Ajay Jadeja
-
భారత్ విజయంపై ఆశలు పెట్టుకోవద్దు: జడేజా
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. ప్రత్యర్ధి ముందు కేవలం 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు.అయితే టీమిండియా ఇప్పటివరకు ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని ఒకే ఒక్కసారి కాపాడుకుంది 2004లో వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో చారిత్రత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో భారత జట్టు కూడా అదే అద్భుతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత గెలుపుపై ఆశలు పెట్టకోవద్దని జడేజా తెలిపాడు."107 పరుగులను భారత్ డిఫెండ్ చేసుకుంటే నిజంగా చాలా గ్రేట్. కానీ వాస్తవం మాట్లాడుకుంటే టీమిండియా గెలవడం చాలా కష్టం. ఐదో రోజు ఉదయం తేమ ఎక్కువగా ఉంటుంది. భారత్ పేస్ బౌలింగ్‌తో ఆటను ప్రారంభిస్తారు. కాబట్టి బంతి పెద్దగా స్వింగ్ అవుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ పిచ్ పేసర్లకు సహకరించి ఒకట్రెండు వికెట్లు పడినా, ఆ పరిస్థితులను అడ్వాంటేజ్ తీసుకునేందుకు భారత్ వద్ద మూడవ సీమర్ లేరు" అని జడేజా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఇద్దరు పేసర్లతోనే ఆడుతోంది. ఆకాశ్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు.చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా? -
సంపన్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించిన అజయ్ జడేజా
భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా రాత్రికి రాత్రి అపర కుబేరుడైపోయాడు. జామ్‌నగర్ రాజ సింహాసనాన్ని వారసత్వంగా పొందిన తరువాత భారతదేశపు అత్యంత ధనిక క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో భారత దేశపు అత్యంత సంపన్న క్రికెటర్ విరాట్ కోహి ఆస్తిని అధిగమించాడు. జడేజా నికర విలువ రూ. 1,450 కోట్లు కాగా.. కోహ్లి నికర విలువ రూ. 1,090 కోట్లుగా ఉంది. కాగా, అక్టోబర్ 12న దసరా శుభ సందర్భంగా నవనగర్‌ను పాలిస్తున్న జామ్ సాహెబ్ మహారాజా శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్సింహ్జీ జడేజా తన వారసుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాజకుటుంబంలో సుప్రసిద్ధ వ్యక్తి , భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తన వారసుడిగా ప్రకటించారు. అజయ్ జడేజా.. మహారాజా శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్సిన్హ్జీ జడేజాకు స్వయానా మేనల్లుడు.అజయ్ జడేజా వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన జామ్‌నగర్ రాజకుటుంబానికి భారత క్రికెట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీవాళీ క్రికెట్లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలకు వీరి కుటుంబసభ్యులైన K.S.రంజిత్సింహ్జీ, K.S. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టారు.జడేజా క్రికెట్లో తన పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అజయ్ జడేజా.. భారత్ జట్టు తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు. ఇందులో 6 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు చేశాడు. జడేజా వన్డేల్లో 20 వికెట్లు కూడా తీశాడు. 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్ సగటు క్రికెట్ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చినవే కావడం విశేషం.చదవండి: శుభ్‌మన్ గిల్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు అనుమానం..? -
మాహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?
జామ్‌నగర్ రాజకుటుంబం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తమ కుటుంబం తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ అజేయ్ జడేజాను ఎంపికచేసింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్సింహ్జీ.. అజయ్ జడేజాను అధికారికంగా తన వారసుడిగా ప్రకటించారు. "పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజైనా దసరా పర్వదినం సందర్భంగా, అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాము. నా వారసుడిగా అతడు సింహాసనాన్ని అధిష్టించనున్నాడు. ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. థంక్యూ ఆజేయ్" అని ఓ ప్రకటనలో శత్రుసల్యాసిన్హ్జీ పేర్కొన్నారు. కాగా అజయ్ జడేజా వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన జామ్‌నగర్ రాజకుటుంబానికి భారత క్రికెట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీవాళీ క్రికెట్లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన K.S.రంజిత్సింహ్జీ K.S. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టారు.ఇక జడేజా క్రికెట్లో కూడా తన పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాడు. 1990లో భారత క్రికెట్ చూసిన గొప్ప క్రికెటర్లలో జడేజా ఒకడు. 1992 నుంచి 2000 వరకు 15 టెస్టులు, 196 వన్డేల్లో భారత జట్టుకు అజేయ్ ప్రాతినిథ్యం వహించాడు.ముఖ్యంగా 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్ సగటు క్రికెట్ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది. జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చినవే కావడం గమనార్హం.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
అదంతా చూస్తూ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు: గంగూలీ
ICC WC 2023: వన్డే ప్రపంచకప-2023లో అఫ్గనిస్తాన్ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాని రీతిలో సెమీస్ రేసులో నిలిచి మేటి జట్లకు సవాల్ విసిరింది. స్పిన్ మాత్రమే అఫ్గన్ బలం అనుకున్న వాళ్లకు బ్యాటింగ్‌లోనూ తాము తక్కువేం కాదంటూ యువ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నిరూపించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జద్రాన్ అఫ్గన్ తరఫున వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. లీగ్ దశలో ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగింట జట్టును గెలిపించి హష్మతుల్లా సైతం సారథిగా తన ముద్ర వేయగలిగాడు. అయితే, అఫ్గన్ విజయాల వెనుక టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పాత్ర కీలకం అన్న విషయం తెలిసిందే. మెంటార్‌గా జట్టుకు మార్గదర్శనం చేసి ఈస్థాయిలో నిలిపిన ఘనత అతడి దక్కుతుంది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2023లో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించిన అఫ్గనిస్తాన్.. ఐదుసార్లు జగజ్జేత అయిన ఆస్ట్రేలియాను కూడా ఓడించేలా కనిపించింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా 291 పరుగులు సాధించిన హష్మతుల్లా బృందం.. ఆరంభంలోనే వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలో అజయ్ జడేజాతో పాటు అఫ్గనిస్తాన్ శిబిరం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్‌రూంలో కదలికల వల్ల సైట్స్క్రీన్ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కంప్లైంట్ చేశాడు. దీంతో అతడిని కవ్వించేలా జడేజా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాక్సీ వచ్చాక సీన్ రివర్స్ కానీ గ్లెన్ మాక్స్వెల్ రాకతో సీన్ మారిపోయింది. అప్పటిదాకా అఫ్గనిస్తాన్ చేతిలో ఉందనుకున్న మ్యాచ్ చేజారిపోయింది. మిస్‌ఫీల్డ్, క్యాచ్డ్రాప్ల మూలంగా మాక్సీకి లైఫ్ దొరకగా.. అతడు ఏకండా అజేయ ద్విశతకం బాదాడు. అఫ్గన్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అనూహ్య రీతిలో విజయం అందించి సెమీస్ చేర్చాడు. జడేజా ఏడ్చే ఉంటాడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాక్స్వెల్ క్రీజులో పాతుకుపోయినపుడు అఫ్గనిస్తాన్ బౌలర్లు ఎక్కువగా స్ట్రెయిట్ బౌలింగే చేశారు. అప్పటికే అతడు గాయపడ్డాడు అయినా కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇచ్చారు. ఇదంతా చూస్తూ అజయ్ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు. మాక్సీ నిలబడి ఉన్నచోటే బౌండరీలు, సిక్సర్లు బాదాడు. అసలు మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినట్లుగా అనిపించలేదు. ఏదేమైనా వన్డేల్లో ఇది అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది’’ అని కోల్‌కతా టీవీతో ముచ్చటిస్తూ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: లబుషేన్‌ను డ్యాన్స్‌తో కవ్వించిన జడేజా! వీడియో వైరల్
అఫ్గనిస్తాన్ మెంటార్, టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ట్రోల్ చేశాడు. తమపై ఫిర్యాదు చేసినందుకు డ్యాన్స్‌తో అతడిని కవ్వించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకు గెలుపు అత్యవసరం. ఇలాంటి కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోరు రాబట్టింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అజేయ శతకం కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, ఆస్ట్రేలియా వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడింది. అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను డకౌట్ చేసి శుభారంభం అందించాడు. ఆరో ఓవర్ నాలుగో బంతికి మిచెల్ మార్ష్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. దీంతో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఇలాంటి తరుణంలో.. క్రీజులోకి వచ్చిన నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్.. ఎనిమిదో ఓవర్ ఆరంభంలో సైట్స్క్రీన్ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ కంప్లైంట్ చేశాడు. అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్‌రూంలో కదలికల కారణంగా ఇబ్బంది కలుగుతోందని అసహనం ప్రదర్శించాడు. ఈ విషయాన్ని గమనించిన అజయ్ జడేజా చిన్నగా డ్యాన్స్ చేస్తూ లబుషేన్‌ను సరదాగా ట్రోల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అఫ్గన్ బౌలర్ల విజృంభణ కారణంగా 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా కష్టాల్లో కూరుకుపోయింది. సెంచరీ పూర్తి చేసుకున్న ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. Lmao not Ajay Jadeja dancing after Labuschagne's complain😭😭😭😭😭 pic.twitter.com/rnWojWgDxM — P.💍 (@PrajaktaSharma8) November 7, 2023 -
CWC 2023: ఆఫ్ఘన్ల విజయాల వెనుక మన "అజేయుడు"
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరుస సంచలనాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడిషన్‌లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఆతర్వాత 1992 వరల్డ్‌కప్ విన్నర్ పాకిస్తాన్‌ను, తాజాగా 1996 వరల్డ్ ఛాంపియన్స్ శ్రీలంకను మట్టికరిపించారు. పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో లంకేయులను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆఫ్ఘన్లు.. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయాలని ఆశిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్ ఆఫ్ఘన్లు ఈ తరహాలో రెచ్చిపోవడం వెనుక ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆఫ్ఘన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ కాగా.. రెండవ వ్యక్తి ఆ జట్టు మెంటార్ ఆజయ్ జడేజా. గతంలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజా.. ఆఫ్ఘన్లకు క్రికెట్‌తో పాటు క్రికెటేతర విషయాల్లోనూ తోడ్పడుతూ వారి విజయాలకు దోహదపడుతున్నాడు. వాస్తవానికి జట్టులో మెంటార్ పాత్ర నామమాత్రమే అయినా జడేజా మాత్రం ఆఫ్ఘన్లకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. వన్ టు వన్ కోచింగ్‌తో పాటు జట్టు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తన టైమ్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా చలామణి అయిన జడేజా.. ఆఫ్ఘన్లకు ఫీల్డింగ్ మెళకువలు కూడా నేర్పుతున్నాడు. అలాగే భారత్‌లో స్థితిగతులపై అవగాహన లేని చాలామంది ఆఫ్ఘన్ క్రికెటర్లకు తోడ్పాటునందిస్తున్నాడు. జడేజా మెంటార్షిప్లో ఆఫ్ఘన్లు మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా, 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడాడు. జడేజా టీమిండియాకు 13 వన్డేల్లో నాయకత్వం వహించాడు. 15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. -
అఫ్గానిస్తాన్ సంచలనాల వెనుక ఇండియన్ లెజెండ్.. ఎవరంటే?
అఫ్గానిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023లో పెను సంచలనాలు నమోదు చేస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గాన్.. వరల్డ్‌క్లాస్ జట్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ మెగా టోర్నీలో మొన్నటికి మొన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆఫ్గాన్స్.. ఇప్పుడు పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. ధర్మశాల వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో తేడాతో ఆఫ్టానిస్తాన్ విజయం సాధించింది. వన్డే క్రికెట్లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం ఈ విజయంతో అఫ్గాన్ తాము పసికూనలు కాదని క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే అఫ్గాన్ చరిత్రాత్మక విజయాల వెనక భారతీయుడి పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ మెగా టోర్నీకి ముందు కేవలం వారం రోజుల ముందే జట్టుతో కలిసిన అతడు.. ఆఫ్గాన్‌ను పసికూనలా కాదు పులిలా తాయారు చేశాడు. అతడో ఎవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం అజేయ్ జడేజా. వన్డే ప్రపంచకప్-2023కు ముందు అజేయ్ జడేజాను తమ జట్టు మోంటార్, అస్టెంట్ కోచ్‌గా ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు నియమించింది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అజయ్ జడేజా సాయంతో ప్రణాళికలను సిద్దం చేసుకొని అఫ్గాన్ బరిలోకి దిగుతోంది. జడేజా ఎంట్రీ.. అఫ్గాన్స్ అదుర్స్ జడేజా మెంటార్‌గా తన బాధ్యతలు చేపట్టనప్పటినుంచి ఆఫ్గానిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా మిగితా అన్నింటిల్లోనూ ప్రత్యర్ధి జట్లకు గట్టిపోటి ఇచ్చింది. ఇంగ్లండ్ వంటి వరల్డ్‌క్లాస్ జట్టుకే ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించింది. రాబోయే రోజుల్లో ఆఫ్గాన్ జడేజా నేతృత్వంతో మరింత రాటుదేలే అవకాశం ఉంది. జడేజా తన అనుభవంతో మరిన్ని సంచలానాలు సృష్టించేలా ఆఫ్గాన్స్ను తాయారు చేస్తాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు. టీమిండియాలో పవర్ హిట్టర్.. భారత క్రికెట్ చరిత్రలో అజయ్ జడేజాకు పవర్ హిట్టర్‌గా పేరుంది. ఎన్నో మ్యాచ్‌లను జడేజా ఒంటి చేత్తో గెలిపించాడు. మూడు వరల్డ్‌కప్‌లు టోర్నీలు ఆడిన భారత జట్టులొ జడేజా సభ్యునిగా ఉన్నాడు. జడేజా తన కెరీర్లో 196 వన్డేలు, 15 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 576 పరుగులు చేసిన జడేజా.. వన్డేల్లో 5359 పరుగులు ఉన్నాయి. 13 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. పాకిస్తాన్‌పై సూపర్ రికార్డు.. అజేయ్ జడేజాకు పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. పాకిస్తాన్ అంటే జడేజాకు పూనకలే. మొత్తంగా పాక్‌పై 40 మ్యాచ్‌లు ఆడిన అజయ్ 892 పరుగులు చేశాడు. బౌలర్‌గా రెండు వికెట్లు తీశాడు. తన అనుభవాన్ని ఆఫ్గాన్ యువ క్రికెటర్లు పంచిన అజేయ్.. పాకిస్తాన్‌ను చిత్తు కావడానికి పరోక్షంగా కారణమయ్యాడు. చదవండి: చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్ కెప్టెన్ -
వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్
త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు జడేజాతో ఒప్పందం కుదుర్చుకుంది. 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో అంతగా ప్రభావం చూపని ఈ గుజరాత్ ఆల్‌రౌండర్, వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. 15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే జడేజా ధాటిగా ఆడటంలో సిద్ధహస్తుడు. తమ జమానాలో జడేజా ఎంతటి బౌలింగ్‌లోనైనా అలవోకగా సిక్సర్లు బాదేవాడు. 1996 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జడేజా 25 బంతుల్లో 45 పరుగులు చేసి, నాటి అరివీర భయంకరుడైన ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్‌కు ముచ్చెమటలు పట్టించారు. మీడియం పేస్ బౌలర్‌గానూ అడపాదడపా రాణించిన జడేజా వన్డేల్లో 20 వికెట్లు పడగొట్టాడు. జడేజాకు అంతర్జాతీయ వన్డేలతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఏ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. జడేజా 111 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 20 సెంచరీలు, 40 అర్ధసెంచరీల సాయంతో 8100 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 264 పరుగులుగా ఉంది. ఈ ఫార్మాట్లో జడేజా 54 వికెట్లు కూడా పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 291 మ్యాచ్‌లు ఆడిన జడేజా 11 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 8304 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను 49 వికెట్లు పడగొట్టాడు. జడేజా పుట్టింది గుజరాత్లో అయినా దేశవాలీ క్రికెట్ మాత్రం ఎక్కువగా హర్యానాకు ఆడాడు. జడేజా హర్యానాతో పాటు జమ్మూ అండ్ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్ జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జర్నీ అక్టోబర్ 7న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 11న టీమిండియాతో తలపడుతుంది. అక్టోబర్ 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లో వరల్డ్‌కప్ ప్రారంభమవుతుంది. భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరుగనుంది. వరల్డ్‌కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ను ఢీకొంటుంది. -
'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు'
టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరనీ అకట్టుకుంటున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో 7 వికెట్లతో ఉమ్రాన్ సత్తాచాటాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్ కూడా ఉమ్రానే కావడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో అదరగొట్టిన ఉమ్రాన్‌పై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్‌తో ఉమ్రాన్‌ను జడేజా పోల్చాడు. ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లు చాలా అరుదగా ఉంటారు. భారత్‌లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్ వంటి స్పీడ్ స్టార్‌ను చూశాను. గతంలో జావగల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్‌తో బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం మాలిక్‌ను చూస్తుంటే నాకు శ్రీనాథ్ గుర్తుస్తున్నాడు. ఉమ్రాన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అతడి లాంటి ఆణిముత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ముఖ్యంగా టెయిలండర్లు క్రీజులో ఉన్నప్పుడు అతడిని బౌలింగ్‌కు తీసుకురండి. ఉమ్రాన్ స్పీడ్‌కు వాళ్లు తట్టుకోలేరు. అతడిని 10 సార్లు తీసుకువస్తే 8 సార్లు వికెట్లు తీయగలడు అని జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్ మాలిక్ లంకతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. -
Ind Vs SL: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్.. ఎందుకిలా?
Team India Captains: ‘‘కొత్త కెప్టెన్ వచ్చిన ప్రతిసారీ.. అంటే కనీసం మూడేళ్లకోసారి జట్టు విధానాలను మార్చేయాలని ఎందుకు కోరుకుంటారు? నాకు తెలిసి విరాట్ కోహ్లి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కోహ్లి తర్వాత రోహిత్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా. వీళ్లు టీమిండియా విధానంలో సమూల మార్పులు తేవాలని ఎందుకు కోరుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసహనం వ్యక్తం చేశాడు. యువ రక్తం కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరు మినహా అంతా యువ ప్లేయర్లే జట్టులో ఉండటం విశేషం. ఇక వాంఖడేలో జరిగిన తొలి టీ20లో పేసర్ శివం మావి అరంగేట్రం చేయగా.. సంజూ శాంసన్ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఇక ప్రస్తుత జట్టులో ఒకరిద్దరు సీనియర్లు మినహా అంతా యువకులే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఓడినా పర్లేదా?! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ప్రయోగాలకు వెనుకాడటం లేదు. అంతేకాదు.. మొదటి మ్యాచ్ తర్వాత.. ‘‘ఓడిపోయినా పర్లేదు గానీ, కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వాళ్లు తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెట్టేశా’’ అంటూ పాండ్యా వ్యాఖ్యానించాడు. మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించడం అలవాటు కావడం కోసం చివరి ఓవర్‌ను అక్షర్ చేత వేయించానని చెప్పుకొచ్చాడు. అయితే, వాంఖడేలో 2 పరుగుల తేడాతో విజయం సాధించినా.. పుణెలో మాత్రం 16 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై హార్దిక్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడం విశేషం. ఇంతకు ముందున్న వాళ్ల సంగతి? ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షో చర్చలో అజయ్ జడేజా మాట్లాడుతూ.. ‘‘కొత్తగా కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరు పాత విధానాన్ని మార్చాలని చూస్తూనే ఉన్నారెందుకు? ఇంతకు ముందున్న వాళ్ల కెప్టెన్సీ సరిగ్గా లేదా ఏంటి?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ‘‘గత కెప్టెన్ల నేతృత్వంలో ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా విఫలమైంది. అందుకే కొత్త విధానాలు అమలు చేయాలని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. కోహ్లి, రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మేజర్ టోర్నీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. మార్పు అనివార్యం, తథ్యం ఇదిలా ఉంటే.. కాగా రెండో టీ20లో యువ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో లంక భారీ స్కోరు చేసింది. కానీ, లంక బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. యువ జట్టు తప్పులను కాయాలని, మార్పులు జరుగుతున్న తరుణంలో అందరూ కాస్త ఓపికగా ఉండాలన్నాడు. దీనిని బట్టి వచ్చే వరల్డ్‌కప్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామనే సంకేతాలు ఇచ్చాడు. చదవండి: ODI World CUP 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. వన్డే వరల్డ్‌కప్‌కు పంత్ దూరం! Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
WC 2022: నా మాటలు రోహిత్‌ను హర్ట్ చేయొచ్చు.. కానీ: భారత మాజీ క్రికెటర్
ICC Men's T20 World CUp 2022- Rohit Sharma: టీ20 ప్రపంచకప్-2022 నుంచి టీమిండియా నిష్క్రమణ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా విఫలమయ్యాడంటూ ‘హిట్‌మ్యాన్’ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్ టైటిళ్లు గెలిస్తే సరిపోదని.. ఐసీసీ ట్రోఫీ గెలిస్తేనే విజయవంతమైన కెప్టెన్ అంటారంటూ ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా పలు సిరీస్‌లకు రోహిత్ అందుబాటులో ఉండని విషయాన్ని ఉటంకిస్తూ.. విశ్రాంతి తీసుకుని తీసుకుని రోహిత్ అలసిపోయాడని.. ఫామ్‌లో ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా తరచూ కెప్టెన్లను మారుస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరును ఎండగట్టాడు. వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాభవం నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘‘నేను చెప్పే మాటలు రోహిత్ శర్మకు బాధ కలిగించవచ్చు. నిజానికి కెప్టెన్‌గా జట్టును తీర్చిదిద్దుకోవాలంటే కనీసం ఏడాది పాటు టీమ్‌ను అట్టిపెట్టుకునే ఉండాలి. అసలు ఈ ఏడాదిలో రోహిత్ ఎన్ని సిరీస్‌లు ఆడాడు? జట్టుకు నాయకుడు అనేవాడు ఒక్కడే ఉండాలి. ఏడుగురు కెప్టెన్లు ఉంటే కీలక సమయాల్లో గెలుపొందడం కష్టమే’’ అంటూ బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు. ఇక న్యూజిలాండ్ టూర్‌కు హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు రెస్ట్ ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో జట్టులో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయాడు. కోహ్లి నిష్క్రమణ తర్వాత కెప్టెన్ల మార్పులు గతేడాది టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్, శ్రీలంక తదితర జట్లపై క్లీన్‌స్వీప్‌లతో సత్తా చాటాడు. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించిన తర్వాత పరిమత ఓవర్ల క్రికెట్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల రోహిత్ జట్టుకు దూరంకాగా కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు, రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్), హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్‌లో టీ20 సిరీస్), జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్), శిఖర్ ధవన్ (వెస్టిండీస్‌తో వన్డే సిరీస్) తదితరులు సారథులుగా వ్యవహరించారు. ఇలా ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా ‘రికార్డు’ సృష్టించింది. కాగా ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలవడం సహా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో కెప్టెన్‌గా హిట్ అయిన హిట్‌మ్యాన్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ, తాజాగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మేజర్ టోర్నీల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ ఆసియా కప్‌లో 133, వరల్డ్‌కప్‌లో 116 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Alex Hales-Eoin Morgan: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు WC 2022 Final: రూ. 500కే ఫైనల్ టిక్కెట్లు అమ్మేసిన ఫ్యాన్స్!? ఇది వాళ్ల పనేనంటూ T20 WC 2022: 'అతడిని టీమిండియా కోచ్ చేయండి.. కెప్టెన్‌గా అతడే సరైనోడు' -
Ind VS SA: ప్రపంచకప్ టోర్నీకి ముందు ఎందుకిలా? అతడికి రెస్ట్ అవసరమైతే!
Ind Vs SA T20 Series- T20 World Cup 2022- Jasprit Bumrah: గాయం కారణంగా ఆసియాకప్- 2022 టీ20 టోర్నీకి దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. రెండో టీ20తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ రెండు ఓవర్లు బౌల్ చేశాడు. మొత్తంగా 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, ఆఖరిదైన మూడో టీ20లో మాత్రం ఈ పేసు గుర్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభమైన నేపథ్యంలో బుమ్రా తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే భావిస్తే.. మరోసారి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా ప్రాక్టీసు సెషన్లో భాగంగా వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా సఫారీలతో గురువారం నాటి తొలి టీ20 సందర్భంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఆరంభానికి ముందు ప్రధాన పేసర్ ఇలా ఫిట్నెస్ సమస్యలతో బాధపడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. ఐపీఎల్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడు! ఈ నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై క్రీడా, అభిమాన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంతమంది నెటిజన్లు బుమ్రా తీరుపై విరుచుకుపడుతున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే ఈ ఆటగాడు.. దేశం తరఫున ఆడాల్సివచ్చినపుడు ఇదిగో ఇలా గాయాల పేరు చెబుతాడు అంటూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే, బుమ్రా అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇలా! ఉద్దేశపూర్వకంగా ఎవరూ జట్టుకు దూరం కారని.. దేశం తరఫున ఆడే అవకాశాన్ని వదులుకోరని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఐసీసీ మెగా టోర్నీకి సమయం ఆసన్నమవుతోందని.. గాయంతో బాధపడుతున్న బుమ్రాకు తగినంత విశ్రాంతినివ్వాలని సూచించాడు. రెస్ట్ ఇవ్వండి ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘భారత జట్టులో అతడు కీలక సభ్యుడు. అతడిని ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు ఆడించకపోయినా సరే.. గాయపడకుండా చూసుకోవడం ముఖ్యం. ఒకవేళ తను విశ్రాంతి కోరుకుంటే మరికొన్నాళ్లు పాటు రెస్ట్ ఇవ్వండి’’ అని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ప్రొటిస్‌తో రెండో టీ20(అక్టోబరు 2)లో బుమ్రాను ఆడించకపోవడమే మంచిదని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా తిరువనంతపురంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs SA ODI: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ IND vs SA: సూర్యకుమార్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా How #JaspritBumrah is fit for complete @IPL games for @mipaltan — #BeingJaved (@jafa4ulv) September 28, 2022 Bumrah injury, even if it's minor, is a major concern.. First WC game is just 24 days away.. This period is the worst time to get injured from team combination's pow #JaspritBumrah — Alpha Mike ↗️ (@Alpha_V18) September 28, 2022 -
ఆఫ్ఘనిస్తాన్‌తో జాగ్రత్త.. భారత్, పాక్‌లకు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..!
ఆసియా కప్ 2022లో అంచనాలకు మించి రాణిస్తూ.. తమకంటే మెరుగైన జట్లకు షాకిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. పసికూనే కాదా అని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేసి ఏమరపాటుగా ఉంటే భారత్, పాక్‌లకు కూడా షాక్ తప్పదని హెచ్చరించాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, ఉరకలేస్తున్న ఆఫ్ఘన్‌ను నిలువరించడం భారత్, పాక్ లాంటి జట్లకు కూడా సవాలేనని పేర్కొన్నాడు. ఆఫ్ఘన్‌ను ముఖ్యంగా బౌలింగ్‌లో అస్సలు తక్కువ అంచనా వేయరాదని.. లంకతో మ్యాచ్‌లో యువ పేసర్ ఫజల్ హాక్ ఫారూఖీ (3/11), ముజీబ్ (2/24), నబీ (2/14).. బంగ్లాతో మ్యాచ్‌లో ముజీబుర్ రెహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) లు ప్రత్యర్ధులకు ఏ గతి పట్టించారో అందరూ చూశారని అన్నాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఆఫ్ఘాన్‌ను చిన్నచూపు చూడరాదని, బంగ్లాపై ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు), నజీబుల్లా జద్రాన్ (17 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) ఏ రకంగా చెలరేగారో భారత్, పాక్‌లు గమనించాలని అల్టర్ జారీ చేశాడు. బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. జడేజా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, బంగ్లాపై విజయంతో ఆఫ్ఘాన్.. గ్రూప్-బి నుంచి సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి రెండో స్థానం కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. పాక్‌పై తొలి మ్యాచ్‌లో విజయంతో టీమిండియా సూపర్-4 తొలి బెర్తును (గ్రూప్-ఏ) దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇవాళ భారత్-హాంగ్‌కాంగ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ -
మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు?
టి20 క్రికెట్ రాకముందు వన్డే క్రికెట్‌కు యమా క్రేజ్ ఉండేది. రోజులో దాదాపు ఎనిమిది గంటలు సాగే మ్యాచ్ అయినా ఆసక్తికరంగా ఉండేంది. ఎందుకంటే అప్పటికి షార్ట్ ఫార్మాట్ పెద్దగా పరిచయం లేదు. ట్రయాంగులర్, ఐదు, ఏడు వన్డేల సిరీస్‌లు ఇలా చాలానే జరిగేవి. అప్పట్లో ఆయా జట్లు కూడా వన్డే సిరీస్‌లు ఆడడానికి ఉత్సాహం చూపించేవి. అందుకు తగ్గట్లుగానే ఐసీసీ కూడా ప్రణాళికలు రచించేది. కాల క్రమంలో పొట్టి ఫార్మాట్(టి20 క్రికెట్) బలంగా తయారవడం.. వన్డేల ప్రాధాన్యతను తగ్గించింది. మూడు గంటల్లో ముగిసేపోయే మ్యాచ్‌లు.. ఆటగాళ్లకు రెస్ట్ దొరికే సమయం ఎక్కువగా ఉండేది. వెరసి టి20లపై ఆటగాళ్లకు మోజు పెరిగిపోయింది. దీంతో టి20లు ఆడేందుకు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉండడమే లేక రిటైర్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది. ఇటీవలీ కాలంలో వన్డే క్రికెట్‌పై ఈ చర్చ మరింత ఎక్కువయింది. వన్డే క్రికెట్‌ను ఆపేస్తే మంచిదని కొందరు అభిప్రాయపడితే.. 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించి వన్డే మ్యాచ్‌లను రూపొందించాలని రవిశాస్త్రి లాంటి క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం రావాలంటే మల్టీ సిరీస్‌లు.. ట్రయాంగులర్ సిరీస్‌లు ఎక్కువగా ఆడిస్తే మంచిదంటూ మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా వన్డే క్రికెట్‌పై స్పందించాడు. ''మేం వన్డే మ్యాచ్‌లు ఆడే సమయానికి టెస్టులు తక్కువగా ఉన్నప్పటికి సమానంగా ఆడేవాళ్లం. కానీ సంప్రదాయ క్రికెట్‌తో వన్డే క్రికెట్‌ను ఎప్పుడూ పోల్చలేం. కానీ టి20 ఫార్మాట్ వచ్చాకా వన్డే క్రికెట్‌పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. ఒక టి20 మ్యాచ్‌లో మూడు గంటల్లోనే ఫలితం వస్తుంది.. అదే వన్డే మ్యాచ్ అయితే కనీసం ఏడు గంటలు ఆడాలి. ఏ ఆటగాడైనా ఫలితం తొందరగా వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం జరుగుతుంది అదే. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు చెప్పండి. వన్డే క్రికెట్‌ను సరికొత్తగా డిజైన్ చేయాలి లేదంటే త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..! పంత్ మాటను లెక్కచేయని ధోని.. నవ్వుకున్న రోహిత్, సూర్యకుమార్ -
శిఖర్ ధావన్ కి టీంలో ఏం పని
-
అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Ind Vs WI ODI Series- Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు వెస్టిండీస్ పర్యటనలో అతడికేం పని అని వ్యాఖ్యానించాడు. ఆరు నెలల క్రితం జట్టు నుంచి తప్పించిన వ్యక్తిని కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాటలకు.. తాత్కాలిక సారథిగా గబ్బర్ నియామకానికి అసలు పొంతనే కుదరడం లేదని పేర్కొన్నాడు. కాగా గతేడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ధావన్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గా ధావన్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో అజయ్ జడేజా ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ విషయంలో నేను అయోమయానికి గురవుతున్నాను. అసలు అతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆరు నెలల క్రితం అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు కెప్టెనా? నిజానికి కేఎల్ రాహుల్ సహా పలువురు ఇతర యువ ఆటగాళ్లకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి. కానీ అకస్మాత్తుగా ధావన్ పేరు తెరపైకి వస్తోంది. గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌ను చేశారు. ఆ తర్వాత జట్టులో చోటే లేదు. తర్వాత ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లారు. అసలు టీమిండియా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఏమనుకుంటోంది?’’ అని ప్రశ్నించాడు. ఇక ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో పరాజయం తర్వాత తాము దూకుడైన ఆటకు మారుపేరుగా ఉండాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పిన విషయాన్ని అజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. వన్డేలను సైతం టీ20 తరహాలో ఆడతామన్న.. హిట్‌మ్యాన్ మాటలను బట్టి చూస్తే ధావన్ అసలు జట్టులో ఉండేందుకు అర్హుడు కాదని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా అజయ్ వ్యాఖ్యలపై స్పందించిన గబ్బర్ అభిమానులు ఐపీఎల్-2022లో ధావన్ ప్రదర్శనను ఓసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ధావన్ 14 ఇన్నింగ్స్‌లో 460 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్! Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 -
'కోహ్లిని గాడిలో పెట్టగల వ్యక్తి సచిన్ మాత్రమే'
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లిని తిరిగి గాడిలో పెట్ట గల ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ మాత్రమే అని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. కోహ్లి ప్రస్తుతం అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్లో మూడెంకెల స్కోర్ సాధించి దాదాపు మూడేళ్ల దాటుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 459 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది అతడి ఇన్నింగ్స్‌లలో అత్యధిక స్కోర్ 79 పరుగులు మాత్రమే. "కోహ్లి విషయంలో సచిన్ జోక్యం చేసుకోవాలని నేను 8 నెలల క్రితమే చెప్పాను. సచిన్ కోహ్లితో కలిసి మాట్లాడాలి. ఎందుకంటే 14 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆడటంప్రారంభించిన సచిన్.. తన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కాబట్టి కోహ్లి విషయంలో సచిన్ మాత్రమే సరైన వ్యక్తి అని నేను భావిస్తాను. ఒకే వేళ సచిన్‌తో మాట్లాడానికి విరాట్ సంకోచించినా.. సచిన్ మాత్రం తనంతట తానే అతడి విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇక ఏ ఆటగాడైనా ఏదో ఒక సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని అనుభవించక తప్పదు. మనం అనుభవం ఉన్న ఆటగాళ్లం కాబట్టి యువ ఆటగాళ్లతో చర్చించాల్సిన బాధ్యత ఉంటుంది. విరాట్‌ను తిరిగి ఫామ్‌లోకి తీసుకురావడానికి మాస్టర్ బ్లాస్టర్ తన వంతు కృషి చేస్తాడు భావిస్తున్నా" అని అజయ్ జడేజా పేర్కొన్నాడు. చదవండి: బాబర్ ట్వీట్‌కు కోహ్లి తప్పకుండా రిప్లై ఇవ్వాలి: షాహిద్ అఫ్రిది -
IND Vs ENG: కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరో క్రికెట్ జట్టును తలపిస్తుందిగా!
క్రికెట్ ఆటలో మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు.. అంపైర్లు.. బంతి.. బ్యాట్ ఉంటే (వెలుతురు కూడా ఉండాలనుకోండి) మ్యాచ్‌కు ఏ ఆటంకం ఉండదు. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు లైవ్‌లో ఆస్వాధిస్తారు. మ్యాచ్‌కు వెళ్లలేని అభిమానులు కూడా ఉంటారుగా. మరి వారి కోసం టీవీల్లో పలు స్పోర్ట్స్ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అయితే లైవ్‌లో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు.. ఇంట్లో టీవీలో చూసే ప్రేక్షకుల మధ్య ఒక చిన్న అంతరం ఉంటుంది. ఆ అంతరం ఏంటో ఈపాటికే మీకు అర్థమయి ఉంటుంది.. అదే క్రికెట్ కామెంటరీ . మన చిన్నప్పడు అంటే టీవీలు రాకముందు.. రేడియోలు ఉన్న కాలంలో చాలా మంది అభిమానులు స్కోర్‌తో పాటు క్రికెట్ కామెంటరీ వింటూ ఉండేవారు. అలా క్రికెట్‌తో పాటు కామెంటరీకి కూడా సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. టీవీల్లో కామెంటరీని వింటూనే మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లను ఎంజాయ్ చేస్తుంటాం. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. జూలై, ఆగస్టు నెలల్లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. మరి ఈ మ్యాచ్‌లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం కూడా తమ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ ప్యానెల్లో హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్లు ఉన్నారు. ఇంగ్లీష్‌లో కామెంటరీ చేయనున్నవాళ్లు: హర్షా బోగ్లే, నాసర్ హుస్సేన్, సంజయ్ మంజ్రేకర్, గ్రేమ్ స్వాన్, డేవిడ్ గ్రోవర్, మైకెల్ ఆర్థర్ టన్ హిందీలో కామెంటరీ చేయనున్నవాళ్లు: వివేక్ రజ్దన్, వీరేంద్ర సెహ్వాగ్, అజయ్ జడేజా, సాబా కరీమ్, మహ్మద్ కైఫ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ ఈ 13 మందిలో హర్షా బోగ్లేను మినహాయిస్తే మిగతా 12 మంది ఏదో ఒక దశలో క్రికెట్ ఆడినవారే. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కామెంటరీ ప్యానల్‌ను సరదాగా ట్రోల్ చేశారు. ''ఇంగ్లండ్, ఇండియాల జట్ల కంటే ఈ కామెంటరీ ప్యానెల్ పటిష్టంగా కనిపిస్తోంది.. 12 మంది ఆటగాళ్లు ఉన్నారు.. అందులో బ్యాటర్స్, బౌలర్స్ ఉండడంతో మరో క్రికెట్ జట్టును తలపిస్తోంది. వీళ్లకు కూడా ఒక మ్యాచ్ నిర్వహించండి'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఏకైక టెస్టుకు అంతా సిద్ధమయింది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ .. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్, ఎడ్జ్‌బాస్టన్ జులై 7న తొలి టీ20, సౌతాంప్టన్ జులై 9న రెండో టీ20, బర్మింగ్‌హామ్ జులై 10న మూడో టీ20, నాటింగ్‌హామ్ జులై 12న తొలి వన్డే, లండన్ జులై 14న రెండో వన్డే, లండన్ జులై 17న మూడో వన్డే, మాంచెస్టర్ చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం! -
IPL 2022: ఈ మ్యాచ్‌లో ఓడిపోయారో మీ పని ఇక అంతే!
IPL 2022 DC Vs SRH: ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగింట మాత్రమే గెలుపొందింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే పంత్ సేన నెట్రన్ రేటు పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ వరుస ఓటములు కలవరపెట్టే అంశంగా పరిణమించాయి. మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరుగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ అజయ్ జడేజా, మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘‘ఈ మ్యాచ్ ఢిల్లీకి ఎంతో కీలకమైనది. మిగతా జట్ల కంటే ఢిల్లీ ఒకే ఒక్క మ్యాచ్ తక్కువగా ఆడింది. కానీ వాళ్లకు ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వాళ్లు ఎస్ఆర్హెచ్ను ఓడించినా.. ఇతర జట్లతో కలిసి సంయుక్తంగా 10 పాయింట్లతో నిలుస్తారు. అందుకే ఈ మ్యాచ్ గెలవడం ఢిల్లీకి అత్యంత ముఖ్యం. ఇటీవలి మ్యాచ్‌లను పరిశీలిస్తే వాళ్లకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారంటే.. ఈ సీజన్లో వారి ప్రయాణం ముగింపునకు వచ్చినట్లే అవుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ‘‘ఓపెనింగ్ భాగస్వామ్యాలు పర్లేదు. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు ఇంకా కూడా కుదురుకోలేకపోతున్నారు. పరుగులు సాధించలేకపోతున్నారు. ఇక అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో కూడా బౌలర్లు విఫలమవుతున్నారు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ తొమ్మిదింట 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓడగా.. ఢిల్లీ.. లక్నో చేతిలో ఓటిమిని మూటగట్టుకుంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ మరింత కీలకంగా మారగా... గెలిచి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ 50: సన్‌రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: బ్రబౌర్న్ స్టేడియం, ముంబై సమయం: రాత్రి 07:30 నిమిషాలకు ఆరంభం చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’ The sound off #RP17's bat when he is in full swing 🤩#YehHaiNayiDilli | #IPL2022 | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/G4rws7Qk0n — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Just 7️⃣ seconds of Bapu smashing 'em down the ground 🔥#YehHaiNayiDilli | #IPL2022 #TATAIPL | #IPL | #DelhiCapitals | @akshar2026 pic.twitter.com/OUnoYucElR — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Our last few games have been about small margins. It's time to seize the clutch moments, starting with today. And @tripathirahul52 concurs. 💪🏾🗣️#DCvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/JKLhXJZuJV — SunRisers Hyderabad (@SunRisers) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెన్నై, ముంబై.. అందుకే పాయింట్ల పట్టికలో అట్టడుగున...
IPL 2022 CSK Vs MI: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు. ముంబై ఐదుసార్లు చాంపియన్‌గా నిలిస్తే.. చెన్నై నాలుగు సార్లు ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఈ రెండు జట్లకు ఐపీఎల్-2022 సీజన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండగా.. రోహిత్ నేతృత్వంలోని ముంబై కనీసం ఖాతా కూడా తెరవలేక అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ అజయ్ జడేజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ముంబై, చెన్నై వైఫల్యాలకు గల కారణాలు విశ్లేషించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ముంబై, చెన్నైకి టాపర్డర్ బౌలర్లు లేరు. అందుకే పాయింట్ల పట్టికలో ఆ జట్లు అట్టడుగున ఉన్నాయి. చెన్నై పెద్దగా మార్పులు చేయడం లేదు. ఇంకా బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఫాస్ట్ బౌలర్ అవసరం వారికి ఉంది. ఇక సానుకూల అంశాలు అంటే.. రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు గత మ్యాచ్‌లో మెరుగ్గా రాణించారు. శివమ్ దూబే అదరగొట్టాడు. అయితే, రవీంద్ర జడేజాను కెప్టెన్ చేయడం అతడిని డౌన్ ఆర్డర్‌కు పంపడం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ముంబై విషయానికొస్తే.. వారికి సరైన బౌలర్లు లేరు’’ అని పేర్కొన్నాడు. ముఖ్యంగా సరైన పేసర్లు లేకపోవడం ఇరు జట్లకు పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. కాగా ముంబైకి జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్ వంటి పేసర్లు ఉన్నారు. ఇక చెన్నైకి రిస్ జోర్డాన్, ముఖేశ్ చౌదరి, ప్రిటోరియస్, తుషార్ దేశ్‌పాండే వంటి బౌలర్లు ఉన్నా దీపక్ చహర్ దూరం కావడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ రెండు జట్లు గురువారం ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ క్రమంలో చెన్నై రెండో విజయం నమోదు చేస్తుందా? లేదంటే ముంబై బోణీ కొడుతుందా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. చదవండి: IPL 2022: కుల్దీప్ క్రీడా స్ఫూర్తి.. ఈ అవార్డు అతడితో పంచుకుంటా.. క్రెడిట్ అంతా రిషభ్‌దే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Respect. Rivalry. and Nothing short of a gripping affair! Here’s the match preview to set the rhythm for the first leg of the IPL El Clasico! Tune into Star Sports network at 7️⃣:3⃣0⃣ PM to watch the match live! #MIvCSK #Yellove #WhistlePodu 🦁💛 @amazonpay pic.twitter.com/2QYpBPxDSf — Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2022 एकदम तगडी training 💪💥 📽️ A look into our prep for the big one 👊 Watch #MIvCSK live on @StarSportsIndia at 7:30 PM. 💙#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/kPLhoXGJTJ — Mumbai Indians (@mipaltan) April 21, 2022 -
అజయ్ జడేజా బ్రేకప్ స్టోరీ: మ్యాచ్ ఫిక్సింగ్.. మాధురీ దీక్షిత్‌ని దూరం చేసిందా!
అజయ్ జడేజా పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు.. మాధురీ దీక్షిత్‌ను గుర్తుపట్టని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఓ వెలుగు వెలిగిన తారలు.. వారి వారి రంగాల్లోని వాళ్ల గ్లామర్.. సంపాదించుకున్న పాపులారిటీ ఒకరితో ఒకరు ప్రేమలో పడేలా చేసింది. కానీ పెళ్లిదాకా తీసుకెళ్లలేదు. అర్ధాంతరంగా ముగిసిన ఆ లవ్ స్టోరీ ఏంటంటే... ఇది 1990ల కథ.. ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేయడానికి అజయ్ వెళ్లాడు. అక్కడ కలిసింది మాధురీ దీక్షిత్. అప్పటిదాకా ఆమె సినిమాలు చూశాడు.. ఆమె అభినయానికి ఆరాధకుడయ్యాడు. ఆ వెండితెర వేలుపు తన కళ్ల ముందే కొలువుదీరేసరికి అప్రతిభుడయ్యాడు. ఆ అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె నవ్వుకి పడిపోయాడు. అజయ్ జడేజా గురించి మాధురీ విన్నది. కానీ చూడ్డం అదే మొదలు. ఆ పరిచయానికి తనూ కాస్త ఎగ్జయిట్ అయింది. ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది. అప్పటికే..సంజయ్ దత్తో ప్రేమ, అతను టాడా కేసులో ఇరుక్కోవడం.. ఆ నేపథ్యంలో మాధురీని మీడియా ఫోకస్ చేయడం.. వంటి చిక్కులు, చికాకుల్లో ఉంది. మాధురీ.. దిగులు, కలత, కలవరం గూడులో దాక్కునుంది. అలాంటి సమయంలో అజయ్ పరిచయం.. స్నేహం ఆమెకు కాస్త ఊరటనిచ్చాయి. అతని హాస్య చతురత ఆమెలో ఉత్సాహాన్ని, జీవనాసక్తినీ పెంచింది. తనకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడింది. మాధురీకి తన మీదున్న ప్రేమను సినిమా రంగంలో తన ఎంట్రీకి పాస్‌గా ఉపయోగించుకోవాలనుకున్నాడు అజయ్. మైదానంలో సిక్సర్లు కొట్టినంత తేలికగా తెర మీద హీరోయిక్ స్టంట్లు చేయాలని ఉబలాటపడ్డాడు. ఆ విషయాన్ని మాధురీ చెవిలో వేశాడు. సినిమాల్లోకి రావాలనుకున్న అజయ్‌కు వెన్నుదన్నుగా నిలబడాలనుకుంది. తనకు బాగా పరిచయం ఉన్న నిర్మాతలందరినీ అతనికి పరిచయం చేసింది. వాళ్లకు అతణ్ణి రికమెండ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ చనువు చూసి బాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆ టైమ్‌లోనే ఈ జంట ఓ మ్యాగజైన్ మీద కవర్ ఫొటోగా అచ్చయింది. దాంతో ఆ గుసగుసలు పెళ్లి చేసుకుంటారనే వదంతుల రూపం తీసుకున్నాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ఫీల్డ్కీ చేరాయి. ఈలోపే.. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సంచలనం అయింది. అందులో అజయ్ పేరూ వినిపించింది. పత్రికల నిండా అవే వార్తలు. మళ్లీ నిరాశ, నిస్పృహలు ఆవహించాయి మాధురీని. ‘అలాంటిదేమీ లేదు.. పట్టించుకోవద్దు’ అని చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్. ఆ మాటను నమ్మింది ఆమె. కానీ ఈలోపే అజయ్ తల్లిదండ్రులకు వాళ్ల ప్రేమ విషయం తెలిసింది. అజయ్ వాళ్లది రాజకుటుంబం. ఆ ఇంటి కోడలు ఓ సినిమా యాక్టరా? వీల్లేదు అంటూ ఫత్వా జారీ చేశారని ఓ వార్త. అదలా ఉంచితే మ్యాచ్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలాడు అజయ్. ఇన్ని గందరగోళాల మధ్య ఆ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకోలేదు మాధురీ. అంతకుముందు ఆమె కుటుంబం అజయ్ పట్ల సానుకూల దృక్ఫథంతోనే ఉంది. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్‌లు, మాధురీ పట్ల అతనింట్లో వాళ్లకున్న అభిప్రాయం తెలిసేసరికి ఆమె ఇంటి వాళ్లూ ఆ సంబంధం పట్ల మొగ్గు చూపలేదు. ఆ ప్రేమకు చరమగీతం పాడి.. మనసులోంచి అజయ్‌ను చెరిపేసుకొమ్మనే సలహా ఇచ్చారు. అజయ్ జడేజా నుంచి సానుకూల స్పందన వస్తుందేమోనని చూసింది. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు అతను. ఇవన్నీ గ్రహించిన మాధురీ కుటుంబం మళ్లీ ఆమె దిగులు లోకం తలుపు తట్టకముందే అమెరికా సంబంధం తెచ్చారు. అతనే డాక్టర్ శ్రీరామ్ నేనే. తర్జనభర్జనలేమీ లేకుండా మీమాంసేదీ పెట్టుకోకుండా శ్రీరామ్‌కు ఓకే చెప్పింది. అతని జీవితభాగస్వామై అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడ అజయ్ జడేజా కూడా ఎలాంటి శషభిషలు లేకుండా జయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ∙ఎస్సార్ -
T20 WC: అఫ్గన్ గెలుస్తుందనుకున్నాం.. కానీ అలా జరగలేదు: సెహ్వాగ్
‘They are better than this’ – Virender Sehwag, Ajay Jadeja: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో అఫ్గనిస్తాన్ ప్రయాణం ముగిసింది. అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడి.. ఇంటిబాట పట్టింది. కాగా ఈ ఏడాది నేరుగా సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధించిన అఫ్గన్.. స్కాట్లాండ్, నమీబియా జట్లను భారీ తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. అంతేగాక పాకిస్తాన్‌కు గట్టిపోటీ నిచ్చి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే, టీమిండియా చేతిలో ఓటమి.. నవంబరు 7న న్యూజిలాండ్ మ్యాచ్‌లో పరాజయం పాలుకావడంతో కేవలం ఐదింట కేవలం రెండు విజయాలకే పరిమితమై ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో కివీస్ విజయం సాధించి సెమీస్ చేరగా.. అఫ్గన్‌తో పాటు టీమిండియాకు కూడా తీవ్ర నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్ అఫ్గనిస్తాన్ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరంభంలో మంచి విజయాలు నమోదు చేసిన నబీ బృందం.. ముందుకు వెళ్తున్న కొద్దీ తమ స్థాయికి తగినట్లు ఆడలేదని అభిప్రాయపడ్డారు. కివీస్ చేతిలో అఫ్గన్ ఓటమి అనంతరం అజయ్ జడేజా మాట్లాడుతూ... ‘‘టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినా.. దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. గెలిచి తమ సత్తా చాటింది. అఫ్గనిస్తాన్ మాత్రం ఇలాంటి ఆటతీరు కనబరచలేకపోయింది. వాళ్ల బ్యాటింగ్ తీరు తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్ల స్థాయికి తగ్గట్లు ఆడలేదు. అయితే, గత కొన్నేళ్లుగా వారు ఎదిగిన విధానం అమోఘం. దానిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి కివీస్‌తో మ్యాచ్‌లో మెరుగ్గా ఆడగల సత్తా వారికి ఉంది. కానీ, అలా జరుగలేదు’’ అని క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్... ‘‘అఫ్గన్ బ్యాటర్లు కచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. 125- 130 పరుగులు చేయగలిగారు. 30- 40 పరుగులు చేస్తే చాలా బాగుండేది. కానీ అలా జరుగలేదు. ఒకవేళ ఇలాంటి స్కోరు నమోదు చేయగలిగితే పెద్ద జట్లకు కూడా వాళ్లు గట్టి పోటీ ఇవ్వగలరు. స్కాట్లాండ్, నమీబియాపై గెలిచారు. న్యూజిలాండ్‌ను కూడా ఓడించాలని మనం కోరుకున్నాం. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా.. అనుభవం గడిస్తున్న కొద్దీ వాళ్లు మెరుగ్గా రాణించగలరు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గనిస్తాన్.. 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్.. 18.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సెమీస్‌కు దూసుకెళ్లింది. స్కోర్లు: అఫ్గనిస్తాన్- 124/8 (20) న్యూజిలాండ్- 125/2 (18.1). చదవండి: T20 World Cup 2021 Pak Vs SCO: ఐదుకు ఐదు గెలిచి పాక్ టాప్.. అట్టడుగున స్కాట్లాండ్ -
కోహ్లి అలా మాట్లడతాడనుకోలేదు.. ఇంగ్లండ్ ఫేవరెట్: టీమిండియా మాజీ క్రికెటర్
Ajay Jadeja Comments on Virat kohli Statement: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్ ఆనంతరం మాట్లడిన విరాట్ కోహ్లి.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసిందని పేర్కొన్నాడు. అయితే కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా నిరాశ వ్యక్తం చేశాడు. "ఆ రోజు విరాట్ కోహ్లి మాటలు విన్నాను. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ వెనుకబడిందని అతడు తెలిపాడు. దాంతో నేను నిరాశ చెందాను. మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు ఉన్నప్పుడు జట్టు వెనుకబడటానికి అవకాశం లేదు. మ్యాచ్ చేజారే పరిస్థితే ఉండదు. విరాట్ మాత్రం ఇలా చెప్పడం మ్యాచ్ పట్ల భారత జట్టు అవలంబించిన విధానం ఎలా ఉందో తెలుపుతోంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకునే ఫేవరెట్ జట్టు ఇంగ్లండ్ అని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ గెలిచి ఇంగ్లండ్ తన సత్తా ఏంటో చూపిందని గుర్తు చేశాడు. ఇక సెమీస్ చేరే జట్ల గురించి మాట్లాడుతూ... "టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించింది. కానీ గ్రూప్-1 నుంచి సెమీస్‌కు అర్హత సాధించే రెండో జట్టు ఎవరనేది నేను అంచనా వేయలేకపోతున్నాను. సూపర్ 12లోని గ్రూప్ 1లో ఐపీఎల్ తరహా దృశ్యాన్ని నేను చూస్తున్నాను. దాదాపు అన్ని జట్లకు సమాన బలాలు ఉన్నాయి. ఇక జట్ల బలహీనతల గురించి నేను మాట్లలేడలేను. ఎందుకంటే.. ఏ జట్టు అయినా తనదైన రోజున ప్రత్యర్థి జట్టును ఓడించగలదు" అని అజయ్ జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కోహ్లి ఏమాన్నడంటే... మ్యాచ్ ఆనంతరం మాట్లడిన విరాట్ కోహ్లీ.. పవర్‌ప్లేలో కీలక వికెట్లు కోల్పోవడం వల్ల జట్టును దెబ్బతీసిందని తెలిపాడు. స్లోగా మొదలుపెట్టి.. తిరిగి పుంజుకోవడం కూడా అంత సులభమేమీ కాదు. 15-20 అదనపు పరుగులు రాబట్టాల్సింది. కానీ పాకిస్తాన్ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు ఆదేవిధంగా భారత్‌పై అద్బుతంగా బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లను కోహ్లి అభినందించాడు. చదవండి: Virat Kohli: వాళ్లు బాగా ఆడారు.. అయినా ఇదే చివరి మ్యాచ్ కాదు కదా -
KL Rahul: నాయకుడి లక్షణాలు లేవు.. టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం..
Ajay Jadeja Comments On KL Rahul: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సర్దుకుపోయే మనస్తత్వం ఉందని, నాయకుడి లక్షణాలు మాత్రం లేవని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. పంజాబ్ సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. అయితే, టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగగలడని వ్యాఖ్యానించాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్... బ్యాటర్‌గా రాణిస్తున్నా.. కెప్టెన్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. పద్నాలుగింటిలో గెలిచింది. ఇక గత సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరిగిన రాహుల్ సేన.. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమితో దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో అజయ్ జడేజా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత రెండేళ్లుగా అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ.. ఒక్కసారి కూడా అతడిలో నాకు నాయకుడి లక్షణాలు కనిపించలేదు. జట్టు ఓడినా, గెలిచినా.. మన దృష్టి రాహుల్‌పై ఉండదు. అసలు తుదిజట్టులో ఎవరు ఆడుతున్నారు? మార్పులు, చేర్పులు ఏం ఉన్నాయి. అసలు ఈ విషయాల గురించి రాహుల్‌కు అవగాహన ఉందా అని అనిపిస్తుంది. టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేసే వ్యక్తిలో లీడర్ లక్షణాలు ఉన్నాయా అని చూస్తారు. కానీ, కేఎల్ రాహుల్‌లో ఇలాంటివేమీ నాకు కనిపించడం లేదు. తను చాలా నెమ్మదస్తుడు. ప్రతీ విషయానికి సర్దుకుపోతాడు. ఒకవేళ అతడు గనుక భారత జట్టు కెప్టెన్ అయితే... సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగగలడు. ఎందుకంటే.. ప్రతీ విషయానికి సర్దుకుపోతూ... తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ జట్టుకు, టీమిండియాకు సారథ్యం వహించడంలో చాలా తేడా ఉంటుందని, కాస్త దూకుడుగా ఉంటూనే కెప్టెన్‌గా విజయవంతమవుతారని చెప్పుకొచ్చాడు. ఇక ధోని వలె కేఎల్ రాహుల్ సైతం సైలెంట్‌గా ఉంటాడని, కానీ నాయకుడంటే గెలుపోటముల బాధ్యతలు మోయగల శక్తి కలిగి ఉండాలని చెప్పుకొచ్చాడు. కాగా ఈనెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లి.. పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ వస్తుందనే వార్తలు వినిపిస్తుండగా... పలువురు మాజీలు కేఎల్ రాహుల్ పేరును సూచిస్తున్నారు. ఈ క్రమంలో అజయ్ జడేజా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ తాజా ఐపీఎల్ సీజన్లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఆడిన 12 మ్యాచ్‌లలో అతడు 528 పరుగులు(అత్యధిక స్కోరు- 91 నాటౌట్) చేసి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు! -
మెంటార్‌గా ధోని: ‘బీసీసీఐని ఒక ప్రశ్న అడుగుతున్నా..’
ముంబై: యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియాకు భారత మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అయితే ధోని ఎంపికపై బీసీసీఐని కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శించారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందిస్తూ బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. చదవండి: MS Dhoni: ధోనీకి షాక్ ''ధోనిని మెంటార్‌గా నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం నన్ను పూర్తిగా నిరాశపరిచింది. ధోనిని ఎంపిక చేయడంపై రెండు రోజులు ఆలోచించా. అయితే ధోనిని నేను తప్పుబట్టడం లేదు. వాస్తవానికి ధోనికి నేను వీరాభిమానిని. అతను మెంటార్‌గా జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాడనే దానిపై మాట్లాడడం లేదు. కేవలం బీసీసీఐని మాత్రమే ఒక ప్రశ్న అడుగుతున్నా. ప్రస్తుతం టీమిండియాకు కోచ్, కెప్టెన్ రూపంలో బలమైన వ్యక్తులు ఉన్నారు. రవిశాస్త్రి, కోహ్లి టీమిండియాను పలుమార్లు నెంబర్‌వన్ స్థానంలో ఉంచారు. అందులోనూ ధోని సారధ్యంలో కోహ్లి చాలా మ్యాచ్‌లు ఆడాడు. ధోని వ్యూహాలపై కోహ్లికి మంచి అవగాహన ఉంటుంది. తాజగా ఇప్పుడు ధోనిని మెంటార్‌గా నియమించడం వల్ల రాత్రికి రాత్రే జట్టులో పెద్ద మార్పులేం చోటుచేసుకోవు. చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు MS Dhoni T20 World Cup Mentor: కెప్టెన్‌గా సూపర్ సక్సెస్.. మరి మెంటార్‌గా ఈ విషయమే నన్ను ఆశ్చర్యపరిచింది. అయినా ధోని తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకే మొగ్గు చూపేవాడు. ఇప్పుడు మెంటార్‌గా వచ్చాడు కాబట్టి మళ్లీ అదే రిపీట్ అవుతుంది. అయితే తాజాగా ఇంగ్లండ్ గడ్డపై టీమీండియా టెస్టు సిరీస్ ఆధ్యంతం నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తోనే మంచి ఫలితాలను రాబట్టింది. మెంటార్, కోచ్ ఇద్దరు జట్టుతో ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి.. దాని ప్రభావం మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, అప్గానిస్తాన్, మరో రెండు క్వాలిఫయర్స్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. కోహ్లి సారధ్యంలోని 15 మంది జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. శిఖర్ ధావన్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లను పరిగణలలోకి తీసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం..