ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు | rowdy sheete open over mla Bhuma nagireddy and party activists | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు

Published Mon, Nov 3 2014 7:45 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

rowdy sheete open over mla Bhuma nagireddy and party activists

నంద్యాల:నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు పదకొండు మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. నంద్యాల పురపాలక సమావేశంలో ఘర్షణకు ప్రేరేపించి టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారని భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆ సమావేశం సజావుగా సాగడం లేదని ప్రశ్నించినందుకు భూమాపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement