కాలువలో పడి రైతు దుర్మరణం
పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. వీఆర్‌ఓ, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాడంగి : పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. వీఆర్‌ఓ, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పినపెంకి గ్రామానికి చెందిన పరడ రాములు (70) బుధవారం ఉదయం పొలానికి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో తోటపల్లి కాలువలో దిగి వస్తుండగా, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించాడు. తండ్రి ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి ఆయన కుమారుడు సత్తిబాబు, గ్రామస్తులు రాత్రంతా గ్రామంలో వెతికారు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు కాలువలో రాములు మతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీఆర్‌ఓ రామకష్ణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై అబ్రహం సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం కోసం మతదేహాన్ని బాడంగి ఆస్పత్రికి తరలించారు. మతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సత్తిబాబు గ్రామంలోనే ఉండగా, రెండో కుమారుడు అప్పలనాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.