టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరనీ అకట్టుకుంటున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో 7 వికెట్లతో ఉమ్రాన్ సత్తాచాటాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్ కూడా ఉమ్రానే కావడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో అదరగొట్టిన ఉమ్రాన్‌పై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్‌తో ఉమ్రాన్‌ను జడేజా పోల్చాడు.
ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్‌లు చాలా అరుదగా ఉంటారు. భారత్‌లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్ వంటి స్పీడ్ స్టార్‌ను చూశాను. గతంలో జావగల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్‌తో బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం మాలిక్‌ను చూస్తుంటే నాకు శ్రీనాథ్ గుర్తుస్తున్నాడు. ఉమ్రాన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అతడి లాంటి ఆణిముత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ముఖ్యంగా టెయిలండర్‌లు క్రీజులో ఉన్నప్పుడు అతడిని బౌలింగ్‌కు తీసుకురండి. ఉమ్రాన్ స్పీడ్‌కు వాళ్లు తట్టుకోలేరు. అతడిని 10 సార్లు తీసుకువస్తే 8 సార్లు వికెట్లు తీయగలడు అని జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్ మాలిక్ లంకతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment