Ind vs SL 3rd ODI: Shubman Gill Hits Second Ton in His ODI Career - Sakshi
Sakshi News home page

IND VS SL 3rd ODI: శతక్కొట్టిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌

Published Sun, Jan 15 2023 3:45 PM | Last Updated on Sun, Jan 15 2023 4:43 PM

IND VS SL 3rd ODI: Shubman Gill Hits Second Ton In His ODI Career - Sakshi

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (89 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో టీమిండియా స్కోర్‌ 31 ఓవర్ల తర్వాత 202/1గా ఉంది.

గిల్‌కు జతగా విరాట్‌ కోహ్లి (48 బంతుల్లో 50; 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి చమిక కరుణరత్నే బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్‌ ఇదివరకు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement