బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి | mp vijayasai reddy comments chandrababu illegal house on krishna karakatta | Sakshi
Sakshi News home page

బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి

Published Mon, Sep 16 2024 10:14 AM | Last Updated on Mon, Sep 16 2024 11:36 AM

mp vijayasai reddy comments chandrababu illegal house on krishna karakatta

ఢిల్లీ/గుంటూరు, సాక్షి: కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారాయన.

‘‘ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. లేదంటే కృష్ణ, గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిపాస్తులకు తీవ్ర ప్రమాదం.  సీఆర్‌జెడ్ నిబంధనలు అమలు చేయడంలో శాసన వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యాయి. న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకొని లక్షలాదిమంది ప్రజలను, వారి ఆస్తులను రక్షించాలి’’ అని అన్నారు.

చదవండి: కరకట్ట నివాసంపై లింగమనేని మాట ఇది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement