Musical Festival
-
భాగ్యనగరంలో.. జిరో స్వరం..
సాక్షి, హైదరాబాద్: ఘనమైన వారసత్వ చరిత్ర, అద్భుతమైన కళాత్మకతకు నెలవైన భాగ్యనగరంలో విభిన్న సంస్కృతులు దర్శనమిస్తాయి. ఆ వారసత్వానికి సంగీత స్వరాలను సమ్మిళితం చేస్తూ నిర్వహించిన ‘జిరో ఆన్ టూర్’ నగరవాసులను అలరించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ ప్రత్యేక సాంస్కృతిక మ్యూజికల్ ఫెస్ట్ మొట్టమొదటిసారి నగరంలోని తారామతి బారాదరి వేదికగా ఆదివారం నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఇతర నగరాల్లో నిర్వహించడం ఇదే ప్రథమం. సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఆధ్వర్యంలో ఈ జిరో ఆన్ టూర్ కళాత్మక కార్యక్రమం కళ– పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై సమ్మిళిత ఉత్సవంగా నిర్వహించడం విశేషం. హృదయాన్ని హత్తుకునే పాటలు ఊర్రూతలూగించే సంగీతం, విభిన్న సంస్కృతులు, సంగీత వాయిద్యాలతో సమ్మోహనంగా జరిగిన ఉత్సవంలో రామ్ మిరియాల, రబ్బీ షెర్గిల్, శక్తిశ్రీ గోపాలన్, తబా చాకే వంటి ప్రముఖ గాయకులు, సంగీత ప్రముఖులు తమ పాటలతో అలరించడం మరో విశేషం. ఇందులో హైదరాబాద్ ర్యాపర్స్, మణిపూరి గిటారిస్ట్ అందరూ చూపును ఆకర్షించారు. నగరానికి అపటానీ గిరిజన సంస్కృతి.. ‘జిరో ఫెస్టివల్ కేవలం సంగీతం గురించి మాత్రమే కాదు.. పర్యావరణం, సంస్కృతి, సమాజంతో లోతైన సంబంధాన్ని పెంపొందించడం గురించి భాగ్యనగరం వేదికగా యావత్ భారత్‌కు తెలియజేస్తుంది. ఏళ్లుగా ఈ ఉత్సవం సంస్కృతుల సమ్మేళనంగా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కళాకారుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఉత్సవం అపటానీ గిరిజన సంస్కృతితో సహా అరుణాచల్ ప్రదేశ్ జానపద సంప్రదాయాలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. – అనుప్ కుట్టి, బాబీ హనో, జిరో ఫెస్టివల్ వ్యవస్థాపకులునేచర్ సిగ్నేచర్ మార్క్.. హైదరాబాద్‌లోని తారామతి బరాదరి వారసత్వపు భారీ గోడల మధ్య జానపద బాణీలతో మట్టి స్వరాల ఆత్మ ప్రతిధ్వనిస్తుండగా.. దీనికి ప్రతిస్పందిస్తూ సంగీత ప్రియులు సాహిత్య సంగమంలో మునిగితేలారు. రోజంతా జరిగిన ఈ వేడుకలో భాగంగా రీయూసబుల్ బాటిల్స్, కప్పులు పై అవగాహన కలి్పంచారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆరి్టస్ట్ కేపీ రాహుల్ రూపొందించిన 12 అడుగుల ఇన్స్టాలేషన్ తారామతికి మరింత అందాన్ని తీసుకొచ్చింది. మడ అడవుల ఆవశ్యకతను సజీవంగా ప్రదర్శించిన ఈ కళ.. ఒడిశా తీరంలో మడ అడవులను పునరుద్ధరించడానికి సిగ్నేచర్ కృషిని ప్రతిబింబించింది. ఏడాదిన్నర కాలంగా ఈ బ్రాండ్ ఐజిఎస్ఎస్తో కలిసి 62 ఎకరాల నదీ తీరాన తోటల ద్వారా పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డియాజియో ఇండియా వీపీ, పోర్ట్‌ఫోలియో హెడ్ వరుణ్ కూరిచ్ మాట్లాడుతూ.. జిరో ఫెస్టివల్‌తో సుస్థిరమైన జీవనానికి భవిష్యత్తు ప్రయాణాన్ని ప్రదర్శించామని తెలిపారు. సంగీతం ప్రకృతి సమ్మిళితంగా జిరో ఆన్ టూర్ హైదరాబాద్‌లో తనదైన ముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు. -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్‌లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
-
నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
న్యూయార్క్ : లాస్ వేగాస్ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వందలాదిమంది గాయాలపాలయ్యారని, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులని తెలుస్తోంది. లాస్ వేగాస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తొలుత ఇద్దరే చనిపోయినట్లు తెలిసినా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 50మంది పైగా చనిపోయారు. లాస్ వేగాస్ స్ట్రిప్‌లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడ్డాడు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు భయభ్రాంతులకు గురై.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. కాల్పుల గురించి సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, మరొకరు ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఒక మహిళ అని, ఆమెకోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. లాస్ వేగాస్ లోపలికి వచ్చే మార్గాలన్నంటిని మూసి వేసి హై అలర్ట్ విధించారు. -
లవ్ పండుగ చేద్దాం ఇలా..
పెదగంట్యాడ : ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి నగరంలోని వివిధ రకాలు ఏర్పాట్లు జరిగాయి. అందులో కొన్ని మీకోసం... పార్క్ హోటల్లో ః ఆక్వా డైనింగ్ హాల్లో స్పెషల్ డిన్నర్ ఉంది. కుదరదనుకుంటే పార్క్ హోటల్లోనే విస్తా హాల్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఎంటర్టైన్మెంట్ కోసం వైజాగ్ కమేడియన్ ఫీట్ పేరుతో ఒక షో సాయంత్రం జరుగుతుంది. నోవాటెల్‌లో ః ఇక్కడ కూడా ప్రేమికుల రోజు స్పెషల్ లంచ్ డిన్నర్‌తో పాటు నియోన్ మ్యూజికల్ ఫెస్టివల్ జరుగనుంది. కొత్త ప్రేమికులకు లైవ్ మెలోడీ సాంగ్స్‌తో విందు ఏర్పాటు చేస్తారు.. సిటీ దాటి వెళ్లాలనుందా... లంబసింగి డ్యామ్ దగ్గర ట్రైబల్స్ చలి కాలం చేసుకునే పండుగ ఉంది. అక్కడి గిరిజనులు ఉదయాన్నే డ్యామ్ దగ్గర పండుగ చేసుకుంటారు. ట్రావెలర్స్ చాలా మంది వెళ్లి పాల్గొంటారు. అక్కడ టెంట్లు కూడా దొరుకుతాయి. ఈ పండుగ ప్రేమికుల రోజు కూడా కావడంతో ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నారు. అరకు వెళదాం.. సాగా ట్రావెల్స్ అరకు వెళ్లడడానికి ప్రత్యేకంగా బస్‌ను ఏర్పాటు చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేద్దామనుకుంటే ఎంచక్కా బస్ ఎక్కెయ్యోచ్చు. బెలూన్ బ్లాస్ట్.. బీచ్ రోడ్లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. టీ ట్రైల్స్నే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్లు దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాలైంటైన్స్ డే స్పెషల్ బెలూన్స్ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన దాన్ని పగలగొట్టొచ్చు. దానిలో వోచర్స్ ఉంటాయి. మీరు లక్కీ అయితే మీకు లంచ్, డిన్నర్లో డిస్కౌంట్ లేదా పూర్తి ఫ్రీగా కూడా పొందవచ్చు.