
టోరంటో/మహేశ్వరం : కెనడాలో ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు విడిచాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్‌కు చెందిన బుస్సు జగన్‌మోహన్ రెడ్డి(29)గా తెలిసింది. కెనడాలోని టోరంటోలో ఓ సరస్సులో పడి అతను మృతిచెందినట్టు సమాచారం అందింది. 2012లో హైదరాబాద్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి అతను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. పూరి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment