
అఫ్గనిస్తాన్ మెంటార్, టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ట్రోల్ చేశాడు. తమపై ఫిర్యాదు చేసినందుకు డ్యాన్స్‌తో అతడిని కవ్వించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకు గెలుపు అత్యవసరం. ఇలాంటి కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోరు రాబట్టింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అజేయ శతకం కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
అయితే, ఆస్ట్రేలియా వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడింది. అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను డకౌట్ చేసి శుభారంభం అందించాడు.
ఆరో ఓవర్ నాలుగో బంతికి మిచెల్ మార్ష్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. దీంతో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఇలాంటి తరుణంలో.. క్రీజులోకి వచ్చిన నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్.. ఎనిమిదో ఓవర్ ఆరంభంలో సైట్‌స్క్రీన్ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ కంప్లైంట్ చేశాడు.
అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్‌రూంలో కదలికల కారణంగా ఇబ్బంది కలుగుతోందని అసహనం ప్రదర్శించాడు. ఈ విషయాన్ని గమనించిన అజయ్ జడేజా చిన్నగా డ్యాన్స్ చేస్తూ లబుషేన్‌ను సరదాగా ట్రోల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా అఫ్గన్ బౌలర్ల విజృంభణ కారణంగా 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా కష్టాల్లో కూరుకుపోయింది. సెంచరీ పూర్తి చేసుకున్న ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు.
Lmao not Ajay Jadeja dancing after Labuschagne's complain😭😭😭😭😭 pic.twitter.com/rnWojWgDxM
— P.💍 (@PrajaktaSharma8) November 7, 2023