rowdy sheete
-
రౌడీషీట్ ఎత్తివేయమంటే రూ. 5 లక్షలు అడుగుతున్నారు
సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : రౌడీషీట్ ఎత్తివేయమంటే నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ రూ.5 లక్షలు లంచం అడుగుతున్నారని మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపించారు. ఆయన సోమవారం అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి ఈమేరకు ఫిర్యాదుచేశారు. 2017లో చినకాకాని వద్ద జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పార్టీ కార్యాలయాన్ని ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తుంటే అడ్డుకున్నందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన నేతల ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్లో తనపై రౌడీషీట్ తెరిచారన్నారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా రౌడీషీట్ తీసివేయాలని ఈ ఏడాది జూలైలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని, అయినప్పటికీ పోలీసులు తొలగించడం లేదన్నారు. డీజీపీని కలిసి విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రీవెన్స్‌కు వచ్చానన్నారు. -
రౌడీషీట్ తెరిచారని మనస్తాపంతో..
బెంగళూరు : పోలీసులు రౌడీషీట్ తెరవడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం చేళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తకోటవాండ్ల పల్లిలో చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం రాజువాండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఇళ్లు మంజూరు విషయమై లక్ష్మీ నారాయణతో పాటు మారెప్పరెడ్డి, రెడ్డెప్ప, ఈశ్వరరెడ్డిలు నల్లగుట్టపల్లి గ్రాపం పీడీఓ శ్రీనివాస్‌పై దాడి చేశారు. అందుకు సంబంధించి శ్రీనివాస్ చేళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేరే ప్రాంతంలో తలదాచుకున్నారు. అయితే చేళూరు పోలీసులు నలుగురు వ్యక్తులను రౌడీషీటర్లుగా ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు రావడంతో నెల రోజుల క్రితం చేళూరు పోలీసుస్టేషన్‌కు వచ్చిన మారెప్పరెడ్డి రౌడీషీట్ తెరవడంతో గ్రామంలో తమ పరువు, మర్యాదలు భంగం వాటిల్లుతోందని రౌడీషీట్ ఉపసంహరించుకోవాలంటూ ప్రాధేయపడ్డారు. అందుకు సంబంధించి గురువారం కూడా చేళూరు ఎస్ఐని కలవగా బాగేపల్లి తహశీల్దార్ వద్దకు వెళ్లాలంటూ సూచించడంతో మనస్తాపం చెందిన మారెప్పరెడ్డి ఇంటికి వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
అయ్యా.. రౌడీషీటర్ గారూ..
-
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
నంద్యాల:నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు పదకొండు మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. నంద్యాల పురపాలక సమావేశంలో ఘర్షణకు ప్రేరేపించి టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారని భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆ సమావేశం సజావుగా సాగడం లేదని ప్రశ్నించినందుకు భూమాపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు.