భాగ్యనగరంలో.. జిరో స్వరం..
సంస్కృతి సమ్మేళనంతో అలరించిన సంగీతం
తారామతి బారాదరి వేదికపై జిరో ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానం భాగ్యనగరానిదే
పర్యావరణ స్పృహతో అలరించిన ఉత్సవం
సాక్షి, హైదరాబాద్: ఘనమైన వారసత్వ చరిత్ర, అద్భుతమైన కళాత్మకతకు నెలవైన భాగ్యనగరంలో విభిన్న సంస్కృతులు దర్శనమిస్తాయి. ఆ వారసత్వానికి సంగీత స్వరాలను సమ్మిళితం చేస్తూ నిర్వహించిన ‘జిరో ఆన్ టూర్’ నగరవాసులను అలరించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ ప్రత్యేక సాంస్కృతిక మ్యూజికల్ ఫెస్ట్ మొట్టమొదటిసారి నగరంలోని తారామతి బారాదరి వేదికగా ఆదివారం నిర్వహించారు.
ఈ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఇతర నగరాల్లో నిర్వహించడం ఇదే ప్రథమం. సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఆధ్వర్యంలో ఈ జిరో ఆన్ టూర్ కళాత్మక కార్యక్రమం కళ– పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై సమ్మిళిత ఉత్సవంగా నిర్వహించడం విశేషం. హృదయాన్ని హత్తుకునే పాటలు ఊర్రూతలూగించే సంగీతం, విభిన్న సంస్కృతులు, సంగీత వాయిద్యాలతో సమ్మోహనంగా జరిగిన ఉత్సవంలో రామ్ మిరియాల, రబ్బీ షెర్గిల్, శక్తిశ్రీ గోపాలన్, తబా చాకే వంటి ప్రముఖ గాయకులు, సంగీత ప్రముఖులు తమ పాటలతో అలరించడం మరో విశేషం. ఇందులో హైదరాబాద్ ర్యాపర్స్, మణిపూరి గిటారిస్ట్ అందరూ చూపును ఆకర్షించారు.
నగరానికి అపటానీ గిరిజన సంస్కృతి..
‘జిరో ఫెస్టివల్ కేవలం సంగీతం గురించి మాత్రమే కాదు.. పర్యావరణం, సంస్కృతి, సమాజంతో లోతైన సంబంధాన్ని పెంపొందించడం గురించి భాగ్యనగరం వేదికగా యావత్ భారత్‌కు తెలియజేస్తుంది. ఏళ్లుగా ఈ ఉత్సవం సంస్కృతుల సమ్మేళనంగా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కళాకారుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఉత్సవం అపటానీ గిరిజన సంస్కృతితో సహా అరుణాచల్ ప్రదేశ్ జానపద సంప్రదాయాలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.
– అనుప్ కుట్టి, బాబీ హనో, జిరో ఫెస్టివల్ వ్యవస్థాపకులు
నేచర్ సిగ్నేచర్ మార్క్..
హైదరాబాద్‌లోని తారామతి బరాదరి వారసత్వపు భారీ గోడల మధ్య జానపద బాణీలతో మట్టి స్వరాల ఆత్మ ప్రతిధ్వనిస్తుండగా.. దీనికి ప్రతిస్పందిస్తూ సంగీత ప్రియులు సాహిత్య సంగమంలో మునిగితేలారు. రోజంతా జరిగిన ఈ వేడుకలో భాగంగా రీయూసబుల్ బాటిల్స్, కప్పులు పై అవగాహన కలి్పంచారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆరి్టస్ట్ కేపీ రాహుల్ రూపొందించిన 12 అడుగుల ఇన్‌స్టాలేషన్ తారామతికి మరింత అందాన్ని తీసుకొచ్చింది.
మడ అడవుల ఆవశ్యకతను సజీవంగా ప్రదర్శించిన ఈ కళ.. ఒడిశా తీరంలో మడ అడవులను పునరుద్ధరించడానికి సిగ్నేచర్ కృషిని ప్రతిబింబించింది. ఏడాదిన్నర కాలంగా ఈ బ్రాండ్ ఐజిఎస్‌ఎస్‌తో కలిసి 62 ఎకరాల నదీ తీరాన తోటల ద్వారా పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డియాజియో ఇండియా వీపీ, పోర్ట్‌ఫోలియో హెడ్ వరుణ్ కూరిచ్ మాట్లాడుతూ.. జిరో ఫెస్టివల్‌తో సుస్థిరమైన జీవనానికి భవిష్యత్తు ప్రయాణాన్ని ప్రదర్శించామని తెలిపారు. సంగీతం ప్రకృతి సమ్మిళితంగా జిరో ఆన్ టూర్ హైదరాబాద్‌లో తనదైన ముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment