Viral Video: Virat Kohli gives priceless reaction seeing Shreyas Iyer's spin bowling - Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ బౌలింగ్‌.. కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో వైరల్‌

Published Mon, Jan 16 2023 12:47 PM | Last Updated on Mon, Jan 16 2023 1:25 PM

Virat Kohli gives priceless reaction seeing Shreyas Iyer spin Bowling - Sakshi

PC: TWitter

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సరికొత్త అవతారమెత్తాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసిన అయ్యర్‌ అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 18 ఓవర్‌ వేసేందుకు బంతిని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అయ్యర్‌ చేతికి అందించాడు. ఈ క్రమంలో వేసిన తొలి బంతినే అయ్యర్‌ అద్భుతంగా టర్న్‌ చేశాడు.

అయితే స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌.. అయ్యర్‌ వేసిన బంతిని చూసి షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ఒక్క ఓవర్‌ మాత్రమే వేసిన అయ్యర్‌ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో లంకపై 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్‌.. సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక​ శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో ముగించిన భారత్‌..  తమ తదుపరి పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. జనవరి 18న హైదరాబాద్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే జరగనుంది.
చదవండిసిరాజ్‌ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement