అఫ్గానిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023లో పెను సంచలనాలు నమోదు చేస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గాన్.. వరల్డ్‌క్లాస్ జట్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ మెగా టోర్నీలో మొన్నటికి మొన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆఫ్గాన్స్.. ఇప్పుడు పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. ధర్మశాల వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో తేడాతో ఆఫ్టానిస్తాన్ విజయం సాధించింది. వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం
ఈ విజయంతో అఫ్గాన్ తాము పసికూనలు కాదని క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే అఫ్గాన్ చరిత్రాత్మక విజయాల వెనక భారతీయుడి పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ మెగా టోర్నీకి ముందు కేవలం వారం రోజుల ముందే జట్టుతో కలిసిన అతడు.. ఆఫ్గాన్‌ను పసికూనలా కాదు పులిలా తాయారు చేశాడు.
అతడో ఎవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం అజేయ్ జడేజా. వన్డే ప్రపంచకప్-2023కు ముందు అజేయ్ జడేజాను తమ జట్టు మోంటార్, అస్టెంట్ కోచ్‌గా ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు నియమించింది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అజయ్ జడేజా సాయంతో ప్రణాళికలను సిద్దం చేసుకొని అఫ్గాన్ బరిలోకి దిగుతోంది.
జడేజా ఎంట్రీ.. అఫ్గాన్స్ అదుర్స్
జడేజా మెంటార్‌గా తన బాధ్యతలు చేపట్టనప్పటినుంచి ఆఫ్గానిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా మిగితా అన్నింటిల్లోనూ ప్రత్యర్ధి జట్లకు గట్టిపోటి ఇచ్చింది. ఇంగ్లండ్ వంటి వరల్డ్‌క్లాస్ జట్టుకే ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించింది. రాబోయే రోజుల్లో ఆఫ్గాన్ జడేజా నేతృత్వంతో మరింత రాటుదేలే అవకాశం ఉంది. జడేజా తన అనుభవంతో మరిన్ని సంచలానాలు సృష్టించేలా ఆఫ్గాన్స్‌ను తాయారు చేస్తాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు.
టీమిండియాలో పవర్ హిట్టర్..
భారత క్రికెట్ చరిత్రలో అజయ్ జడేజాకు పవర్ హిట్టర్‌గా పేరుంది. ఎన్నో మ్యాచ్‌లను జడేజా ఒంటి చేత్తో గెలిపించాడు. మూడు వరల్డ్‌కప్‌లు టోర్నీలు ఆడిన భారత జట్టులొ జడేజా సభ్యునిగా ఉన్నాడు. జడేజా తన కెరీర్‌లో 196 వన్డేలు, 15 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 576 పరుగులు చేసిన జడేజా.. వన్డేల్లో 5359 పరుగులు ఉన్నాయి. 13 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
పాకిస్తాన్‌పై సూపర్ రికార్డు..
అజేయ్ జడేజాకు పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. పాకిస్తాన్ అంటే జడేజాకు పూనకలే. మొత్తంగా పాక్‌పై 40 మ్యాచ్‌లు ఆడిన అజయ్ 892 పరుగులు చేశాడు. బౌలర్‌గా రెండు వికెట్లు తీశాడు. తన అనుభవాన్ని ఆఫ్గాన్ యువ క్రికెటర్లు పంచిన అజేయ్.. పాకిస్తాన్‌ను చిత్తు కావడానికి పరోక్షంగా కారణమయ్యాడు.
చదవండి: చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment