అధికారంలోకి వచ్చాక.. వడ్డీతో సహా చెల్లిస్తాం: కాపు నేతలు | Ysrcp Kapu Leaders Warn The Chandrababu Government | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వచ్చాక.. వడ్డీతో సహా చెల్లిస్తాం: కాపు నేతలు

Feb 7 2026 3:10 PM | Updated on Feb 7 2026 3:33 PM

Ysrcp Kapu Leaders Warn The Chandrababu Government

సాక్షి, గుంటూరు: కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపు సరికాదని కాపు నేతలు అన్నారు. శనివారం.. మాజీ మంత్రి అమర్నాథ్‌, కరణం ధర్మశ్రీ ఆధ్వరంలో 100 కార్లతో అంబటి ఇంటికి తరలివచ్చిన ఉమ్మడి జిల్లా కాపు నేతలు.. అంబటి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులంతా అండగా ఉంటారన్నారు. ‘‘అంబటి రాంబాబును వాళ్లే రెచ్చగొట్టి  వాళ్లే దాడికి పాల్పడ్డారు. అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?’’ అంటూ కాపు నేతలు మండిపడ్డారు.

‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిర్థారించింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టడం దారుణం. అంబటి రాంబాబుపై  ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు నమోదు చేశారు. పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయించారు.

‘‘టీడీపీకి కాపులు అంటే గిట్టదు. టీడీపీని  కాపులు ప్రశ్నిస్తే సహించరు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రజలు  ఎక్కువ కాలం అంగీకరించరు. చంద్రబాబు, లోకేష్‌ను చూసి ఎవరూ భయపడరు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  వడ్డీతో  సహా  చెల్లిస్తాం’’ అని కాపు నేతలు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement