
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కృష్ణానదిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. యనమలకుదురు దగ్గర ఘటన జరిగింది. ఈతకు వెళ్లి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించారు.
ఈ రోజు మధ్యాహ్నం ఈత కొట్టడానికి కృష్ణానది దిగువ పాయలకు విద్యార్థులు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లినట్టు సమాచారం. క్షేమంగా ముగ్గురు విద్యార్థులు బయటపడ్డారు. గల్లంతైన ఐదుగురిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, అధికారులు చేరుకున్నారు.
చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే?
Comments
Please login to add a commentAdd a comment