గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 67పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగల్గింది. లంక కెప్టెన్ దసున్ షనక(108) ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
లంక బ్యాటర్లలో షనకతో పాటు ఓపెనర్ నిస్సాంక 72 పరుగులతో అకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, షమీ,హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జనవరి 12న జరగనుంది.
చదవండి: IND vs SL: వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment