Illegal housing
-
బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి
ఢిల్లీ/గుంటూరు, సాక్షి: కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్ వేదికగా మండిపడ్డారాయన.‘‘ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. లేదంటే కృష్ణ, గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిపాస్తులకు తీవ్ర ప్రమాదం. సీఆర్‌జెడ్ నిబంధనలు అమలు చేయడంలో శాసన వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యాయి. న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకొని లక్షలాదిమంది ప్రజలను, వారి ఆస్తులను రక్షించాలి’’ అని అన్నారు.CM of AP Sri N. Chandrababu Naidu @ncbn is officially residing in an illegally constructed house located on the embankment of the Krishna River violating environmental & construction regulations (CRZ) as it is considered an ecologically sensitive zone. All these illegal… pic.twitter.com/IvnmQ58137— Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2024చదవండి: కరకట్ట నివాసంపై లింగమనేని మాట ఇది -
కొందరికే అను‘గృహం’
– జిల్లాకు 11,216 ఇళ్లు మంజూరు – స్థలం ఉన్న వారికే అవకాశం – తాడిపత్రిలో జీ ప్లస్ 2 నమూనాతో సముదాయం – ఏపీటీఐడీసీఎల్కు బాధ్యతలు సొంతింటి కల కొందరికి మాత్రమే సాకారం కానుంది. ఇంటి స్థలాలు లేని వారికి కూడా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడు స్థలమున్న వారికి మాత్రమే అవకాశం ఇస్తోంది. తాడిపత్రి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్ని చోట్ల స్థలం ఉన్న వారు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పట్టణాలకు ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఒక నగర పాలక సంస్థ, ఆరు మునిసిపాలిటీలకు కలిపి 11,216 ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణాలకు లబ్ధిదారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే పురపాలక అధికారులు దరఖాస్తులు స్వీకరించి.. గృహ నిర్మాణశాఖకు ప్రతిపాదించారు. జన్మభూమి గ్రామసభల్లో అందిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి స్థలం ఉన్న వారు.. లేని వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. 11,216 ఇళ్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సముదాయ విధానంగా తాడిపత్రి మునిసిపాలిటీలో 3,009 ఇళ్లకు అనుమతి లభించింది. ఇందుకోసం తాడిపత్రి శివారులో స్థలాన్ని సేకరించారు. ఇక్కడ జీ ప్లస్ 2 సముదాయంగా ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీఐడీసీఎల్) ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లో స్థలమున్న వారికే ఇళ్లు మంజూరు చేశారు. అనంతపురం నగర పాలక సంస్థలో 2 వేలు, హిందూపురం 500, గుంతకల్లు 2 వేలు, ధర్మవరం 1,400, కదిరి వెయ్యి, రాయదుర్గంలో 1,307 ఇళ్లు మంజూరయ్యాయి. యూనిట్ వ్యయంలో కోత ఇంటి నిర్మాణం (400 అడుగులు) కోసం రూ. 4.80 లక్షలతో అధికారులు మొదట ప్రతిపాదించారు. ఇందులో రూ.1.50 లక్షలు మాత్రమే కేంద్రం భరిస్తుంది. రూ.80 వేలు రాష్ట్ర ప్రభుత్వం, రూ.50 వేలు లబ్ధిదారుడి వాటా కాగా.. మిగిలిన రూ.2 లక్షలు బ్యాంకు రుణం కింద ఇవ్వాలన్నది ప్రతిపాదన. అయితే.. తాజాగా మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి ఒక యూనిట్‌కుS (323 అడుగులు) రూ.3.50 లక్షలు మాత్రమే ఇవ్వనున్నారు. కేంద్రం వాటాలో ఎలాంటి మార్పూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుంది. లబ్ధిదారుడి వాటా రూ.25 వేలు ఉంటుంది. బ్యాంకు రుణం రూ.75 వేలు అందనుంది. ణం సాధ్యమేనా? బ్యాంకు రుణం పొందే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కొన్ని పథకాలను బ్యాంక్ రుణంతో ముడిపెట్టడంతో ఆశించిన ప్రగతి కన్పించలేదు. లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే.. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ కోన శశిధర్ బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. జాబితా తుదిరూపు దాల్చాక ఎంత మందికి ఏయే బ్యాంకుల ద్వారా రుణాలు అందివ్వాలో తేల్చనున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభం అయ్యాక విడతల వారీగా బిల్లులు చెల్లిస్తారు. రూఫ్ లెవల్‌కు రూ.లక్ష, రూఫ్ క్యాస్ట్ వరకు పూర్తయితే మరో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ.50 వేలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితాను హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఉంచి నిర్మాణం ప్రారంభం నుంచి ఆన్లైన్లోనే బిల్లులు మంజూరు చేస్తారు. స్థలం లేని వారికి రెండో విడతలో మంజూరు : – ప్రసాద్, హౌసింగ్ పీడీ ఇంటి స్థలం ఉన్న వారు, లేని వారి జాబితాను వేర్వేరు చేస్తున్నాం. ప్రస్తుతానికి కొన్ని చోట్ల స్థల సమస్య ఉంది. డిమాండ్ సర్వే చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మొదటి విడతగా మంజూరైన వాటిని ఆగస్టు 15న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటి స్థలం లేని వారికి రెండో విడతలో మంజూరవుతాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. -
అ‘క్రమబద్ధీకరణ’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :ప్రభుత్వం చేపట్టిన సర్కారు స్థలాల క్రమబద్ధీకరణ భూ కబ్జాదారుల పాలిట వరంగా మారింది. రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టి రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది ఈ అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ స్థలాలను దొడ్డిదారిన భూ ఆక్రమణదారులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇలా మంచిర్యాలకు సమీపంలో ఉన్న ముల్కల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రికి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భూ ఆక్రమణదారులపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే కోర్టు వివాదాల్లో ఉన్న భూములను సైతం గుట్టుగా క్రమబద్ధీకరించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. మంచిర్యాల నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో గతంలో ఏకంగా ఓ అపార్టుమెంట్ నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై కేసు హైకోర్టులో ఉంది. ఈ అపార్టుమెంట్‌ను కూడా అధికారులు క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం న్యాయస్థానం పరిధిలో ఉన్న భూములను క్రమబద్ధీకరించడం వీలు లేదు. అలాగే చెరువు శిఖం, నాలా, దేవాదాయ, మున్సిపల్, భూదాన్ స్థలాలను క్రమబద్ధీకరించడం కుదరదు. కానీ నిర్మల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, భైంసా తదితర పట్టణాల్లో చెరువు శిఖం స్థలాల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారు. పాత తేదీల్లో గ్రామ పంచాయతీ రశీదులు.. ఉచిత క్రమబద్ధీకరణ జీవో నెం.58 కింద జిల్లా వ్యాప్తంగా 25,452 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జీవో 59 కింద సుమారు 1,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. 125 గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 4 నుంచి విచారణ చేపట్టారు. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నివాస స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. అయితే.. కొందరు అక్రమార్కులు పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కై ఇటీవల నిర్మాణాలు చేపట్టి వాటికి 2014 జూన్ కంటే ముందే నిర్మించినట్లు పాత తేదీల్లో రశీదులు సృష్టించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, భూ ఆక్రమణదారులు, చోటామోటా నేతలు కలిసి ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేసేందుకు చాలా చోట్ల ఈ క్రమబద్ధీకరణను ఆసరాగా చేసుకున్నారు. ఇలా క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు పకడ్బందీ విచారణ చేపట్టని పక్షంలో రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అధికారికంగానే భూ ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి.