సాక్షి, తాడేపల్లి: కాకినాడ సీపోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని.. ఏదో జరిగిపోయిందంటూ కట్టు కథలు రాయిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్ధానాలు ఇచ్చారని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తునారు. ఈనాడు మోసపూరిత పత్రిక. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్‌పై కేసు నడుస్తోంది. చంద్రబాబు బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉన్నవాళ్లపై కక్ష సాధిస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
‘‘పవన్ కల్యాణ్ పీడీఎస్ రైస్ పట్టుకుంటానన్నారు.. ఎందుకు పట్టుకోలేదు. పవన్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బినామీ కేవీరావు అని పవన్ మాట్లాడారు. చెప్పింది చేయడం బాబుకు అలవాటు లేదు. బెల్టు షాపు తెస్తే బెల్టు తీస్తానన్నాడు.. గాలికొదిలేశాడు. ఏపీలో దోపిడీ రాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేవీరావును అడ్డుగా పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. దొడ్డిదారిన కేవీరావుకు పోర్టును కట్టబెట్టింది నిజం కాదా?. ఇప్పుడు కేవీరావును అడ్డంపెట్టుకుని డ్రామాలాడుతున్నారు.’’ అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
..రైతాంగ సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెల 11నుంచి 13కి వాయిదా వేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుమల లడ్డూ విషయంలో రద్దాంతం చేసి టీడీపీ అభాసుపాలయింది. ఇప్పుడు కాకినాడ సెజ్ మీద పడ్డారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు బెదిరించి పోర్టుని లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పచ్చమీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటున్నారు
..కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి పోర్టును రాయించుకున్నట్టు ఈనాడు కట్టు కథలు రాసింది. ఈనాడు పత్రిక మోసపూరితంగా పుట్టింది. అవినీతి పుత్రిక ఈనాడు. అలాంటి పత్రికలో సాయిరెడ్డి మీద దారుణమైన వార్తలు రాస్తున్నారు. చంద్రబాబుకు ఆస్తుల సంపాదనపై దాహం తీరలేదు. అందుకే ఇతరుల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నారు. గతంలో కేవీరావు గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ కామెడీ డైలాగు వేశారు
చంద్రబాబు తన అధికారంతోపాటు వేలాది కోట్లను లోకేష్ కి అందించాలని చూస్తున్నారు. ఏపీలో అవినీతికి పాల్పడని టీడీపీ ఎమ్మెల్యేనే లేడు. ప్రతిపనిలోనూ అడ్డంగా దోచుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మీడియా ముందు భీకర మాటలు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగితే సహించనంటూ బడాయి మాటలు మాట్లాడుతున్నారు. కానీ జరిగేదంతా అవినీతి, దోపిడీలే. పయ్యావులకేశవ్ వియ్యంకుడు కాకినాడ పోర్టులో రారైస్ బిజినెస్ చేస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించటానికి మేము సిద్ధం. ఆయన చేసే దోపిడీని కప్పిపుచ్చేందుకు పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనకు చెందిన షిప్‌ని సైలెంట్‌గా వదిలేశారు
..కాకినాడ పీర్టులో అరబిందో షేర్లు చట్టబద్దమైనవి. కానీ పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. గంజాయి మీద ఈగల్ దర్యాప్తు, బియ్యం మీద, తిరుపతి లడ్డూల మీద సిట్‌లు అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అంతకుమించి రాష్ట్రంలో ప్రజాపాలనే జరగటం లేదు. లోకేష్ డబ్బులు లెక్కలేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడపటం కలకాలం జరగదు’’ అని అంబటి రాంబాబు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment