
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఐదుగురు భారత క్రికెటర్లు అరంగేట్రం చేశారు. సంజూ శాంసన్, నితీశ్ రానా, చేతన్ సకారియా, కె.గౌతమ్, రాహుల్ చహర్ వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టారు. బరోడా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్థానంలో గౌతం, ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, స్పిన్ ద్వయం కుల్దీప్-చహల్ స్థానంలో రాహుల్ చహర్- నితీశ్ రానా, నవదీప్ సైనీకి జంటగా మరో పేసర్‌గా చేతన్ సకారియాకు జట్టులో చోటు కల్పించారు
ఇక భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినివ్వగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ అతడి బాధ్యతలను నెరవేర్చనున్నాడు. కాగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా సిరీస్‌లో చివరిదైన వన్డేలో ఎలాగైనా క్లీన్‌స్వీప్ టీమిండియా భావిస్తుండగా.. నామమాత్రపు మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు తహతహలాడుతోంది.
భారత తుది జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ రాణా, హార్దిక్ పాండ్యా, క్రిష్ణప్ప గౌతం, రాహుల్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా
శ్రీలంక తుది జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీరా, ప్రవీన్ జయవిక్రామ.
🎥 🎥: That moment when the 5⃣ ODI debutants received their #TeamIndia cap!👏 👏 #SLvIND@IamSanjuSamson | @NitishRana_27 | @rdchahar1 | @Sakariya55 | @gowthamyadav88 pic.twitter.com/1GXkO13x5N
— BCCI (@BCCI) July 23, 2021
Comments
Please login to add a commentAdd a comment