krishna river
-
‘కృష్ణా’తీరం.. ఆధ్యాత్మిక తరంగం
తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండలానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. జీవ నదులు.. రాజుల సంస్థానాలు.. రుషులు తపస్సు చేసిన ప్రాంతాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఘనకీర్తి సముపార్జించుకున్న ప్రాంతం కృష్ణా మండలం. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విశిష్టతతో ప్రసిద్ధికెక్కాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రసిద్ధ ప్రాంతాలు ఆదరణకు నోచుకోక మరుగున పడ్డాయి. చారిత్రాత్మక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరచాలని స్థానికులు కోరుతున్నారు. – కృష్ణానారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో 22 కిలోమీటర్ల మేర కృష్ణానది (Krishna River) 3 కిలోమీటర్ల మేర భీమా నది ప్రవహిస్తోంది. ఈ రెండు నదులు తంగిడి గ్రామంలో కలుస్తాయి. నదీ తీర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు (Temples) ఉన్నాయి. కుసుమర్తి గ్రామంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే భీమా నది ఒడ్డున కృష్ణ ద్వైపాయన మఠం ఉంది. ఆ రుషి మంత్రాలయం గురు రాఘవేంద్ర మహాస్వాములకు ముందే ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు సాక్షాత్తు భగవంతుండు ప్రత్యక్షమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వేద పాఠశాల కూడా నిర్వహించినట్టు ఇక్కడి పురోహితులు చెబుతున్నారు. తంగిడిలో సంగమ క్షేత్రం.. కృష్ణా, భీమా నదులు కలిసే తంగిడి సంగమ క్షేత్రంలో ఎందరో రుషులు తపస్సు ఆచరించినట్టు ఆధారాలున్నాయి. నది అటువైపు కర్ణాటక (Karnataka) ప్రాంతంలో ప్రసిద్ధ శివాలయం ఉంది. అక్కడ ఇప్పటికీ ఈ ప్రాంత విశిష్టత గురించి శిలా శాసనాలు ఉన్నాయి. ఇటువైపు కొంతకాలం క్రితం దత్త పీఠాధిపతి విఠల్‌బాబా దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు. గూర్జాల్ గ్రామ సమీపంలోని కృష్ణానది మధ్యలో ఒక బండపై శివలింగం, నంది విగ్రహాలు ఉన్నాయి. అవి కదిలిస్తే కదులుతాయి. కానీ నది ప్రవాహానికి అంగుళం కూడా కదలవు. ఇక్కడ నది ఒడ్డునే సిద్ధలింగ మహాస్వాములు తపస్సు ఆచరించి.. ఓ మఠం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ పూజలు నిర్వహిస్తూ.. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణా గ్రామంలో నది ఒడ్డున దత్తాత్రేయ మందిరం, శివాలయం ఉన్నాయి. ఇక్కడ కూడా రుషులు తపస్సు ఆచరిస్తూ.. స్థానికులకు తమ మహిమలను చూపించే వారు. అందులో ఒకరైన శ్రీ క్షీరలింగేశ్వర మహాస్వాములు 47 రోజులపాటు కేవలం ఒకమారు మాత్రమే పాలు సేవించి ఘోర తపస్సు ఆచరించారు. ఆయన శిష్యులు ఇక్కడ ఏటా మకర సంక్రాంతి పండగ రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ముడుమాల్ గ్రామంలో నది ఒడ్డున మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల సమకాలికులైన గురు యాదవేంద్ర మహాస్వాములు తపస్సు ఆచరించారు. గురు రాఘవేంద్ర స్వాములు ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు «ఇక్కడి నుంచి ధర్మ ప్రచారం ప్రారంభించారు. అలా వెళ్లిన గురురాఘవేంద్ర స్వాములు తుంగభద్ర నది ఒడ్డున ప్రస్తుత మంత్రాలయంలో మఠం ఏర్పాటు చేశారు. ఇక్కడున్న ఆయన సమకాలికుడు యాదవేంద్ర మహాస్వామి మాత్రం కేవలం పూజలు, తపస్సుకే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడే ఉండిపాయారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి 22న యాదవేంద్ర స్వాముల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు విధిగా మంత్రాలయ పీఠాధిపతులు హాజరవుతారు. ఇక్కడ నాలుగు ద్వారాలతో కూడిన శివాలయం ఉంది. ఎక్కడైనా ఆలయ గర్భగుడికి ఓకే ద్వారం ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం శివాలయ గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం విశేషం. ముడుమాల్ సంస్థానం రాజులు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వారని.. యుద్ధ సమయంలో సైన్యంతో తూర్పున ఉన్న ద్వారం నుంచి ప్రవేశించి, పశ్చిమాన ఉన్న ద్వారం గుండా బయటికెళ్లే వారని చరిత్ర చెబుతోంది. మాగనూర్ మండలం కొల్పూర్‌లో కృష్ణానది ఒడ్డున సత్యపూర్ణ తీర్థ మహాస్వాముల మఠం ఉంది. ఈయన కూడా మంత్రాలయ రాఘవేంద్రస్వామి సమకాలికులే. ఈయన భక్తులు కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ముడుమాల్ గ్రామంలో రాజులు సంస్థానాలను ఏర్పాటు చేసుకొని పరిపాలించారు. కృష్ణా, మాగనూర్ మండలంలోని గ్రామాలతో పాటు కర్ణాటకలోని పలు గ్రామాలను ఈ రాజులు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కొల్పూర్ సంస్థానంలో నది అటువైపు ఉన్న కర్ణాటక ప్రాంతంతో పాటు ఇటువైపు ఉన్న కొన్ని గ్రామాలను వారు పరిపాలించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం కూడా కొల్పూర్ ప్రాంతానికి చెందినదిగా ప్రచారం ఉంది. ఈ వజ్రం (Diamond) చేపల వేటగాడికి నదిలో దొరికిందని.. అది కొల్పూర్ దొరకు ఇవ్వగా, ఆయన నిజాం ప్రభువుకు అప్పగించినట్లు ప్రచారంలో ఉంది. కొల్పూర్‌లో ఇప్పటికీ రాజమందిరాలు ఉన్నాయి. వీరి వంశీకులే ప్రస్తుతం కర్ణాటకలోని ప్రసిద్ధ దేవసూగూర్ సూగురేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సంస్థానాధీశులకు చెందిన లక్షలాది ఎకరాలు భూములను ఆచార్య వినోభాబావే స్వచ్ఛందంగా సేకరించి, పేదలకు పంచిపెట్టారు.ఇక్కడే నిలువు రాళ్లు.. ముడుమాల్ సమీపంలోని నది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు దేశంలో మరెక్కడా కనిపించవు. ఈ నిలువు రాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్నవని.. పురావస్తు శాఖకు చెందిన ప్రొఫెసర్ పుల్లారావు పరిశోధన ద్వారా ప్రపంచానికి తెలిసింది. సూర్య కిరణాలు ఒక వరుస నుంచి.. మరో వరుసకు ప్రయాణించే సమయాన్ని.. ఆది మానవులు రుతువులుగా భావించే వారని ప్రొఫెసర్ పేర్కొన్నారు. మహోన్నతమైన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిలువురాళ్లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, మఠాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మత్స్యకారుల వలలు తగులబెట్టిన ఫారెస్ట్ అధికారులు
నాగార్జునసాగర్: అనుమతి లేకుండా కృష్ణానది తీరంలో నివాసం ఉండొద్దని అటవీశాఖ అధికారులు మత్స్యకారులను హెచ్చరించి, వారు వేసుకున్న గుడిసెలను తొలగించి వలలను తగులబెట్టారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది తీరం వెంట పుట్టీలనే గృహాలుగా మార్చుకొని గత 50 ఏళ్లుగా 2 తరాల వారు 10 వేల మత్స్యకారుల కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయి. అయితే ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అటవీ అధికారులు తమ గుడిసెలు తొలగించి వలలు తగలబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సుమారుగా రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. -
పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అంటే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు అంగీకరించిందన్న మాట. అయితే.. ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇదెలా సాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయగలిగితేనే.. జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి, ఇటు గోదావరి–బనకచర్ల, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి జీవం తీసి.. బనకచర్లకు తరలిస్తామనడం చూస్తే ఆ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవచ్చని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.కుడి కాలువ ఆయకట్టు, కృష్ణా డెల్టాకే చాలవు..పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకూ నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లకు గోదావరి ఇలా..గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా నది, నాగార్జునసార్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల అభయారణ్యంలో 26.8 కిలీమీటర్ల టన్నెల్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరింది. ఆ నివేదికలో పేర్కొన్న మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ఇలా..తొలి దశ..– పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ–శాడిల్ డ్యాం, ఎఫ్–శ్యాడిల్ డ్యాం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచుతారు.– తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1400 నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, 178 కిలోమీటర్ల వరకూ పొడగిస్తారు. ఇందులో 5 వేల క్యూసెక్కులను ఆయకట్టుకు, మిగతా 5 వేల క్యూసెక్కులను భలేరావు చెరువులోకి తరలిస్తారు. – బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణా నదిలోకి తరలిస్తారు.– తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు రూ.13,511 కోట్లు వ్యయం అవుతుంది.రెండో దశ– కృష్ణా నదిలో 12.5 మీటర్లు (సముద్ర మట్టానికి) ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు ఐదు దశల్లో రోజూ 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి.. నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకూ సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు. – సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి, పల్నాడులో బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి.– రెండో దశ పనులకు 28,560 కోట్లు వ్యయం అవుతుంది.మూడో దశ:– బొల్లాపల్లి రిజర్వాయర్‌లో 172 మీటర్ల నుంచి మూడు దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి.. నల్లమలలో తవ్వే సొరంగం ద్వారా తరలించి, అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు వ్యయం అవుతుంది.– ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం. బొల్లాపల్లి రిజర్వాయర్, కాలువల తవ్వకానికి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాలు అటవీ భూమి. -
524 మీటర్లకు ఆల్మట్టి డ్యామ్
రాయచూరు రూరల్: కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న భారీ జలాశయం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత ఎత్తు 519 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం బెళగావిలో రైతు సంఘాల నాయకులు, ఉత్తర కర్ణాటక ప్రజాప్రతినిధులతో సీఎం సిద్దరామయ్య సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కాగా, అప్పర్ కృష్ణా మూడో దశ పథకం కింద, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఆల్మట్టి ఎత్తు పెంపు ఉంటుందని అధికారులు చెప్పడం గమనార్హం. డ్యామ్ ఎత్తు పెంపు వల్ల తమకు దక్కే 173 టీఎంసీల కృష్ణా జలాల్లో 130 టీఎంసీల వాడకానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. 13.10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల లభించే ఆ నీటిలో కలబుర్గి, రాయచూరు, కొప్పళ్, విజయపుర, యాదగిరి, బాగల్‌కోట, గదగ్ జిల్లాల్లోని 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్యామ్ ఎత్తు పెంపు వల్ల నీటి మట్టం పెరిగి పెద్ద సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతాయి. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పరిహారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
విషాదం మిగిల్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం కేసు
సాక్షి, కృష్ణా జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమంత్ అదృశ్యం కేసు చివరికి విషాదాన్ని మిగిల్చింది. అవనిగడ్డ మండలం తుగలవానిపాలెంలో ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. స్నేహితుని వద్దకు వెళ్లి వస్తానని చెప్పి చల్లపల్లికి చెందిన బొడ్డు సుమంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లారు.అయితే, రెండు రోజుల క్రితం పులిగడ్డ-పెనుమూడి వారధి పై సుమంత్ బైక్, ఫోన్, పర్సు లభ్యమయ్యాయి. కృష్ణానదిలో దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమంత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో రూ.928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 3న, ప్రైస్ బిడ్లను 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం కృష్ణా నదిలో తుంగపాడు వాగు కలిసే చోట ఈ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించారు. డిజై న్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్íÙప్ నిర్మాణం జరుగుతుంది. 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివా స గృహసముదాయాలతో లేఅవుట్‌ను తయా రు చేశారు. 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కు లు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మి కులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్‌షిప్‌ను జెన్కో నిర్మిస్తోంది. ఉన్నతాధికారుల కోసం ‘ఏ’–టైప్‌లో రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లను, ‘బీ’–టైప్‌లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు ‘డీ’, ‘ఈ’టైప్ క్వా ర్టర్లను, కార్మి కులకు ‘ఎఫ్’టైప్ క్వార్టర్లను కేటాయిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు కలిపి మొత్తం 2,970 ఫ్లాట్లను నిర్మించనున్నారు. సకల సదుపాయాలు టౌన్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆస్పత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెనెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్స్, సెప్టిక్ ట్యాంక్స్, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జీ, కాంపౌండ్ వాల్, టౌన్‌షిప్‌కు అప్రోచ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా జెన్కో నిర్మిస్తోంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రోజుకు 1,000 కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను సైతం నిర్మిస్తోంది. కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్లో జెన్కో తెలిపింది. -
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ప్రాణం తీసిన ఈత సరదా
తాడేపల్లిరూరల్/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడారు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్ కుమార్ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపాడారు. మరో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారిని వెతుకుతుండగా ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్ దివ్యాంగుడు, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలలకు గుంటూరు కొత్తపేటకు చెందిన రేషి కళ్యాణ్ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్ కొట్టుకుపోయాడు. -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలంప్రాజెక్ట్/ విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లి రూరల్ : ఆయా ప్రాజెక్టుల నుంచి శుక్రవారం నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం గత మూడురోజులుగా గరిష్టస్థాయి 885 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని బట్టి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,26, 281 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. 2గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55, 782 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 884.60 అడుగులకు చేరుకుంది. సాగర్ 12 క్రస్ట్‌గేట్ల ద్వారా..నాగార్జునసాగర్ నుంచి 12 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 96,324 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 589.30 అడుగుల వద్ద ఉండగా, ఇది 309.9534 టీఎంసీలకు సమానం. పులిచింతల నుంచి..నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 1,93,966 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 6.860 టీఎంసీలు నిల్వ ఉంది.ప్రకాశం బ్యారేజ్ నుంచి..ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు 70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2 లక్షల 20 వేల 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 2 లక్షల 36 వేల 158 క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చి చేరుతోంది. బ్యారేజీ రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. తూర్పు డెల్టా కాలువకు 8 వేల 632 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 26 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
కృష్ణాలో పెరుగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్/తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహం గంటగంటకూ పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 1,95,929 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ వద్ద ఆరు రేడియల్ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా నాగార్జున సాగర్‌కు 1,67,898 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 1,75,782 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. 1,59,070 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 2,32,110 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఇక్కడి నుంచి 2,45,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. జేఈ రాజేష్ మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 1,62,689 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రానుందన్నారు. ఈ దృష్ట్యా బ్యారేజీ వద్ద 20 గేట్లు 4 అడుగులు, 50 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. -
ఇది సర్కారు షో.. కూల్చెయ్..
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వం నిర్వహించనున్న ‘షో’కి అడ్డం వస్తుందని ప్రజాధనంతో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చేశారు. విజయవాడలో కృష్ణానది తీరాన పున్నమిఘాట్లో ఈ నెల 22వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ షో, కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు అడ్డువస్తుందని అప్కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రహరీని కూల్చేశారు. భవానీపురం కరకట్ట సౌత్ రోడ్‌లోని పున్నమిఘాట్‌కు ఆనుకుని ఆక్రమణకు గురైన ఎకరానికిపైగా స్థలాన్ని అప్కాస్ట్ గత మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై.అపర్ణ సర్వే చేయించి స్వా«దీనం చేసుకున్నారు.సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చుపెట్టి ఈ స్థలానికి ప్రహరీ నిర్మించారు. అప్కాస్ట్ సరిహద్దుకు వెనుక (పున్నమిఘాట్ లోపల) ఉన్న ప్రైవేట్ వ్యక్తులు తమ స్థలానికి దారిలేకుండా ప్రహరీ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పున్నమిఘాట్లో డ్రోన్ షో నిర్వహించాలని నిర్ణయించింది.దీనికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఈ కార్యక్రమానికి అడ్డువస్తుందని అప్కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రహరీని గురువారం రాత్రి జేసీబీతో కూల్చేశారు. కూల్చేసిన శిథిలాలను తిరిగి సైన్స్ సెంటర్ ఆవరణలోనే పడేశారు. గోడ కూలుస్తున్నామని అప్కాస్ట్ అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. దీనిపై అప్కాస్ట్ ఏవో పద్మను అడగగా.. తాను మాట్లాడతానని అటవీ, పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ అనంతరాము చెప్పినట్లు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పున్నమిఘాట్ పరాదీనం గత కృష్ణా పుష్కరాల సమయంలో (2016) అప్పటి టీడీపీ ప్రభుత్వం రివర్ ఫ్రంట్ కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి నిర్మించిన పున్నమిఘాట్లో సింహభాగం పరా«దీనం అయింది. పున్నమిఘాట్ నిర్మాణం పూర్తయిన తరువాత ఆ స్థలం తమదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు మేరకు పున్నమిఘాట్లో ప్రధానంగా నిలిచిన స్థలాన్ని వారికి స్వాదీనం చేశారు. తరువాత స్థల యజమానులు ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన ఎయిర్ షోకి ఈ స్థలమే కేంద్రబిందువుగా నిలిచింది. ఆ స్థలానికి (పున్నమిఘాట్) సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ధర విషయంలో సయోధ్య కుదిరి ఉంటే ఈ రోజు డ్రోన్ షో నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని స్థానికులు పేర్కొంటున్నారు. -
కృష్ణాలో 3,048.37 టీఎంసీలా?
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఏటేటా నీటి లభ్యత తగ్గుతోందని.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు అంచనా వేసినంత కూడా రావడంలేదని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతుంటే.. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చెబుతోంది. కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 వరకు 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై తాజాగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ బుధవారం ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం కృష్ణాలో 3,048.37 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ 2,130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీలు ఉన్నట్లు నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్లు నిర్ధారించిన దానికంటే అధికంగా 875 టీఎంసీల లభ్యత ఉన్నట్లుగా సీడబ్ల్యూసీ తాజాగా వెల్లడించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల సమయంలో పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో సీడబ్ల్యూసీ చెప్పినంతగా నీటి లభ్యత ఉండదని తేల్చిచెబుతున్నారు. కేవలం 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనాలకే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ ఇదీ..మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకునే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యంలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఆంధ్రప్రదేశ్‌లో 9.80 శాతం కృష్ణా బేసిన్ విస్తరించి ఉంది. నదిలో కోయినా, వర్ణ, పంచ్‌గంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, బీమా, తుంగభద్ర, కాగ్నా, మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉప నదులు కలుస్తాయి.తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 843.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం ఉంది. ఈ 38 ఏళ్లలో గరిష్టంగా 2005–06లో 1,169.70 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 10,716.60 టీఎంసీల ప్రవాహం ఉంది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 5,207.50 టీఎంసీల ప్రవాహం ఉంది.1985–86 నుంచి 2022–23 మధ్య కృష్ణాలో సగటున 3,048.37 టీఎంసీల లభ్యత ఉంది. 2025–26లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా.. 2018–19లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది.1985–2023 మధ్య బేసిన్లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీలను వినియోగించుకున్నారు.బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటు 96.06 టీఎంసీలు. -
బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి
ఢిల్లీ/గుంటూరు, సాక్షి: కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్ వేదికగా మండిపడ్డారాయన.‘‘ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. లేదంటే కృష్ణ, గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిపాస్తులకు తీవ్ర ప్రమాదం. సీఆర్‌జెడ్ నిబంధనలు అమలు చేయడంలో శాసన వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యాయి. న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకొని లక్షలాదిమంది ప్రజలను, వారి ఆస్తులను రక్షించాలి’’ అని అన్నారు.CM of AP Sri N. Chandrababu Naidu @ncbn is officially residing in an illegally constructed house located on the embankment of the Krishna River violating environmental & construction regulations (CRZ) as it is considered an ecologically sensitive zone. All these illegal… pic.twitter.com/IvnmQ58137— Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2024చదవండి: కరకట్ట నివాసంపై లింగమనేని మాట ఇది -
అటు ఎండబెట్టి.. ఇటు ముంచేసి..
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు. » కృష్ణా బేసిన్లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు. » దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు. రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం.. » వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు. » వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది. » ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్కో కంటే ఏపీ జెన్కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది. శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..» ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు » శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు » ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు » సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు » హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీశ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..ఆంధ్రప్రదేశ్..» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు » హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు »కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలుతెలంగాణ..» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు » ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు » గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు -
రికార్డు స్థాయిలో కృష్ణమ్మ వరద
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్లో కృష్ణానదిలో రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. గడిచిన 50 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన తుంగభద్ర, కృష్ణానదిలో పెరిగిన నీటి ప్రవాహంతో కేవ లం పదిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఇప్పటివరకు 1,139 టీఎంసీల నీ రు శ్రీశైలం జలాశయానికి చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడంతో గత 50 రోజుల్లో 558 టీఎంసీల నీరు దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. గత రెండేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. ఈ సారి కృష్ణానదిలో భారీ స్థాయిలో వచ్చి న వరదలకు జూలై చివరకల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది. పది రోజుల్లోనే నిండిన ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లతో ఈసారి కేవలం పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ నుంచి ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేసే వరకు చేరింది. జూలై నెల ప్రారంభంలో నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టు చివరికల్లా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు జూలై 20 నాటికి కేవలం 35.629 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు జలాశయంలో నీటినిల్వ 812.30 అడుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే తుంగభద్ర నదితో పాటు కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో అనూహ్యంగా పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. తొమ్మిది రోజుల్లోనే 179 టీఎంసీల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. దీంతో జూలై 30న అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఆగస్టు, సెపె్టంబర్‌లోనూ నిత్యం 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగడంతో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటిని కిందకు వదిలారు. ఆగస్టు నెలలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సుమారు 20 రోజుల పాటు ప్రాజెక్టు పదిగేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. పవర్‌హౌస్‌లో 17 మి.యూనిట్ల విద్యుదుత్పత్తిశ్రీశైలం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి నిత్యం 37 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి మొత్తం 152.74 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా, ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గత జూలై 16 నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా, నిత్యం 35 వేల క్యూసెక్కులకు పైగా నీటితో గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. -
కృష్ణా, గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరిలలో వరద కూడా తగ్గుతోంది. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి.. వాటి ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి సోమవారం రాత్రి 7 గంటలకు 3.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు రెండు వేల క్యూసెక్కులను వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 3.46 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. జూరాల, సుంకేశుల బ్యారేజీ నుంచి శ్రీశైలంలోకి 2.37 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2.14 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 206.5365 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 883.40 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్, పులిచింతలలోకి.. వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 588.30 అడుగుల వద్ద ఉండగా ఇది 306.9878 టీఎంసీలకు సమానం. కృష్ణాకు వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కృష్ణాజిల్లాలోని తీరప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇక గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఏలేరు వరద ఉధృతి పెరిగింది. ఏలేరు రిజర్వాయర్‌లోకి 46,405 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 23.23 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి 25,275 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంపా, తాండవ, సుబ్బారెడ్డిసాగర్తో పాటు ఏలేరు దానికి అనుబంధంగా సుద్దగడ్డ, దబ్బకాలువ, గొర్రికండి వంటి వాగులు, ఏరులు పోటెత్తాయి. గట్లకు గండ్లు పడి పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు సోమవారం గొల్లప్రోలు ముంపు ప్రాంతంలో పర్యటించారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో దబ్బ కాలువపై ఏలేరు ఉ«ధృతికి వంతెన కొట్టుకుపోయింది. మరోవైపు.. ఏలేరు వరద ముంచెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ సోమవారం నాగులాపల్లి పర్యటనలో సూచించారు.అల్లూరి జిల్లాలో వర్ష భీభత్సం..అల్లూరి జిల్లాలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన గెడ్డలు, వాగులలో వరద ఉధృతి ప్రమాదకరంగా ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జోలాపుట్టు, డుడుమ, సీలేరులోని గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో దిగువకు భారీగా నీటిని విడిచి పెడుతున్నారు. చింతపల్లి నుంచి సిలేరు వరకు విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వరద ముంపులో ‘మాచ్‌ఖండ్’ జల విద్యుత్కేంద్రంఇక ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోకి వరద నీరు చేరింది. డుడుమ, జోలాపుట్టు జలాశయాల నుంచి 85 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో 2వ నంబర్ నుంచి సోమవారం విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. నీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రాజెక్టు మనుగడకే ముప్పు అని భావించిన అధికారులు విద్యుత్ ఉత్పాదనను నిలిపివేశారు. ప్రస్తుతం బ్యాక్ ఫీడింగ్ ద్వారా మూడు క్యాంపులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
గ్రేట్ వాల్ ఆఫ్ బెజవాడ
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణీ.. అంటూ సినీ కవుల పాటలు వినసొంపుగా ఉంటాయి. కృష్ణా నదికి వరద వస్తే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ మీదకు వెళ్లి ఆ సోయగాన్ని చూడటం సామాన్యులకు ఓ మధురానుభూతి. కానీ విజయవాడ కృష్ణలంక తోతట్టు ప్రాంతాల వారు కృష్ణమ్మకు వరద వస్తుందంటేనే హడలెత్తిపోయేవారు. నదిని ఆనుకుని ఉన్న కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్, గౌతమి నగర్, బాలాజీ నగర్, భ్రమరాంబపురం, భూపేష్గుప్తా నగర్, తారకరామా నగర్, గీతానగర్, చలసాని నగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ, రణదివె నగర్ తదితర కాలనీలు దశాబ్దాల పాటు వరద బాధిత ప్రాంతాలుగానే మిగిలిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలితే చాలు.. ఆ కాలనీలను వరద ముంచెత్తేది. ఇళ్లన్నీ నీట మునిగిపోయేవి. ఆ వెంటనే కొన్ని వస్తువులు, దుస్తులు తీసుకొని పిల్లలు, వృదు్థలతో సహా కృష్ణలంక గట్టు మీదకు చేరేవారు. అక్కడే టార్పాలిన్లు వేసుకుని వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసేవారు. ఓ సారి వరద వస్తే వారం వరకూ కొనసాగేది. వర్షం, చలి మధ్య వీధి దీపాలు కూడా లేని ఆ గట్టు మీద చీకట్లోనే రోజులు వెళ్లదీయాల్సి వచ్చేది.దాదాపు 5 వేల కుటుంబాలు దశాబ్దాలపాటు అనుభవించిన దుస్థితి ఇది. వారందరూ రెక్కాడితేగానీ డొక్కాడని ముఠా కార్మికులు, రోజు కూలీలు, చిరు వ్యాపారులే. అటు పనులకు వెళ్లలేక ఇటు ఇళ్లలోకి వెళ్లలేక అవస్థలు పడేవారు. అయినా గతంలో ఏ ప్రభుత్వమూ వీరి కడగండ్లను పట్టించుకోలేదు. తమ బతుకులు ఇంతే అంటూ ఆ పేదలు కూడా నిస్పృహలో కూరుకుపోయారు.వరద వచ్చి నా ఇప్పుడు బెంగ లేదు20 ఏళ్లుగా కృష్ణలంక భూపేష్ నగర్లోనే ఉంటున్నాం. గతంలో చాలాసార్లు కృష్ణా నదికి వరదలు వచ్చాయి. చిన్న వరద వస్తే కుటుంబమంతా కట్టుబట్టలతో కృష్ణలంక గట్టు మీదకు వెళ్లిపోయేవాళ్లం. వంట సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అయిదారురోజుల తరువాత వరద తగ్గితే ఇంటికి చేరేవాళ్లం. పాడై పోయిన ఇంటిని బాగుచేసుకొనేవాళ్లం. అన్ని సామాన్లు మళ్లీ కొనుక్కోవాల్సిందే. ఇంటి రిపేర్లు, అత్యవసరమైన సామాన్లకే అయిదారు నెలల సంపాదన ఖర్చయ్యేది. ఇక మా పరిస్థితి ఇంతే అనుకునే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతం చేసింది. కృష్ణా నదికి రక్షణ గోడ నిరి్మంచింది. మా ప్రాంతాలకు వరద ముప్పు పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తున్నా నేను ఇంట్లోనే ధీమాగా ఉన్నాను. – వై. బాబూరావు, తాపీ మేస్త్రిజగన్ చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకుంటాం కృష్ణలంక ప్రజలు ఈ రోజు ఇంత ధైర్యంగా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం. కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మించాలని గతంలో ఎన్నో ప్రభుత్వాలను వేడుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. వరదలు వచ్చి నప్పుడు మంత్రులు, అధికారులు వచ్చి పరామర్శించి వెళ్లిపోయేవారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేం కోరకుండానే కృష్ణా నదికి రక్షణ గోడ కట్టారు. అదీ అత్యంత పటిష్టంగా నిరి్మంచారు. మా కాలనీలకు ముంపు భయం పూర్తిగా తొలగిపోయింది. ఎంత వరద వచ్చి నా మాకు ఎలాంటి భయం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మంచిని ఈ ప్రాంతంలోని 3 లక్షల మంది జనాభా జీవితాంతం గుర్తుంచుకుంటా. – చిన్నపరెడ్డి వెంకటరెడ్డి, తారకరామ నగర్, విజయవాడ జగన్ దయతో ప్రశాంతంగా ఉన్నాం వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షణ గోడ కట్టబట్టే కృష్ణా నదికి ఇంత పెద్ద వరద వచ్చి నా మేం ప్రశాంతంగా ఉన్నాం. వరదలు వస్తే మా ఇళ్లన్నీ మునిగిపోయి రోడ్డున పడేవాళ్లం. రోడ్డు మీద మా బతుకులను ఎవరూ పట్టించుకునే వారే కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రక్షణ గోడ కట్టడంతోపాటు మా కాలనీలకు రోడ్లు కూడా వేసింది. – బి. రమణమ్మ, రాణిగారితోట, విజయవాడ వరదకు అడ్డుగా జగన్... అడ్డుకట్టగా రిటైనింగ్ వాల్మనసున్న పాలకుడు వస్తే పేదల కష్టాలకు శాశ్వత పరిష్కారం ఎలా చూపిస్తారో అనడానికి వైఎస్ జగనే ఏకైక ఉదాహరణ. కృష్ణలంక లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను అడ్డుకట్ట వేసిన ఏకైక ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు నదిని ఆనుకుని 5.66 కిలోమీటర్ల మేర పటిష్టమైన రక్షణ గోడ నిర్మించారు. మూడు దశల్లో మొత్తం రూ.474.51 కోట్లతో నిర్మించిన ఈ రక్షణ గోడ నేటి కృష్ణా నది భారీ వరద నుంచి లోతట్టు ప్రాంతాలను కాపాడే రక్షణ కవచంగా నిలిచింది. వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఈ రక్షణ గోడ డిజైన్‌ను ఖరారు చేశారు. గత వందేళ్లలో కృష్ణా వరదలను పరిగణలోకి తీసుకుని.. 2009లో కృష్ణా నదికి వచ్చి న గరిష్ట వరద లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేకుండా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మించారు. వైఎస్ జగన్ దూరదృష్టే ప్రస్తుతం కృష్ణా నదికి 11లక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద మప్పు లేకుండా ధీమాగా ఉంచింది. -
ప్రజలే బుద్ధి చెబుతారు!
భారతదేశం నదీ నాగరికతల దేశం. అసలు ఇక్కడ నదులను దేవతలుగా కొలవడం సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతికి మూల విరాట్టులు ఆదివాసీలూ, దళితులే. అడవులు, నదీతీరాలు వీరి ఆవాసాలుగా ఉన్నప్పుడు వాటికి ఏ ఇబ్బందులూ కలగలేదు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చి, వస్తూత్పత్తి వాణిజ్య స్థాయిలో అవ్వడం ప్రారంభమయ్యిందో... అప్పుడే ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభమయ్యింది. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. చివరికి నదులు, కాలువలు, చెరువులు, అడవులు అన్నింటినీ ఆధిపత్య వర్గాలవారు కబ్జా చేశారు. వీరి చేతుల్లోనే భూమి, మూలధనం కేంద్రీ కృతమై ఉన్నందున వీరే పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను స్థాపించి పేరాశతో డబ్బు, అధికార దర్పాలతో కబ్జాలకు తెరలేపారు. తత్ఫలితమే విజయవాడ, ఖమ్మం వంటి చోట్ల ఇవ్వాళ నదులు లేదా ఏరులు సృష్టించిన విలయాలు! ఈ నేపథ్యంలో విజయవాడను చుట్టుముట్టిన వరదలను చూడాలి. ఇక్కడ ప్రజల కడగండ్లకు ప్రధాన కారణం బుడమేరు కాలువ/ వాగు. జలవనరుల శాఖ పరిభాషలో ఇది ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు మండలాల్లోని పులివాగు, భీవ్ువాగు, లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది. విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి. ఇవన్నీ కలిశాక, వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠ నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని ఉద్ధృతి తగ్గించేందుకు 1970ల్లోనాటి ప్రభుత్వం జి. కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించే వారు. తర్వాత దీన్నుంచి మళ్లింపు కాలువ (బుడ మేరు డైవర్షన్ ఛానెల్– బీడీసీ)ని తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానెల్ ద్వారానే ప్రవహించి, ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. వీటీపీఎస్‌లోని వృథా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ.కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనల్లో ఉండ గానే బుడమేరుకు 2005లో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద పోటెత్తి, విజయవాడను ముంచెత్తింది. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదన వచ్చింది. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్నొక అనుసంధాన కాలువగా మలిచారు. పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా, ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశ ముంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10 వేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరముంది. సహజమైన నదీ తీరాన్ని ఇవ్వాళ ధ్వంసం చేసి పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కట్టి నదీ గమనానికి అడ్డుగా నిలవడమే కాక నదీజలాలు కలుషితం కావడానికి కూడా కారణమవుతున్నారు బడాబాబులు. విజయవాడకు ఇంతటి పెనుముప్పు రావడానికి ఇదే ప్రధాన కారణం. కృష్ణా నది కరకట్ట మీద పెత్తందారుల అక్రమ కట్టడాల వల్లే ఇది జరిగింది. ఈ కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి నివాసం, కొంతమంది వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్న వారి కట్టడాలు ఉన్నాయి. వాటిని కూలుస్తామనే మాట పాలకులు చెప్పడం లేదు. ఈనాడు తెలంగాణలో ‘హైడ్రా’ చెరువులు కబ్జా చేసిన వారి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలలో కూల్చివేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూల్చివేతల అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రజలు ప్రాకృతిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పునరుజ్జీవనం గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. ప్రజల్లో అలముకున్న నిరాశ, నిస్పృహల స్థానంలో సమకాలీన పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన నింపాలి. అప్పుడే వారు పెత్తందార్లకు బుద్ధి చెబుతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఇంకా ఆర్తనాదాలే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి బృందం, విజయవాడ/సాక్షి, అమరావతి: నాలుగు రోజుల నుంచి అన్నం లేక.. నీళ్లు దొరక్క ఆకలితో అలమటించి ఆర్తనాలు చేస్తూ వాంబే కాలనీలో రాజ్‌కుమార్ అనే పాస్టర్ మృత్యువాత పడ్డాడంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజులు గడుస్తున్నా ముంపు నుంచి తమను ఎవరూ బయటకు తీసుకువచ్చే పరిస్థితులు కనపడకపోవడంతో తమంతట తాముగానే వరద నీటి నుంచి బయట పడేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అలా నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వారిలో కొందరు మధ్యలోనే కొట్టుకుపోయి గల్లంతైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడని, ఏమైపోయామో కూడా కనుక్కునే వారే లేరని వాపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 11 సాక్షి బృందాలు, బోట్లు, ట్రాక్టర్లలో ముంపునకు గురైన శివారు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి.సహాయక చర్యలేవీవరద స్వల్పంగా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు వెళ్లలేదు. ప్రధాన రోడ్లు, వాటికి అనుంబంధంగా ఉన్న రోడ్లపై తిరుగుతూ హడావుడి చేయడం మినహా లోపల ఉన్న కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో వేలాది ఇళ్లలో ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా.. అవన్నీ చాలా పరిమిత ప్రాంతాల్లోనే. జేసీబీలు, ట్రాక్టర్లు కూడా కాలనీల్లోని చివరి ప్రాంతాల్లోకి వెళ్లడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బోట్లు, ప్రైవేటు బోట్లు కూడా పైపైనే తిరిగి రోడ్లపై కనపడిన వారిని మాత్రమే అరకొరగా బయటకు తీసుకువస్తున్నాయి. ఆ బోట్లలో కూడా డబ్బులిస్తేనే బాధితులను ఎక్కించుకుంటున్నారు. ఒక్కో మనిషికి రూ.2 వేలు అడుగుతున్నారు. వరదలో సర్వం కోల్పోయిన వారు ఆ డబ్బు ఇచ్చుకోలేక బోట్ల వారిని ప్రాధేయపడుతున్నా.. వాటి యజమానులు కనికరించడం లేదు. ప్రభుత్వ బోట్లలో ఎక్కాలన్నా డబ్బులు అడుగుతున్నారని బాధితులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లో చాలా ఇళ్లకు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లిన దాఖలాలు లేవు. తిండి సంగతి అటుంచితే.. అసలు మంచినీళ్లు కూడా ఎవరూ ఇవ్వలేదని వాంబేకాలనీకి చెందిన రామలక్ష్మి అనే మహిళ వాపోయింది. ‘నాలుగు రోజులుగా కరెంటు లేదు, ఫోన్లు పనిచేయడం లేదు. మేం చచ్చామో.. బతికామో కూడా బయటి ప్రాంతాల్లో ఉన్న తమ వాళ్లకు తెలిపే అవకాశం లేకుండా పోయింది’ అని విలపిస్తూ చెప్పింది. తలో దిక్కయ్యాంవరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు టూర్లు, మంత్రుల హడావుడి మీడియా, సోషల్ మీడియా కోసం చేస్తున్న హంగామాయే తప్ప బాధితులను ఆదుకోవాలనే కనీస ప్రయత్నం ఎక్కడా కనిపించడం లేదు. ఎలాగైనా బయట పడాలని తమ కుటుంబంలో నలుగురం బయటకు వచ్చామని, ఇప్పుడు తలోదారి అయ్యిందని, మిగిలిన వాళ్లు కనిపించడంలేదని ఓ వృద్ధురాలు విలపిస్తూ చెప్పింది. నీరు లేక ఇబ్బంది పడుతున్నామని కొందరు గోడు వెళ్లబోసుకున్నారు. తమ ఏరియాల్లో పిల్లులు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు చనిపోయి దారుణమైన వాసన వస్తోందని, ఏం రోగాలు వస్తాయోనని మరికొందరు ఆందోళనగా చెబుతున్నారు. మరోవైపు రోడ్లన్నీ బురద, చెత్త, చెదారంతో మురికి కూపాలను తలపిస్తున్నాయి.పునరావాసం ఏదీ?!వరద నీరు కొంతమేర తగ్గడంతో ఎలాగోలా నరకయాతన పడుతూ బయటకు వచ్చినా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో అధికారులకే తెలియడం లేదు. నాలుగు లక్షల మంది నిరాశ్రయులైతే కనీసం వంద శిబిరాలు కూడా పెట్టలేదు. లక్షల మంది ముంపులో చిక్కుకుంటే ఇప్పటివరకు కేవలం 15 వేల మందిని మాత్రమే శిబిరాలకు తరలించినట్టు ప్రభుత్వం చెబుతోంది. దీన్నిబట్టే పునరావాస చర్యలు ఎంత ఘోరంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. దీంతో వరద నీటిలో మునిగిపోయిన తమ ఇళ్లలో ఉండలేని పరిస్థితుల్లో ఎలాగోలా బయటకు వచ్చిన జనానికి ఎటు వెళ్లాలో దిక్కు తెలియడంలేదు. తమ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఉండేందుకు కొందరు వెళుతున్నారు. మరికొందరు ఇతర నగరాలు, పట్టణాల్లో ఉన్న తమ బంధువుల ఇంటికి బస్సుల్లో వెళ్లేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఇలా బయటకు వచ్చిన వారితో బుధవారం రామవరప్పాడు ప్రాంతం రద్దీగా మారిపోయింది. అక్కడ డివైడర్లు, రోడ్డు పక్కన తమ వారి కోసం, బస్సుల కోసం అనేక మంది లగేజీలతో ఎదురుచూస్తూ కూర్చున్నారు. కొంచెం డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లు స్థానిక హోటళ్లలో తలదాచుకుంటున్నారు. ఏ గతీ లేని సామాన్య జనం మాత్రం ఎటు వెళ్లాలో తెలియక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలపై కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకా చాలా కుటుంబాలు ముంపులోనే ఉన్న ఇళ్ల నుంచి ఒకరో, ఇద్దరో బయటకు వచ్చి దొరికిన ఆహారం తీసుకుని మళ్లీ వరద నీటిలోనే నడుచుకుంటూ ఇళ్లకు వెళుతున్నారు. వెంటాడుతున్న అంటువ్యాధుల భయంఇళ్లతో పాటు పరిసరాలలో పేరుకుపోయిన కళేబరాలు, వ్యర్థాలు, వాటితో మురిగిపోయిన నీటివల్ల అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.పాములు, తేళ్లతో సహజీవనంవరద బాధితులను పాములు, తేళ్లు కలవరపెడుతున్నాయి. ఊర్మిళా సుబ్బానగర్లో మెరకలో ఉన్న ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేసుకుంటున్న క్రమంలో బురద నుంచి పాములు బయటకు వస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందో.. తేలు కుడుతుందోనన్న భయంతో రాత్రిళ్లు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని బాధితులు తెలిపారు.కూలిపోయేలా ఇళ్లుఇంటి గోడలు వరద నీటిలో నానిపోవడంతో ఎన్నో కుటుంబాలు భయం గుప్పెట్లో బతుకున్నాయి. అనేక ఇళ్లు ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాయి. సితార సెంటర్ కొండ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు అధికంగా కనిపించాయి.ఇంకా తేరుకోని లంబాడీపేటలంబాడీపేటలో మోకాలిలోతు నీరు నిలిచి ఉంది. ఇప్పటికీ మోకాలి లోతు నీటిలోనే ఇళ్లన్నీ దర్శనమిస్తున్నాయి. వంట సామగ్రి, స్టీలు పాత్రలు బురద పట్టిపోవడంతో వాటిని కడుక్కోవడం వారికి తలకు మించిన భారంగా పరిణమించింది. ఒకపక్క ఇల్లంతా మురుగు, దుర్గంధం వెదజల్లుతుండగా వాటిని కడుక్కోవడానికి మంచినీరు లేక పక్కనే రోడ్డుపై ఉన్న వరద నీటితోనే ఇంటిలోని మురుగును కడుక్కోవడం కనిపిస్తోంది.ముంపులోనే విజయ డెయిరీఈ ప్రాంతంలోని విజయ డెయిరీ ఇప్పటికీ వరద నీటిలోనే మునిగి ఉంది. పాలు, పెరుగు ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు తగ్గుతుండటంతో నీట మునిగిన, ప్రవాహంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన వాహనాలు నీటిలో తేలుతూ కనిపిస్తున్నాయి. మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని ప్రధాన డ్రెయిన్‌లో అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఎందుకు పనికిరాని స్థితిలో బటయపడ్డాయి.నాలుగు రోజులుగా నీళ్లలోనే నానుతున్న ఇళ్లు.. దిక్కు తెలియక వాటిలో ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకు జీవుడా అంటూ క్షణమొక యుగంలా గడుపుతున్న జనం.. నీళ్లు లేవు.. తిండి దొరకదు.. అకలి కేకలు.. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో సతమతమయ్యే అభాగ్యులు.. ఎలాగైనా తినడానికి ఆహారం తెచ్చుకుందామని వరద నీటిలోనే కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తున్న ప్రజలు.. విజయవాడలోని బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.డంపింగ్ యార్డులే నయంముంపు ప్రాంతాలైన అజిత్‌సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఇందిరానాయక్ నగర్, నందమూరి నగర్, వాంబే కాలనీ, శాంతి నగర్, ప్రశాంతి నగర్, రాజీవ్ నగర్, సుందరయ్య నగర్, ఎల్బీఎస్ నగర్, వుడా కాలనీ, కండ్రిక, నున్న, పాతపాడు, రూరల్ పరిధిలోని అంబాపురం, నైనవరం, అప్పారావుపేట, గొల్లపూడి, జక్కంపూడి, రాయనపాడు, భవానీపురం, కేఎల్‌రావు నగర్, కబేళ, కండ్రిక తదితర ప్రాంతాలు దారుణమైన దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఎటుచూసినా వ్యర్థాలు, చికెన్ దుకాణాల్లోని కోళ్లు, గొర్రెలు, మేకలు, పశువుల కళేబరాలతోపాటు మలమూత్రాలు సైతం బురదలోనే తేలియాడుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. అక్కడక్కడా మానవ మృతదేహాలు నీటిపై తేలియాడుతున్నాయి. ఇవన్నీ వరద నీటిలో కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నాయి. వరద ముంపు బాధితుల కోసం తెస్తున్న ఆహార పదార్థాలు పాడైపోతుండటంతో వాటిని రహదారులపై కుప్పులు కుప్పులుగా వదిలేస్తున్నారు. వర్షం పడిన సమయంలో ఇవన్నీ నీటిలో కలిసిపోయి ఇళ్లను చుట్టుముడుతున్నాయి. మొత్తంగా ముంపు ప్రాంతాల్లోని పరిస్థితులు డంపింగ్ యార్డుల కంటే భయంకరంగా తయారయ్యాయి. ముంపు తగ్గిన ప్రదేశాల్లో నగరపాలక సంస్థ కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదు.పునరావాస కేంద్రాల జాడేది‘పునరావాస కేంద్రాలా.. అవి ఎక్కడున్నాయి. అసలు ఉన్నాయా. నిజంగా ఏర్పాటు చేసి ఉంటే ఇలా బతుకు జీవుడా అంటూ ఊరు విడిచి పోవాల్సిన పనేంటి’ అంటూ వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముంపునీరు తగ్గుతుండటంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకొచ్చేస్తున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ తడిసిపోవడంతో కట్టుబట్టలతోనే రోడ్డెక్కుతున్నారు. ఎటువైపు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. తిండి తినక నీరసించిపోవడంతో కొద్దిదూరం నడిచి.. కొంతదూరం వెళ్లాక కొద్దిసేపు కూలబడిపోతున్నారు. తిరిగి శక్తినంతా కూడదీసుకుని నడక సాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలనీలకు కాలనీలు ఖాళీ అయిపోతున్నాయి. మంగళవారం మాదిరిగానే బుధవారం కూడా వరద బాధితులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎవర్ని కదిపినా ఒకటే సమాధానం.. ‘తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. తిందామంటే పట్టెడన్నం లేదు. కట్టుకునేందుకు బట్టలు కూడా లేవు. ఇంట్లో సామాన్లన్నీ వరద నీటిలో నాశనమైపోయాయి’ అని చెబుతున్నారు.నాలుగు రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఎవరైనా వచి్చనా.. ప్రధాన వీధుల్లోని వారికే ఆహార పొట్లాలు, నీళ్లు ఇస్తున్నారు. మా వరకు ఏమీ రావట్లేదు. నేను ఇళ్లల్లో పనులు చేస్తుంటా. నా భర్త, బిడ్డ బెల్దార్ కూలీలు. మా జీవితాలు పూర్తిగా రోడ్డు పైకి వచ్చాయి. ప్రభుత్వం మా లాంటి కుటుంబాలను ఆదుకోవాలి. – కురెళ్ల రాజేశ్వరి, శ్రీను, భవానీ, లూనా సెంటర్ఎలాంటి సాయమూ అందలేదు మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. మా ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. మూడు రోజులు పాటు కరెంట్ లేక ఇబ్బంది పడ్డాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. ఇక పీకల్లోతు నీటిలో ఉండలేక.. స్థానికుల సాయంతో మా కుటుంబమంతా బయటకు వచ్చాం – మన్నెపల్లి సుగుణ, సింగ్నగర్తేలియాడుతున్న టీవీలు... డ్రెస్సింగ్ టేబుల్స్నీటిపై తేలియాడుతున్న టీవీలు... డ్రెస్సింగ్ టేబుల్స్... మంచాలు... ఇలా పేదలు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వస్తువులన్నీ వరదపాలయ్యాయి. గుణదల కార్మెల్నగర్లోని పలు ప్రాంతాల్లో గృహోపకరణాలు ఎక్కువగా నీటిలో తేలియాడుతూ కనిపించాయి. వేలాది రూపాయల విలువైన వస్తువులు వరదలో కొట్టుకుపోతుండటంతో వాటి యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదేవిధంగా పుస్తకాలు, ఇళ్లలోని సరుకులు కూడా తడిసి పనికిరాకుండా పోయాయని కార్మెల్నగర్కు చెందిన పలువురు తెలిపారు. – గుణదల వణుకు తగ్గింది.. కునుకు పట్టింది బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు బాధితులను వరద బారి నుంచి కాపాడటానికి ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కొందరు మత్స్యకారులు తమ పడవలతో వచ్చారు. నాలుగు రోజులు వరద ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తమవంతు పాత్ర పోషించారు. వరద ఉధృతి కాస్త తగ్గడంతో బుధవారం అజిత్‌సింగ్‌నగర్ బ్రిడ్జి పక్కన పడవలు నిలిపి వాటిపై ఇలా సేదదీరుతున్నారు. – ఆటోనగర్ సందర్శకులకు పొంచి ఉన్న ప్రమాదంప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణానది దిగువన సీతానగరం పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో బ్యారేజ్ జనరేటర్ రూమ్ నుంచి పుష్కర ఘాట్ల వరకు గత పుష్కరాల సమయంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ వరదలకు బలహీన పడింది. ఇప్పుడు అక్కడికి కృష్ణానది వరద ఉధృతిని వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏక్షణంలోనైనా అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు మేల్కొని బారికేడ్లను ఏర్పాటు చేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. –తాడేపల్లిరూరల్ఊరి బాట పట్టిన వరద బాధితులు ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : ‘నాలుగు రోజుల నుంచి వరద ముంపులోనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. అన్నం, నీళ్లు కూడా దొరకలేదు. మేం చచ్చామో.. బతికామో కూడా ఎవరూ చూడలేదు. అందుకే.. మా సొంతూళ్లకు వెళ్లిపోతున్నాం. పరిస్థితులు బాగుపడితే తిరిగొస్తాం. లేదంటే కలోగంజో తాగి ఊళ్లోనే ఉండిపోతాం’ అని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చి ముంపు ప్రాంతాల్లో స్థిరపడిన వలస జీవులు చెప్పారు. వారిలో అత్యధికులు బుధవారం సొంతూరి బాట పట్టారు. ‘ప్రాణాలతో బయటపడ్డాం. వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే ఇంత ఇబ్బంది పడే వాళ్లం కాద’ని రాజరాజేశ్వరిపేటకు వలస వచ్చిన ఉత్తరాంధ్ర వాసులు చెప్పారు. ‘చివరకు మా గ్రామాలకు వెళదామన్నా బస్టాండ్, రైల్వేస్టేషన్లకు కనీసం వాహనాలు కూడా అధికారులు పెట్టలేకపోయారు. గత్యంతరం లేని పరిíస్థి్ధతుల్లో నడుచుకుంటూనే రైల్వేస్టేషన్, బస్టాండ్‌కు వెళ్తున్నామని తెలిపారు. ముంపుబారిన పడిన ప్రాంతాల్లో అద్దెకు ఉండే కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. అద్దె ఇవ్వాలని ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారని, ఇప్పటికే పనులు లేక అవస్థలు పడుతున్నామని పలువురు మహిళలు వాపోయారు. కాస్తో కూస్తో ఉన్న డబ్బులు కూడా వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు. చంటి బిడ్డతో మూడు రోజులుగా వ్యాన్లోనే... విజయవాడ సింగ్‌నగర్ పైపులరోడ్డు ఏరియాకు చెందిన వ్యాన్ డ్రైవర్ గోపి, దుర్గ దంపతులకు మూడు నెలల కిందట మగశిశువు జని్మంచాడు. ఆదివారం ఒక్కసారిగా బుడమేరుకు వరద రావడంతో వాళ్ల ఇళ్లు ముగినిపోయింది. మూడు నెలల చంటి బిడ్డను తీసుకుని రోడ్డెక్కారు. గోపి తాను నడుపుతున్న వ్యాన్‌ను ఆవాసంగా మార్చుకున్నారు. పాత రాజీవ్ నగర్ ప్రాంతంలోని రోడ్డు పక్కన వరద తక్కువ ఉన్న ప్రాంతంలో వ్యాన్ నిలిపి భార్య, మూడు నెలల కొడుకును దానిలో ఉంచాడు. చంటి బిడ్డతో మూడు రోజులుగా వ్యాన్లోనే గాలి, వానకు గడిపారు. స్నానానికి నీళ్లు లేవు. తినేందుకు తిండి లేదు. చంటిబిడ్డకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయించాల్సి ఉన్నా నీరు లేక ఇబ్బంది పడ్డారు. చివరికి దాతలు అందించిన బాటిల్ వాటర్‌తో వస్త్రాన్ని తడిపి చంటి బిడ్డను శుభ్రం చేస్తున్నారు. దుర్గకు సకాలంలో ఆహారం లేకపోయిన తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని బిడ్డకు పాలు ఇస్తూ కాపాడుకుంది. -
పేదల కష్టం నీటిపాలు
వాళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. రోజువారీ కూలీలు.. నెలవారీ చిరుజీతగాళ్లు.. రుణాలు చేసి ఆటోలు కొనుక్కుని నడుపుకునేవాళ్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తోడుగా నెట్టుకొచ్చే ఎన్నో జీవితాలు. ఆ కుటుంబాలన్నీ ఇప్పుడు వరద ముంపుతో ఆర్థిక సుడిగుండంలో మునిగిపోయారు.సాక్షి, అమరావతి/సాక్షి బృందం, విజయవాడ : పేద, గొప్ప తేడా లేకుండా బుడమేరు అందర్నీ ముంచేసింది. వరద తీవ్రతను తట్టుకుని కోలుకున్న పేదవర్గాలకు పెద్ద కష్టమే మిగిలింది. ఒక్క వరద పేదల రోజువారీ బతుకుదెరువును దెబ్బతీయడంతోపాటు జీవితకాలం కాష్టార్జితాన్ని సైతం మింగేసింది. విజయవాడ ముంపు బాధిత ప్రాంతాల ప్రజల్లో 80 శాతం మంది రోజువారీ కూలీలు, చిన్నపాటి వేతన జీవులు అధికంగా ఉన్నారు. అజిత్‌సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్‌నగర్, కేఎల్‌రావు నగర్, ఉడా కాలనీ, వాంబే కాలనీ, రాజీవ్‌నగర్, వైఎస్సార్ కాలనీ, కుందవారీ కడ్రిక (నేతాజీ సుభాష్‌చంద్రబోస్ కాలనీ) వంటి అనేక ప్రాంతాల్లోని ఇరుకు సందులు, చిన్నపాటి ఇళ్లలో పేద, దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వారిలో విజయవాడ ఆటోనగర్, వన్‌టౌన్, టూటౌన్ తదితర ప్రాంతాలకు రోజువారీ కూలికి వెళ్లేవారే అధికంగా ఉన్నారు. అనేక మంది పేదలు స్థానిక అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలో పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుడమేరు పై(సింగ్‌నగర్) వంతెన పడటం, రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటం, సింగ్‌నగర్ సమీప ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా కావడం, తక్కువ ఖరీదుకే ఇళ్లు, స్థలాలు లభించడంతో చాలా ఏళ్ల నుంచి ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పేదలు వలస వచ్చి స్థిరపడ్డారు. రాజస్థాన్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఆ ప్రాంతంలోనే అద్దెకు ఉంటూ వన్‌టౌన్‌లోని షాపులు, తోపుడు బండ్లపై వ్యాపారాలకు, కూలికి వెళ్తుంటారు. హోటళ్లు, షాపులు, చిన్నపాటి పరిశ్రమల్లో పనిచేసే చిరుద్యోగులు సైతం సొంతంగా ఇల్లు కొనుక్కోవడంతోపాటు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు వారంతా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.అసలే పేదరికం.. ఆపై ముంపునష్టంరోజువారీ కూలీలు, చిరువేతన జీవులు పదేళ్లకుపైగా కష్టపడితేగాని ఇంట్లోకి అవసరమైన సామగ్రిని సమకూర్చుకోలేరు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకుపైగా వెచ్చించి కొనుక్కున్న మంచం, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, బైక్ వంటి సామగ్రి నీటిపాలు కావడంతో వాటిని మళ్లీ సమకూర్చుకోవడం కష్టమేనని వాపోతున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులకు నెలవారీ ఈఎంఐలు చెల్లించడం కూడా పెద్ద సమస్యేనని వాపోతున్నారు. వరద తమ రోజువారీ బతుకుదెరువు దెబ్బతీయడంతోపాటు జీవితకాలం కష్టపడి సమకూర్చిన సామగ్రి పాడైపోయిందని, వాటికోసం చేసిన అప్పులను తీర్చడం వంటి అనేక సవాళ్లు ఆర్థిక సమస్యల సుడిగుండంలో పడేసిందని వాపోతున్నారు. అసలే పేదరికం.. ఆపై ముంపు నష్టంతో కోలుకోలేని దెబ్బతీసిందని వాపోతున్నారు.ఈఎంఐ కట్టాల్సిందేనయ్యా!ఇక్కడి పరిస్థితులు దుర్భరంగా కనిపిస్తుండగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా ఒకటో తేదీ దాటిపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు ఈఎంఐల (నెల వాయిదా సొమ్ము) వసూళ్ల కోసం రుణాలు తీసుకున్న వారిపై దండెత్తుతున్నారు. కొన్ని కంపెనీల ప్రతినిధులైతే అప్పులు పొందిన వారికి ఫోన్లు చేస్తూ.. 1వ తేదీకే ఈఎంఐ కట్టాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎందుకు జమ చేయలేదని నిలదీస్తున్నారు. తక్షణమే చెల్లించకపోతే పెనాల్టీలు కట్టాల్సి వస్తుందంటూ ఒత్తిడి చేస్తున్నారు. గత నెల 10, 15 తేదీల నాడు ఈఎంఐలు చెల్లించాల్సి వారి ఇళ్లకైతే నేరుగా కంపెనీల ప్రతినిధులు వెళ్లి ‘వానొచ్చినా.. వరదొచ్చినా ఈఎంఐ కట్టి తీరాలి. లేదంటే ఫైనాన్స్‌పై ఇచ్చిన వస్తువులను తీసుకుపోతామ’ని బెదిరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కేఎల్ రావు నగర్ 7వ లైన్‌కు చెందిన ఆటో డ్రైవర్లు వేల్పుల కిశోర్, మారుపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘కొంతకాలం క్రితం లోన్ సదుపాయంతో ఆటోలు కొన్నాం. ఒక్కొక్కరూ ప్రతి నెలా రూ.10 వేల వరకు ఈఎంఐ కడుతున్నాం. వరద ముంచెత్తడంతో ఈఎంఐ చెల్లించలేకపోయాం. కంపెనీల ప్రతినిధులు వచ్చి ఈఎంఐ కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నీట మునిగిన ఆటోలకు మరమ్మతు చేయించేందుకే రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు అవుతుంది. వాటిని ఎలా మరమ్మతు చేయించుకోవాలి దేవుడా అని అవస్థ పడుతుంటే.. ఈఎంఐల ఒత్తిడి మరింత ఆవేదన కలిగిస్తోంది’ అని వాపోయారు.పింఛన్లు తెచ్చుకోలేక అవస్థలుకేఎల్ రావు నగర్, ఊర్మిళా నగర్లలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల్లో చాలా మందికి ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు ఇంకా అందలేదు. ‘వలంటీర్లు ఉండుంటే.. ఈ పాటికే మాకు పింఛన్లు అంది ఉండేవి. మేం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వలంటీర్లు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. చర్చి సెంటర్‌కు వచ్చి పింఛను తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 75 ఏళ్ల వయసులో నీటిలో నడుచుకుంటూ మేం ఎక్కడకు వెళ్లగలం. చేతిలో చూస్తే చిలిగవ్వ లేదు. పింఛను ఇంకా అందకపోవడంతో అవస్థలు పడుతున్నాం’ అని ఊర్మిళా నగర్‌లోని సుబ్బారావు వీధికి చెందిన చెందిన ఎన్.లక్ష్మి వాపోయిందిఏ వస్తువూ పనికొచ్చేలా లేదుఇళ్లల్లోని అన్ని వస్తువులు పాడయ్యాయి. ప్రతి పేద కుటుంబానికి రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లింది. భవనాల్లో ఉంటున్న కుటుంబాలకైనే రమారమి రూ.5 లక్షల చొప్పున వస్తు నష్టం కలిగింది. వంట సామగ్రి, బట్టలే కాకుండా విలువైన వస్తువులు పూర్తిగా నీటమునిగి పాడయ్యాయి. ఫ్రిజ్‌లు, టీవీలు, మంచాలు, వంటి వస్తువులు మూడు రోజులు నీటిలో నానిపోవడంతో పనికి రాకుండా పోయాయని బాధితులు చెబుతున్నారు. పాత రాజరాజేశ్వరి పేట మీర్జాన్ అనే మహిళ తన ఇంట్లో దెబ్బతిన్న వస్తువులను చూపించి ఆవేదన వ్యక్తం చేసింది. అదే ప్రాంతానికి చెందిన ఎలీషా సైతం తన ఇంట్లో వస్తువులే కాకుండా పిల్లల సర్టిఫికెట్లు, ఇతర సామగ్రి పూర్తిగా నాశనమయ్యాయని వాపోయింది. 10 నుంచి 20 ఏళ్లపాటు కష్టించి కొనుక్కున్న వస్తువులన్నీ పాడైపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఉపాధి వెతుక్కుంటూ వేల సైకిళ్లు వెళ్లేవివిజయవాడలో 2006 ప్రాంతంలో సింగ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ఉదయం 8 గంటల నుంచి 10గంటల మధ్య వేల సంఖ్యలో సైకిళ్ల వెనుక భోజనం క్యారేజీ కట్టుకుని పేదలు రోజువారీ కూలికి వెళ్లేవారు. మారిన పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ బైక్‌లు కొనుక్కుని కూలికి వెళ్తున్నారు. ముంపు ప్రాంతాల్లో 50 వేలకుపైగా బైక్‌లు ఉంటాయి. స్వయం ఉపాధి కోసం అనేక మంది రోజుకు రూ.500 నుంచి రూ.800 అద్దెకు ఆటోలు నడుపుకుంటున్నారు. వరదతో తిరగని ఆటోలకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి కొందరిదైతే.. కొన్ని ఆటోలు వరదలో కొట్టుకుపోయి ఏం చేయలో తెలియని పరిస్థితి. – వై.శ్రీనివాసరావు, రియల్టర్, సింగ్నగర్జీవనోపాధి పోయిందిదశాబ్దం కిందట ఇద్దరు బిడ్డలతో పొట్టచేత పట్టుకుని విజయవాడకు వచ్చాను. కూలీనాలి చేసి కూడబెట్టుకున్న సొమ్ముతో ఎనిమిదేళ్ల కిందట చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నాను. నా టిఫిన్ బండి వరదలో కొట్టుకుపోయింది. గ్రైండర్లు, మిక్సీలు, వంట సామగ్రి నిత్యావసరాలు నీటిలో నానిపోయాయి. సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇదంతా అప్పు చేసి పట్టుకొచ్చిందే. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు తీరిస్తే తప్ప.. కొత్తగా అప్పు పుట్టదు. వ్యాపారం లేకున్నా ఇంటి, హోటల్ గది అద్దె కట్టితీరాల్సిందే. వీటికే నాకు రూ.30వేలకుపైగా అవుతుంది. ప్రభుత్వమే మాకు ఏదైనా దారి చూపించాలి. – వెంకటరమణ, భవానీపురం, టిఫిన్ బండి నిర్వాహకుడుఉపాధిని దెబ్బతీసిందివరద నా ఉపాధిని దెబ్బతీసింది. ఒక్క గంటలోనే మా ఇళ్లు మొత్తం మునిగిపోవడంతో జిరాక్స్ షాపులో జిరాక్స్ మెషిన్, మెటీరియల్ పనికిరాకుండా పోయాయి. ఇంటిలో కబోర్డులు నానిపోయాయి. తలుపులు, మంచాలు ఉబ్బిపోయాయి. పరుపులు, బట్టలు దుర్వాసన వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోవడంతో బయటపడేశాం. ఇలాంటి పరిస్థితిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇంటిని శుభ్రం చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. నీళ్లలో నానిపోయిన చెత్తను తీసుకెళ్లమంటే మునిసిపాల్టీ సిబ్బంది పట్టించుకోవట్లేదు. ఇంటి ముంగిట అలానే పెట్టి ఉంచాం. – బాషా, భవానీపురం -
శాంతించిన కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఉప నదుల్లో ప్రవాహం తగ్గడంతో బుధవారం కృష్ణమ్మ మరింత శాంతించింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం రాత్రి 10 గంటలకు 3,00,767 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3,00,267 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన ఆల్మట్టిలోకి చేరుతున్న వరద 30 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువకు 17,600 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలలోకి 1.28 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.37 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 39,945 క్యూసెక్కులు వస్తుండగా 15,533 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 39,964 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 16 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి మరింతగా తగ్గనుంది. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు తాడేపల్లి రూరల్ : నాలుగు రోజులుగా భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి బుధవారం సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారె సమరి్పంచామని జీయర్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు చెప్పారు. మహానాడు ప్రాంతంలో వరద ముంపునకు గురైన బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అహోబిల జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దగ్గరే తప్పు.. సీఎంగా అర్హుడేనా?: వైఎస్ జగన్
విజయవాడ, సాక్షి: వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయడం లేదని.. అసలు ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజరాజేశ్వరి పేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను పరామర్శించారు. అనంతరం.. చంద్రబాబు సర్కార్ అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉంది. అయినా కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నమూ చేయలేదు. ఎక్కడా రిలీఫ్ క్యాంప్‌లు లేవు. ప్రజలపై చంద్రబాబుకు కనికరం లేదు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి బిల్డప్ ఇస్తున్నారు.ఆ పదవికి అర్హుడివేనా?:సీఎం చంద్రబాబు, తాను ఆ పదవిలో కూర్చోవడానికి అసలు అర్హుడినేనా? అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని, ఇప్పుడు విజయవాడ విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబు తప్పిదమే కారణమని, అందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగన్ అన్నారు. విజయవాడ వరదలకు ఇప్పటికే 32 మంది బలి అయ్యారన్న ఆయన, ఇంకా ఎందరు చనిపోయారో లెక్క తెలియడం లేదని, మరోవైపు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వెల్లడించారు. తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, నెపాన్ని అధికారులపై నెడుతున్నారన్న ఆయన, నిజానికి అన్ని అనర్ధాలకు కారణం చంద్రబాబే అని తేల్చి చెప్పారు.చంద్రబాబు–దారుణంతాను నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ నివాసాన్ని కాపాడుకోవడం కోసమే, చంద్రబాబు విజయవాడను ముంచారని, చివరకు ఆ ఇల్లు కూడా నీట మునగడంతో, కలెక్టర్ ఆఫీస్‌కు మకారం మార్చారని, ప్రజల కోసమే తానక్కడ ఉంటున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. మందీ మార్బలంతో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తూ హంగామా చేస్తున్నారని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. విజయవాడలో విపత్తు కచ్చితంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని మరోసారి స్పష్టం చేసిన ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు.‘బుడమేరు వాగుపై వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఒకేసారి ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? అలా కాకుండా మూడు రోజుల ముందు, వాటిని కాస్త ఎత్తి ఉంటే, వరద ఎప్పటికప్పుడు వెళ్లిపోయి ఉండేవి కదా?. ఆ వరదను అలా రెగ్యులేట్ చేసి ఉంటే, తొలుత డైవర్షన్ ఛానల్, అక్కణ్నుంచి పోలవరం కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయి ఉండేది. కానీ, అలా చేయకుండా, వరద ఉధృతి పెరిగాక, ఒకేసారి ఎత్తారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం, ఆ పని చేయడంతో, ఆ నీరంతా ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తింది’.‘ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? వారిని ఆదుకోవడం కోసం ఏమైనా అడుగులు వేశాడా? ఏ చర్యలైనా తీసుకున్నాడా?. అంటే ఏదీ లేదు. విజయవాడలో ఎక్కడికైనా వెళ్లండి. ఏ కాలనీ అయినా తీసుకోండి. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవు’ ముందస్తు జాగ్రత్త లేదుఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ (వాతావరణశాఖ) హెచ్చరించిన గత బుధవారం నాడే, ఎగువన ప్రాజెక్టుల వద్ద ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ వాటర్ కుషన్ ఏర్పాటు చేసి, నీటి విడుదలను నియంత్రించి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు నుంచి నీరు వదలడం, ముందు జాగ్రత్తగా నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ క్యాంప్‌లకు తరలించకపోవడం ఇన్ని అనర్థాలకు కారణమని తేల్చి చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోం శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా కారణమని చెప్పారు.అదే మా ప్రభుత్వ హయాంలో..అదే తమ ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలొస్తే.. 40 వేల జనాభా ఉన్న ఊరి నుంచి 36 వేల మందికి పైగా రిలీఫ్ క్యాంప్‌లకు తరలించామని జగన్ గుర్తు చేశారు. అలాగే, ఏ విపత్తు వచ్చినా, ముందుగానే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కలెక్టర్లు అప్రమత్తమయ్యే వారని, అక్కడి వారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో పాటు, వాలంటీర్లు దగ్గరుండి తలుపుతట్టి మరీ ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తీసుకెళ్లేవారని, ప్రతి సందర్భంలో ప్రజల చేయి పట్టుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేవారని తెలిపారు. అంతే తప్ప, ఇప్పటి మాదిరిగా ఏనాడూ ప్రచార ఆర్భాటం చేయలేదన్న జగన్.. ఈ సీఎం మాదిరిగా కలెక్టర్ ఆఫీస్‌లో పడుకుంటూ, అర్థరాత్రి ప్రెస్మీట్స్ పెట్టలేదని గుర్తు చేశారు.కలెక్టర్లకు వారం టైమ్రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, సహాయక చర్యలు వేగంగా జరిగేలా కలెక్టర్లకు పూర్తి అధికారం ఇస్తూ.. తగిన నిధులు కూడా కేటాయిస్తూ (టీఆర్–27 కింద కలెక్టర్ల ఖాతాలో జమ), వారం రోజుల టైమ్ ఇచ్చేవారమన్న జగన్, అప్పటి వరకు తాను అక్కడికి వెళ్లకపోయే విషయాన్ని ప్రస్తావించారు. సహాయక చర్యలకు అటంకం కలగొద్దు అనేదే తమ అభిమతమని చెప్పారు. ఆ టైమ్ ఇవ్వడం వల్ల వెంటనే కలెక్టర్ యాక్టివేట్ కావడంతో పాటు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేసి, అంతా కలిసి ఒక వ్యవస్థలా పని చేసి, ప్రతి బాధితుడికీ అండగా నిల్చేవారని చెప్పారు. బాధితులను రిలీఫ్ క్యాంప్‌లకు తరలించడం, బాగోగులు చూడడం, అక్కడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు రూ.2 వేల చొప్పున ఇవ్వడం.. ఇవన్నీ ఒక కార్యక్రమంలా జరిగాయని శ్రీ వైయస్ జగన్ వివరించారు. ఇదంతా కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని గమనించాలని కోరారు.ఆ వాల్ కనుక లేకపోయి ఉంటే..ప్రకాశం బ్యారేజీకి ఏ మాత్రం వరద వచ్చినా, మునిగిపోయే కృష్ణలంక, ఇంకా దిగువ ప్రాంతాల వాసుల కష్టాలు స్వయంగా చూసి, రూ.500 కోట్లతో కృష్ణలంకకు ఇరువైపులా నిర్మించిన రీటెయినింగ్ వాల్.. ఇప్పుడు దాదాపు 3 లక్షల మందిని కాపాడుతోందని జగన్ వెల్లడించారు. అందుకే మొన్న తాను వారధి మీదుగా వస్తుండగా, కృష్ణలంక వాసులు ఆపి, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. ఈరోజు ఒకవేళ ఆ వాల్ లేకపోయి ఉంటే, ఇంకా ఎంత అనర్థం జరిగి ఉండేదో ఆలోచించాలని అన్నారు.వారి మరణాలకు సమాధానం చెప్పాలివిజయవాడ విపత్తులో ఇప్పటికే 32 మంది చనిపోయారన్న శ్రీ వైయస్ జగన్, పేర్లతో సహా ఆ వివరాలన్నీ పత్రికలో వచ్చాయని చెప్పారు. నిజానికి మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న ఆయన, వరద పూర్తిగా తగ్గితే అన్నీ వెలుగులోకి వస్తాయని అన్నారు. ఏదేమైనా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇదంతా జరిగిందన్న ఆయన, ఇప్పటి వరకు బయటపడిన 32 మంది మరణాలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది లేకుండా ఈ మాదిరిగా మేనేజ్ చేసిన చంద్రబాబు, అసలు సీఎం పదవిలో ఉండడానికి అర్హుడినేనా? అని తనకు తాను గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. ఈ మరణాలకు వెంటనే బాధ్యత తీసుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పి, బాధితుల సహాయ కార్యక్రమంలో ముందడుగు వేయాలని తేల్చి చెప్పారు.అధికారులపై వేలెత్తడం హేయం‘సీఎం చంద్రబాబు అధికారులను సస్పెండ్ చేస్తానంటున్నాడు. అసలు అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి ఏ అధికారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి, ఆయనే దగ్గరుండి అన్ని పోస్టింగులు పూర్తి చేశాడు. ఆయనే పోస్టింగులు ఇప్పించుకున్న అధికారుల వల్ల ఇది జరిగింది అని ఆయనే సిగ్గు లేకుండా చెబుతున్నాడు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదన్నా ఉంటుందా?. కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పి పుచ్చుకునే దాని కోసం అధికారులను బలిపశువులను చేస్తూ వారి మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారు’.‘అన్నింటికీ కారణం నువ్వు అయినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, దాన్ని హుందాగా అంగీకరించి, తప్పు చేశానని ప్రజలను క్షమాపణ అడిగి అడుగులు ముందుకు వేయాలి కానీ.. తాను చేసిన తప్పులకు అధికారుల మీద వేలెత్తి చూపిస్తూ, వారిని తప్పు పడుతూ, వారిపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబు కంటే దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు’ఆ లాక్‌లు ఎవరెత్తారు?‘బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ మీద లాక్‌లు.. అంటే గేట్లు ఎవడు ఎత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడు ఎత్తాడు? ఎందుకు ఎత్తాడు? అది ఎత్తకపోయి ఉంటే చంద్రబాబునాయుడుగారి ఇల్లు మునిగేది. ఎందుకంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లేవి. బాబు ఇల్లు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి, అక్కణ్నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో కలిసేవి. దాని వల్ల బ్యాక్‌వాటర్ ఎక్కువై చంద్రబాబు ఇల్లు మునిగేది. మరి ఆ రెగ్యులేటర్ 11 గేట్లు ఒకేసారి ఎత్తింది ఎవరు? ఎందుకు అర్ధరాత్రి పూట హడావుడిగా ఎత్తారు? ఎక్కడ చంద్రబాబునాయుడు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎత్తారు. అది ఎత్తడం వల్ల ఆ గేట్ల నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చిన నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి’ అని జగన్ వివరించారు.నిజాయితీ ఉంటే చూపండి‘ఇది రూట్ సార్.. మీరంతా విలేకరులు.. ఒకసారి నేరుగా వెళ్లి మీరు చూడండి. ఇదే విషయం వాళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులోనూ వచ్చింది. దయచేసి కాస్తో కూస్తో జర్నలిజంలో న్యాయం, ధర్మం కొంచం అయినా పాటించి. వాళ్ల గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చిన ఆ వార్తను ఒక్కసారి మీ టీవీల్లో చూపించండి’. ‘వాళ్లంతట వాళ్లే గేట్లు ఎత్తడం జరిగింది. అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకెత్తారట! అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చాయట! అవన్నీ వాళ్లు రాసిన మాటలే. దయచేసి ఏ మాత్రం జర్నలిజంలో నిజాయితీ, న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నాను’ అని జగన్ అన్నారు.మ్యాన్ మేడ్ ఫ్లడ్విజయవాడ విపత్తు కచ్చితంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్ అన్న శ్రీ వైయస్ జగన్, దీని వల్ల ఇప్పటికే 32 మంది చనిపోయారని చెప్పారు. గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబునాయుడుగారు తన షూటింగ్ కోసం, తాను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో చేసిన హంగామాలో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం చెందిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు కూడా అదే మాదిరిగానే చంద్రబాబునాయుడుగారి తప్పిదం వల్లే 32 మంది చనిపోయారని అన్నారు.రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలిఅంత మంది మరణానికి కారణమైన సీఎం చంద్రబాబు, వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మృతుల్లో ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, క్షమాపణ కోరుతూ వారందరికీ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లల్లోని సామాన్లన్నీ కొట్టుకుపోయాయని, ఫ్రిజ్‌లు, ఇతర వస్తువులన్నీ పోవడం వల్ల వారంతా చాలా నష్టపోయారని చెప్పారు. ఈ వరదల వల్ల 6 లక్షల మంది ప్రభావితులైనట్లు వారిచ్చిన రిపోర్ట్‌లోనే ఉన్నందువల్ల, ఆ విధంగా సామాన్లు కోల్పోయిన ప్రతి ఇంటికి కనీసం రూ.50 వేలు ఇవ్వాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. -
శాంతిస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపివ్వడంతో కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7,03,839 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,03,339 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ శాంతిస్తుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన కూడా వరద ప్రవాహం తగ్గింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 47 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు 20 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 8,272 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.08 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 47,911 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 4,809 క్యూసెక్కులు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,61,292 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు 3,38,604 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 3,04,115 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్ కేంద్రం ద్వారా 2.90 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 3.40 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. మున్నేరు, బుడమేరు, కీసర తదితర వాగుల్లో వరద తగ్గిన నేపథ్యంలో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత తగ్గనుంది. -
ఆపలేనంత వరద..
-
ఇప్పుడే తేలిన లంక గ్రామాలు పరిస్థితి దయనీయం
-
ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు బంద్
-
బాబు ఇల్లు వరదపాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా నదీ తీరంలో కరకట్ట వెంబడి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూడా కృష్ణమ్మ వరద ముంచెత్తింది. కనీసం సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేనంతగా రెండో అంతస్తు వరకు వరద వచ్చింది. ఇది అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలుసు. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అందులో నివాసం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎన్ని విమర్శలు వచి్చనా కొన్నేళ్లుగా చంద్రబాబు అదే తన నివాసంగా చేసుకొన్నారు. రెండు రోజులుగా కృష్ణా నదికి తీవ్రంగా వరద రావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కప్పిపుచ్చారు. సీఎం చంద్రబాబు ఆదివారం నుంచి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటున్నారు. ఇంటి వద్దకు వరద ఎంత వస్తుందో కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో సోమవారం సీఎం ఇంట్లోని రెండో అంతస్తులోకి వరద నీరు వచి్చంది. ముఖ్యమంత్రి నివాసమే మునిగిపోయింది. కనీసం అందులో ఉన్న సామగ్రిని కూడా బయటకు తీయలేకపోయారు. ప్రకాశం బ్యారేజి పరిసర ప్రాంతాలకు పోటెత్తిన వరద కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నది పరిసర ప్రాంతాలన్నీ వరద పోటెత్తింది. బ్యారేజ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో సోమవారం 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు నిలిపి వేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో రిటైనింగ్ వాల్ కూలి ప్రమాదభరితంగా మారింది. బకింగ్‌హామ్ కాలువ నీరు రెండు బ్రిడ్జిల మధ్య ఓవర్ ఫ్లో అవుతోంది. కొండవీటి వాగు స్లూయిజ్ వద్ద తూటాకు అడ్డుపడడంతో నీటిని బయటకు పంపడం సాధ్యం కావడంలేదు. కెనాల్‌లోని తూటాకును తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. కృష్ణా నీరు కొండవీటి వాగులోకి ప్రకాశం బ్యారేజ్ వద్ద కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు రూ. 200 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిరి్మంచారు. అయితే వాగు వద్ద స్లూయిజ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఎత్తిపోతల వరకు భారీగా వరద వస్తోంది. కృష్ణానది ఎత్తులో ఉండడంతో ఆ నీరంతా వాగులోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరు చానల్‌కు వెళ్లి ఉండవల్లిలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఉండవల్లి అమరావతి రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.సారపాక వాగులోంచి వచి్చన వరద నీరంతా సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద నిలిచిపోయింది. అధికారులు ఇక్కడ గండి కొట్టి నీటిని మళ్లించారు. కాగా, వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణ రాజు నిరి్మంచిన ప్రకృతి వైద్యం ఆశ్రమానికి సోమవారం ఉదయం వరద నీరు రావడంతో ఆందోళన చెందిన రోగులు పెద్దపెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద తాడు సహాయంతో పై అంతస్తుల్లో ఉన్న వారిని కిందకు దించి పంపించి వేశారు. కరకట్టకు ముప్పు ప్రకాశం బ్యారేజ్ నుంచి హరిశ్చంద్రపురం వరకు కరకట్ట పలుచోట్ల దెబ్బతిని పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం గ్రామాల్లోకి నీరు చొచ్చుకు వస్తోంది. కొల్లిపర వద్ద కరకట్టకు గండ్లు పడే పరిస్థితి తలెత్తడంతో అధికారులు ఇసుక బస్తాలు వేస్తున్నారు. రేపల్లె పులిగడ్డ వద్ద కరకట్ట తెగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. కరకట్ట ఎక్కడైనా గండిపడితే నష్టం భారీగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎప్పుడు వరదలు వచి్చనా ముందస్తుగా వివిధ శాఖల అధికారులు పలు ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. -
కరకట్ట అతలాకుతలం..
-
కృష్ణలంకలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పోటెత్తిన కృష్ణమ్మ: సాగర్ డ్యామ్‌కు పర్యాటకుల క్యూ (ఫొటోలు)
-
పోటెత్తిన కృష్ణమ్మ
విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద దిగువకు ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సాగర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం 10 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,06,242 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,063 క్యూసెక్కులు కలిపి 4,74,205 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 4,20,280 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,97,524 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 12,261 క్యూసెక్కులు కలిపి దిగువ కృష్ణాలోకి 5,09,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లాంచీలు నిలిపివేతఎగువ నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నాగార్జున కొండకు వెళ్లే లాంచీలను శని, ఆదివారాలు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వరద ఉధృతి తగ్గి, గాలులు తగ్గితే లాంచీలను నడుపుతామని, పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీలను నిలిపి వేసినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.పులిచింతలకు భారీగా వరద నీరుఎగువ నుంచి 6,36,945 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 6.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 24 క్రస్ట్ గేట్లు ఉండగా 21 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 5,69,744 క్యూసెక్కులను దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏడీఈ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెయిల్ పాండ్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా ఆదివారం విడుదల చేసిన 5,69,744 క్యూసెక్కుల వరద నీరే అత్యధికం. నీటిమట్టం 73.55 మీటర్లకు చేరుకోవడంతో టెయిల్ పాండ్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేతరెండో ప్రమాద హెచ్చరిక జారీతాడేపల్లి రూరల్/అమరావతి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి 11 గంటలకు 10,25,776 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మొత్తం గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని గెస్ట్హౌస్లలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎక్స్క్లూయిస్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో మత్స్యకారులు తమ పడవలను రేవుపై వరద నీటిలోనే భద్రపర్చుకున్నారు. దిగువ ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతి పెరగడంతో మత్స్యకారులు తమ పడవలను పుష్కరఘాట్లపైనే వదిలేశారు. మహానాడు మసీదు రోడ్డులో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఇన్చార్జి తహశీల్దార్ సతీష్‌కుమార్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ.. గుండిమెడ నుంచి కృష్ణా నది కరకట్టవైపు ప్రయాణించడంతో పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది. వరద ఉధృతి పెరిగితే ప్రాతూరు, గుండిమెడ పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది లంక పొలాల్లో పశువుల కాపరులు తమ పశువులను బయటకు తీసుకువచ్చారు. మంగళగిరి మండలం రామచంద్రాపురం, దుగ్గిరాల మండల పరిధిలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు తదితర ప్రాంతాల్లో కృష్ణా నది పొంగిపొర్లడంతో కరకట్ట లోపల వున్న పంట పొలాలు మునిగిపోయాయి. పుట్టలమ్మ తల్లి ఆలయం చుట్టూ వరద నీరు చేరడంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. -
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ
-
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లిరూరల్/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. శుక్రవారం వరదనీరు భారీగా వచ్చి చేరడంతో 10 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 213.88 టిఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది.నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులుగా ఉంది. 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ క్రస్ట్‌గేట్లు ద్వారా 2,85,222 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేయగా.. ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల నుంచి 3 లక్షల 22 వేల 606 క్యూసెక్కుల వరద నీటిని కిందకు విడుదల చేశారు. -
18 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు
విజయపురిసౌత్: ఎగువున గల కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో బుధవారం సాగర్ జలాశయం 18 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఐదు అడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరగడంతో నాలుగు రేడియల్ క్రస్ట్‌గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు 1,12,300 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,708 క్యూసెక్కులు మొత్తం 2,22,503 క్యూసెక్కులను దిగువున గల కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 1,94,758 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590.00 అడుగులు గరిష్ట స్థాయి నీటిమట్టంతో ఉంది. 18 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 1,29,600 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,070 క్యూసెక్కులు మొత్తం 1,58,670 క్యూసెక్కులు దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, ఎస్ఎల్బీసీ, వరద కాలువ ద్వారా 20,313 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్
సాక్షి, హైదరబాద్ /పెద్దవూర : సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నీటమునిగింది. సొరంగంలోకి నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్‌వాల్ ఒక్క సారిగా కుప్పకూలడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన ఉదయం 6.30 గంటలకు జరిగినా అధికారులు బయటకు పొక్కనీయలేదు. కృష్ణానదికి వరద వస్తుందని అంచనా వేయకపోవడంతోనే...డెడ్ స్టోరేజీలో ఉన్న నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు ఇప్పట్లో రాదనే ఆలోచనతోనే రెండోదశ సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి పనులు చేపట్టినట్టు తెలిసింది. ఇంజినీర్ల అంచనాలోపంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. సాగర్ జలాశయానికి లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరు తున్న ఈ సమయంలో సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా ఉండాల్సిందని నిపుణులు పేర్కొంటున్నారు. సొరంగంలోకి నీరు రాకుండా ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్, సొరంగంలో చేప డుతున్న బ్లాస్టింగ్‌కు దెబ్బతినడంతో పగుళ్లు వచ్చి వరద తాకిడికి ఒక్కసారిగా కూలిపోయిందంటు న్నారు. మరోవైపు రెండోదశ టన్నెల్లో రక్షణ గోడ వెనుక గేటు అమర్చిన అధికారులు పంప్‌హౌస్ స్లాబ్ పూర్తయిన తర్వాత దాని నుంచి గేటుకు టైబీమ్స్ నిర్మించాల్సి ఉందని, ఆ పనులు పూర్త యిన తర్వాత సొరంగాన్ని ఓపెన్ చేస్తే ఈ ప్రమా దం జరిగేది కాదని మరికొందరు అంటున్నారు. ఘటనపై గోప్యత ఎందుకు?ఘటన జరిగి వారంరోజులు గడిచినా విషయం బయటకు పొక్కకుండా అధికారులు ఎందుకు గోప్యత పాటించారనే ప్రశ్న తలెత్తుతోంది. మూడు షిఫ్టుల వారీగా కూలీలచే పనులు చేయించాల్సి ఉన్నా, రెండు షిఫ్టుల్లోనే పనులు చేపడుతున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఒక షిఫ్టు, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు మరో షిఫ్టు చేయిస్తున్నారు. షిఫ్టు మారే సమయంలో కూలీలు అంతా బయటకు వెళుతున్న వేళ నీటి ఉధృతికి రక్షణ గోడ కూలిపోయి, గేట్లు అమర్చేందుకు సుమారు 40 అడుగులకుపైగా ఎత్తులో చేపట్టిన నిర్మాణం అంతా కూలిపోయింది. దీంతో మరో షిఫ్టులో పనికి రావాల్సిన కూలీలు ఇది చూస్తూ భయంతో కేకలు వేసినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. పనుల నాణ్యతపై అనుమానాలుపనులు పూర్తికాకముందే కాంక్రీట్ పిల్లర్లతో కూడిన నిర్మాణం పేకమేడలా కూలిపోయింది. అదే నిర్మాణం పూర్తయి మోటార్లు బిగించిన తర్వాత కూలిపోతే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. జలాశయ నీటిమట్టం 450 అడుగుల లోతుకు సమాన లోతులో తీసిన బావిచుట్టూ పెద్దరాయి ఉంది. నిర్మాణం చేసే సమయంలో కింది నుంచి పక్కనున్న రాయికి రంధ్రాలు చేసి కడ్డీలతో పిల్లర్లను జాయింట్ చేస్తూ నిర్మిస్తున్నారు. అయినా పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే అంత ఎత్తులో ఉన్న నిర్మాణం వరద తాకిడికి కుప్పకూలిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారమైతే పనులు పూర్తయ్యేవి : ప్రాజెక్టు మేనేజర్ వారం రోజులైతే పనులు పూర్తయ్యేవని ప్రాజెక్టు మేనేజర్ నర్సిరెడ్డి తెలిపారు. జలాశయంలో నాలుగైదు మీటర్ల లోతు నీటిమట్టం తగ్గగానే రక్షణగోడ నిర్మించి పంప్‌హౌస్‌లో చేరిన నీటిని తొలగించే పనులు చేపడతామని చెప్పారు. విచారణకు కమిటీ ఏర్పాటు రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జలమండలిస్థాయిలో ఉన్నత ఇంజినీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ ప్రాజెక్టు ఉద్దేశం..నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలో ఉన్నా జంట నగరాలకు భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 2022 మే 14వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2035 నాటికి 47.71 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065నాటికి 67.71 టీఎంసీలు, సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్‌ను ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా నిర్మిస్తున్నారు.. సుంకిశాల పాపం బీఆర్ఎస్దే: భట్టి విక్రమార్క‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంసహా కృష్ణా ప్రాజెక్టును వదల్లేదు. మేడిగడ్డ మాదిరే సుంకిశాలను మార్చేసింది. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం మింట్ కాంపౌండ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. జూలై 2023న టన్నెల్ సైడ్‌వాల్ పూర్తి చేసింది. ఇప్పటివరకు కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అని అనుకున్నాం. మిగిలినవి బాగా ఉన్నాయని భావించాం. తీరా సుంకిశాలను చూస్తే అన్నీ నాసిరకమైనవేనని అర్థమైంది. వారు గోదావరిని మాత్రమే కాదు కృష్ణాను కూడా వదిలిపెట్టలేదు. సుంకిశాల పాపం పూర్తిగా నాటి బీఆర్ఎస్దే. సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. దోషులు ఎవరో త్వరలోనే తేలుస్తాం’ అని డిప్యూటీ సీఎం అన్నారు.సుంకిశాల అవసరం లేదని ఆనాడే కేటీఆర్‌కు చెప్పా : గుత్తా హైదరాబాద్ జంట నగరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన 1.5 టీఎంసీ సామర్థ్యం కలిగిన సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని తాను ఆనాడే అనధికారికంగా కేటీఆర్‌కు చెప్పానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. పైన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది.శ్రీశైలం నుంచి నీటి విడుదలను పెంచిన నేపథ్యంలో.. సాగర్‌కు వరద మరింత పెరిగిపోనుంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశముంది. కృష్ణా ప్రధాన పాయలో వస్తున్న వరదకుతోడు తుంగభద్రలోనూ భారీ ప్రవాహం ఉండటంతో.. ఈ వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని అధికారులు చెప్తున్నారు. -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
సాగర్‌లో 182.95 టీఎంసీలు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ధవళేశ్వరం/పోలవరం రూరల్/సాక్షి, అమలాపురం: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. ప్రాజెక్టులో గురువారం .6 గంటలకు 3,69,866 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో నీటినిల్వ 537.4 అడుగుల్లో 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా.. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 129.1 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అటు జూరాల.. ఇటు సుంకేశుల బ్యారేజ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కులు చేరుతుండంతో పదిగేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మరోవైపు.. మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టిలోకి వరద ఉధృతి మరింత పెరిగింది. » ఆల్మట్టిలోకి 3.41 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. » నారాయణపూర్ డ్యాంలోకి 3.35 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. » అలాగే, జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.03 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. » తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. ఈ డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కులు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. » మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటి మట్టం 311 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికను జారీచేసి నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. » ఈ నేపథ్యంలో.. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది. గోదావరిలో తగ్గుతున్న వరద..ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గురువారం రాత్రి 7 గంటలకు 10,39,697 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు అధికారులు 8,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 10,30,897 క్యూసెక్కులను 175 గేట్లను ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 12.10 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి భద్రాచలం వద్దకు చేరుతున్న వరద 8.41 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో అక్కడ నీటిమట్టం 40.30 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన 24 గంటలుగా వరద నిలకడగా ఉంది. గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. దీంతో అన్ని వరా>్గల వారు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కృష్ణ గోదావరి నదులకు కొనసాగుతున్న వరద.. ప్రాజెక్టులకు జలకళ
-
రాయలసీమ రైతుల ఆనందం.. కానీ చివరికి
-
రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3.79 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది.మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 3.27 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తగ్గని తుంగభద్ర తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగి, ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బరాజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నా రు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
కృష్ణా, తుంగభద్ర పోటాపోటీ
సాక్షి, అమరావతి/హొసపేటె/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పోటాపోటీగా వరదెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,12,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 866.4 అడుగుల్లో 127.59 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి కేంద్రంలో ఏజీ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కులు.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరద వస్తుండటంతో సోమ లేదా మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 52,599 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 507.80 అడుగుల్లో 127.97 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన పాయలో ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వచి్చన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్రలో ఉధృతి మరింత పెరిగింది. డ్యామ్‌లోకి 1.21 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో.. మొత్తం 33 గేట్లు ఎత్తేసి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 1.58 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. దాంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద మట్టం 311.25 మీటర్లు(సముద్రమట్టానికి)కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1,02,100 క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులు వదులుతూ గేట్లు ఎత్తి దిగువకు 99,736 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
నిండుగా కృష్ణమ్మ ప్రవాహం
సాక్షి,హైదరాబాద్/నాగర్‌కర్నూల్/ధరూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గురు వారం జూరాల ప్రాజెక్టుతోపాటు తుంగ భద్ర నుంచి కలిపి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చి చేరింది. జూరాల లో విద్యుదుత్పత్తితోపాటు ప్రాజెక్టు 46 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి నుంచి 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2,50,120 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది.శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా, వరదనీటితో 855.20 అడుగులకు చేరింది. కృష్ణానదిలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో వారంరోజుల్లో శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో నిండుతుంది.2021లో జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా, రెండేళ్లుగా నీటి ప్రవాహం లేక ప్రాజెక్టు నిండలేదు. సాగర్ ఎడమకాల్వకు నీటి నిలిపివేత నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు గురువారం ఉదయం నీటిని నిలిపి వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు తాగునీటిని అందించడం కోసం వా రం రోజుల పాటు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు.మళ్లీ పెరుగుతున్న గోదావరి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం 51.2 అడుగుల నీటిమట్టం ఉండగా, క్రమంగా తగ్గుతూ బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. అయితే మళ్లీ గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతూ ఒంటిగంటకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితే‹Ù.వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
కృష్ణమ్మకు జలకళ.. భారీగా వరద ఉధృతి (ఫొటోలు)
-
ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, తూర్పుగోదావరి/ఖమ్మం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తోంది. నీటిమట్టం 13.9 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల 9వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అన్నంపల్లి అక్విడెట్, యానాం దగ్గర గౌతమి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.భద్రాచలంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 53 అడుగులకు చేరితే చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదారి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే మార్గంలో తూరుబాక బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం మొండికుంట నుంచి ఇరవెండి రహదారిపై గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రామచంద్రాపురం స్టేజి వద్ద గల కడియాలబుడ్డి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రభావం తగ్గింది. ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6470 క్యూసెక్కులు ఉండగా, అడుగు మేర 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: మిడ్ మానేరుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 640 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 62 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 27.5 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 5.80 టీఎంసీలు.అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం, తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం కెపాసిటి 137 కాగా. ప్రస్తుతం 136కి చేరుకుంది. జలాశయం లోకి ఇన్ ఫ్లో 518 క్యూసెక్కుల నీరు. మూడు గేట్లు ద్వారా 456 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.కర్నూలు జిల్లా: తుంగభద్ర డ్యామ్‌కు వరద కొనసాగుతోంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో.. 92,636, ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/హొళగుంద/హొసపేటె: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగుపరుగున చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,09,814 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 832.5 అడుగుల్లో 52.14 టీఎంసీలకు చేరుకుంది. పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉపనదులు వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంటగంటకు పెరుగుతోంది. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,04,972 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 87.42 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారడం, ఎగువ నుంచి భారీవరద వస్తుండటంతో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. క్రమేణ పెంచుతూ రాత్రికి 55 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని, నదీతీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరులశాఖ అధికారులను తుంగభద్ర బోర్డు ఆదేశించింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసే జలాలు సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఇటు జూరాల నుంచి కృష్ణా, అటు సుంకేశుల నుంచి తుంగభద్ర జలాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరగనుంది. -
కృష్ణమ్మకు జలకళ
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ప్రధాన పాయతోపాటు ఉప నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచి్చన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ వరద అంతా జూరాలకు వస్తుండగా.. 37 గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అలా కృష్ణమ్మ పరుగుపరుగున శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది.ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి నీటిని వదలడం ప్రారంభించారు. నీటి విడుదలను క్రమేణా పెంచుతామని, నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులకు తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీళ్లు సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇటు జూరాల నుంచి, అటు సుంకేశుల నుంచి వచ్చే ప్రవాహాలతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరగనుంది. సాగర్ ఎడమ కాల్వ కట్టకు బుంగ నడిగూడెం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు ఆదివారం రాత్రి బుంగ పడింది. కట్టతోపాటు, కాల్వ లైనింగ్ కూడా కోతకు గురైంది. దీంతో అధికారులు కృష్ణానగర్, చాకిరాల వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. బుంగపడిన చోట కంచె ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన చిన్న బుంగ ప్రస్తుతం పెద్దగా మారి, కట్ట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాల్వ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం శనివారం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 174 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 0.74 టీఎంసీలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీలోకి 6,064 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 6,596 క్యూసెక్కులను వదులుతున్నారు. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. పెరిగిన గోదా‘వడి’తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, శబరి ఉప నదులతో పాటు కొండ కాలువల నీళ్లు కూడా కలవడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 40.2 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరింది. పోలవరం ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్లను ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. శుక్రవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 7 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,48,191 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 1,800 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,46,391 క్యూసెక్కులను బ్యారేజీ నుంచి 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. శనివారం వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. జల వనరుల శాఖ అధికారుల అప్రమత్తమే ధవళేశ్వరంలోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. -
కృష్ణాలో నిలకడగా..
సాక్షి, అమరావతి/రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద నిలకడగా కొనసాగుతోంది. గురువారం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 72,286 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 65,580 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 68,797 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 46,329 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25,174 క్యూసెక్కులు దిగువకు వదులుతోంది. ఈ జలాలు శుక్రవారానికి శ్రీశైలానికి చేరుకోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. ఇందుకోసం 7,064 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 32.37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం నుంచి తరలిస్తున్న జలాలతో నాగార్జున సాగర్‌లోకి 23,851 క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో సాగర్‌లో నీటి నిల్వ 123.34 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్‌లోకి 82,491 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ నీటి నిల్వ 46.80 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం తుంగభద్ర డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.గోదావరిలో పెరుగుతూ..పోలవరం వద్దకు 2.30 లక్షల క్యూసెక్కుల వరదసాక్షి, అమరావతి/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా వచ్చిన జలాలను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,31,161 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 8.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు వదులుతూ మిగతా 2,23,961 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో నీటిమట్టం గురువారం సాయంత్రం 18.20 అడుగులకు చేరింది.పాపికొండల విహార యాత్రకు బ్రేక్బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, తుఫాన్ హెచ్చరికలు, గోదావరి నదికి వరద తాకిడి పెరగడం వల్ల యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 22 అడుగుల వరకు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. -
శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది వరద ఉధృతికి కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు బుధవారం డ్యామ్ గేట్లు 9 ఎత్తి దిగువకు 37,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తూ వస్తోంది. జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ ఇప్పటికే 7.66 టీఎంసీలు ఉన్న నేపథ్యంలో..ఒక్క రోజులోనే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఆ తర్వాత జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద చేరే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయ, ఉపనదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 92,836 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 65 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఆ జలాలు నారాయణపూర్ డ్యామ్‌లోకి చేరుతున్నాయి. కృష్ణా ప్రధానపాయలో వరద మరో నాలుగైదు రోజులు ఇదే రీతిలో కొనసాగే అవకాశముందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 49,522 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 39.72 మీటర్లకు చేరుకుంది. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ 4.5 టీఎంసీలు.. తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయిస్తూ మంగళవారం కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాగర్‌లో నీటిమట్టం కనీస స్థాయికి దిగువన ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 5.705 టీఎంసీలను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా ఏపీ 15,800, ఎడమ కేంద్రం ద్వారా తెలంగాణ 6,357 వెరసి 22,157 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నీటినిల్వ 33.24 టీఎంసీలకు తగ్గింది. సాగర్‌లోకి 21,481 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 122.69 టీఎంసీలకు చేరుకుంది. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు బుధవారం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.వరద గోదావరిభద్రాచలం వద్ద బుధవారం రాత్రి 21 అడుగులకు చేరే అవకాశంభద్రాచలం అర్బన్: గోదావరి నిండుకుండను తలపిస్తోంది. భద్రాచలం వద్ద ఈ నెల 13వ తేదీ నుంచి 13 అడుగుల మేర నీటిమట్టం నిలకడగా ఉంది. రెండు,మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతుండడంతో మంగళవారం రాత్రి 14.5 అడుగులకు చేరింది. ఆపై అంతకంతకూ పెరుగుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా 18.1 అడుగులకు చేరుకుంది. కాగా, బుధవారం రాత్రి మరో మూడు అడుగుల మేర పెరిగి 21 అడుగులకు చేరే అవకాశముందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు నదిలోకి దిగొద్దని హెచ్చరిస్తున్నారు.‘తాలిపేరు’కు పోటెత్తుతున్న వరదచర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండ లంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిలాల్లో కురు స్తున్న భారీ వర్షాలతో బుధవారం ఉదయం ప్రాజెక్టు 25 గేట్లలో 12 గేట్లు అడుగు మేర ఎత్తి 16,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయినా వరద ఉధృతి ఆగ లేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు 22 గేట్లు అడుగు మేర ఎత్తి ద్వారా 63 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి వరద మరింతగా పెరగగా, 20 గేట్లను రెండేసి అడుగుల మేర, మిగతా ఐదు గేట్లను పూర్తిగా ఎత్తి 70,750 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. -
15 నాటికి శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 84,645 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 81.44 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం వరద ముప్పును నివారించేందుకు నిల్వలు గరిష్ట స్థాయికి చేరకముందే గేట్లను ఎత్తి వరదను దిగువన విడుదల చేస్తారు. గతేడాది జూలై 27న నిల్వ 93.28 టీఎంసీలకు చేరిన వెంటనే ఆల్మట్టి డ్యామ్ గేట్లను పైకి ఎత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిల్వలు 105 టీఎంసీలకు చేరే లోపే గేట్లను ఎత్తే అవకాశముంది. వర్షాలు, వరదలు కొనసాగితే మరో రెండు రోజుల్లోగా ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను దిగువన విడుదల చేసే అవకాశముంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్మామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.06 టీఎంసీల నిల్వలున్నాయి. ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేయనున్నారు. దీంతో తెలంగాణ భూభాగంలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నెల 15 లేదా 16వ తేదీలోగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్రకు పెరిగిన వరద ప్రవాహం కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లోనూ వర్షాలు కురుస్తుడడంతో తుంగభద్రలో వరద ప్రవాహం మరింత పెరిగింది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం బుధవారం ఉదయం 35వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రానికి 27,544 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 100.86టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వలున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే మరో వారం రోజుల్లో తుంగభద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. సాగర్ నుంచి 5 టీఎంసీల విడుదలకు అనుమతించండి: ఏపీ విజ్ఞప్తి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా 5 టీఎంసీల నీళ్లను విడుదల చేసేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా నదియాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15 నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు నీళ్లను కుడి ప్రధాన కాల్వ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసుకుంటామని, పర్యవేక్షణ కోసం కృష్ణా బోర్డు సిబ్బందిని పంపించాలని కోరింది. నీటి విడుదలకు అనుమతివ్వాలని సీఆర్పీఎఫ్ బలగాలను సైతం కోరాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ నెల 8న కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చే వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టం పడిపోయిందని, అందుకే నీటి విడుదల చేసుకుంటామని తెలిపారు. -
తృటిలో తప్పిన ముప్పు...
-
విజయవాడ కృష్ణా నది రిటైనింగ్ వాల్ పై సీఎం జగన్ దీక్ష
-
కేసీఆర్ స్పీచ్‌పై అందరిలోనూ ఉత్కంఠ
-
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైంది
-
ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్
రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన తవ్వకాల్లో కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా శివ లింగం శ్రీకృష్ణుని దశావతార విగ్రహాలను సురక్షితంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయతే రాయచూర్ యూనివర్శిటీలోని చరిత్ర, పురావస్తు శాఖ అధ్యాపకులు డాక్టర్ పద్మజ దేశాయి ఏమంటున్నారంటే..! "రాయచూరు, హంపి పరిసరాల్లోని 30 గ్రామాల్లో ప్రాచీన దేవాలయాలపై పీహెచ్డీ చేశాను నేను. కృష్ణ నదీ తీరంలో బయటపడ్డ ఈ విష్ణుమూర్తి విగ్రహం 11వ శతాబ్ధానికి చెందినది కావచ్చునని, కళ్యాణ చాళుక్యుల కాలంలో తయారైందని ప్రాథమిక అంచనా ఉంది. కచ్చితమైన కాలావధి కావాలంటే కార్బన్ డేటింగ్ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తాము పలు విగ్రహాలు చూశామని గ్రామస్తులు పలుమార్లు చెప్పేవారు. తాజాగా నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అందరికీ కనిపించాయి. పైగా అయోధ్య రామ మందిరం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం కావడం, అక్కడి రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ చెక్కడం వంటి నేపథ్యంలో రాయచూరుకు సమీపంలో బయటపడ్డ విగ్రహాన్ని చాలామంది రామ్ లల్లా విగ్రహంతో పోల్చి చూశారు. అయితే నా అంచనా ప్రకారం ఈ విగ్రహం వెంకటేశ్వరుడిది అయ్యేందుకు అవకాశముంది. ఎందుకంటే విగ్రహం దొరికిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు కావడం.. ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి ఆరాధన ఎక్కువగా ఉండటం. అంతేకాదు.. విగ్రహ లక్షణాలను గమనిస్తే దీనిపై శంఖు, చక్రాలు అన్నాయి. తిరుపతి వెంకటేశ్వరుడి మాదిరిగానే అభయ, వరద హస్తాలు ఉన్నాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో అటు శైవారాధనతోపాటు వైష్ణవారాధన కూడా జరిగేది. ఇందుకు తగ్గట్టుగా ఈ విష్ణుమూర్తి విగ్రహం బయటపడ్డ ప్రాంతంలోనే శివలింగమూ లభించింది. ఇంకో విషయం.. ఈ విగ్రహాలు బయటపడ్డ చోట ఆలయం లాంటివి ఏమీ లేవు.’’ - డాక్టర్ పద్మజ దేశాయి, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ లెక్చరర్,రాయచూర్ యూనివర్శిటీ. -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా -
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ విజయం
-
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
కృష్ణా జలాల వివాదంపై నేడు భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నది దిగువ బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే అజెండాగా బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు పరిధిని నిర్దేశించేవరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ(ఆంధ్రప్రదేశ్), సాగర్ నిర్వహణను ఆ ప్రాజెక్టు సీఈ(తెలంగాణ)కి అప్పగించింది. కానీ తమ భూభాగంలో ఉందంటూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నా అప్పటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా దిగువకు నీటిని వదిలేస్తూ.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలం పాజెక్టును ఖాళీ చేస్తూ రాయలసీమ హక్కులను తెలంగాణ హరిస్తూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తరలించిన జలాలను.. కుడి కాలువకు విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులను కాలరాస్తూ వస్తోంది. బోర్డు పరిధి నిర్దేశించినప్పటికీ.. దీనిపై 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలి. కృష్ణా బోర్డు సమావేశంలో ఆ ప్రాజెక్టులను అప్పగించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరగడంతో ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్లో దిగువన నీటి అవసరాలు లేకపోయినా.. శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 17 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసి సాగర్‌కు తరలించిన తెలంగాణ.. వాటిని ఏపీకి విడుదల చేయకుండా మొండికేసింది. దాంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి నవంబర్ 30న ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాగర్ వివాదంతో కదలిన కేంద్రం సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్‌పై యధాస్థితిని కొనసాగిస్తూ.. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతోపాటు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
విజయవాడ ప్రజలకు శుభవార్త కృష్ణానది ఒడ్డున రక్షణ గోడ
-
ముంపు నుంచి ‘రక్షణ’
వర్షం వచ్చిందంటే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణం కృష్ణా నది పొంగుతుందో... ఎక్కడ తమ ప్రాంతానికి వరద వస్తుందో... తమ ఇళ్లు ముంపు బారిన పడతాయో... మళ్లీ మా బతుకులు ఎక్కడ అతలాకుతలంఅవుతాయోనని ఆందోళన చెందేవారు. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవాడ నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్య. అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఎన్నో మారినా ఇక్కడివారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ సమస్యపై దృష్టిసారించారు. అవసరమైన నిధులు మంజూరు చేసి రక్షణగోడ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వేలాదిమంది ప్రజల చింత తీర్చారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర ప్రజలకు వరద ముప్పు నుంచి పూర్తి ఉపశమనం కలగనుంది. ఆర్టీసీ బస్టాండు నుంచి యనమలకుదురు వరకు వేలాది మంది ప్రజలకు వరద కష్టాలు తొలగనున్నాయి. ప్రకాశం బ్యారేజినుంచి 5లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వదిలితే దిగువ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యేవి. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినా ఏ ఇబ్బంది లేకుండా రక్షణ గోడ నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతవాసుల ముంపు కష్టాల నుంచి గట్టెక్కిస్తూ కనకదుర్గమ్మ వారధినుంచి కోటినగర్ వరకు రూ. 122కోట్లతో రక్షణగోడ నిర్మించారు. తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మవారధి వరకు రూ. 120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కృష్ణలంకకు రక్షణ కవచం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతం కృష్ణానదికి వరదలు వచ్చినపుడల్లా ముంపుబారిన పడేది. ఇక్కడి కాలనీ వాసులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించేవారు. వారం, పదిరోజుల పాటు వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే తలదాచుకునేవారు. ఈ సమస్యను ప్రత్యక్షంగా చూసిన సీఎం వైఎస్ జగన్ రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటి నగర్ వరకు 1.2 కిలో మీటర్ల పొడవునా రూ.122.90 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన దాదాపు 50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బ్యారేజీ నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతిసారీ చలసాని నగర్, కృష్ణలంక, గీతానగర్, రాణిగారితోట, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భ్రమరాంబపురం వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవి. రక్షణ గోడ నిర్మాణంతో ఈ ప్రాంత వాసుల కష్టాలు పూర్తిగా తీరాయి. తుది దశకు పనులు ప్రస్తుతం పద్మావతి ఘాట్‌నుంచి కనకదుర్గా వారధి మధ్య కృష్ణానది వెంబడి 1.070 కిలో మీటర్ల పొడవున రూ120.82 కోట్ల నిధులతో రిటైనింగ్ వాల్ మూడో దశ పనులు తుది దశకు చేరాయి. దీనివల్ల కృష్ణలంకలోని రణదీప్ నగర్, గౌతమి నగర్, నెహ్రూనగర్, ద్వారక నగర్లో నివసిస్తున్న 30 వేల మందికి వరద కష్టం తీరింది. స్వరూపం – ఆర్టీసీ బస్టాండ్ నుంచి యనమలకుదురు వరకు రక్షణ గోడ – ఇప్పటివరకూ 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం. – ఇకపై 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు సమస్యే ఉండదు. – కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు రూ.122.90 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణం – తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 1.070 కిలోమీటర్ల పొడవున రూ.120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి. ముంపు సమస్య తీరింది వర్షాకాలం వచ్చిందంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణాన్నైనా వరద వచ్చేస్తుందేమోనని భయాందోళన చెందేవాళ్లం. వరద ఇళ్లలోకి వస్తుండటంతో ఇళ్లు కాళీ చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ భయం లేదు. మా కష్టాలు తీరాయి. – మండాది దుర్గ, తారకరామనగర్ మా జీవితాలకు రక్షణ వరద ముంపు సమస్యకు పరిష్కారం దొరకింది. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ సమస్య పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మా వరద కష్టాలను పరిష్కరించి, మా జీవితాలకు రక్షణ కల్పించారు. – వీర్ల సుభద్రాదేవి, తారకరామనగర్ దశాబ్ధాల సమస్య పరిష్కారం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కూలీ పనులు చేసుకుంటూ, కృష్ణానది కరకట్టపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వరద వచ్చినప్పుడల్లా ఇళ్లు కాళీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఆ సమస్యలేదు. దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. – బాపనపల్లి కుమార్, ఆటోడ్రైవర్, భూపేష్గుప్తానగర్ రిటైనింగ్ వాల్ పనులు పూర్తయ్యాయి కృష్ణా నది కరకట్ట వెంబడి రిటైనింగ్ వాల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడోదశలో పద్మావతి ఘాట్‌నుంచి కనకదుర్గా వారధి వరకు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. దీని ద్వారా విజయవాడ వాసులకు ముంపు కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. . – టి.జె ప్రసాద్, నీటిపారుదలశాఖ ఎస్ఈ, విజయవాడ దశాబ్దాల కల నేరవేర్చారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర వాసుల ముంపు కష్టాలు చూసి, వారి కష్టాలకు చెక్ పెట్టే విధంగా, కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఇది కృష్ణలంక ప్రజలకు రక్షణ కవచంగా మారనుంది, దీంతో పాటు నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా రిటైనింగ్ వాల్‌ను అందంగా తీర్చి దిద్దుతున్నారు. దశాబ్దాల కలనేరవేర్చిన ముఖ్యమంత్రికి తూర్పు నియోజక వర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – దేవినేని అవినాష్, తూర్పునియోజక వర్గ ఇన్‌ఛార్జి కృష్ణాతీరం... ఇక ఆహ్లాదం... నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ వెంబడి పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.38.39 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి, పనులు ప్రారంభించారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ వెంబడి బండ్ పనులు పూర్తయ్యాయి. -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
కాకతీయుల కళావైభవం
కాకతీయుల కళాపోషణకు సజీవ సాక్ష్యాలుగా పలు కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి ఒక కృతిని, ఆకృతిని కల్పించి.. తమలో దాగిన ఆగమజ్ఞాన నిధిని.. తత్వార్థ ఖనిని రాళ్లల్లో ఇమిడ్చిన కాకతీయుల ప్రతిభ అనన్యం అపూర్వం.. సుమధురం. కాకతీయుల కళామణిహారం లోంచి జాలువారిన కళాఖండాలు ఎన్నో నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మన చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ఎలుగెత్తి చాటుతోంది ఇక్కడి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కళాపిపాసకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. – నర్వ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో కోటలు, సంస్థానాలు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్‌లోని అనేక కట్టడాలు గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలోని శాతవాహనులు, గుప్తులు, వాకాటములు, కదంబులు రాజ్యపాలన చేశారు. శాతవాహనుల తర్వాత దక్కను భాగమును విశేషంగా ఆక్రమించుకున్న వారు పల్లవులు. పల్లవుల నుంచి కర్ణాటక ఉత్తర భాగాన్ని విడిపించిన వారు కదంబులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం ప్రారంభం వరకు సర్వాధికారాలతో పరిపాలన సాగించారు. ఈ కదంబులు కుంతల దేశాన్నే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గ, బీజాపూర్, ధారవాడ, బళ్లారిలతో పాటు కర్నూల్, అనంతపురం ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. వీటితో పాటు పాలమూరు జిల్లాలోని నారాయణపేట, మక్తల్ తాలుకా, తాండూర్, కోస్గి, కొడంగల్, ఆత్మకూర్, గద్వాల ప్రాంతాలతో పాటు అలంపూర్, అయిజ, కందూర్, కడుమూర్, కోడూర్ ప్రాంతాల్లో కదంబులతో పాటు కర్ణాటక ప్రభువులు ఏలుబడి ఉందని చరిత్ర చెబుతోంది. కదంబులు నాడు నిర్మించిన గ్రామమే కడుమూర్.. నేడు పెద్దకడ్మూర్గా పిలవబడుతోందని చరిత్రకారుడు, సాహితీ సేవకుడు కవి బాబు దేవిదాస్‌రావు ‘పాలమూరు చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు. చరిత్రకు సాక్ష్యంగా కల్యాణి చాళుక్యుల శాసనం పెద్దకడ్మూర్ బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణి చాళుక్యుల శాసనం గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ శాసనాన్ని చరిత్రకారుడు బాబు దేవిదాస్‌రావు విపులంగా వివరించారు. కదంబుల కాలంలో పాలమూరు జిల్లాపై కర్ణాటక ప్రభువుల ఏలుబడి ఎక్కువగా ఉండేది. దీంతో నాటి కదంబూరు (కడ్మూర్), నాగలకడ్మూర్ గ్రామాలు ఆత్మకూర్ తాలుకాలో ఉండేవి. కడ్మూర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయ ఆవరణలో స్థాపించిన శాసనంలో అనేక అంశాలను పొందుపర్చారు. అహవమల్లరాయ నారాయణుడి పరిపాలన కాలంలో మూడవ ఏట వీరబలంజయ ధర్మప్రతిపాదకులైన ‘ఆయావోళేనూర్వర స్వాములు’ కర్ణాటక దేశాన 4వేల ఉభయ నానాదేశి వర్తకులు పెద్దకడ్మూర్‌లో కూర్చొని తమ సంఘం వారికై చేసుకున్న కట్టుబాట్లను శాసన రూపకంగా పొందుపర్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా.. గత వైభవాన్ని చాటే కాకతీయుల కళాఖండాలను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు. మరో కథ వెలుగులో.. నేటి పెద్దకడ్మూర్ ప్రాంతం జూరాల ప్రాజెక్టు అతి సమీపంలోని కృష్ణానది తీరంలో ఉండటంతో కాకతీయ రాజు రెండవ పులకేశి వేటకు వచ్చాడంటా. ఈ ప్రాంతం దట్టమైన అడవి.. కృష్ణనది సోయగాలతో రెండవ పులకేశిని మంత్రముగ్దులను చేసిందంటా. దీంతో ఇక్కడ ఓ గ్రామాన్ని నిర్మించాలని ఆయన తలంచారు. రాజులు తలచుకుంటే కొదవే ముంటుందన్న చందంగా సైనికులు, నిపుణులు, శిల్పులతో కలిసి రాజుకు ఇష్ట దైవమైన బాలబ్రహ్మేశ్వరుడి ఆలయం నిర్మించారని గ్రామంలో చెబుతున్నారు. ఆలయంతో పాటు గ్రామముఖ ద్వారం, గ్రామదేవత ఆలయం, నాగదేవతల ఆలయాలు రూపొందించారు. ఈ అద్భుతమైన కట్టడాలు, కాకతీయుల కళాపోషణకు నిదర్శనాలుగా నిలిచి, నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చారిత్రక ఆలయాన్ని సంరక్షించాలి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సంరక్షించాలి. గ్రామస్తుల చైతన్యంతో కొంత అభివృద్ధి జరిగింది. ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా గుర్తించి, విలువైన శిల్పసంపదను కాపాడాలి. – తంబలి నర్సింహయ్య, బాలబ్రహ్మేశ్వర ఆలయ అర్చకుడు అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం.. అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం. గ్రామముఖ ద్వారాలు, నాగదేవతల స్థలాలను సంరక్షించాలి. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కట్టడాలను పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సందర్శించి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామస్తుల సహకారంతో ఆలయాలను సంరక్షించుకుని ప్రస్తుతం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు -
కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు!
గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు, హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు, అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయట పడటంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారు. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృ దేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబునాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. -
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
ఎర్రవల్లిచౌరస్తా: అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయం సోమవారం అంజన్న నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అభయాంనేయస్వామికి ఆకుపూజ, పంచామృత అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు ఉదయాన్నే బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అభయాంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ఎదుట కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ పేర్కొన్నారు. -
కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం.. వైభవంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి వేడుకలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చిన్నబోయిన కృష్ణమ్మ!
సాక్షి, అమరావతి: నిండా నీటితో పరుగులు తీసే కృష్ణమ్మ ఈ ఏడాది చిన్నబోయింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పాయతోపాటు కృష్ణా ఉప నదులైన కోయినా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వేదవతి, భీమాలలోనూ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. బేసిన్లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నికర జలాల లభ్యతలో ఈ ఏడాది సగం కూడా లభించడం లేదు. నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో నీటికి కటకట ఏర్పడింది. సాగునీటికే కాదు తాగునీటికీ ఇబ్బందులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ పర్వత శ్రేణుల్లో పురుడు పోసుకునే కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ మీదుగా 1,400 కి.మీ. పొడవున ప్రవహించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కృష్ణా నదిలో ఏటా సగటున 75 శాతం లభ్యత (నికర జలాల) ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసింది. అందులో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299) చొప్పున కేటాయించింది. కానీ.. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రధాన పాయతోపాటు ఉప నదుల్లో వరద ప్రవాహం పెద్దగా రాలేదు. దాంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకుంది. మహారాష్ట్రలో కృష్ణా ప్రధాన పాయ, కోయినా, దూద్గంగ, భీమా వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి 298 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఘటప్రభ, మలప్రభ, వేదవతి, తుంగభద్ర ద్వారా ప్రాజెక్టుల్లోకి 427 టీఎంసీల ప్రవాహం వచ్చింది. బేసిన్లో దిగువన గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల్లోకి కృష్ణా ప్రధాన పాయతోపాటు మూసీ, పాలేరు, మున్నేరు వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు కేవలం 157 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. శ్రీశైలంలోకి 120 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. ఇది ఆ ప్రాజెక్టు చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కావడం గమనార్హం. 2015–16లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన 58.69 టీఎంసీలే ఆ ప్రాజెక్టు చరిత్రలో కనిష్ట ప్రవాహం. కృష్ణా బేసిన్లో 2019–20 నుంచి 2022–23 వరకూ నాలుగేళ్లూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా జలాలు లభించాయి. ఈ ఏడాది నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో బేసిన్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. -
కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా
-
కృష్ణా జలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం
-
‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి : కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్తగా విధి విధానాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్) జారీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విధి విధానాలను ఇప్పటికే నిర్దేశించారని గుర్తు చేస్తూ.. మళ్లీ కొత్తగా విధి విధానాలు జారీ చేయడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయంగా, అక్రమంగా కొత్తగా జారీ చేసిన విధి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. వాటిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని.. దాని ద్వారా న్యాయబద్ధంగా హక్కుగా రాష్ట్రానికి దక్కిన ప్రతి నీటి బొట్టునూ రక్షించుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటికే ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1976లో 811 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. ఈ కేటాయింపుల ఆధారంగా 2015 జూలై 18–19న ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ చేసిన తాత్కాలిక సర్దుబాటుపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశారు. కృష్ణా నది జలాలను పంపిణీ చేయడానికి 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి నివేదిక, 2013లో తుది నివేదిక కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. ఆ రెండు నివేదికలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీలు దాఖలు చేయడంతో వాటిపై స్టే ఇచ్చింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రం నోటిఫై చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం కట్టబెడుతూ దాని గడువును పొడిగించింది. విభజన చట్టంలో సెక్షన్–89లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాలలో ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే నియమావళిని రూపొందించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం విధి విధానాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకే నీటి పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2016 నుంచి విచారణ జరుపుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ కృషి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క నీటిని వదులుకోబోమని, అన్యాయంగా చుక్క నీటిని వాడుకోబోమని తేల్చి చెప్పారు. సెక్షన్–3 ప్రకారం నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి శాఖకు 2021లో లేఖ రాయగానే.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి చట్టబద్ధంగా ట్రిబ్యునల్ కేటాయించిన జలాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఈ నెల 4న ఆమోదం తెలపడం అశాస్త్రీయమని, దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.. అందువల్ల తదుపరి చర్యలను నిలిపేసి రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే రోజున ఢిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై ఇదే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూ తప్పుడురాతలు అచ్చేస్తున్నారు. వారి విషపురాతలను ప్రజలు నమ్మరు. టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న విమర్శలను జనం పట్టించుకోరు. పవన్ కళ్యాణ్, లోకేశ్ పొలిటికల్ బఫూన్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయా పార్టీల వారికే తెలియక జట్టు పీక్కుంటున్నారు. పెడనలో ఎన్డీయే నుంచి బయటకొచ్చానని ప్రకటించిన పవన్.. ముదినేపల్లికి వచ్చే సరికి మాట మార్చారు. జైలులో చంద్రబాబును ములాఖత్‌లో కలిసి బయటకొచ్చాక.. చంద్రబాబు అవినీతిని ఇంటింటా ప్రచారం చేస్తానని లోకే‹శ్ ప్రకటించారు. అందుకే వారిద్దరినీ పొలిటికల్ బఫూన్లుగా ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాల ద్వారా ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరూపితమైంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉన్న చంద్రబాబును కలిశాక టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించారంటే.. ఆయన అవినీతిలో ఈయనకు వాటా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బలహీనపడ్డ టీడీపీ తన మద్దతుతో బలం పుంజుకుంటుందని పొత్తు పెట్టుకున్న జనసేన.. క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి చతికిలపడింది. అవనిగడ్డ, పెడన, ముదినేపల్లిలలో పవన్ సభలు అట్టర్ ఫ్లాప్ కావడమే అందుకు నిదర్శనం. టీడీపీతో పొత్తు ప్రజలెవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన బలహీన పడిందన్న వాస్తవాన్ని పవన్ తెలుసుకోవాలి. -
కరువు నేలకు కృష్ణమ్మ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్: కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కే గడియ రానే వచ్చింది. 2015లోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అంకురార్పణ జరగ్గా, దాదాపు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ కల సాకారం కానుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నార్లాపూర్ పంపుహౌస్, కృష్ణాతీరంలోని హెడ్‌రెగ్యులేటరీ ఇన్‌టేక్ వద్ద, కొల్లాపూర్ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొల్లాపూర్‌కు రోడ్డు మార్గంలో వస్తారు. మొదటగా నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పంప్‌హౌస్‌లోని కంట్రోల్ రూం వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరిస్తారు. పంపుహౌస్‌లోని నాలుగో అంతస్తులో మొదటి మోటారు స్విచ్ ఆన్‌చేసి నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 1.7 కి.మీ దూరంలో ఉన్న హెడ్ రెగ్యులేటరీ వద్దకు చేరుకొని కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం కొల్లాపూర్ పట్టణ శివారులోని సింగోటం చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కొల్లాపూర్‌లో సీఎం సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి వేర్వేరుగా పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని, శుక్రవారం రాత్రి వరకు ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.అంతకుముందు మంత్రి నిరంజన్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను పరిశీలించారు. స్విచ్ బోర్డుల పనితీరు గురించి నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి మంత్రికి వివరించారు. మహా బాహుబలి మోటార్లు ♦ పాలమూరు ఎత్తిపోతల్లో మొత్తం 34 మోటార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇంత సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ప్రథమం. ఈ మోటార్లను మహా బాహుబలి పంప్‌లుగా పిలుస్తున్నారు. ♦ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ సర్జిపూల్‌ను భూ ఉపరితలం నుంచి 145 మీటర్ల లోతులో నిర్మించారు. 90 మీటర్ల ఎత్తు, 357 మీటర్ల పొడవు, 31 మీటర్ల వెడల్పుతో దీని డిజైన్ రూపొందించారు. ♦పాలమూరు ఎత్తిపోతల్లో విద్యుత్ సబ్స్టేషన్లను భూ ఉపరితలంపైనే నిర్మించారు. పంపులు, విద్యుత్ వ్యవస్థతోపాటు అన్నింటా మానవరహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కాడా (సాంకేతిక వ్యవస్థ) వినియోగిస్తున్నారు. 550 టన్నుల బరువు ఉండే పంప్ నడుస్తున్నప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ మేరకు చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మోటారుకు 20 భారీ ఏసీలు అమర్చారు. -
రిజర్వాయర్ల నీళ్లు.. పూడిక పాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో.. శ్రీశైలం లైవ్ స్టోరేజీ (వాడుకోదగిన నీళ్లు) సామర్థ్యం 253.058 టీఎంసీల నుంచి 188.71 టీఎంసీలకు.. నాగార్జునసాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీల నుంచి 189.295 టీఎంసీలకు పడిపోయింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వేలలో ఈ అంశం వెల్లడైంది. జలాశయాల్లో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల డేటా ఆధారంగా పరిశీలించి, విశ్లేషించడం పూడిక పరిస్థితిపై నివేదికను సిద్ధం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాలు తాగు, సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 13.182 టీఎంసీలు తగ్గిన సాగర్ సామర్థ్యం నాగార్జునసాగర్ డ్యామ్‌ను 1956–1968 మధ్య నిర్మించారు. అప్పట్లో జలాశయం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీలుకాగా, 1999లో నిర్వహించిన శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సర్వేలో సామర్థ్యం 195.806 టీఎంసీలకు తగ్గిపోయిందని తేలింది. 2001, 2009లలో నిర్వహించిన రిజర్వాయర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేలలో మాత్రం సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం వరుసగా 217.47 టీఎంసీలు, 213.388 టీఎంసీలని తేలింది. తాజాగా శాటిలైట్ డేటాను విశ్లేషించగా.. 2020 నాటికి సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 189.295 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1968–2020 మధ్య 52 ఏళ్లలో 13.182 టీఎంసీల ( 6.511శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. సగటున ఏటా 0.125 శాతం నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతోంది. శ్రీశైలానికి 64.339 టీఎంసీల నష్టం కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయాన్ని 1981లో నిర్మించగా.. 1984 నుంచి నీళ్లను నిల్వ చేస్తున్నారు. 253.058 టీఎంసీల లైవ్ స్టోరేజీ, 55 టీఎంసీల డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) కలిపి మొత్తం 308.06 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. తాజా అధ్యయనంలో శ్రీశైలం లైవ్ స్టోరేజీ 188.71 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1984–2021 మధ్య 37 ఏళ్లలో శ్రీశైలం ఏకంగా 64.339 టీఎంసీల (25.425శాతం)సామర్థ్యాన్ని నష్టపోయిందని, ప్రాజెక్టు ఏటా 0.687 శాతం లైవ్ స్టోరేజీని కోల్పోతోందని వెల్లడైంది. ఇంతకుముందు 1990, 1999లలో నిర్వహించిన రిమోట్ సెన్సింగ్ సర్వేల్లో శ్రీశైలం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 194.437 టీఎంసీలు, 181.95 టీఎంసీలకు తగ్గిపోయినట్టు గుర్తించారు. తాజా సర్వేతో పోల్చితే 1990, 1999 నాటి సర్వేలు ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొన్నా.. అప్పట్లో వాటర్ స్ప్రెడ్ ఏరియాను సరిగ్గా అంచనా వేయక కచ్చితమైన ఫలితం రాలేదని తాజా సర్వేలో సీడబ్ల్యూసీ పేర్కొంది. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని అని.. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. ఈ మేరకు తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. ♦ అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకునేందుకు పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా చెట్లను పెంచాలి. ♦ నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ♦ నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. ♦ వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. ♦ రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. -
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్‌ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్‌బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్‌లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి మద్రాస్‌లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్‌ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్‌తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్‌ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్‌కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్‌లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్‌ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్‌లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్‌లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణాబోర్డు ఆదేశించింది. బోర్డు జారీ చేసే నీటి కేటాయింపుల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు లేఖ రాసింది. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇంకా ఎలాంటి ఇండెంట్ ఇవ్వలేదని గుర్తు చేసింది. సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న నేపథ్యంలో, వార్షిక సగటు వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిగా నిండకపోవచ్చని, ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించాల్సిన అవసరముందని చెప్పింది. కృష్ణా బోర్డుకు సంబంధం లేదు సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరపాలని కృష్ణాబోర్డు కోరడం పట్ల తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాగర్‌కు నీటి విడుదల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించాలని ప్రణాళిక సంఘం అనుమతిచ్చిందని, శ్రీశైలం నిండిన తర్వాతే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో కృష్ణాబోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, జలవిద్యుదుత్పత్తి బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ త్వరలో కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. జల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఉండడంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ భారీ పెరిగింది. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు లోటును పూడ్చుకోవడానికి మాత్రమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ కొరత నెలకొన్న సమయంలో జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. -
ప్రకాశం బ్యారేజీకి జలకళ.. పోటెత్తిన జనం (ఫొటోలు)
-
కృష్ణాలో తగ్గిన వరద
సాక్షి, అమరావతి: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 82,055 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 846.7 అడుగులకు పెరిగింది. నీటినిల్వ 73.23 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. పూర్తినిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధానపాయపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలుగా మారిన నేపథ్యంలో.. ఇకపై కురిసే వర్షాల వల్ల ఆ డ్యామ్‌లలోకి వచ్చే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సిందే. ఈ నేపథ్యంలో శ్రీశైలంతోపాటు, నాగార్జునసాగర్ కూడా ఆగస్టులో నిండుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి మూసీ నుంచి 11,755 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 32 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 13 టీఎంసీలు అవసరం. మున్నేరు, కట్టలేరు, బుడమేరు తదితర వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 48,696 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో గేట్లద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 46.715 టీఎంసీల కృష్ణా మిగులు జలాలు కడలిలో కలిశాయి. ఇవన్నీ మున్నేరు, కట్టలేరు వరద జలాలే కావడం గమనార్హం. ఇక పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం ఏర్పడటంతో.. కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద మరింత తగ్గింది. ఆల్మట్టిలోకి 1.16 లక్షలు, నారాయణపూర్‌లోకి 60 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లను మూసేశారు. ఆ రెండు డ్యామ్‌లలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తూ దిగువకు 55 వేల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాలలోకి వరద ప్రవాహం 63,563 క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను మూసేసి.. విద్యుదుత్పత్తి చేస్తూ 41,252 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం మరింతగా తగ్గనుంది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోను వరద తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 42,376 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.36 టీఎంసీలకు చేరుకుంది. ఈ డ్యామ్ నిండాలంటే ఇంకా 33 టీఎంసీలు అవసరం. -
తగ్గుతున్న వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలోని గోదావరి నదిపై ఉన్నశ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసేశారు. గోదావరి వరద ప్రవాహం ఎల్లంపల్లి, కాళేశ్వరం వద్ద తగ్గింది. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో.. ఆదివారం రాత్రి నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు 15,69,011 క్యూసెక్కులు వస్తుండటంతో అక్కడ నీటి మట్టం 55.6 అడుగులకు చేరుకుంది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,80,862 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7,100 క్యూసెక్కులను వదులుతూ మిగులు జలాలను 175 గేట్ల ద్వారా అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లో నీటి మట్టం 15 అడుగుల వద్ద స్థిరంగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.51 లక్షల క్యూసెక్కులు పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, తుంగభద్రలలో వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వరద ప్రవాహం తగ్గింది. ఇక తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ 69.23 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,48,875, సుంకేశుల నుంచి 2,181 వెరసి 1,51,056 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో నీటి నిల్వ 837.9 అడుగుల్లో 58.81 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 157 టీఎంసీలు అవసరం. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద ప్రవాహం తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 15 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. మున్నేరు, కట్టలేరు, బుడమేరులలో వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,06,370 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను 60 గేట్లు రెండు అడుగులు, పది గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సంగమేశ్వరుడిని చుట్టేస్తున్న కృష్ణమ్మ కొత్తపల్లి (నంద్యాల): శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వరాలయాన్ని కృష్ణాజలాలు చుట్టేస్తున్నాయి. ఆలయం జలాధివాసానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ దంపతులు శనివారం ఆలయంలోని వేపదారు శివలింగానికి కుంకుమార్చన, పుష్పార్చన, నదిజలాలతో అభిషేకం, మంగళహారతి వంటి విశేషపూజలు చేశారు. గంటగంటకు నీరు పెరుగుతుండటంతో శనివారం రాత్రి 9 గంటల సమయానికి గర్భాలయంలోకి నీరుచేరుతుందని పురోహితులు తెలిపారు.