ఆ ఎఫ్ఐఆర్‌ బాబు సర్కార్‌ చౌకబారు ఎత్తుగడ.. విజయసాయి ట్వీట్‌ | Ysrcp Mp Vijayasai Reddy Tweet Chandrababu And Kv Rao | Sakshi
Sakshi News home page

ఆ ఎఫ్ఐఆర్‌ బాబు సర్కార్‌ చౌకబారు ఎత్తుగడ.. విజయసాయి ట్వీట్‌

Published Wed, Dec 4 2024 8:08 PM | Last Updated on Wed, Dec 4 2024 8:31 PM

Ysrcp Mp Vijayasai Reddy Tweet Chandrababu And Kv Rao

సాక్షి, ఢిల్లీ: కులవాది కేవీ రావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్‌ చంద్రబాబు సర్కార్‌ చౌకబారు ఎత్తుగడ అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వెన్నుపోటుదారుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం. అబద్ధాలు చెప్పేందుకు కేవీ రావు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఎందుకు వేచి చూశారు?. నేను కాల్ చేశానని, బెదిరించానని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా?’’ అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.

‘‘వాల్యుయేషన్ ఎప్పుడు చర్చలకు లోబడే ఉంటుంది?. నాకు ఆ రెండు సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థల భాగస్వాములెవరో  నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదు. కేవీ రావు చంద్రబాబు రాజకీయ తొత్తు. 1997లో ఏడిబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబు, కేవీ రావు ఇద్దరు కులవాదులే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు..
చంద్రబాబు నియంతృత్వ ధోరణితో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు. ‘‘దక్షిణ భారత కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు తయారయ్యారు. చంద్రబాబు విధానాలకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల కార్యకర్తల జీవితాలను, స్వేచ్ఛను ప్రమాదంలో పెట్టారు. ఏపీ పోలీసులు వాగ్నర్ గ్రూప్ తరహాలో ప్రైవేటు సైన్యంలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఏపీ పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప టీడీపీ రాజ్యాంగం ప్రకారం కాదు.

..చంద్రబాబు ప్రభుత్వం అణిచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన చేస్తున్న రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సంబరాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు తమ జీవితాలను భయం భయంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా అణిచివేశారు. జీవించే హక్కును అధికార పార్టీ దయదాక్షిణ్యల పైన ఆధారపడేలా చేశారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement