చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
Published Mon, Dec 14 2015 11:14 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
మెదక్ : మెదక్ జిల్లాలోని పఠాన్ చెరు లో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానిక రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీన్ పూర్ పెద్ద చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాలు... వాణి నగర్ కు చెందిన మురళి(9), రాజశేఖర్(10 ) లు పెద్ద చెరువుకు ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. రాజశేఖర్ మృత దేహాన్ని గమనించిన స్థానికులకు విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని మురళి మృత దేహం కోసం గాలింపు చేపట్టారు.
Advertisement
Advertisement