బాబర్ ఆజం- విరాట్ కోహ్లి
WC 2023- Babar Azam: ‘‘ఏడాది క్రితం నా చానెల్‌లో నేను కూడా ఇవే మాటలు చెప్పాను. బాబర్ ఆజం గొప్ప బ్యాటర్. విరాట్ కోహ్లిలాగా అతడు కూడా కెప్టెన్సీ వదిలేస్తే మరిన్ని అద్భుతాలు చేయగలడు. విరాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత బ్యాటర్‌గా మరింత గొప్పగా రాణిస్తున్నాడు.
ద్రోహిగా ముద్ర వేశారు
అలాగే బాబర్ ఆజం కూడా కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి పెడితే బాగుంటుంది. ఈ మాటలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో కొందరు నన్ను బాబర్ వ్యతిరేకిగా ప్రచారం చేశారు. నాకు బాబర్ ఆజం అంటే ఇష్టం లేదని.. అందుకే ఇలా అంటున్నానని విమర్శించారు. నా మాటలు వక్రీకరించి ద్రోహిగా నాపై ముద్ర వేశారు’’ అని పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడు అందరూ అదే మాట
తాను బాబర్ మంచి కోరితే ద్రోహి అన్నవాళ్లు ఇప్పుడు ఏమంటారో చూడాలని ఉందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగాలనే డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా అఫ్గనిస్తాన్ చేతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా వన్డేలో ఓటమి పాలు కావడం.. అది కూడా ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లో పాక్ పరాభవం నేపథ్యంలో బాబర్‌పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.
సెమీస్ చేరాలంటే
ఈ నేపథ్యంలో బసిత్ అలీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాబర్ ఆజం విషయంలో తనను విమర్శించిన వాళ్లకు ఇలా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత మూడింటిలోనూ ఓడిపోయింది. తదుపరి ఐదు మ్యాచ్‌లలో గెలిస్తేనే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్‌షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!
Comments
Please login to add a commentAdd a comment