
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో దీపావళి పండగపూట విషాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ కాల్వలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. పండగ పూట జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల చొరవతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు. మృతులను సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. డ్యాం గేట్ల వద్ద స్నానానికి దిగిన సందర్భంగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment