KV Rao
-
రాజకీయ దురుద్దేశాలతోనే కేవీ రావు తప్పుడు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) రాజకీయ దురుద్దేశాలతోనే తనపై సీఐడీకి ఫిర్యాదు చేశారని వైవీ విక్రాంత్‌రెడ్డి హైకోర్టుకి నివేదించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణను తోసిపుచ్చుతున్నట్టు విక్రాంత్‌రెడ్డి తెలిపారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీయాలన్న అజెండాతోనే కేవీ రావు నాపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా అనుచిత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు. నాపై చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారం చూపలేదు. తద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో నిర్ణయం వెలువరించేందుకు అత్యావశ్యకమైన పలు కీలక విషయాలను ఆయన తొక్కిపెట్టారు. వాటాల బదిలీ జరిగిన నాలుగేళ్ల తరువాత సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఆయన ఎక్కడా చెప్పలేదు. వాటాల బదిలీ ప్రక్రియలో, మూల్యాంకనంలో, ఒప్పందాల తయారీలో కేవీ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంతో నాకున్న రాజకీయ సంబంధాల దృష్ట్యా నా ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ దురుద్దేశాలతో ఆయన ఫిర్యాదు చేశారు. కేవీ రావు తన స్వీయ చర్యల నుంచి దృష్టిని మరల్చేందుకే, తన తప్పులను కప్పించుకునేందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తను బాధితుడినంటూ చెప్పుకుంటున్న కేవీరావు అందుకు ప్రాథమిక ఆధారాలను చూపడంలో విఫలమయ్యారు. న్యాయ సలహాదారులు, ఆడిటర్ల సమక్షంలోనే వాటాల బదిలీ జరిగింది’ అని విక్రాంత్‌రెడ్డి వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయదలచుకుంటే చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేయడంతో విక్రాంత్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ సోమవారం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
ప్రశ్నిస్తే పనిపడతా!
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు ఇప్పుడు పార్టీలోని ఇద్దరు బీసీ నేతల మధ్చ చిచ్చు పెట్టారు. సుదీర్ఘ కాలం నుంచి తనకు బలమైన మద్ధతుదారుగా ఉన్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను జీర్ణించుకోలేక ప్రశ్నించడంతో ఆయనపైకి మరో సీనియర్ నేత, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను ఉసిగొల్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియా కూడా యనమలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయి ఆరోపణలతో ట్రోల్ చేస్తోంది. దీనికంతటికీ కాకినాడ పోర్టు వ్యవహారంలో చంద్రబాబు వైఖరికి విరుద్ధంగా యనమల రామకృష్ణుడు ఆయనకు లేఖ రాయడమే కారణం. కాకినాడ పోర్టుకు చెందిన కేవీ రావు చౌదరికి చంద్రబాబు మద్దతు పలుకుతూ రాజకీయంగా ఆయన్ను పావులా వాడుకుంటున్నారు. కానీ యనమల మాత్రం తాను రాసిన లేఖలో కేవీ రావు చౌదరి కాకినాడ సెజ్ భూముల ద్వారా వేల కోట్ల లబ్ధి పొందారని.. బీసీ, మత్స్యకార రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తనను ధిక్కరిస్తూ లేఖ రాయడంతో చంద్రబాబు.. యనమలను ప్రశ్నించకుండా ఇతర బీసీ నేతలను ఆయనపైకి ప్రయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రెడ్డి సుబ్రహ్మణ్యం బహిరంగంగా యనమల రామకృష్ణుడిపై ఆరోపణలు గుప్పించారు. 40 ఏళ్లుగా యనమల బీసీల గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు తనకు పదవి ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు తోడుగా మరికొందరు కింది స్థాయి నేతలు కూడా యనమలపై విమర్శలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా అయితే యనమల పార్టీలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయి ఆడేసుకుంటోంది. చంద్రబాబుకు తెలియకుండానే తిడతారా?పార్టీలో తన స్థాయి ఉన్న ఒక సీనియర్ బీసీ నాయకుడిని, మరో సీనియర్ బీసీ నాయకుడు బహిరంగంగా తిట్టారంటే అందుకు చంద్రబాబు పరోక్ష అనుమతి కచ్చితంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యనమలకు వ్యతిరేకంగా పార్టీలోనే ఇంత జరుగుతున్నా, చంద్రబాబు స్పందించక పోవడాన్ని బట్టి ఆయన అభిమతం ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కొందరు బీసీ నేతలు యనమలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ఆది నుంచి తోడు, నీడగా ఉన్న నాయకుడిని ఇలా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పార్టీలోనే బీసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడినా, చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనలాంటి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికితోడు కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో కేవీ రావు చౌదరికి అనుకూలంగా వ్యవహరించడం, రాజ్యసభ స్థానాలను లాబీయిస్టులకు కట్టబెడుతుండడంతో తట్టుకోలేక ఆయన తొలిసారిగా చంద్రబాబును ధిక్కరించి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం నుంచి చంద్రబాబుతో కలిసి పని చేసిన యనమల లాంటి నాయకుడు తిరుగుబాటు స్వరం వినిపించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. -
సెజ్ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్: ప్రత్యేక ఆర్థిక ప్రాంతం (సెజ్)కు తీసుకున్న భూములను రైతులకు తిరిగిచ్చిన చరిత్ర దేశంలో గత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందని కాకినాడ సెజ్ రైతులు కొనియాడారు. ప్రతిపక్షంలో ఉండగా భూములు తిరిగి ఇచ్చేస్తానని సెజ్ భూముల్లో ఏరువాక చేసిన చంద్రబాబు తీరా గద్దె నెక్కాక అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు లాగేసుకున్నారని మండిపడ్డారు. పోలీసు కేసులు, జైలు జీవితం, నిత్యం నిర్బంధాల మధ్య తమ కుటుంబాలను అనుక్షణం వేదనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆ భూములను కాకినాడ సెజ్ ప్రధాన ప్రమోటర్ కేవీ రావు, జీఎంఆర్‌లకు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టారని దుమ్మెత్తిపోశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తమ పీకలమీద కత్తిపెట్టి ఎకరం రూ.5 లక్షలు, రూ.9 లక్షలకే కొట్టేస్తే.. ఇచ్చిన మాట కోసం జగన్ ఆ భూములు తమకు తిరిగి ఇచ్చేసి దేవుడయ్యారని కొనియాడారు. జగన్ తిరిగిచ్చిన భూముల విలువ ఇప్పుడు ఎకరం రూ.రెండు కోట్ల నుంచి రూ.ఐదు కోట్లు ఉందన్నారు. అలాంటి జగన్‌ను దోషిగా చూపించేందుకు చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా కుట్రలు చేస్తున్నాయని, ఈనాడు పత్రిక అసత్యాలు వండివారుస్తోందని ధ్వజమెత్తారు. శనివారం కాకినాడలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతలతో కలిసి రైతులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాటమార్చారు.. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకోమాట.. ఇదీ చంద్రబాబు తీరు. మా భూములు వెనక్కి ఇవ్వకుండా ఆయన మాట మార్చారు. తర్వాత మా ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్ మా బాధలను తెలుసుకుని అధికారంలోకి వచ్చాక కమిటీ వేసి భూములు వెనక్కి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులు కోరుకున్న ఆరు గ్రామాలను వదిలేయడంతోపాటు డబ్బు తీసుకోని రైతుల భూములను కూడా వదిలివేశారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆయన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భూములపై ఈనాడు తప్పుడు రాతలు రాయడం అన్యాయం. – బావిశెట్టి నారాయణస్వామి, సెజ్ బాధిత రైతు నాయకుడు, రావివారిపోడు, యు.కొత్తపల్లి మండలం వైఎస్ జగన్ పెట్టిన భిక్ష మాకు ఎకరం భూమి ఉంది. వైఎస్ జగన్ మాకు పెట్టిన భిక్ష ఇది. ఈ రోజు ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. కన్నబాబు, వంగా గీత, దాడిశెట్టి రాజా రైతులకు అండగా నిలిచారు. వారికి రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2,180 ఎకరాలు వెనక్కి ఇచ్చారు. – మేడిబోయిన కృష్ణ, రమణక్కపేట, కొత్తపల్లి మండలం కేవీ రావుపై కేసు పెట్టాలి.. పరిశ్రమలు పెడతామంటూ మా భూములపైనే రుణాలు తీసుకుని మా భూములనే కేవీ రావు అనే వ్యక్తి కొన్నారు. మా భూములు కొన్నాక ఎకరాకు రూ.6 లక్షలు చొప్పున బ్యాంకులో లోను తీసుకుని రూ.3 లక్షలు మాత్రమే రైతుకు ఇచ్చారు. మిగతా రూ.3 లక్షలు కేవీ రావు తన వద్దే ఉంచుకున్నారు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ 8,500 ఎకరాలపై రుణాలు తీసుకున్నాడు.. ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు.. సెజ్‌ను జీఎంఆర్‌కు అప్పగించారు. అలాంటి కేవీ రావుపై కేసు పెట్టి, లుక్ అవుట్ నోటీసు ఇవ్వాలి. జీఎంఆర్ కూడా పరిశ్రమలు పెట్టకుండా మా భూములపై రూ.2500 కోట్లు అప్పు తెచ్చుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మా ప్రాంత రైతుల జీవితాలను నాశనం చేశారు. – వై.ప్రసాదరెడ్డి, సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నాగులాపల్లి, కొత్తపల్లి మండలం రైతులకు న్యాయం చేశారు.. సెజ్ రైతులకు, మా గ్రామాలన్నింటికీ వైఎస్ జగన్ న్యాయం చేశారు. పాదయాత్రలో సెజ్ రైతుల బాధలు తెలుసుకుని పిఠాపురం సభలో రైతులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నెరవేర్చారు. ఆయన దయ వల్ల లక్షలు విలువ గల భూములు మాకు దక్కాయి. – బోనం రాముడు, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి, రావివారిపోడు జగన్ లేకపోతే ఆత్మహత్యలే.. మా భూములు వెనక్కి తిరిగి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేం. ఆయనే లేకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. ఈనాడు పేపర్లో తప్పుడు రాతలు రాయడం సరికాదు. – చింతపల్లి బుచ్చియ్య, సెజ్ రైతు, నాగులాపల్లి జగన్ వల్లే మా కుటుంబాల్లో వెలుగులు మా కుటుంబాలకు గత సీఎం వైఎస్ జగన్ వెలుగునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భూములను ఇచ్చారు. వాటిని ఎవరికైనా అమ్ముకునే హక్కును కూడా కల్పించారు. చిత్రమేమిటంటే కాకినాడ సెజ్‌లో రైతులు, ఎస్సీలు, బీసీలు చాలా నష్టపోయారని ముఖ్యమంత్రికి యనమల రామకృష్ణుడు లెటర్ రాశారంట.. అసలు ఎవరి వల్ల నష్టపోయారు? పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబుతో ఏరువాక సాగించి ఎందుకు ఆదుకోలేదు? సీబీఐ విచారణ చేయమని తాము కోరితే రూ.2 లక్షలు అదనంగా ఇచ్చి కొత్త చట్టం ప్రకారం పరిహారం ముట్టిందని రైతులకు అన్యాయం చేయలేదా? ఆరోజు ఆర్థిక మంత్రిగా యనమల సమావేశాలు పెట్టి భూములు ఖాళీ చేయించి సెజ్‌కు అప్పగించారు. ఈరోజు మా భూములు మేము అమ్ముకుంటే అభాండాలు వేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి ఎవరూ భూములు కొనుగోలు చేయలేదు. – చింతా సూర్యనారాయణమూర్తి, కాకినాడ సెజ్ పోరాట కమిటీ కన్వినర్, మూలపేట, కొత్తపల్లి మండలం జగన్ వల్లే మా కుటుంబానికి రూ.4 కోట్లు కాకినాడ సెజ్‌కు వేల ఎకరాలు అవసరమా అన్న చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే సెజ్‌ను రద్దు చేస్తానన్నారు. రైతుల భూములు తిరిగి ఇచ్చివేస్తానని నమ్మించారు. తర్వాత అధికారంలోకి వచ్చి మాటతప్పారు. సెజ్‌లో పోయిన 8 ఎకరాలు వైఎస్ జగన్ వల్ల మాకు తిరిగొచ్చాయి. తద్వారా మా కుటుంబానికి రూ.4 కోట్లు కలిసి వచ్చింది. – కృష్ణారెడ్డి, సెజ్ బాధిత రైతు, నాగులాపల్లి చాలా మంచి జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వం మా నాన్న సుబ్బారెడ్డిని 200 రోజులు జైలులో పెట్టి వేధించింది. దీంతో ఆయన చనిపోయారు. జగన్ ప్రభుత్వం వచ్చాక నాలుగు ఎకరాల మా భూమికి ప్రత్యామ్నాయంగా సాగర్మాల రోడ్డు పక్కన ఇచ్చారు. ఎకరా రూ.2 కోట్లు ధర పలుకుతోంది. మాకు చాలా మంచి జరిగింది. ఈనాడులో నేను అనని మాటలను అన్నట్టుగా రాశారు. – సత్యానందరెడ్డి, సెజ్ రైతు, రమణక్కపేట ఈనాడు రాతలు పచ్చి అబద్ధాలు.. జగన్ ప్రభుత్వంలో భూములను లాక్కున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలను రాసింది. వైఎస్ జగన్ చేసిన మేలుకు రైతులు ఆయనకు పాలాభిõÙకం చేయాలి. కేవీ రావు, జీఎంఆర్ ప్రజాభిప్రాయ సేకరణకు రైతులను రానివ్వలేదు. అరబిందో మాత్రం రైతుల అభిప్రాయాలు సేకరించడమే కాకుండా దాదాపు రూ.4 వేల కోట్లతో ఇన్సులిన్ తయారు చేసే పరిశ్రమను పెట్టి రైతుల్లో నమ్మకం కలిగించింది. – పి.ధర్మరాజు, సెజ్ రైతు, పొన్నాడ, కొత్తపల్లి మండలం -
చంద్రబాబు, కేవీ రావు పై విజయ సాయి రెడ్డి ఆగ్రహం
-
చంద్రబాబు, కేవీ రావుపై హైకోర్టులో పరువునష్టం దావా వేస్తా
-
కేవీ రావు, చంద్రబాబు కలిసి కుట్రలు పన్నుతున్నారు: Vijay Sai Reddy
-
కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు.. వైఎస్ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌తో సహా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలి’’ అని విజయసాయి డిమాండ్ చేశారు.‘‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. కేవీరావుకు అన్యాయం జరిగిఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా?. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా?. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి?. కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. -
భేతాళ కథ.. అంతా బాబు కుట్ర!
ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు కుట్ర బట్టబయలైంది! తన పార్ట్నర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కాకినాడలో చేయించిన బియ్యం హైడ్రామా వెనుక పన్నాగం బయటపడింది. ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం అంతా చంద్రబాబు కుట్ర సినిమా టీజర్ అన్నది స్పష్టమైంది. సీఐడీ అక్రమ కేసులతో బెదిరించి కాకినాడ డీప్ వాటర్పోర్ట్లో వాటాలను కొల్లగొట్టాలన్నదే అసలు కుట్ర అన్నది నిగ్గు తేలింది. భారీ ఆర్థిక దోపిడీ ధ్యేయంగా చంద్రబాబు అల్లిన భేతాళ కథ వెనుక కుట్ర బట్టబయలైంది. పవన్, నాదెండ్ల ద్వారా వీధి నాటకం... అనంతరం తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు ...సీఐడీ అక్రమ కేసు నమోదు ...ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో పావులు కదిపారన్నది స్పష్టమైంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... టీడీపీ కూటమి పెద్దల దోపిడీతో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో డైవర్షన్ కుట్రను తెరపైకి తెస్తున్న చంద్రబాబు పన్నాగంలోని తాజా అంకమే ఈ అక్రమ కేసు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టడమే ఏకైక అజెండాగా సాగుతున్న పచ్చ నాటకం ఇదిగో ఇలా ఉంది. – సాక్షి, అమరావతిఅంతా బాబు కుట్ర స్క్రిప్టేబియ్యం రాద్ధాంతం డ్రామానేకాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది నెలలుగా కాకినాడలో పర్యటిస్తూ చంద్రబాబు పన్నాగానికి రంగం సిద్ధం చేశారు. ఇక కుట్రను వేగవంతం చేయాలని నిర్ణయించిన తరువాత చంద్రబాబు ఇందుకు పవన్ కళ్యాణ్‌ను పైలట్‌గా వాడుకున్నారు. ఆయన డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. అసలు విషయం ఏమిటంటే... బియ్యం ఎగుమతి చేసే యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి కదా! దీన్ని విస్మరిస్తూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం గమనార్హం. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు. అనంతరం ఈ నెల 2న (సోమవారం) పవన్ ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమై తాను డ్రామాను ఎలా పండించిందీ వివరించారు. కేవీరావు తప్పుడు ఫిర్యాదు... వెంటనే సీఐడీ అక్రమ కేసుతమ కుట్ర సీన్ పండిందని భావించిన చంద్రబాబు అసలు పాత్రధారిని తెరపైకి తెచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన తాపీగా నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... అదే రోజు సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం. అంతా కట్టు కథ... ఇదీ బాబు కుట్రకేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా కట్టు కథే! పోర్టులో 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు కేవీ రావు 2020లో విక్రయించారు. ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలు విక్రయించబట్టే అరబిందో సంస్థ చెల్లించిన ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. ఆ మొత్తాన్ని మరో సంస్థలో పెట్టుబడిగా పెట్టారు కూడా. కాకినాడ పోర్ట్‌లో వాటాల విక్రయంపై ఆయనకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా ఆ మొత్తాన్ని తిరస్కరించేవారు.అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్సŠచ్ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికి ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలోనూ ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. ఆ వాటాల విక్రయం కోసం మంతనాలు, అనంతరం ఒప్పందం, విక్రయం అంతా హైదరాబాద్ కేంద్రంగా సాగాయి. మరి తెలంగాణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా! హైదరాబాద్‌లో పోలీసులకుగానీ సీఐడీకి గానీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు కుట్రలో కేవీ రావు పాత్రధారన్నది స్పష్టమవుతోంది. అంతర్జాతీయస్థాయి సంస్థపై దుష్ప్రచారంఅరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన గ్రూప్. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. అరబిందో సంస్థ ఏటా రూ.3 వేల కోట్ల నికర లాభం చూపుతోంది. ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించే అరబిందో సంస్థ పూర్తి స్థాయిలో విశ్లేషించిన అనంతరం సహేతుకంగా, చట్టబద్ధంగానే కొత్త సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. అదే రీతిలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో కూడా వ్యూహాత్మక పెట్టుబడిగానే 41 శాతం వాటాలను కొనుగోలు చేసింది. పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన (రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. అది పూర్తిగా ఆ సంస్థ వ్యాపార ప్రణాళిక. అరబిందో, కేవీ రావు మధ్య ప్రైవేట్ ఒప్పందం. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికిగానీ ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.ప్రైవేటు లావాదేవీలకు వక్రభాష్యం... అదే బాబు ప్రభుత్వ పన్నాగంకాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది? పోర్టు విలువపైఅవాస్తవ ప్రచారం కాకినాడ పోర్టు వాటాలను తక్కువగా విలువ కట్టారన్న కేవీ రావు ఫిర్యాదులో నిజం లేదు. వాటాల విక్రయం కోసం దాదాపు ఐదేళ్ల క్రితం అరబిందో సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అప్పటి మార్కెట్ విలువ వేరు. ప్రస్తుతం ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ వేరు. ఆ రెండూ ఒకటే అన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. మరి అదే విధానమైతే... ఈనాడు రామోజీరావు కుటుంబం ఫిల్మ్ సిటీ కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో దాదాపు 2 వేల ఎకరాలు కారుచౌకగా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరిగింది కాబట్టి... ఆనాడు భూములు అమ్మిన రైతులు వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తారా? మరి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవీ రావు, అరబిందో సంస్థ మధ్య జరిగిన ప్రైవేటు లావాదేవీని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం విష ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రే.బెదిరించి ఉంటే ఫ్రీగానే తీసుకునేవారు కదా..!ఏకంగా 51 శాతం వాటా దక్కించుకునేవారు తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందని కేవీ రావు చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేరిట నిజంగా బెదిరించి ఉంటే అరబిందో సంస్థ వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఫ్రీగానే వాటాలను తీసేసుకునేది.ఒకవేళ బెదిరించి కొనుగోలు చేయాలన్నా కేవలం 41 శాతం వాటానే ఎందుకు కొనుగోలు చేస్తుంది ? కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది కదా! 41 శాతం వాటా అంటే పోర్టులో మైనారిటీ భాగస్వామే అవుతుంది. అంటే నిర్ణయాధికారం ఉండదు. కనీసం 51 శాతం వాటా ఉంటేనే నిర్ణయాధికారం ఉంటుంది. కానీ కేవీ రావుకే 59 శాతం వాటా ఉంది. అంటే పోర్టుపై నిర్ణయాధికారం ఇప్పటికీ కేవీరావుకే ఉంది. అందుకే ఆయనే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఎండీగా కొనసాగుతున్నారు. సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. -
ఆ ఎఫ్ఐఆర్ బాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ.. విజయసాయి ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కులవాది కేవీ రావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వెన్నుపోటుదారుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం. అబద్ధాలు చెప్పేందుకు కేవీ రావు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఎందుకు వేచి చూశారు?. నేను కాల్ చేశానని, బెదిరించానని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా?’’ అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.‘‘వాల్యుయేషన్ ఎప్పుడు చర్చలకు లోబడే ఉంటుంది?. నాకు ఆ రెండు సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థల భాగస్వాములెవరో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదు. కేవీ రావు చంద్రబాబు రాజకీయ తొత్తు. 1997లో ఏడిబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబు, కేవీ రావు ఇద్దరు కులవాదులే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.1/2: Who is this liar KV Rao? He is nobody, I haven't met him or seen him. He is a stooge propped up by TDP to file a false case against me. The FIR is a script of some masala Telugu Movie. I will go behind liar KV Rao for malicious prosecution and defamation.Further his money…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు..చంద్రబాబు నియంతృత్వ ధోరణితో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ భారత కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు తయారయ్యారు. చంద్రబాబు విధానాలకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల కార్యకర్తల జీవితాలను, స్వేచ్ఛను ప్రమాదంలో పెట్టారు. ఏపీ పోలీసులు వాగ్నర్ గ్రూప్ తరహాలో ప్రైవేటు సైన్యంలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఏపీ పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప టీడీపీ రాజ్యాంగం ప్రకారం కాదు...చంద్రబాబు ప్రభుత్వం అణిచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన చేస్తున్న రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సంబరాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు తమ జీవితాలను భయం భయంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా అణిచివేశారు. జీవించే హక్కును అధికార పార్టీ దయదాక్షిణ్యల పైన ఆధారపడేలా చేశారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.1/2 : The oppression by AP Govt. under @ncbn of thousands of people shows how scared he is. It shows his cowardice, his insecurity and his inferiority complex. Chandrababu is resorting to political vengence that even he cannot justify. He cannot look at himself in the mirror.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024 -
నవ్వులు పంచే లోకం
‘‘ఇప్పటి వరకూ యమలోకం బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘యమలోకం’ వాటన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. రెండున్నర గంటలసేపు ప్రేక్షకుడు ఈ లోకాన్ని మరపించేలా మా సినిమా ఉంటుంది’’ అంటున్నారు కె.వి. రావు. తమిళ హాస్య నటుడు వడివేలు నటించిన చిత్రం ‘ఇంద్రలోగత్తిల్ నా అళగప్పన్’ చిత్రాన్ని నిర్మాత కె.వి.రావు తెలుగులో ‘యమలోకం’ పేరుతో అనువదిస్తున్నారు. ‘ఇంద్రలోక సుందరవదన’ అనేది ట్యాగ్‌లైన్.ఇందులో యముడు, ఇంద్రుడు, నరుడు మూడు పాత్రల్లో కనిపిస్తారు వడివేలు. కె.విరావు మాట్లాడుతూ – ‘‘ తెలుగు ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగు హక్కులను మేం సొంతం చేసుకున్నాం. మూడు పాత్రల్లో వడివేలు అద్భుతంగా నటించారు. శ్రియ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శహభాష్ మురళి, దర్శకుడు: తంబి రామయ్య. -
డోన్ పాసింజర్ రైలులో దారుణం
సాక్షి, నూజెండ్ల (వినుకొండ): విధి నిర్వహణలో రైల్వే గార్డ్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం గుండ్లకమ్మ రైల్వేస్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. డోన్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న పాసింజర్ రైలు గుండ్లకమ్మ స్టేషనుకు చేరుకునే సమయానికి సిగ్నల్ ఇచ్చారు. అయితే అదే రైలులో విధి నిర్వహణలో ఉన్న సీనియర్ రైల్వేగార్డ్ కె.వెంకటేశ్వరరావు(48) ఎంతసేపటికీ స్పందించ లేదు. అనుమానం వచ్చిన ప్రసాదు స్టేషన్ రైల్వే పాయింట్‌మెన్ ఎస్.రామాంజనేయులును గార్డ్ ఉన్న బోగీను పరిశీలించాలని ఆదేశించారు. పాయింట్ మెన్ వెళ్లి చూడగా రైల్లోని బాత్రూమ్లో రక్తపు మడు గులో గార్డ్ పడి ఉండటాన్ని చూసి స్టేషన్ మాస్టర్‌కు తెలియజేశాడు. వెంటనే స్టేషన్ మాస్టర్ ప్రసాదు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గార్డ్ మృతిపై అనేక అనుమానాలు: గార్డు వెంకటేశ్వరరావు మృతి అనుమానాస్పదంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మృతదేహం నడుము భాగం వరకు బాత్రూములో ఉండగా మిగిలిన భాగం బాత్రూమ్ బయట ఉంది. మృతుడి నోరు, ముక్కు, తల నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఎవరైనా తలపై గాయం చేయడంతో మృతి చెందాడా లేక గుండెపోటుతో మృతి చెందాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గార్డ్ మృతి తో రైలు 4 గంటలపాటు గుండ్లకమ్మ రైల్వేస్టేషన్లో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు ముందుకు కదిలింది. -
బెజవాడ సత్యనారాయణ అరెస్ట్
కాకినాడ: గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల ఘటనలో ఆ సంస్థ చైర్మన్ బెజవాడ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను 4వ అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. బెజవాడ సత్యనారాయణ టీడీపీకి చెందిన నేత. అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సాక్షి టెలివిజన్ చానళ్ తోపాటు ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ దారుణానికి పాల్పడిన కరస్పాండెంట్ కేవీరావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
'కాకినాడ గ్రీన్ ఫీల్డ్' కేవీరావుకు 14 రోజుల రిమాండ్!
కాకినాడ: గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల కరస్పాండెంట్ కేవీరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రిన్సిపల్ శ్రీనివాస్, కేవీరావులను తిమ్మాపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులపై ఐపీసీ సెక్షన్ 324, రెడ్ విత్ 34, సెక్షన్ 23 జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సోమవారం సాక్షి టెలివిజన్ చానళ్ తోపాటు ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ దారుణానికి పాల్పడిన కేవీరావు, శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అంధ విద్యార్థుల్ని చితకబాదిన ప్రిన్సిపాల్
కాకినాడ క్రైం : నెత్తురు, కన్నీళ్ల రంగేమిటో తెలియని చీకటి బతుకులు ఆ చిన్నారులవి. అసలు చీకటి, వెలుతురుల వ్యత్యాసమూ వారికి అంతుపట్టదు. వారు చేయని నేరానికి పుట్టుకతోనే విధి విధించిన క్రూరశిక్ష వారిని కబోదులుగా మిగిల్చింది. అలాంటి వారికి తమ ఆత్మీయపూరితమైన స్పర్శతోనే అన్ని వన్నెలనూ పరిచయం చేయాల్సిన వారే పగవారిలా విరుచుకుపడ్డారు. కనుపాపల్లా కాచుకోవాల్సిన వారే చూపులేని వారిపై తమ ప్రతాపం చూపారు. సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లు చేసిన ఈ క్రౌర్యం ఆలస్యంగా వెలుగు చూసింది. చివరికి వారి దేహశుద్ధికి, అరెస్టుకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. కేవీ రావు అనే వ్యక్తి కరస్పాండెంట్‌గా నడుస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలకు శ్రీనివాస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కూడా అంధులే. వివిధ సంస్థలు, విదేశీయులు ఇచ్చే విరాళాలతో నడిచే ఈ పాఠశాలలో అంధులకు వసతి కల్పిస్తూ, చదువు చెపుతుంటారు. కాజులూరుకు చెందిన 13 ఏళ్ల కూర్తి జాన్సన్ (6వ తరగతి), గుంటూరు జిల్లా శ్రీనగర్‌కు చెందిన 12 ఏళ్ల పాముల సురేంద్రవర్మ (6వ తరగతి), గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన 9 ఏళ్ల పులప సాయి (3వ తరగతి) పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు. అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. అంతటితోనూ శాంతించక ముగ్గురిలో ఒకరిపై ఎక్కి తొక్కారు. ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు సోమవారం చానళ్లలో ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి ఆగ్రహం పట్టలేక కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లకు దేహశుద్ధి చేశారు. కలెక్టర్ నీతూప్రసాద్, డీఈఓ శ్రీనివాసులురెడ్డి పాఠశాల ను సందర్శించారు. తాను అల్లరి చేస్తున్నానని చితకబాదారని సాయి, బ్రెయిలీ లి పి సరిగా నేర్చుకోవడం లేదని కొట్టారని సురేంద్ర, తన స్నేహితుడిని నాలుగు రో జుల క్రితం ప్రిన్సిపాల్ కొట్టడంతో బాధకలిగి అన్నం తినకపోవడంతో తనను హింసించారని జాన్సన్ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ ఫిర్యాదు చేయగా ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లను తిమ్మాపురం పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతను స్కూల్ అసిస్టెంట్ ఆర్.రాజేంద్రకు అప్పగించారు. ఐసీడీఎస్ పీడీ ఎంజే నిర్మల ఆదేశాల మేరకు బాలల సంరక్షణాధికారి వెంకట్రావు బాధిత చిన్నారులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి వైద్యం చేయిస్తున్నారు. పిల్లలు కుదుటపడేవరకు తాము సంరక్షిస్తామని వెంకట్రావు తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలకు సీడబ్ల్యూసీ నోటీసు రంపచోడవరం : అంధబాలలను హింసించిన గ్రీన్‌ఫీల్డ్ ప్రిన్సిపాల్, కరస్పాం డెంట్లకు బాలల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూసీ) నోటీసు జారీ చేసినట్టు బాలల కోర్టు బెంచ్ మేజిస్ట్రేట్లు వై.సత్యశివానంద్, బాలు అక్కిస, పి.రత్నం, జి.మాచ్చారావ్ తెలిపారు. మీడియా వార్తను సుమోటోగా స్వీకరించి, ఈ నెల 26న రాజ మండ్రి బాలల కోర్టులో హాజరు కావాలని ఆదేశించామన్నారు. పాఠశాలపై తీసుకున్న చర్యలను డీఈఓ, వికలాంగ సంక్షేమ శాఖ ఏడీ అదే రోజు తెలపాలని అన్నారు.