కృష్ణానది ఊబిలో కూరుకుపోయిన ఐదుగురు యువకులు
ముగ్గురిని కాపాడిన మత్స్యకారులు.. ఇద్దరు మృతి
తాడేపల్లిరూరల్/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడారు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్ కుమార్ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు.
ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపాడారు. మరో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారిని వెతుకుతుండగా ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్ దివ్యాంగుడు, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.
సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు
బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలలకు గుంటూరు కొత్తపేటకు చెందిన రేషి కళ్యాణ్ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్ కొట్టుకుపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment