అక్కడే ఉన్న యువకుడు ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకాడు. వీరు దూకిన ప్రాంతంలోఊబిలా ఉండటంతో కూరుకుపోయి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూబోట్‌లో గా లింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన యువతి సుంకర పద్దయ్య వీధికి చెందిన పి.సత్యస్వరూప (18)గా అక్కడ ల భించిన ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఐడెంటిటీ కార్డు ద్వారా తెలిసింది. యువకుడు చిన్నఅప్పారావు తోట ప్రాంతానికి చెందిన కనిమిరెడ్డి మహేష్ (25)గా తెలుస్తోంది. యనమదుర్రు డ్రెయిన్‌లో దూకడానికి కొద్ది సమయం ముందు లంకపేట వద్ద వీరిద్దరూ ఘర్షణ పడ్డారని, తర్వాత ఆమె వేగంగా నడుచుకుంటూ వచ్చి వంతెనపై నుంచి దూకిందని తెలుస్తోంది. వెనుకనే మోటార్ సైకిల్‌పై వచ్చిన మహేష్ ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకగా ఇద్దరు గల్లంతయ్యా రు. వీరిద్దరూ ప్రేమికులని గతంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో విడిపోయారని ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టు మరికొందరు చెబుతున్నారు. దీనిపై టూటౌ¯ŒS పోలీస్ స్టేషన్లో పోలీసులను వివరణ కోరగా తమకెలాంటి ఫి ర్యాదు అందలేదని చెప్పారు. -
పాకాల వాగులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతు
ఖానాపూర్: వరంగల్ జిల్లా పాకాల వాగులో పడి ఆదివారం ఓ టెకీ గల్లంతయ్యాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధర్మారానికి చెందిన అనిల్ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పాకాల వాగు వద్దకు వచ్చిన అనిల్ మద్యం సేవించినట్లు తెలిసింది. మత్తులో కాలు జారి వాగులో పడిపోయినట్లు తెలిపారు. అనిల్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
హైదరాబాద్: ఈతకు వెళ్లిన ఇద్దరు నీట మునిగి మృత్యవాత పడ్డారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు టెన్త్ విద్యార్థి కాగా, మరో యువకుడు ఉన్నాడు. వరంగల్ జిల్లా హనుమకొండ మండలం సింహాపురం గ్రామ శివారులోని బెస్తచెరువులో ఈతకు వెళ్లిన ఇమ్మడి భవన్ అనే టెన్త్ విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు. సింహపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం బెస్త చెరువులో ఈతకు వెళ్లారు. వారిలో భవన్ చెరువులో మునిగి మృతి చెందాడని మిగిలి ముగ్గురు విద్యార్థులు గ్రామంలోకి వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు. వారు చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. మరో వైపు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలకేంద్రం ఇంద్రానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్నఅజయ్(20) అనే యువకుడు మానేరు వాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
సత్తుపల్లి: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. దీంతో రేజర్ల గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
పొంగి పొర్లుతున్న ‘నిర్లక్ష్యం’
* ఆరు దశాబ్దాలుగా పంట నష్టం * వచ్చి చూసి వెళ్లేవారే తప్ప చర్యలు శూన్యం * నల్లమడ శాశ్వత ముంపు నివారణ చర్యలకు వెనకడుగు * మాటలతో కాలం గడుపుతున్న ప్రభుత్వం పెదనందిపాడు/ చిలకలూరిపేట టౌన్: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లమడ వాగు కింద సుమారు 3లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతోంది. గుంటూరు జిల్లాలో చిలకలూరి పేట, ప్రత్తిపాడు, పొన్నూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో పర్చూరు, చీరాల నియోజవర్గాల రైతులు ఈ వాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఆరు నియోజకవర్గాల్లో ఈ వాగుపై చాలా చోట్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకాల వలన రైతులకు ఉపయోగం ఉన్నా, వరదలు వచ్చిన ప్రతిసారీ రైతులు నష్టపోతూనే ఉన్నారు. పాలకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. వాగుకు పడిన గండ్లను పటిష్టంగా పూడ్చకపోవడం వలన పడిన చోటే మళ్లీ మళ్లీ గండ్లు పడుతున్నాయి. 2013లో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నల్లమడ వాగును శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపడతామని ప్రకటించారు. తీరా గెలిచిన తర్వాత నల్లమడ వాగు గురించి మరిచి పోయారు. 60 ఏళ్లలో 8 కమిటీలు.. నల్లమడ వాగుకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈ 60 ఏళ్లలో 8 కమిటీలు సూచనలు చేశాయి. ఏ ఒక్క సూచన అమలు చేసిన దాఖలాలు లేవని నల్లమడ రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. 1964లో మిత్రా కమిటీ,1980లో సెంట్రల్ వాటర్ కమిషన్, 1982లో శాసనసభ అంచనాల కమిటీ, 1987లో డాక్టర్ శ్రీరామకృష్ణయ్య కమిటీ, 1991లో టెక్నికల్ మానిటరింగ్ కమిటీ, 1998లో సీహెచ్ రాధాకృష్ణమూర్తి కమిటీ, 2000లో ఎ.కృష్ణారావు కమిటీ, 2005లో చీఫ్ ఇంజినీర్ రోశయ్య కమిటీ ఈ ప్రాంతానికి వచ్చి నల్లమడ వాగును పరిశీలించాయి. వాగును 300 సి వాల్యూగా మార్చి, నల్లమడ వాగుకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని సూచించాయి. నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం ఆధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు నాయత్వంలో అనేక సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.211 కోట్లతో నల్లమడ వాగును శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. కానీ నేటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. రైతులకు కష్టాలు తప్పడం లేదు. నల్లమడ వాగును అభివృధ్ధి చేసి ముంపు బారిన పడకుండా శాశ్వత నివారణ చర్యలు చేపడితే ఆరు నియోజకవర్గాలు సస్యశ్యామలంగా మారతాయి. శాశ్వత ముంపు చర్యలు వెంటనే చేపట్టాలి.. నల్లమడ వాగును అభివృద్ధి చేసి, శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలకు గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వెంటనే అమలు చేయాలి. రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంలోని మర్మం ఆయనకే తెలియాలి. వాగులకు కరకట్టలు వేసినపుడు రైతులు కోల్పోయే భూమికి తగిన పరిహారం చెల్లిస్తే రైతులు మాత్రం ఎందుకు సహకరించరు. – డాక్టర్ కొల్లా రాజమోహనరావు, నల్లమడ రైతు సంఘం ఆధ్యక్షుడు రైతుల సమస్యలు పట్టని ప్రజా ప్రతినిధులు.. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఆధికారులు పట్టించుకోకపోడం వలన నల్లమడ శాశ్వత ముంపు నివారణకు ప్రతిపాదనలు తయారైనా అవి ముందుకు సాగడం లేదు.ఇకనైనా ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి నల్లమడ శాశ్వత ముంపు నివారణ చర్యలు అమలయ్యేలా చూడాలి. – యార్లగడ్డ అంకమ్మ చౌదరి, నల్లమడ రైతు సంఘం కార్యదర్శి రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే అందజేయాలి.. ప్రస్తుతం వచ్చిన వరదల వలన పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం అందజేయాలి. నల్లమడ వాగుకు పడిన గండ్లను వెంటనే పటిష్టంగా పూడ్చాలి. – బెల్లం సీతారామయ్య, రైతు -
వరద ముంచిన పొలాలవీ..