India vs Srilanka
-
Asia Cup Final: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌పై, శ్రీలంక.. పాకిస్తాన్‌పై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. అంత కోపమెందుకో?
ICC WC 2023- Ind vs SL- Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో అయ్యర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(92), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(88) టీమిండియా భారీ స్కోరుకు పునాది వేయగా.. అయ్యర్ ఆ పని పూర్తి చేశాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ నలువైపులా షాట్లు బాదుతూ చూడముచ్చటైన ఆటతో ఆకట్టుకున్నాడు. ముంబై మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ 3 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో ఏకంగా 82 పరుగులు రాబట్టాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తనదైన షాట్లు బాదుతూ సొంతమైదానంలో ప్రేక్షకులకు కనువిందు చేశాడు శ్రేయస్ అయ్యర్. View this post on Instagram A post shared by ICC (@icc) గత మ్యాచ్‌లో 4 పరుగులకే అవుటై తీవ్ర విమర్శలపాలైన అతడు గురువారం నాటి మ్యాచ్‌లో తిట్టిన నోళ్లతోనే ప్రశంసించేలా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో లంకపై ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన శ్రేయస్ అయ్యర్‌కు.. ‘‘ఈ వరల్డ్‌కప్ ఆరంభం నుంచి షార్ట్‌బాల్ ఎదుర్కోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా?’’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నను మధ్యలోనే కట్‌చేసిన అయ్యర్.. ‘‘షార్ట్‌బాల్స్ ఎదుర్కోవడం ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ’’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. అది సమస్య అని చెప్పడం లేదు కాదు.. ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నా అని సదరు జర్నలిస్టు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) మీరు చూశారా? ఎందుకీ ప్రచారం? దీంతో తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. ‘‘నేను ఎన్నిసార్లు పుల్‌షాట్లు ఆడాను.. ముఖ్యంగా ఆ తరహాలో ఎన్ని ఫోర్లు కొట్టాను మీరు చూశారా? బంతిని బాదాలని ఫిక్స్ అయితే.. అది షార్ట్బాలా లేక ఇంకేదైనానా అని చూడను. హిట్ చేయాలనుకుంటే చేస్తానంటే.. ఆ క్రమంలో ఓ రెండు మూడుసార్లు నేను బౌల్డ్ అయితే.. ఇక అప్పటి నుంచి.. ‘‘ఇతడు ఇన్‌స్వింగింగ్ బాల్ ఆడలేడు.. కట్ షాట్ ఆడలేడు..’’ అంటూ ప్రచారాలు మొదలుపెడతారా? ఆటగాళ్లుగా పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు. కానీ మీరు ఇలా.. ‘‘అయ్యర్ షార్ట్ బాల్ ఆడలేడు’’ అంటూ ఇష్టారీతిన మీకు నచ్చినట్లు రాసేస్తారు. మిమ్మల్ని చూసి మరికొంత మంది ఇలాగే మాట్లాడతారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. నిజమే కదా! నిజానికి అయ్యర్ షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో గతంలో చాలాసార్లు విఫలమయ్యాడు. అయితే, వాంఖడేలో లంకతో మ్యాచ్‌లో మాత్రం షార్ట్ బంతులను కూడా షాట్లుగా మలిచాడు. ఈ నేపథ్యంలో తన ఆట తీరును సమర్థించుకున్న శ్రేయస్ అయ్యర్.. ఇకపై ఇలాంటి ప్రచారాలు మానేయాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మీకు ఇబ్బంది.. నాకు కాదు ‘‘షార్ట్ బాల్స్ ఆడే క్రమంలో కొన్నిసార్లు అవుటైన కారణంగా మీరలా భావిస్తున్నారే తప్ప.. నాకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. ‘వాస్తవాలు మాట్లాడితే అంత కోపమెందుకు అయ్యర్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసి టీమిండియా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్‌జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సొంతం
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఈవెంట్లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. INDIA Women's Cricket Team wins 𝐆𝐎𝐋𝐃 at the 𝐀𝐬𝐢𝐚𝐧 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟑🥇 pic.twitter.com/o4NPpbqFix — CricTracker (@Cricketracker) September 25, 2023 కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. India women's team defeated Sri Lanka in the Asian Games 2023 final by 19 runs and clinched the Gold medal for the first time.🥇 pic.twitter.com/5Uf3CP1H9Q — CricTracker (@Cricketracker) September 25, 2023 -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్‌ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్‌మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్‌ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
Asia Cup 2023 Final: వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఓ వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన 2023 ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 263 పరుగులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్స్ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ నిర్ధేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా మరో 226 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టీమిండియాకు అతి భారీ విజయం.. వన్డే క్రికెట్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో భారత్ 263 బంతులు మిగిలుండగానే, వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు బంతుల పరంగా టీమిండియాకు అతి భారీ విజయం 2001లో కెన్యాపై దక్కింది. నాటి మ్యాచ్‌లో భారత్ 231 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే టోర్నీ ఫైనల్స్‌లో మూడవది.. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఓ వన్డే టోర్నీ ఫైనల్స్‌లో ఈ ఘనత (10 వికెట్ల తేడాతో విజయం) మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓ వన్డే టోర్నీ (కోకో కోలా కప్) ఫైనల్స్‌లో 1998లో భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి ఫైనల్స్ భారత్.. జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. కేవలం 129 బంతుల్లో మ్యాచ్ ముగిసింది.. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్ 2023 ఫైనల్స్ బంతుల పరంగా మూడో అతి చిన్న మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 129 బంతుల్లో (రెండు ఇన్నింగ్స్) ముగిసింది. శ్రీలంక 15.2 ఓవర్లు.. భారత్ 6.1 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి. బంతుల పరంగా అతి చిన్న మ్యాచ్ 2020లో నేపాల్-యూఎస్ఏ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ కేవలం 104 బంతుల్లో ముగిసింది. ఇదిలా ఉంటే, 2023 ఆసియా కప్ టైటిల్‌ను భారత్ ఎనిమిదో సారి ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్
20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చరిత్ర సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో దునిత్ ఈ ఘనత సాధించాడు. దునిత్ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉండేది. బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్ కర్నైన్ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దునిత్ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించి, టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇతన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. దునిత్ సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్క వికెట్లు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. దునిత్‌కు మరో స్పిన్నర్ మహీష్ తీక్షణ (8-0-29-4) కూడా తోడవ్వడంతో భారత్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ (53), ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0) ఔట్ కాగా.. అక్షర్ (15), సిరాజ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. -
Asia Cup 2023: లంకేయుల జైత్రయాత్రకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా..?
వన్డేల్లో వరుసగా 13 విజయాలు సాధించి జోరుమీదున్న శ్రీలంకకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా అన్న ప్రశ్నపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతుంది. టీమిండియా తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని మెజార్టీ శాతం లంకేయుల జైత్రయాత్రకు బ్రేక్ పడటం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. కొందరేమో లంకేయులు హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని టీమిండియాకు షాకిస్తుందని అంటుంటే, మరికొందరు శ్రీలంకకు అంత సీన్ లేదని ఆ జట్టును తేలిగ్గా తీసిపారేస్తున్నారు. మరి ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. Can Sri Lanka continue their winning streak against India?#INDvSL pic.twitter.com/wcUfm1yRxJ— CricTracker (@Cricketracker) September 12, 2023 పై పేర్కొన్న అంశంపై మెజార్టీ శాతం అభిప్రాయం మేరకు టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటకీ, ఒక్క విషయంలో మాత్రం లంకేయుల విన్నింగ్ ఛాన్సస్ను కొట్టిపారేయడానికి వీళ్లేదు. ఆ విషయం ఏంటంటే.. టీమిండియా ఎంతటి ఫామ్‌లో ఉన్నా, గంటల వ్యవధిలో బరిలోకి దిగాల్సి రావడం (నిన్ననే పాక్‌తో మ్యాచ్) ఆ జట్టుకు పెద్ద ప్రతికూలాంశంగా మారింది. ఎంతటి మేటి జట్టైనా ఇలా గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడితే సత్ఫలితాలు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు శ్రీలంకకు హోమ్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. దీనికి తోడు ఆ జట్టు ఇటీవలికాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతుంది. ప్రస్తుత మ్యాచ్‌లోనూ వారు టీమిండియా టాప్-3 బ్యాటర్లను కేవలం 11 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపారు. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే (4-1-10-3) భారత టాపార్డర్‌కు చుక్కలు చూపించాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (53), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3) ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ (11), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు. -
వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి.. టాప్-5లోకి ఎంట్రీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 283 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్‌కు చేరే అవకాశం ఉంది. టాప్ ర్యాంక్‌లో 887 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాబర్‌ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను సిరాజ్ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. -
మా సంజూ ఎక్కడ? ఇదిగో ఇక్కడ .. శభాష్ సూర్య! వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తన సొంత రాష్ట్రం కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేరళలో మ్యాచ్ జరిగిందింటే చాలు సంజూ జట్టులో లేకపోయినా అభిమానుల సందడి మాములుగా ఉండదు. తాజాగా మరోసారి సంజూ అభిమానులు అతడిపై ప్రేమను చాటుకున్నారు. భారత్-శ్రీలంక మధ్య మూడో వన్డే తిరువనంతపురం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టేడియమంతా సంజూ పేరుతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను.. మా సంజూ ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నించారు. ఈ క్రమంలో సూర్యకుమార్ తన సమాధానంతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. సంజూ మా గుండెల్లో ఉన్నాడంటూ సూర్య సైగ చేశాడు. దీంతో ఒక్క సారిగా అభిమానుల కేకలతో స్టేడియం దద్దరిల్లపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు శాంసన్ భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు. అయితే ముంబై వేదికగా తొలి టీ20లో గాయపడిన సంజూ.. సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఈ కేరళ ఆటగాడికి జట్టు దక్కలేదు. అయితే సంజూను ఎందుకు ఎంపిక చేయలేదన్న సృష్టత బీసీసీఐ ఇవ్వలేదు. కాగా సంజూ ఇంకా మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs SL 3rd ODI: టీమిండియా ప్రపంచ రికార్డుతో పాటు.. ఈ ఘనతలు కూడా! ఆసీస్‌ను దాటేసి.. "Where is Sanju?" and Surya replied "He is in our heart". 😍#SanjuSamson 🤝#SuryakumarYadav pic.twitter.com/CZ3vuDWQRK — Heart Broken 💔 (@Sachin_Gandhi7) January 16, 2023 -
IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలకపోరుకు సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18(బుధవారం)న జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టు సోమవారం హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక రోహిత్ సేన మంగళవారం మధ్యాహ్నం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక ఇప్పటికే బాగ్యనగరానికి చేరుకున్న ప్రత్యర్ధి న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్‌లో మునిగితేలుతుంది. కాగా ఈ సిరీస్‌కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సో షిప్లీ చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! Virat Kohli Has Arrived In Hyderabad Ahead Of The ODI Series Against NZ.#ViratKohli #INDvNZ @imVkohli pic.twitter.com/RXZuQrbuCu — virat_kohli_18_club (@KohliSensation) January 16, 2023 -
సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!
Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్ ఈ రకంగా ట్వీటాడు. "Tiger hunts every 4-7 days". Must be true as it's been 4 days since this knock 😉 #INDvSL https://t.co/OzhCRl7sGz — Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2023 సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్‌లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్ అని అర్ధం వచ్చేలా జాఫర్ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్‌ను ఆస్వాధిస్తున్నారు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్‌లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్‌లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్‌ను అందుకున్న కింగ్ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్ బ్యాక్ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది. -
సంక్రాంతి అంటే కోహ్లికి పూనకాలే.. పండగ రోజు కింగ్ ఎన్ని శతకాలు కొట్టాడంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కింగ్ బద్దలు కొట్టిన అరుదైన రికార్డుల జాబితాలో ఓ అసాధారణ రికార్డు దాగి ఉందన్న విషయం మనలో చాలామంది గమనించి ఉండరు. Virat Kohli on 15th January:- In 2017 - 122(102) vs ENG in ODIs. In 2018 - 153(217) vs SA in Tests. In 2019 - 104(112) vs AUS in ODIs. In 2023 - 166*(110) vs SL in ODIs. pic.twitter.com/1e9qG6KoYW — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 అదేంటంటే.. కింగ్ కోహ్లికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూనకం వస్తుంది. ఈ పర్వదినాన (జనవరి 15) కోహ్లి ఏకంగా 4 సెంచరీలు బాదాడు. 2017 సంక్రాంతి రోజున ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. Declare 15th January as "Virat Kohli Day"@imVkohli pic.twitter.com/DVHA476m5E — Pratham. (@75thHundredWhen) January 15, 2023 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన కింగ్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది సంక్రాంతి తనకెంత అచ్చొచ్చిన పండగో మరోసారి చాటాడు. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ పరిమాణాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. A good day on the field and it was wonderful to watch @ShubmanGill & @imVkohli bhai bat today. Congratulations on your 100s and thanks to the almighty for giving me this opportunity to contribute in team’s biggest win. Shukar 🙏🇮🇳 @BCCI pic.twitter.com/ZDAVMRL250 — Mohammed Siraj (@mdsirajofficial) January 15, 2023 సంక్రాంతి రోజు కోహ్లి శతక్కొట్టుడు గణాంకాలను చూసిన అభిమానులు జనవరి 15ను 'విరాట్ కోహ్లి డే' గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేదిక ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సంక్రాంతి రోజు మ్యాచ్ ఉందంటే కింగ్‌కు పూనకం వస్తుంది.. ఈ రోజు ప్రత్యర్ధులు ఎంతటి వారైనా జాగ్రత్తగా ఉండాలని కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. Milestone of Virat Kohli today: 46th ODI Hundreds. 74th International Hundred. Most Hundreds in 2023. His 2nd highest score in ODIs. 10th ODI Hundred vs SL, first ever. Highest ever score in Greenfield. Most Sixes in an innings in his ODI career. 2nd Hundred in this series. pic.twitter.com/mES2axrI9N — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 కాగా, లంకపై సూపర్ సెంచరీతో పలు రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. కెరీర్లో 46వ వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో శ్రీలంకపై 10వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓ ప్రత్యర్ధిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ సెంచరీ సాధించే క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, లంకతో మూడో వన్డేలో కోహ్లి విధ్వంసకర శతకంతో పాటు శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్ (2/16) ధాటికి 73 పరుగులకే ఆలౌటై, 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. -
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు: సునీల్ గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో విరాట్ చెలరేగాడు. అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమానార్హం. కాగా కింగ్ కోహ్లికి ఇది 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు విరాట్ మరింత చేరువయ్యాడు. మరో నాలుగు సెంచరీలు ఈ రన్‌మిషన్ సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి ఎప్పుడు బ్రేక్ చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అదే విధంగా విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడితే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దల కొట్టగలడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి కావల్సిన సెంచరీలు కేవలం మూడు మాత్రమే. కాబట్టి ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని నేను భావిస్తున్నాను. కోహ్లి విశ్రాంతి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తడనడంలో ఎటువంటి సందేహం లేదని" గవాస్కర్ పేర్కొన్నాడు. అదేవిధంగా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు గురించి సన్నీ మాట్లాడుతూ.. ఒక వేళ కోహ్లి మరో 5-6 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే కచ్చితంగా సచిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు సగటున సంవత్సరానికి సెంచరీలు చేసినా సచిన్‌ను ఈజీగా అధిగమిస్తాడు. అతడు తన వయస్సు 40 ఏళ్ల వచ్చే వరకు ఆడితే వచ్చే 5-6 సంవత్సరాలలో మరో 26 సెంచరీలు సాధించగలడు. సచిన్ కూడా 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు. కోహ్లికి కూడా అద్భుతమైన ఫిట్నెస్ ఉంది. కాబట్టి విరాట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అతడు అన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! -
శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త అవతారమెత్తాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసిన అయ్యర్ అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 18 ఓవర్ వేసేందుకు బంతిని కెప్టెన్ రోహిత్ శర్మ అయ్యర్ చేతికి అందించాడు. ఈ క్రమంలో వేసిన తొలి బంతినే అయ్యర్ అద్భుతంగా టర్న్ చేశాడు. అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్.. అయ్యర్ వేసిన బంతిని చూసి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ఒక్క ఓవర్ మాత్రమే వేసిన అయ్యర్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో లంకపై 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో ముగించిన భారత్.. తమ తదుపరి పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. చదవండి: సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్ శర్మ Shreyas Iyer's bowling spin and Virat Kohli were surprised that it turned so much😂. PS- He bowls both legs and off-spin#INDvSL #ViratKohli𓃵 #ShreyasIyer pic.twitter.com/RuYJqMfTiC — Gaurav jain (@GauravJ43304117) January 15, 2023 -
సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. తిరువంతపురం వేదికగా ఆదివారం లంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి వన్డే విజయంలో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, గిల్, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌లో కోహ్లి, గిల్ సెంచరీలతో చెలరేగగా.. అనంతరం బౌలింగ్‌లో సిరాజ్ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా సిరాజ్ తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించిడానికి ఆఖరి వరకు ప్రయత్నించాడు. ఇక తన బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టిన సిరాజ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ లాంటి టాలెంట్ ఉన్న చాలా అరుదగా ఉంటాడాని రోహిత్ కొనియాడాడు. ఇక ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. సిరీస్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. "ఇది మాకు అద్భుతమైన విజయం. ఈ సిరీస్‌లో మాకు చాలా పాజిటివ్ ఆంశాలు ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా కూడా మేము చక్కగా రాణించాం. అదే విధంగా మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు సాధించారు. ముఖ్యంగా సిరాజ్ ఈ సిరీస్ అసాంతం అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా సిరాజ్ లో చాలా మార్పు వచ్చింది. అతడు రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడు. అతడు తన ఇన్‌స్వింగ్ బౌలింగ్‌తో జట్టుకు పవర్ ప్లేలో శుభారంభం అందిస్తున్నాడు. సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. అదే విధంగా ఆఖరి మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టుకు మరింత లాభం చేకూరుతుంది. ప్రస్తుతం మా దృష్టి అంతా న్యూజిలాండ్ సిరీస్‌పై ఉంది. పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించి వచ్చిన న్యూజిలాండ్‌ను ఓడించడం అంత సులభం కాదు"అని పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! Captain @ImRo45 collects the trophy as #TeamIndia seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣👏👏 Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2 pic.twitter.com/KmCAFDfpUe — BCCI (@BCCI) January 15, 2023 -
శ్రీలంక చిత్తు.. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా (ఫొటోలు)
-
వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సంచలన రనౌట్‌తో మెరిసిన సిరాజ్.. ఏక పాక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఈ మ్యాచ్‌లో సంచలన రనౌట్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కరుణరత్నే నాన్‌స్ట్రైకర్ వైపు డిఫెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్ సమయస్ఫూర్తితో రెప్పుపాటులోనే స్ట్రైకర్ వైపు స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తను క్రీజులో ఉన్నానని భావించిన కరుణరత్నేకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే కరుణరత్నే క్రీజుకు కొంచెం వెలుపుల ఉన్నట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: ఇదేం ఆనందంరా బాబు.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్ pic.twitter.com/F3EpqK649o — The sports 360 (@Thesports3601) January 15, 2023 -
ఇదేం ఆనందం.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. కోహ్లి 110 బంతుల్లో 166 నాటౌట్ (13 ఫోర్లు, 8 సిక్స్‌లు), గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. బంతికి ఫోటో తీసిన ఫ్యాన్ కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో 45 ఓవర్ వేసిన కరుణరత్నే బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి లాంగ్ ఆన్ దిశగా స్టాండ్స్‌కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు. అయితే ఆ ఫ్యాన్ బంతిని తిరిగివ్వకుండా ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తరువాతి బంతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్న కోహ్లి.. అభిమాని చర్యను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడు బంతిని తిరిగి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్ pic.twitter.com/Vn6k6xPwFT — MINI BUS 2022 (@minibus2022) January 15, 2023 pic.twitter.com/PeolYUFd4T — IPLT20 Fan (@FanIplt20) January 15, 2023 -
ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్లో విరాట్‌కు ఇది 46 సెంచరీ. ఈ సిరీస్‌లో కింగ్‌కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. హెలికాప్టర్ షాట్ కొట్టిన విరాట్ ఈ మ్యాచ్‌లో అద్భతమైన హెలికాప్టర్ షాట్ బాదిన విరాట్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన కసున్ రజిత బౌలింగ్‌లో నాలుగో బంతిని ఫ్రంట్‌ఫుట్ వచ్చిన విరాట్ లాంగ్ ఆన్ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. విరాట్ అద్భుతమైన షాట్ చూసిన అభిమానులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? 📹 Mighty Maximum - a 97m SIX from Virat Kohli 👀👀 Live - https://t.co/q4nA9Ff9Q2 #INDvSL @mastercardindia pic.twitter.com/R3CzXTWBT5 — BCCI (@BCCI) January 15, 2023 -
గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే?
తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతుండగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్ కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక శ్రీలంకతో ఆఖరి వన్డేల్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో సంచలన సెంచరీతో కోహ్లి చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. A fan invaded the field and touched Virat Kohli's feet. pic.twitter.com/wualIoFgZ8 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2023 చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డులు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో విరాట్‌కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►శ్రీలంకపై విరాట్‌కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్‌తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ►ఇక భారత గడ్డపై విరాట్‌కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ సచిన్‌ను అధిగిమించాడు. ►అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 5303 రన్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ప్రపంచ వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై కివీస్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్‌తో కివీస్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. చెలరేగిన సిరాజ్, షమీ 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. . భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదరగొట్టిన కోహ్లి, గిల్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. చదవండి: IND vs SL: మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం -
మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. కాగా ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే పరుగుల తేడాతో ఇదే భారీ విజయం కావడం విశేషం. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్ ఆషాన్ బండారకు గాయం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంకబ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! -
తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన చమికా కరుణరత్నే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపడానికి వచ్చిన వాండర్సే, బండారా ఒకరిని ఒకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన ఫిజియో పరిశీలించాడు. అనంతరం వీరిద్దరిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువెళ్లారు. సెంచరీలతో చెలరేగిన గిల్, కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు.