Durgaprasad
-
ప్రాణం తీసిన ఈత సరదా
తాడేపల్లిరూరల్/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడారు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్ కుమార్ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపాడారు. మరో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారిని వెతుకుతుండగా ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్ దివ్యాంగుడు, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలలకు గుంటూరు కొత్తపేటకు చెందిన రేషి కళ్యాణ్ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్ కొట్టుకుపోయాడు. -
మానవ హక్కుల కౌన్సిల్ సేవలు ప్రశంసనీయం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సమాజాభివృద్ధిలో మానవ హక్కుల కౌన్సిల్ సేవలు ప్రశంసనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వ్యభిచార రొంపిలోకి వెళ్లకుండా.. వారి హక్కులు కాపాడేలా మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, జిల్లా లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ప్రజలు, మహిళలు, విద్యార్థులకు భరోసానిచ్చేలా ఈ కార్యక్రమాలుండాలని, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ మానవ హక్కుల కౌన్సిల్‌ను స్థాపించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో వలంటీర్లను తయారుచేసి, వారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్లుగా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమారు 6 వేల ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తిని కౌన్సిల్ ప్రతినిధులు సత్కరించారు. కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మి, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవరా సత్యనారాయణ, వివిధ జిల్లాల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
రౌడీషీట్ ఎత్తివేయమంటే రూ. 5 లక్షలు అడుగుతున్నారు
సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : రౌడీషీట్ ఎత్తివేయమంటే నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ రూ.5 లక్షలు లంచం అడుగుతున్నారని మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపించారు. ఆయన సోమవారం అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి ఈమేరకు ఫిర్యాదుచేశారు. 2017లో చినకాకాని వద్ద జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పార్టీ కార్యాలయాన్ని ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తుంటే అడ్డుకున్నందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన నేతల ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్లో తనపై రౌడీషీట్ తెరిచారన్నారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా రౌడీషీట్ తీసివేయాలని ఈ ఏడాది జూలైలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని, అయినప్పటికీ పోలీసులు తొలగించడం లేదన్నారు. డీజీపీని కలిసి విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రీవెన్స్‌కు వచ్చానన్నారు. -
‘వైఎస్సార్సీపీదే అధికారం’
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం ఎదురుచూస్తున్నారని తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. ప్రజల మనోగతాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 125 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజల్ని, అధికారుల్ని భయపెట్టారని, కానీ ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటువేసే బాధ్యతను తీసుకున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వేలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
జేసీ దివాకర్ రెడ్డి గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు
-
బిలియార్డ్‌లో రైల్వే ఉద్యోగి హవా
విజయవాడ స్పోర్ట్స్ : సికింద్రాబాద్‌లో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియార్డ్ టోర్నీలో విజయవాడ డివిజన్ ఉద్యోగి ఎల్.దుర్గాప్రసాద్ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన బిలియార్డ్స్–09 బాల్ విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను దుర్గాప్రసాద్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎల్.దుర్గాప్రసాద్ 6–2 తేడాతో పీజీ బెన్నిపై విజయం సాధించారు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో గోవిందరాజ్‌రెడ్డిపై 0–6 తేడాతో దుర్గాప్రసాద్ గెలుపొందారు. -
'కబడ్డి ఆడేందుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యా'
విజయవాడ: తాను కబడ్డి ఆడేందుకు వెళ్లి... ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆర్ఎస్ఎస్ నేత దుర్గాప్రసాద్ స్మారక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఎస్‌లో చేరిన నాటి సంగతులతో ఆపటు దుర్గాప్రసాద్‌తో తనకు గల అనుబంధాన్ని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని ఆయన తెలిపారు. మనలో ఐక్యమత్యం లేకపోవడం వల్లే విదేశీ దాడులు జరుగుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వగురు స్థానంలో భారత్‌ను చేర్చాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. రాముడు ఆదర్శపాలకుడని... అలాంటి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. -
బావిలో పడి యువకుడి మృతి
బెలగాం, న్యూస్‌లైన్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక వై.కె.ఎం. కాలనీకి చెందిన టి.దుర్గాప్రసాద్(32) మూడేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశాడు. ఏడాది కాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎప్పటిలానే కాలకృత్యాల కోసం గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వై.కె.ఎం కాలనీకి ఆనుకుని ఉన్న నేల బావిలో దుర్గాప్రసాద్ విగతజీవై తేలడాన్ని కొంతమంది గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందిన ఫిర్యాదు మేరకు పార్వతీపురం టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై బి.లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టానికి తరలించారు. అయితే దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తు జారిపడిపోయాడా, ఇంకేదైనా కారణం ఉందా అన్నది తెలియరాలేదు. ఆదుకుంటాడనుకుంటే... బీఈడీ చదివి ప్రయోజకుడై పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నామని, ఇంతలోనే విధి ఇలా చేసిందని మృతుడు దుర్గాప్రసాద్ తండ్రి పకీరు నాయుడు, తల్లి లక్ష్మి, అన్నదముల్ము సతీష్, గౌరి భోరుమన్నారు. పేద కుటుంబం కావడంతో దుర్గాప్రసాద్ తండ్రి పకీరునాయుడు స్థానిక ఏరియా ఆస్పత్రిలో జంక్షన్లో తోపుడుబండి పెట్టి టీ, ఫలహారాలను అమ్ముతూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ అతనికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చేతికి అందొచ్చిన కొడుకు మృతిని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.