షేక్ జలీల్
సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : రౌడీషీట్ ఎత్తివేయమంటే నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ రూ.5 లక్షలు లంచం అడుగుతున్నారని మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపించారు. ఆయన సోమవారం అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి ఈమేరకు ఫిర్యాదుచేశారు. 2017లో చినకాకాని వద్ద జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పార్టీ కార్యాలయాన్ని ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తుంటే అడ్డుకున్నందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన నేతల ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో తనపై రౌడీషీట్ తెరిచారన్నారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా రౌడీషీట్ తీసివేయాలని ఈ ఏడాది జూలైలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని, అయినప్పటికీ పోలీసులు తొలగించడం లేదన్నారు. డీజీపీని కలిసి విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రీవెన్స్‌కు వచ్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment