
ప్రాణం తీసిన ఈత సరదా
ఖానాపూర్ : సుర్జాపూర్ పంచాయతీ పరిధి మేడంపెల్లిలోని సదర్‌మాట్ ఆనకట్ట వద్ద నీటిలో సరదాగా ఈత కొడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి తాళ్లపల్లి శ్రావణ్‌గౌడ్(25) మృతి చెందినట్లు ఎస్సై కొల్లూరి వినయ్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన శ్రావణ్, బోధన్‌కు చెందిన జశ్వంత్ మంగళవారం మెట్‌పల్లిలోని స్నేహితుడు గౌతమ్ ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సదర్‌మాట్ చూసేందుకు వెళ్లారు.
సరదాగా ఈత కొడుతుండగా శ్రావణ్ అవతలి ఒడ్డువైపుకు వెళ్లి తిరిగివస్తూ నీటిలో మునిగిపోయాడు. స్నేహితున్ని కాపాడే ప్రయత్నంలో అక్కడే ఉన్న పలువురిని పిలిచేసరికే నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలియడంతో సీఐ అజ్మీరా పెద్దన్నకుమార్, ఎస్సై, స్థానిక నాయకులు అక్కడికి చేరుకొని ఈత గాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.