Chetan Sakariya
-
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కేకేఆర్ బౌలర్ (ఫొటోలు)
-
టీమిండియా పేసర్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ
టీమిండియా యువ బౌలర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ పేసర్ చేతన్ సకారియాకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఈ సౌరాష్ట్ర బౌలర్‌ను అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది. బీసీసీఐ సకారియాను పూర్తిగా నిషేధించనప్పటికీ, అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు ఉన్నాయని ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు చెప్పకనే చెప్పింది. బీసీసీఐ చర్యతో 25 ఏళ్ల చేతన్ సకారియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐ సకారియాతో పాటు మరో ఆరుగురు బౌలర్ల పేర్లను కూడా అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది. కాగా, ఐపీఎల్‌కు సంబంధించి ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవలే సకారియాను రిలీజ్ చేసింది. అతను తిరిగి 2024 ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో సకారియా 50 బేస్ ప్రైజ్ విభాగంలో 27 నంబర్‌తో రిజిస్టర్ చేయబడ్డాడు. బీసీసీఐ అనుమానిత బౌలర్ల జాబితాలో సకారియా పేరు చేర్చడంతో ఫ్రాంఛైజీలు ఇతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. సకారియా ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 19 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రెండు టీ20లు, ఓ వన్డేలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన ఇతర బౌలర్ల వివరాలు.. తనుష్ కోటియన్ (ముంబై) రోహన్ కున్నుమ్మల్ (కేరళ) చిరాగ్ గాంధీ (గుజరాత్) సల్మాన్ నిజార్ (కేరళ) సౌరబ్ దూబే (విదర్భ) అర్పిత్ గులేరియా (హిమాచల్‌ప్రదేశ్) మనీశ్ పాండే (కర్ణాటక) కేఎల్ శ్రీజిత్ (కర్ణాటక) పై పేర్కొన్న ఆటగాళ్లు అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన ఆటగాళ్ల జాబితాలో మాత్రమే చేర్చబడ్డారు. వీరిపై ఎలాంటి నిషేధమూ లేదు. బ్యాటింగ్‌కు సంబంధించి వీరిపై ఎలాంటి అంక్షలు ఉండవు. -
సీఎస్కే బౌలర్‌కు బంపర్ ఆఫర్.. టీమిండియాతో పాటుగా ఆస్ట్రేలియాకు!
టీ20 ప్రపంచకప్-2022 కోసం టీమిండియా అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు పయనం కానుంది. జస్ప్రీత్ బుమ్రా మినహా 15 మందితో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్‌కు వారం రోజుల ముందే కంగారూల గడ్డపై అడుగుపెట్టనుంది. అదే విధంగా స్టాండ్ బై ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ ఆక్టోబర్ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడే భారత జట్టులో భాగంగా ఉన్నారు. కాగా ప్రాధాన జట్టుతో పాటు నెట్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ వంటి పేస్ బౌలర్లను నెట్ బౌలర్లగా బీసీసీఐ ఎంపిక చేయగా.. తాజాగా మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కూడా నెట్ బౌలర్లగా ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్‌స్టార్ నివేదిక ప్రకారం.. ఈ బౌలర్ల జాబితాలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి, చేతన్ సకారియా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ముఖేష్ చౌదరి అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖేష్ ప్రస్తుతం పూణేలో శిక్షణ పొందుతుండగా.. ఉమ్రాన్, సకారియా, కుల్దీప్ సేన్ ఇరానీ కప్‌లో ఆడుతున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ , జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. కోహ్లికి రెస్ట్! శ్రేయస్‌కు ఛాన్స్ -
జడేజాలా తిప్పాలని యువ క్రికెటర్ విశ్వ ప్రయత్నాలు!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పుడు ఫిప్టీ లేదా సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్‌ను కత్తిసాములా తిప్పడం అలవాటు. అతని సెలబ్రేషన్స్ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌పుత్ కుటుంబం నుంచి వచ్చిన జడేజా స్వతహగానే కత్తిసామును బాగా చేయగలడు. అయితే జడ్డూ ఆసియా కప్‌లో ఆడుతూ మోకాలి గాయంతో టోర్నీ నుంచి అర్థంతరంగా వైదొలిగాడు. మోకాలి సర్జరీ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జడేజా తన గాయంపై ఇటీవలే అప్డేట్ ఇచ్చాడు. వీలైనంత తొందరగా కోలుకునే ప్రయత్నం చేస్తానని జడేజా చెప్పుకొచ్చాడు. కాగా సర్జరీతో కనీసం నెలరోజులైనా విశ్రాంతి అవసరం కావడంతో జడేజా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు కూడా దూరమయ్యాడు. ఈసారి టి20 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషిస్తాడనుకున్న తరుణంలో జడేజా ఇలా దూరమవ్వడం అభిమానులకు బాధ కలిగిస్తుంది. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా తొందరగా కోలుకోవాలంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా జడ్డూ స్టైల్‌ను అనుకరించాడు. అతనిలా బ్యాట్‌ను కత్తిసాములా తిప్పడానికి ప్రయత్నించాడు. దాదాపు జడేజాను గుర్తుచేస్తూ ఒంటిచేత్తో బ్యాట్‌ను అటు ఇటు తిప్పాడు. ''జడ్డూ భయ్యాను మిస్ అవుతున్నామనుకునేవాళ్లు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే. జడ్డూ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ రాసుకొచ్చాడు. కాగా చేతన్ సకారియా చర్యకు స్పందించిన జడేజా..''హాహా వెల్డన్ సకారియా.. థాంక్యూ'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే టి20 ప్రపంచకప్ సహా ఆసీస్, సౌతాఫ్రికాలతో ఆడబోయే సిరీస్‌లకు సంబంధించి జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. In case you are missing jaddubhai 🤩😇🤺⚔️@imjadeja Here's wishing him a speedy recovery ❤️🩹💪 🦁 pic.twitter.com/HzBbSLk4uX — Chetan Sakariya (@Sakariya55) September 14, 2022 -
'బట్లర్‌ను ఔట్ చేయడం చాలా సంతోషంగా ఉంది'
ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తమ ప్లేఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపుకుంది. కాగా తిరిగి జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ చేతన్ సకారియా తన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను ఔట్ చేసి సకారియా ఢిల్లీ జట్టుకు శుభారంభం ఇచ్చాడు. కాగా బట్లర్‌ను ఔట్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం సకారియా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సకారియా 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున అతడి వికెట్ సాధించడం నాకు చాలా పెద్ద విషయం. బౌలింగ్‌లో నా ప్రణాళికలను బాగా అమలు చేసాను. ఈ మ్యాచ్‌లో నా బౌలింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాను" అని సకారియా పేర్కొన్నాడు. చదవండి: Rishi Dhawan: 'టీమిండియాలోకి తిరిగి రావడమే నా టార్గెట్' -
IPL 2022: రిషభ్ భయ్యా గ్రేట్.. బాగా ఆడితే క్రెడిట్ మాకు.. లేదంటే!
IPL 2022 DC Vs SRH: ‘‘రిషభ్ భయ్యా.. చాలా కామ్‌గా ఉంటాడు. ఒత్తిడినంతా తానే భరిస్తాడు. జట్టు బాధ్యతను తీసుకుంటాడు. ఎప్పుడైనా మేము ఒత్తిడిలో కూరుకుపోతే దానిని అధిగమించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తాడు. మేము బాగా ఆడితే క్రెడిట్ అంతా మాకే ఇస్తాడు. అయితే, జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రం తానే ముందుంటాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ యువ బౌలర్ చేతన్ సకారియా.. తమ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. తమకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నీ తానై వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా 20 లక్షల రూపాయల కనీస ధరతో ఆక్షన్‌లోకి రాగా రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 1.2 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ఇక మెగా వేలం-2022 నేపథ్యంలో సకారియాను వదిలేయగా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. అతడి కోసం 4. 20 కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే, ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఈ లెఫ్టార్మ్ సీమర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరులో జట్టులోకి వచ్చాడు. ఆరోన్ ఫించ్ వికెట్ తీసి సత్తా చాటాడు. ఇక కొత్త ఫ్రాంఛైజీతో తన అనుబంధం పట్ల స్పందిస్తూ తాజాగా ఎన్డీటీవీతో ముచ్చటించిన సకారియా కోచ్ రిక్కీ పాంటింగ్, కెప్టెన్ రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిక్కీ పాంటింగ్ ఆలోచనా విధానం నన్ను ఆకట్టుకుంది. క్లిష్ట సమయాల్లో ఆయన మాలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేయని ప్రయత్నం ఉండదు. సరదాగా మాట్లాడుతూ.. జోకులు వేస్తూ ఆటగాళ్లతో కలిసిపోతారు. ఒక్కో ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. అందుకు తగ్గట్లుగా మెళకువలు నేర్పుతారు’’ అని పాంటింగ్ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఇక కెప్టెన్‌గా పంత్ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడంటూ ప్రశంసించాడు. కాగా ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. గురువారం(మే 5) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా దూసుకుపోవాలంటే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’ The sound off #RP17's bat when he is in full swing 🤩#YehHaiNayiDilli | #IPL2022 | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/G4rws7Qk0n — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Just 7️⃣ seconds of Bapu smashing 'em down the ground 🔥#YehHaiNayiDilli | #IPL2022 #TATAIPL | #IPL | #DelhiCapitals | @akshar2026 pic.twitter.com/OUnoYucElR — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫించ్ క్లీన్ బౌల్డ్.. వెరైటీ సెలబ్రేషన్స్ జరపుకున్న సకారియా.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న చేతన్ సకారియా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన సకారియా.. 17 పరుగులు ఇచ్చి ఫించ్ వికెట్ పడగొట్టాడు. కాగా ఫించ్ వికెట్ సాధించిన సకారియా.. వెరైటీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సకారియా.. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో సకారియా.. ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ సిరీస్ "డ్రాగన్ బాల్ జెడ్" లోని గోకు స్టైల్లో సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ సకారియాను రీటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలో రూ. 4 కోట్లకు సకారియాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022: ఏదో ఒక రోజు 155 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తా: ఉమ్రాన్ మాలిక్ What a start🔥🔥🔥🔥 pic.twitter.com/nbnA7h7HAp — abhishek sandikar (@ASandikar) April 28, 2022 -
ధోనిని క్లీన్‌బౌల్డ్ చేశా.. ఇప్పుడు నా టార్గెట్ కోహ్లి భాయ్'
టీమిండియా యువ పేసర్ చేతన్ సకారియాను ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అతడు వేలంలో తన పేరును కనీస ధర రూ. 50 లక్షల రూపాయలుగా రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. కాగా గత ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన సకారియా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021లో 14 మ్యాచ్‌లు ఆడిన సకారియా 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ఏకంగా భారత జట్టు తరుపున అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. గత ఏడాది జూలైలో శ్రీలంకపై టీ20ల్లో భారత తరపున సకారియా అరంగేట్రం చేశాడు. ఇక తాజాగా క్రికెట్. కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని సకారియా బయటపెట్టాడు. ఐపీఎల్-2021లో తన డెబ్యూ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిను సకారియా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో ధోనిను ఔట్ చేయడం తన బెస్ట్ మూమెంట్ అని సకారియా తెలిపాడు. “ఐపీఎల్ 2021లో ఎంస్ ధోని వికెట్ తీయడం నా బెస్ట్ మూమెంట్. అదే విధంగా నా తొలి మ్యాచ్ కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ధోని భాయ్ వికెట్ తీయడం కంటే ఎక్కువ ఏమీ కాదు. అతడు ఆటలో ఒక లెజెండ్. ఒక లెజెండ్‌కు బౌలింగ్ చేయడం, ఔట్ చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. నేను మ్యాచ్‌లోనూ, నెట్స్‌లోనూ డివిలియర్స్‌కి బౌలింగ్ చేశాను. డెత్ ఓవర్లలో అతడు అన్ని రకాల షాట్లు ఆడతాడు. కాబట్టి అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడి వికెట్‌ను తీయాలని కోరిక ఉండేది. కానీ అతడు ఇప్పుడు క్రికెట్ నుంచి తప్పుకోవడంతో నాకు మరి అవకాశం లేదు. అయితే ఐపీఎల్-2022లో విరాట్ భాయ్ వికెట్ సాధించాలని అనుకుంటున్నాను" అని సకారియా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ జట్టుకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
చేతన్ సకారియాకి బంపర్ ఆఫర్.. అప్పుడు 1.2 కోట్లు.. ఇప్పడు ఏకంగా..!
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియాకి కాసుల పంట పండింది. సకారియాను రూ.4.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన సకారియాను దక్కించుకోవడానికి ఆర్సీబీ, రాజస్తాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకి సకారియాను రూ.4.2 కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. కాగా గత ఏడాది సీజన్లో కేవలం రూ.1.2 కోట్లకు సకారియాను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో సకారియా అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 14 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించడంతో ఈ యంగ్ బౌలర్‌కు టీమిండియా తరుపున ఆడే అవకాశం లభించింది. గత ఏడాది జాలైలో శ్రీలంకపై సకారియా అరంగట్రేం చేశాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ జాక్ పాట్ కొట్టాడు. గత సీజన్లో బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు అమ్ముడుపోయిన లివింగ్ స్టోన్, ఈసారి ఏకంగా రూ.11.50 కోట్లు దక్కించుకున్నాడు. లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022 Auction: ఏడాదిలో తలకిందులు.. అప్పుడు 9.25 కోట్లు... ఇప్పుడు కేవలం! -
'సూపర్' వాషింగ్టన్ సుందర్.. ఫైనల్‌కు తమిళనాడు
Tamil Nadu Enters Final Beating Saurashtra In Semi Final-2.. విజయ్ హజారే ట్రోఫీ 2021లో తమిళనాడు ఫైనల్‌కు చేరింది. సౌరాష్ట్రతో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో తమిళనాడు 2 వికెట్లతో విజయాన్ని అందుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఇన్నింగ్ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తమిళనాడు బ్యాటింగ్‌లో ఓపెనర్ బాబా అపరాజిత్(122 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (61 బంతుల్లో 70, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 5 వికెట్లు తీశాడు. చదవండి: ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వికెట్ కీపన్ షెల్డన్ జాక్సన్(125 బంతుల్లో 134 పరుగులు, 11 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా.. వసవదా 57, ప్రేరక్ మన్కడ్ 37 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ 4, సిలింబరాసన్ 3 వికెట్లు తీశారు. ఇక హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగులతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 26న జరగనున్న ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ -
మ్యాచ్ విజయం.. షర్ట్ లేకుండా డ్యాన్స్ చేసిన ఆటగాళ్లు
PBKS Winning Moment.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంలో కార్తిక్ త్యాగి పాత్ర మరువలేనిది. ఆఖరి ఓవర్లో పంజాబ్‌కు నాలుగు పరుగులు అవసరమైన దశలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆర్ఆర్ మ్యాచ్ గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మ్యాచ్ హీరో కార్తిక్ త్యాగి, బౌలర్ చేతన్ సకారియాలు షర్ట్ లేకుండా డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ చేశారు. వీరికి యశస్వి జైశ్వాల్ తోడవ్వడంతో మరింత కళ వచ్చి చేరింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేసింది. ఈ విజయం డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషాన్ని నింపింది. హల్లాబోల్.. రాయల్స్ ఫ్యామిలీ అంటూ ఆర్ఆర్ ట్వీట్ చేసింది. Courtesy: IPL Twitter చదవండి: Kartik Tyagi: ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు.. కానీ కార్తిక్ 'ఒక మ్యాచ్ గెలిచామంటే సంబరాలు చేసుకోవడం సాధారణం. అయితే అద్భుత మ్యాచ్‌లు అప్పుడప్పుడే జరుగుతుంటాయి. కానీ కార్తిక్ త్యాగి అసాధారణ ప్రతిభతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఇది అతని సొంతం' అంటూ పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ కుమార్ సంగక్కర తెలిపాడు. 📹 Straight from a 𝓱𝓪𝓹𝓹𝔂 dressing room. 💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/gNxggS8BA1 — Rajasthan Royals (@rajasthanroyals) September 22, 2021 -
బౌలింగ్.. బ్యాటింగ్.. క్యాచ్ ; ముగ్గురు డెబ్యూలే
కొలంబో: టీమిండియా, శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చేసుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చేతన్ సకారియా వేసిన రెండో బంతిని రమేష్ మెండిస్ గల్లీ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే షాట్ కొట్టిన రమేష్ మెండిస్, బౌలింగ్ చేసిన చేతన్ సకారియా, క్యాచ్ పట్టిన రుతురాజ్ గైక్వాడ్‌లకు వారి జట్ల తరపున ఇదే డెబ్యూ మ్యాచ్. ఒక మ్యాచ్‌లో ముగ్గురు డెబ్యూ ప్లేయర్ల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చాలా అరుదు. కాగా ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా.. లంక తరపున రమేశ్ మెండిస్ టీ20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 40 పరుగలుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది.ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది. -
Ind Vs Sl 3rd ODI: 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే!
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులకే అవుట్ కాగా.. మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్ పృథ్వీ షా(49), సంజూ శాంసన్(46) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉండగా వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగా.. సంజూ శాంసన్, గౌతం, రాహుల్ చహర్, నితీశ్ రాణా, చేతన్ సకారియా తదితర భారత క్రికెటర్లు ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఒకేసారి ఐదుగురు టీమిండియా ప్లేయర్లు వన్డే క్యాపులు అందుకోవడం 1980 తర్వాత ఇదే తొలిసారి. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా... అప్పటి ఆటగాళ్లు దిలీప్ దోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ... ‘‘సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత టీమిండియా ఇలాంటి సాహసానికి పూనుకుంది. ఒకే మ్యాచ్‌లో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలికింది. నామమాత్రపు మ్యాచ్ అయినా సరే, యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించింది. ఆల్ ది బెస్ట్ అందరికీ’’ అంటూ అభిమానులు అరంగేట్ర ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే... గత నెలలో ఇంగ్లండ్ టూర్లో భాగంగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, షఫాలీ వర్మ, తాన్యా భాటియా, స్నేహా రానా భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశారు. కాగా శిఖర్ ధావన్ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరిదైన మూడో వన్డేలో భారీ మార్పులతో బరిలోకి దిగింది. టీమిండియా ప్రస్తుత స్కోరు- 147/3 (23) Five players are making their ODI debut for India today – Sanju Samson, Nitish Rana, Rahul Chahar, Chetan Sakariya and K Gowtham 👏#SLvINDpic.twitter.com/q6NYWV4W9N — ICC (@ICC) July 23, 2021 -
Ind Vs Sl: ఐదుగురు భారత ప్లేయర్ల అరంగేట్రం
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఐదుగురు భారత క్రికెటర్లు అరంగేట్రం చేశారు. సంజూ శాంసన్, నితీశ్ రానా, చేతన్ సకారియా, కె.గౌతమ్, రాహుల్ చహర్ వన్డే క్రికెట్లో అడుగుపెట్టారు. బరోడా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్థానంలో గౌతం, ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, స్పిన్ ద్వయం కుల్దీప్-చహల్ స్థానంలో రాహుల్ చహర్- నితీశ్ రానా, నవదీప్ సైనీకి జంటగా మరో పేసర్‌గా చేతన్ సకారియాకు జట్టులో చోటు కల్పించారు ఇక భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినివ్వగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ అతడి బాధ్యతలను నెరవేర్చనున్నాడు. కాగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా సిరీస్‌లో చివరిదైన వన్డేలో ఎలాగైనా క్లీన్‌స్వీప్ టీమిండియా భావిస్తుండగా.. నామమాత్రపు మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు తహతహలాడుతోంది. భారత తుది జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ రాణా, హార్దిక్ పాండ్యా, క్రిష్ణప్ప గౌతం, రాహుల్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా శ్రీలంక తుది జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీరా, ప్రవీన్ జయవిక్రామ. 🎥 🎥: That moment when the 5⃣ ODI debutants received their #TeamIndia cap!👏 👏 #SLvIND@IamSanjuSamson | @NitishRana_27 | @rdchahar1 | @Sakariya55 | @gowthamyadav88 pic.twitter.com/1GXkO13x5N — BCCI (@BCCI) July 23, 2021 -
చేతన్ సకారియా ఇంట మరో విషాదం
భవ్నగర్(గుజరాత్): గుజరాత్ పేస్ బౌలర్ చేతన్ సకారియా ఇంట మరో విషాదం నెలకొంది. సకారియా తండ్రి కన్జిభాయ్ సకారియా కరోనాతో మృతిచెందారు. గత కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన కన్జిభాయ్ సకారియా చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చేతన్ సకారియా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ‘సకారియా ఇంట విషాదం నెలకొందనే విషయాన్ని తెలియజేయడం బాధిస్తోంది. కోవిడ్-19తో పోరాడిన చేతన్ సకారియా తండ్రి కన్జిభాయ్ చివరకు ఓడిపోయారు. ఈ రోజు ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇది చేతన్ సకారియాకు అండగా ఉండాల్సిన సమయం. మాకు సాధ్యమైనంత చేయూతను సకారియా కుటుంబానికి అందజేస్తాం. మేము చేతన్ సకారియాతో టచ్‌లో ఉన్నాం. ఇది అతనికి కష్టకాలం’ రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో చేతన్ సకారియా సోదరుడు మృతి చెందగా, ఇప్పుడు తండ్రి కన్నుమూయడంతో సకారియా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలానికి కొద్ది రోజుల ముందే సకారియా తన తమ్ముడిని ల్పోయాడు. జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న సమయంలో అతని తమ్ముడు రాహుల్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఆ సమయంలో ఈ విషాద వార్తను తల్లిదండ్రులు సకారియాకు తెలీనివ్వలేదు. తమ్ముడంటే సకారియాకు చాలా ఇష్టమని, దీంతో అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనన్న భయంతో విషయం అతనికి చెప్పలేదని, ఆతర్వాత మెల్లగా తన తమ్ముడు లేడన్న వార్తను తెలియజేశామని తల్లిదండ్రులు తెలిపారు. ఇక్కడ చదవండి: ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్ టెంపో డ్రైవర్‌గా తండ్రి కష్టం, తమ్ముడి ఆత్మహత్య కలిచివేశాయి.. -
సకారియా సక్సెస్ వెనుక ఓ విషాద గాధ..
ముంబై: రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో(3/31) ఆకట్టుకున్న చేతన్ సకారియా ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తున్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ప్రపంచ స్థాయి బౌలర్లంతా చేతులెత్తేసిన వేళ, తాను మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసి, మూడు కీలకమైన వికెట్లు(మయాంక్, కేఎల్ రాహుల్, రిచర్డ్సన్) సాధించి ఔరా అనిపించాడు. పంజాబ్ బ్యాట్స్మెన్ల సిక్సర్ల సునామీలో ప్రతి ఒక్క రాజస్థాన్ బౌలర్ కొట్టుకుపోగా, సకారియా మాత్రం ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి శభాష్ అనిపించాడు. దీంతో పాటు అతను ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ను(నికోలస్ పూరన్) సైతం అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ సంజూ సామ్సన్(119) అద్భుత శతక పోరాటం, చేతన్ సకారియా అదిరిపోయే బౌలింగ్ స్పెల్ ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేళంలో 1.2 కోట్లు ధర పలికిన 23 ఏళ్ల ఈ సౌరాష్ట్ర కుర్రాడి అదిపోయే ప్రదర్శన వెనుక సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని ఓ విషాద గాధ నెలకొంది. ఐపీఎల్ వేలానికి కొద్ది రోజుల ముందే సకారియా తన తమ్ముడిని కోల్పోయాడు. జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న సమయంలో అతని తమ్ముడు రాహుల్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఆ సమయంలో ఈ విషాద వార్తను తల్లిదండ్రులు సకారియాకు తెలీనివ్వలేదు. తమ్ముడంటే సకారియాకు చాలా ఇష్టమని, దీంతో అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనన్న భయంతో విషయం అతనికి చెప్పలేదని, ఆతర్వాత మెల్లగా తన తమ్ముడు లేడన్న వార్తను తెలియజేశామని తల్లిదండ్రులు తెలిపారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన అనంతరం తన తమ్ముడిని కోల్పోయిన విషయాన్ని సకారియా మీడియాకు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు నా తమ్ముడు బతికి ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదే సందర్భంలో సకారియా తన కుటుంబ నేపథ్యం గురించి మీడియాకు వివరించాడు. తమది చాలా పేద కుటుంబమని, తన తండ్రి టెంపో నడుపుతూ, ఆ సంపాదనతోనే అన్నదమ్ములను పోషించాడని, తాను డబ్బు సంపాదించే సమయానికి తమ్ముడు లేకపోవడం బాధాకరమని దుఖాన్ని వెల్లబుచ్చాడు. ఐపీఎల్ వేళంలో వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొంటానని ఈ లెఫ్టార్మ్ పేసర్ తెలిపాడు. -
అతడి బౌలింగ్ చూస్తే ముచ్చటేసింది: సెహ్వాగ్
ముంబై: రాజస్తాన్ రాయల్స్ బౌలర్ చేతన్ సకారియాపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఇంత అద్భుతంగా రాణిస్తాడని ఊహించలేదన్నాడు. ఏమత్రం బెరుకు లేకుండా ఆడాడని, ఒక మంచి బౌలర్‌కు కావాల్సిన లక్షణాలు తనలో మెండుగా ఉన్నాయని కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ సంజూ సామ్సన్ అద్భుత సెంచరీతో, యువ పేసర్ చేతన్ సకారియా మూడు వికెట్లతో రాణించి అభిమానుల మనసు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరూ భాయ్ చేతన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తన పేరు చాలాసార్లు విన్నాను. దేశవాళీ క్రికెట్లో తన ఆటను కూడా చూశాను. కానీ ఇంతబాగా బౌల్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. దేశవాళీ క్రికెట్లో వివిధ రకాల బ్యాట్స్‌మెన్‌ను తను ఎదుర్కొని ఉండవచ్చు. అయితే, ఐపీఎల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. స్టార్ ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా పంచుకున్న అభిప్రాయాల ప్రకారం, తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ ఎక్కడ బౌండరీ బాదుతాడేమోనని అస్సలు భయపడకూడదు. అవకాశం దొరికేంతవరకు ఓపికగా వేచి చూసి, గట్టిగా దెబ్బకొట్టాలి. అప్పుడే వికెట్లు ఎలా తీయాలన్న విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. సకారియాలో ఇలాంటి లక్షణాలను నేను చూశాను. ఎంతో పట్టుదలగా ఆడాడు’’ అని ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘తన బౌలింగ్‌లో వైవిధ్యం కనబడుతోంది. కొన్నిసార్లు నోబాల్స్ వేసి ఉండవచ్చు. అయితే, మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేసిన తీరు, క్రిస్‌గేల్‌ను తన డెలివరీలతో భయపెట్టిన విధానం ముచ్చటగొలిపింది’’ అని వీరేంద్ర సెహ్వాగ్ ఈ 23 ఏళ్ల సౌరాష్ట్ర బౌలర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక ఆటపట్ల చేతన్ సకారియాకు ఉన్న అంకితభావం గురించి ట్విటర్ వేదికగా ప్రస్తావిస్తూ.. ‘‘కొన్ని నెలల క్రితం చేతన్ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఈ విషయం తనకు చెప్పలేదు. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ ఆడుతున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది. దీనిని బట్టి సకారియా కుటుంబానికి, అతడికి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం సుస్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా, ఆర్ఆర్ చేతన్ సకారియాను 1.20 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక సీజన్ తొలి మ్యాచ్‌లో అతడు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, జై రిచర్డ్సన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసి, 7.80 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఒక నోబ్ ఉంది. చదవండి: ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్ భావోద్వేగం బట్లర్ సేవలను సరిగా వాడుకోలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’ -
రూ. 1.20 కోట్లు.. త్వరలోనే ఇల్లు కొంటా..
న్యూఢిల్లీ: ‘‘విజయ్ హజారే ట్రోఫీలో ఆడే క్రమంలో ప్రాక్టీసు ముగించుకుని హోటల్‌కు వస్తున్నాం. అదే సమయంలో వేలం జరుగుతోంది. అవీ బరోట్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. అసలు నన్ను ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా అనే సందేహం మొదలైంది. అయితే, వెంటనే ఆర్సీబీ బిడ్డింగ్ మొదలు పెట్టింది. వెంటనే రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీకి వచ్చింది. 1.2 కోట్లు పెట్టి నన్ను కొనుగోలు చేసింది. అప్పుడు నా చుట్టూ ఉన్న జట్టు సభ్యులంతా బస్సులోనే సంబరాలు చేశారు. నా మీద నీళ్లు జల్లుతూ సంతోషంతో కేకలు వేశారు’’ అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా ఉద్విగ్న క్షణాల గురించి గుర్తు చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2021లో సత్తా చాటేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన చేతన్‌ను భారీ మొత్తం వెచ్చించి ఆర్ఆర్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజాగా టైమ్స్ నౌతో మాట్లాడిన చేతన్ సకారియా తన క్రీడా, వ్యక్తిగత జీవితంలోని పలు కీలక అంశాల గురించి పంచుకున్నాడు. ‘‘ 13 ఏళ్ల వయసు నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ఆరంభించాను. అంతకుముందు టెన్నిస్ బాల్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. అయితే, నా తల్లిదండ్రులు మాత్రం ముందు చదువుపై శ్ర్దద్ధ పెట్టు.ఆ తర్వాతే ఆటలు అని చెప్పేవారు. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది వారి కోరిక. కానీ నాకు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. పరీక్షల సమయంలో కూడా క్రికెట్ ఆడటం మానేవాడిని కాదు. అండర్- 16 జట్టుకు నేను ఎంపికైన తర్వాతే నా తల్లిదండ్రులకు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. ఆ తర్వాతే వాళ్లే నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మొదట్లో మేం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే, మా మామయ్య చాలా సాయం చేశారు. ఆయన స్టేషనరీ షాప్ నడిపేవారు. అందులోనే నాకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. తనకు సాయంగా ఉంటే స్కూలు ఫీజులు కట్టడంతో పాటు, క్రికెట్ ఆడటానికి వెళ్లేందుకు డబ్బులు ఇస్తానని చెప్పారు. అలాగే చేశారు కూడా. నేను బౌలర్ కాబట్టి పెద్దగా క్రికెట్ కిట్ల అవసరం కూడా ఉండేది కాదు. ఒక లెఫ్టార్మ్ సీమర్ అయిన నాకు జహీర్ ఖాన్ ఆదర్శం. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఉన్నపుడు ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నా బౌలింగ్ యాక్షన్ బాగుందని మెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ నన్ను కొనడం ద్వారా వచ్చిన 1.2 కోట్ల డబ్బుతో ఇల్లు కొనాలనుకుంటున్నా. ప్రస్తుతం మేం వర్టేజ్ గ్రామంలో ఉంటున్నాం. రాజ్‌కోట్‌లో ఓ ఇల్లు కొని కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్తాను. అయితే, నా తమ్ముడు చనిపోయిన బాధ మాత్రం ఎన్నటికీ వెంటాడుతుంది. నేను తనను చాలా మిస్పవుతున్నా. నేను ఇంట్లో లేనపుడు వాడే అన్ని పనులు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. తన మరణం నాకొక పెద్ద షాక్’’ అని 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ చెప్పుకొచ్చాడు. కాగా చేతన్ సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' -
‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’
న్యూఢిల్లీ: ‘‘గత నెలలో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. మ్యాచ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నా తమ్ముడు ఇక లేడనే విషయం తెలిసింది. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు తమకు తాముగా ఈ విషయం బయటపెట్టలేదు. రాహుల్ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు తొందరగానే వస్తాడు అని చెప్పేవారు. కానీ ఒకానొకరోజు నిజం చెప్పక తప్పలేదు. నా తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ రోజు వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ తనే సంతోషించేవాడు. కానీ తను శాశ్వతంగా దూరమయ్యాడు’’అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతన్ సకారియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి కనబరచగా, రాజస్తాన్ రూ.1.20 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చేతన్‌కు భారీ మొత్తం దక్కడంతో అతడి పంట పండినట్లయింది. అయితే అదే సమయంలో తమ్ముడిని కోల్పోయిన బాధ అతడిని వెంటాడుతోంది. ఈ విషయాల గురించి చేతన్ మాట్లాడుతూ... ‘‘మా నాన్న టెంపో నడుపుతారు. ఆయన సంపాదనతోనే మమ్మల్ని పోషించారు. ఇక ఇప్పుడు ఆయనకు కాస్త విశ్రాంతినివ్వాలని భావిస్తున్నా. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ముందైతే డబ్బు చేతికి రానివ్వండి. రాజ్‌కోట్‌కు షిఫ్ట్ అయిపోతాం. అక్కడే ఒక మంచి ప్రదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలనకుంటున్నా అని చెప్పాను’’ అంటూ తన కలల గురించి చెప్పుకొచ్చాడు. కాగా మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రికార్డు ధరకు(రూ. 16.25 కోట్లు) దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, శివం దూబేను రూ. 4.40 కోట్లు, ముస్తాఫిజుర్ రహమాన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది. ఇక సకారియాను 1.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా, ఆర్ఆర్ అత్యధిక ధరకు కొన్న ఆటగాళ్లలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం పూర్తి వివరాలు చదవండి: ఐపీఎల్ వేలం: అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి!