
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియా ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రూ. 75 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన సకారియాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో సకారియా అమ్ముడుపోనప్పటికి.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం భాగం కానున్నాడు.
ఐపీఎల్-18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నెట్‌బౌలర్‌గా సకారియా తన సేవలను అందించనున్నాడు. కాగా సకారియా గత సీజన్‌లో కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని కేకేఆర్ విడిచిపెట్టింది.
ఇప్పుడు నెట్‌బౌలర్‌గా అదే జట్టుతో సకారియా కొనసాగనున్నాడు. కాగా చేతన్ సకారియా ఇటీవల మణికట్టు గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాడు. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఓ టీ20 టోర్నమెంట్‌లో సకారియా మెరుగ్గా రాణించి కేకేఆర్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు.
దీంతో అతడిని నెట్ బౌలర్‌గా కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. భరత్ అరుణ్ పర్యవేక్షణలో తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి చేతన్‌కు ఇదొక మంచి అవకాశం. అదేవిధంగా రహానే, రస్సెల్ వంటి క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను సకారియా పంచుకోనున్నాడు.
మూడే మూడు మ్యాచ్‌లు..
చేతన్ సకారియా భారత్ తరపున 2021లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు రెండు టీ20లు, ఒక వన్డే ఆడాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్‌కు సకారియా ప్రాతినిథ్యం వహించాడు.
2021 సీజన్‌లో సకారియా రాజస్తాన్ తరపున 14 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే భారత సెలక్టర్లు నుంచి సకారియా పిలుపును అందుకున్నాడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో సకారియా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన చేతన్.. 20 వికెట్లు సాధించాడు.
ఐపీఎల్-2025కు కేకేఆర్ జట్టు: రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 200 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 5 కోట్లు. కోటి), అంగ్‌క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), వైభవ్ అరోరా (రూ. 1.80 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), ఎ. 30 లక్షల రూపాయలు. రహానె (రూ. 1.50 లక్షలు), అనుకుల్ రాయ్ (రూ. 40 లక్షలు), మొయిన్ అలీ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).
చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment