
కాలువలోకి దూసుకెళ్లిన బైకు.. వ్యక్తి మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రలోని మంజీర బ్రిడ్జిపై నుంచి ఓ బైకు అదుపుతప్పి నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్‌గౌడ్ గా గుర్తించారు.
(నిజాంసాగర్)