మీకెందుకు వరల్డ్‌కప్‌.. వెంటనే ఫ్లైట్‌ ఎక్కి వచ్చేయండి! పాక్‌పై సెటైర్‌లు | CWC 2023 PAK Vs AFG: Fans Lambast Pakistan Cricket Team After Shameful Loss Against Afghanistan - Sakshi
Sakshi News home page

WC 2023 PAK Vs AFG: మీకెందుకు వరల్డ్‌కప్‌.. వెంటనే ఫ్లైట్‌ ఎక్కి వచ్చేయండి! పాక్‌పై సెటైర్‌లు

Published Tue, Oct 24 2023 11:59 AM | Last Updated on Tue, Oct 24 2023 5:40 PM

Fans lambast Pakistan cricket team after Shameful loss against Afghanistan - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ చిత్తు అయింది. తొలుత బ్యాటింగ్‌లో పర్వాలేదనపించిన పాకిస్తాన్.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

283 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు పాక్‌ బౌలర్లు తీరు ఎలా ఉందో. షాహీన్‌ అఫ్రిది, హ్యారీస్‌ రవూఫ్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్లకు ఆఫ్గాన్‌ బ్యాటర్లు చుక్కలు చూపించాడు.  కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం(74) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

పాకిస్తాన్‌ జట్టుపై ట్రోల్స్‌.. 
ఈ ఓటమితో పాకిస్తాన్‌ తమ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం. చేసుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ సేన.. రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. ఇక పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓటమిని పాక్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా తమ జట్టును దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మీకెందుకు ఇంకా ఆట.. వెంటనే ఫ్లైట్‌ ఎక్కి పాకిస్తాన్‌ వచ్చేయండి అంటూ ఓ యూజర్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. కాగా పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 27న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 
చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement