nizam sagar canal
-
దీపావళి పండగపూట విషాదం
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో దీపావళి పండగపూట విషాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ కాల్వలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. పండగ పూట జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల చొరవతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు. మృతులను సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. డ్యాం గేట్ల వద్ద స్నానానికి దిగిన సందర్భంగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సాగర్ కాలువలో ఇద్దరి గల్లంతు
వర్ని(బాన్సువాడ): ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.. చదువుల ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ కాలువలో సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు గల్లంతయ్యారు. వర్ని మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థులు సోహెల్ (17), ప్రభురాజ్ (17) బుధవారం చివరి పరీక్ష రాశారు. పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోయిన ఆ మిత్రులు ఇద్దరు సహా ఐదుగురు స్నేహితులు గురువారం సరదాగా స్నానం చేయడానికి సత్యనారాయణ పురం సమీపంలో గల నిజాంసాగర్ కాలువలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సోహెల్, ప్రభురాజ్ కొట్టుకుపోయారు. వీరిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తోటి స్నేహితులతో పాటు సమాచారమందుకున్న బంధువులు కాలువ వెంబడి సాయంత్రం వరకు గాలించారు. రబీ పంటల కోసం వారం రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటుందని స్థానికులు తెలిపారు. విద్యార్థులు గల్లంతు కావడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన బైకు.. వ్యక్తి మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రలోని మంజీర బ్రిడ్జిపై నుంచి ఓ బైకు అదుపుతప్పి నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్‌గౌడ్ గా గుర్తించారు. (నిజాంసాగర్)