నదిలో గల్లంతైన నటుడు | Hindi TV Actor Feared Drowned Near Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

నదిలో గల్లంతైన నటుడు

Published Wed, Dec 23 2015 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

నదిలో గల్లంతైన నటుడు

నదిలో గల్లంతైన నటుడు

తేజ్పూర్: ప్రముఖ హిందీ టీవీ నటుడు మోహిన్ ఖాన్ నదిలో మునిగిపోయారు. స్నానానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం సరిహద్దులోని తైఫీ వద్ద గల జియాభరాలి నదిలో అతడు మంగళవారం సాయంత్రం మునిగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సరదాగా స్నానానికంటూ నదిలోకి దిగిన మోహిన్ అది పూర్తయ్యాక ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరాలని అనుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా ఓ అలలాంటి ప్రవాహం రావడంతో నీటిలో మునిగి గల్లంతయ్యారని వివరించారు.

హిందీలోని పలు టీవీ కార్యక్రమాల్లో మోహిన్ నటించాడు. అంతేకాకుండా ఆయన స్వయంగా నిర్మాత కూడా. ఇతడికోసం తొలుత గజ ఈతగాళ్లు, అనంతరం ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి గాలింపులు చేపట్టినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఓ నేషనల్ చానెల్ తరుపున డాక్యుమెంటరీ చిత్రం తీసేందుకు మొత్తం ఐదుగురు సభ్యుల బృందంతో ఈ ప్రాంతానికి మోహిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వాతావరణ భద్రతకు సంబంధించి ఉందని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement