
సాక్షి, నూజెండ్ల (వినుకొండ): విధి నిర్వహణలో రైల్వే గార్డ్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం గుండ్లకమ్మ రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. డోన్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న పాసింజర్ రైలు గుండ్లకమ్మ స్టేషనుకు చేరుకునే సమయానికి సిగ్నల్ ఇచ్చారు. అయితే అదే రైలులో విధి నిర్వహణలో ఉన్న సీనియర్ రైల్వేగార్డ్ కె.వెంకటేశ్వరరావు(48) ఎంతసేపటికీ స్పందించ లేదు. అనుమానం వచ్చిన ప్రసాదు స్టేషన్ రైల్వే పాయింట్‌మెన్ ఎస్.రామాంజనేయులును గార్డ్ ఉన్న బోగీను పరిశీలించాలని ఆదేశించారు. పాయింట్ మెన్ వెళ్లి చూడగా రైల్లోని బాత్‌రూమ్‌లో రక్తపు మడు గులో గార్డ్ పడి ఉండటాన్ని చూసి స్టేషన్ మాస్టర్‌కు తెలియజేశాడు. వెంటనే స్టేషన్ మాస్టర్ ప్రసాదు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
గార్డ్ మృతిపై అనేక అనుమానాలు: గార్డు వెంకటేశ్వరరావు మృతి అనుమానాస్పదంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మృతదేహం నడుము భాగం వరకు బాత్‌రూములో ఉండగా మిగిలిన భాగం బాత్‌రూమ్ బయట ఉంది. మృతుడి నోరు, ముక్కు, తల నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఎవరైనా తలపై గాయం చేయడంతో మృతి చెందాడా లేక గుండెపోటుతో మృతి చెందాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గార్డ్ మృతి తో రైలు 4 గంటలపాటు గుండ్లకమ్మ రైల్వేస్టేషన్‌లో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు ముందుకు కదిలింది.
Comments
Please login to add a commentAdd a comment