మహారాష్ట్రలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని ముంబైలోని పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పూణే, నాసిక్, సాంగ్లీ, కొల్హాపూర్‌లలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
థానే, లోనావాలా, మహాబలేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలను సమాయత్తమయ్యాయి.
నాసిక్‌లో కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు గంగాపూర్ డ్యామ్ పొంగిపొర్లుతోంది. గోదావరి నది ఉప్పొంగడంతో గోదా ఘాట్ వద్దనున్న పలు చారిత్రక ఆలయాలు నీట మునిగాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా గోదా ఘాట్‌లోని దుకాణాలను మూసివేశారు.
#WATCH | Maharashtra: Various temples were inundated under the Godavari river in Nashik, following incessant rainfall in the region. pic.twitter.com/oHjGYbTvDs
— ANI (@ANI) August 5, 2024
Comments
Please login to add a commentAdd a comment