basit
-
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే తీరును కనబరిచింది.ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు. "ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్లో లేవు. దయచేసి భారత్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.ప్రస్తుతం బారత జట్టు మెన్జ్మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్‌లా చెలరేగాడు. అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. -
బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో గానీ..: పాక్ క్రికెటర్ విమర్శలు
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్‌కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నై మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ జయభేరి మోగించి బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమనిపించింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే అయితే, వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు.దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులను ఉద్దేశించి బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అసలు మైదానాన్ని ఆరబెట్టనేలేదు. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారోగత రాత్రి వర్షం లేకపోయినా.. సూపర్ సాపర్స్ ఉన్నా.. సోమవారం ఉదయానికి కూడా గ్రౌండ్ ఇంకా చిత్తడిగానే ఉంది. అంటే.. అక్కడి కవర్స్ సరిగ్గా లేవని అర్థం. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో.. వాళ్లు మాత్రం కాన్పూర్‌లో ఇంకోసారి టెస్టు మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధించాలి’’ అని విజ్ఞప్తి చేశాడు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిస్తే.. డబ్ల్యటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో టీమిండియా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోఅగ్రస్థానంలో టీమిండియా అయితే, అందులో ఒక్క మ్యాచ్ డ్రా అయినా.. రోహిత్ సేన చిక్కుల్లో పడుతుంది. ఏదేమైనా కాన్పూర్ స్టేడియానికి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అర్హత మాత్రం లేదు’’ అని బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు గెలిచి.. రెండు ఓడిన భారత్.. ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి రెండోస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనున్న రోహిత్ సేన.. ఆతర్వాత ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక... కాన్పూర్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి బీసీసీఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్‌కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... ‘సి’ బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు.అందుకే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారుదేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్‌లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సోమవారం నాటి నాలుగో రోజు మాత్రం ఆట సజావుగా సాగింది. 107/3తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్.. షాక్‌లో సహచరులు! వీడియో -
మోర్నీ మోర్కెల్ పనికిరాడన్నట్లు చూశారు: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ బౌలర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. అహంభావం పెరిగిపోయి.. ఆటను, కోచ్‌లను కూడా లెక్కచేయని స్థితికి చేరారని మండిపడ్డాడు. అందుకు జట్టు పరాజయాల రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.వరుస వైఫల్యాలతో..గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన బాబర్ సేన.. టీ20 ప్రపంచకప్-2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్-8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లనూ ఇదే తంతు.ఆస్ట్రేలియలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన షాన్ మసూద్ బృందం.. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా.. 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.టీమిండియా వరుస విజయాలతోమరోవైపు.. పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియా ఇటీవలే పొట్టి వరల్డ్‌కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు... వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరవవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా‘‘పాకిస్తానీ బౌలర్లు ... క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా భావిస్తారు. తమ ముందు మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా ప్రవర్తించారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ మమ్మల్ని ఓడించింది. అదే భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచనా విధానం, ప్రవర్తనపైనే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్‌లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు.బౌలింగ్ కోచ్గాటీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు పాక్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్ -
మా వాళ్లకు ఇలాంటివి చేతకావు: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ల తయారీ ఎలా ఉండాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. చెన్నై వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు అద్భుతంగా సాగిందని.. ఇందుకు పిచ్ క్యూరేటర్లే కారణమని కొనియాడాడు.280 పరుగుల తేడాతో విజయంకాగా పాకిస్తాన్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్ టూర్లో ఉంది. ఇందులో భాగంగా చెపాక్ వేదికగా సెప్టెంబరు 19న మొదలైన తొలి టెస్టు మూడున్నర రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.అయితే, పేసర్లకు అనుకూలంగా ఉండే ఎర్రమట్టి పిచ్‌పై జరిగిన భారత్- బంగ్లా మ్యాచ్‌లో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటగా.. పాతబడే కొద్ది స్పిన్నర్లు దుమ్ములేపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. చెన్నై పిచ్ క్యూరేటర్ల పనితనాన్ని ప్రశంసించాడు.ప్రతి బౌలర్ వికెట్లు తీశాడు‘‘బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. జడేజా ఐదు వికెట్లు కూల్చాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా టీమిండియా 20 వికెట్లూ పడగొట్టింది. జట్టులోని ప్రతి బౌలర్ అన్ని రకాలుగా పరీక్షలో పాసయ్యారు.మా వాళ్లకు ఇలాంటివి సాధ్యం కావుపిచ్ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేసిన భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లనూ తుదిజట్టులోకి తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్ బౌలర్లు ప్రభావం చూపారు. ఈ మ్యాచ్ ఇంత బాగా సాగడానికి కారణం పిచ్ క్యూరేటర్లు. క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇవ్వాలి. టెస్టు మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలో వారికి ఎంతబాగా తెలుసో మ్యాచ్ చూశాక అర్థమైంది.మా వాళ్లకు మాత్రం ఇలాంటివి సాధ్యం కావు. మా దేశంలో పిచ్‌లకు ఎలాంటి విలువా లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్లు నిరక్షరాస్యులేనని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడినందుకు గర్వపడే తనకు.. ఇప్పటి పిచ్ క్యూరేటర్లను చూసి కోపం వస్తోందంటూ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆడించింది.చదవండి: రోహిత్‌పై విమర్శలు.. ఎన్ని పరుగులు చేస్తారో చేయండి! పంత్ చెప్పిందిదే! -
‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. షాహిన్ ఆఫ్రిది వంటి పాక్ దిగ్గజాలు ఇప్పటికే ఈ విషయం గురించి పాక్ బోర్డుకు సూచనలు చేయగా.. మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా ఇదే మాట అంటున్నాడు. బాబర్‌కు నాయకత్వ లక్షణలు లేవని.. అతడిని ఇకపై సారథిగా కొనసాగించవద్దని సూచిస్తున్నాడు.సరైన నిర్ణయం తీసుకోకపోతేబాబర్ ఆజం స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని బసిత్ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు గనుక కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. పాక్ క్రికెట్ మరింత భ్రష్టుపట్టిపోతుందని హెచ్చరించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులయ్యారు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అనూహ్యంగా షాహిన్‌పై వేటు వేసిన పాక్ బోర్డు.. తిరిగి వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలను బాబర్‌కు అప్పగించింది. అయితే, గత టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన అతడు.. ఈసారి మాత్రం కనీసం సూపర్-8కు చేర్చలేకపోయాడు. ఫలితంగా బాబర్‌పై వేటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. మహ్మద్ రిజ్వాన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. చాంపియన్స్ వన్డే కప్-2024లో అతడు మార్ఖోర్స్ జట్టును నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. బాబర్ బదులు రిజ్వాన్‌ను పాకిస్తాన్ కెప్టెన్ చేయాలని సూచించాడు.బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు‘‘తన కంటే పాకిస్తాన్‌కు మెరుగైన కెప్టెన్ మరొకరు దొరకరు అనేలా రిజ్వాన్ చాంపియన్స్ కప్‌లో జట్టును నడిపిస్తున్నాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ.. మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు. షాన్ మసూద్ కూడా రిజ్వాన్లా జట్టుకు న్యాయం చేయలేడు.ఈసారి గనుక రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించకపోతే పాకిస్తాన్ క్రికెట్‌కు అంతకంటే భారీ నష్టం మరొకటి ఉండదు. రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ చాంపియన్స్ వన్డే కప్‌లో మహ్మద్ రిజ్వాన్ మార్ఖోర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు ఆదివారం నాటి మ్యాచ్‌లో స్టాలియన్స్‌ను 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక బాబర్ ఆజం స్టాలియన్స్ జట్టుకు ఆడుతుండటం కొసమెరుపు. చదవండి: 4,4,4,4,4: బాబర్ ఆజం ఫోర్ల వర్షం.. అంత ఈజీగా ఎలా కొట్టేశాడు! -
టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.కాసుల వర్షం వల్లేఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.ఇండియా లక్కీనిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు -
Pak vs Ban: పాక్ ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడకూడదు!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ జట్టు మాజీ ఆటగాడు బసిత్ అలీ ధీమా వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లోనూ బంగ్లా కంటే పాక్ ఎంతో మెరుగ్గా ఉందని.. ఒక్క వరణుడు తప్ప పర్యాటక జట్టును ఓటమిని నుంచి ఎవరూ తప్పించలేరని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంటామని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 21న రావల్పిండి వేదికగా ఇరు జట్ల మద్య తొలి టెస్టు ఆరంభం కానుండగా.. ఆగష్టు 30 నుంచి రెండో టెస్టుకు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్లో అడుగుపెట్టింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ను ఆ వరణుడే కాపాడాలి. వర్షం పడలేదంటే వారి ఓటమి ఖాయమే!... అసలు మా జట్టుకు వారితో అసలు పోటీ, పోలికే లేదు. బంగ్లాదేశ్ గడ్డపై ఆ జట్టును ఓడించిన ఉత్సాహంలో పాక్ జట్టు ఉంది’’ అంటూ పాక్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. పాక్ టెస్టు జట్టు కొత్త కోచ్ జాసన్ గిల్లెస్పి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిల్లెస్పిని పాకిస్తాన్ రంగంలోకి దించింది. ఇప్పుడు మావాళ్లు ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడతారో లేదో చూడాలి. ఒకవేళ గిల్లెస్పి ఇదే చేయాలని భావిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై గెలిస్తే తన స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. -
కోహ్లి వరుస వైఫల్యాలు.. పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
శ్రీలంకతో తాజా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్‌లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్‌ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్‌రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. -
WC 2023: కోహ్లిలా ఉండాలన్నందుకు.. నాపై ద్రోహి అనే ముద్ర వేశారు! కానీ..
WC 2023- Babar Azam: ‘‘ఏడాది క్రితం నా చానెల్లో నేను కూడా ఇవే మాటలు చెప్పాను. బాబర్ ఆజం గొప్ప బ్యాటర్. విరాట్ కోహ్లిలాగా అతడు కూడా కెప్టెన్సీ వదిలేస్తే మరిన్ని అద్భుతాలు చేయగలడు. విరాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత బ్యాటర్‌గా మరింత గొప్పగా రాణిస్తున్నాడు. ద్రోహిగా ముద్ర వేశారు అలాగే బాబర్ ఆజం కూడా కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి పెడితే బాగుంటుంది. ఈ మాటలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో కొందరు నన్ను బాబర్ వ్యతిరేకిగా ప్రచారం చేశారు. నాకు బాబర్ ఆజం అంటే ఇష్టం లేదని.. అందుకే ఇలా అంటున్నానని విమర్శించారు. నా మాటలు వక్రీకరించి ద్రోహిగా నాపై ముద్ర వేశారు’’ అని పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అందరూ అదే మాట తాను బాబర్ మంచి కోరితే ద్రోహి అన్నవాళ్లు ఇప్పుడు ఏమంటారో చూడాలని ఉందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగాలనే డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అఫ్గనిస్తాన్ చేతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా వన్డేలో ఓటమి పాలు కావడం.. అది కూడా ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లో పాక్ పరాభవం నేపథ్యంలో బాబర్‌పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. సెమీస్ చేరాలంటే ఈ నేపథ్యంలో బసిత్ అలీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాబర్ ఆజం విషయంలో తనను విమర్శించిన వాళ్లకు ఇలా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత మూడింటిలోనూ ఓడిపోయింది. తదుపరి ఐదు మ్యాచ్‌లలో గెలిస్తేనే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి! -
బాబర్ కెప్టెన్సీ వదిలేయాల్సిందే.. ఆఫ్రిదిని కెప్టెన్ చేయండి.. అప్పుడే!
Babar Azam- Shaheen Afridi: ‘‘బాబర్ ఆజం ఇప్పటికైనా కెప్టెన్సీ వదిలేయాలి. ఒకవేళ తను సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే.. క్రికెట్లో దిగ్గజాలు సృష్టించిన రికార్డులన్నీ బద్దలు కొట్టడం కాయం. కెప్టెన్సీ భారం వల్ల తను పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడు’’ అని పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. బాబర్ ఆజంకు ఐసీసీ పట్టం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నిలకడైన ప్రదర్శనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో రాణించిన బాబర్‌ను ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది. 2022లో ఓవరాల్‌గా 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 54.12 సగటుతో 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దిగ్గజ క్రికెటర్ పేరిట ఏడాది ఉత్తమ ఆటగాడికి ఇచ్చే ‘సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని బాబర్ అందుకుంటాడు. దీంతో పాటు బాబర్ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా ఎంపిక కావడం విశేషం. ప్రశంసల జల్లు వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న అతడు... గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు సాధించాడు. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సొంతగడ్డపై బాబర్ సారథ్యంలో ఇటీవల పలు సిరీస్‌లు ఓడిన వేళ.. కెప్టెన్సీ భారం నుంచి అతడికి విముక్తి కల్పించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. షాహిన్ ఆఫ్రిదిని పాక్ కెప్టెన్‌ను చేయాలని అలీ సూచించాడు. షాహిన్‌ను కెప్టెన్ చేయండి ఈ మేరకు క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘బాబర్ బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి సారించాలి. ఇందుకు కెప్టెన్సీ అడ్డంకి కాకూడదు. తనకు రికార్డులన్నీ బద్దలు కొట్టగల ప్రతిభ ఉంది. షాహిన్ ఆఫ్రిదిని పాక్ కెప్టెన్‌ను చేయాలి. టెస్టులు, వన్డేల పగ్గాలు అతడికి అప్పగించాలి. షాబాద్ ఖాన్‌ను టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌ను చేయాలి’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. అయితే, రషీద్ లతీఫ్ వంటి మరికొంత మంది ఐసీసీ అవార్డుల్లో సత్తా చాటిన బాబర్‌కు ఎవరూ సాటిరారని.. అతడే పాక్ కెప్టెన్‌గా ఉండాలని పేర్కొనడం గమనార్హం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్ జైల్లో ఉన్నా తన పంథా మార్చుకోలేదు. ఇప్పటికీ బరితెగిస్తూ అనేక మందిని జాతి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడు స్మార్ట్‌ఫోన్ సాయంతో ‘ఉగ్ర’నెట్వర్క్ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) నిర్వహిస్తున్న ఆన్లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ను ఇతడే ప్రారంభించాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐఎస్కేపీ ఉగ్రవాది సామి సాయంతో ఈ పని చేశాడు. సామి సైతం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టై ఢిల్లీ జైల్లో ఉన్నాడు. ఐఎస్కేపీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. గతంలో అరెస్టు అయి బెయిల్‌పై వచ్చిన బాసిత్‌ను ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన దంపతులు జహన్ జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. బాసిత్ ఆదేశాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా వీళ్లు ప్రేరేపించారు. జైల్లో ఉన్న బాసిత్, బయట ఉన్న సామి కలిసి ‘వాయిస్ ఆఫ్ హింద్’ను మొదలెట్టారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో పాటు ఓ వర్గాన్ని మిగిలిన వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఓ దశలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరిని ఢిల్లీకి రప్పించిన బాసిత్ ఓక్లా ప్రాంతంలోని జామియానగర్‌లో ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీళ్లు అరెస్టయినా.. ‘వాయిస్ ఆఫ్ హింద్’ సంచికలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఏడు ఎడిషన్స్ రావడంతో బాసిత్ నెట్‌వర్క్‌లో మరికొందరు బయట ఉన్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగించిన బాసిత్ పుణేకు చెందిన నబీల్ ఎస్ ఖాత్రి, సాదియా అన్వర్ షేక్‌లను ఐఎస్‌కేపీలో కీలకంగా మార్చాడు. ఎన్ఐఏ అధికారులు బుధవారం ఈ ఐదుగురి పైనా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎవరీ బాసిత్?: చాంద్రాయణగుట్ట పరిధిలోని గుల్షాన్ ఇక్బాల్ కాలనీకి చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన భావజాలంలో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్, ఐఎస్కేపీల్లో కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
బాసిత్ కోణంలోనూ ఆంద్రాబీ విచారణ?
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్–ఏ–మిల్లత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అసియా ఆంద్రాబీని నగరవాసి అబ్దుల్లా బాసిత్ కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు విచారించనున్నారని తెలిసింది. ఆమె ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన నిధుల సమీకరణ కేసులో అరెస్టు అయి, ప్రస్తుతం ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ అదుపులో ఉన్నది. ఈమెకు నగరంతోనూ కొన్నిలింకులు ఉన్నాయి. 2015లో నగరంలో చిక్కిన బాసిత్ నేతృత్వంలోని ‘ఐసిస్ త్రయం’సైతం కశ్మీర్ వెళ్లి ఈమెను కలవడానికి ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ఉగ్ర నిధుల కేసులో ఎన్ఐఏ అధికారులు ఈ నెల 4న అసియా ఆంద్రాబీతోపాటు ముసరత్ ఆలం, షాబీర్ షాలను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పది రోజులపాటు వీరిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అప్పట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కుటుంబాన్ని 2014లో నగరంలో ఆమె పరామర్శించి వెళ్లినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అబ్దుల్లా బాసిత్(గత ఏడాది మళ్లీ అరెస్టు అయ్యాడు) సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను 2015 డిసెంబర్లో సిట్ పోలీసులు నాగ్‌పూర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ‘సిమి’సలావుద్దీన్‌కు బంధువులైన వీరు నాగ్‌పూర్ నుంచి విమానంలో శ్రీనగర్ వెళ్లి అసియాను కలవాలనే ఉద్దేశంతో బయలుదేరారనే విష యం వెలుగులోకి వచ్చింది. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో విద్యనభ్యసించాడు. ఈ నేపథ్యంలోనే 2012లోనూ ఆంద్రాబీ ఓసారి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారని సమాచారం. పాక్ అనుకూలవాదిగా ముద్రపడ్డ ఆంద్రాబీ 2015 సెప్టెంబర్‌లో కశ్మీర్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేశారు. 2016లో ఓ సందర్భంలో జాతీయ మీడియాతో మాట్లాడిన అసియా హైదరాబాద్ వచ్చి సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. తాజాగా ‘అబుదాబి మాడ్యుల్’ కేసులో గత ఏడాది బాసిత్ అరెస్టు కావడం, ఇప్పుడు ఆంద్రాబీ సైతం ఎన్ఐఏ కస్టడీలో ఉండటంతో ఆమెను బాసిత్‌కు సంబంధించిన వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది. -
పేలుడు పదార్థాల బాధ్యత ఖదీర్‌కు!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ తేలికైనా విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. అబుధాబి మాడ్యూల్‌కు సంబంధించిన ‘ఐసిస్ ద్వయం’అబ్దుల్లా బాసిత్, అబ్దుల్ ఖదీర్ మాత్రం ఈ వ్యవహారంలో తెలివిగా వ్యవహరించారు. సంప్రదాయేతర ‘విధ్వంస’ వనరులపై దృష్టి పెట్టారు. ఈ బాధ్యతల్ని సూత్రధారి బాసిత్ ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. శనివారం నగరంలో అరెస్టు చేసిన వీరిని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం 11 రోజులు (ఈ నెల 24 వరకు) పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆర్డీ ఎక్స్, అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించే ప్రయత్నంలో నిఘాకు చిక్కే ప్రమాదం ఉం దని సాధారణ వస్తువులపై ఐసిస్ ద్వయం దృష్టిపెట్టింది. ఈ అంశంపై ఖదీర్ ఇంటర్నెట్లో సుదీర్ఘ అధ్యయనమే చేశాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి వీటిని సమీకరించాడు. షహీన్‌నగర్‌లోని తన ఇంటితోపాటు తన బంధువు ఇంట్లోనూ వీటిపై ప్రయోగాలు చేశాడే కానీ, ఇంకా సఫలీకృతుడు కాలేదు. ఎన్ఐఏ అధికారులు ఇతడి ఇంటి నుంచి ఈ పదార్థాలతోపాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటినీ పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబోరేటరీకి పంపారు. ఇలాంటి పదార్థాలు మార్కెట్లో తేలిగ్గా దొరకడంతోపాటు ఎవరికీ అనుమానం రాదనే వీటిని ఎంపిక చేసుకున్నామని బాసిత్, ఖదీర్ ఎన్ఐఏకు తెలిపారు. 2014 నుంచి ఐసిస్ భావజాలం... 2014 నుంచి ఐసిస్ భావజాలంతో ఉండి, రెండుసార్లు దేశం దాటేందుకు యత్నించి చిక్కిన, ఇప్పటికీ రెండుసార్లు అరెస్టు అయిన అబ్దుల్లా బాసిత్‌కు ‘ఉగ్రస్ఫూర్తి’ఇచ్చింది అతడి సమీప బంధువు సలావుద్దీన్. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబై వెళ్లి అక్కడి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాడు. ఆపై రెండేళ్లపాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్రం నిషేధించిన తరవాత సలావుద్దీన్ దుబాయ్‌కు మకాం మార్చాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాసిత్‌లో మార్పు తీసుకురావాలని కుటుంబీకులు ఓ యువతితో వివాహం చేసినా అతడిలో మార్పు రాలేదని అధికారులు చెప్తున్నారు. -
ఐసిస్‌తో లింకులపై ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది. ‘అబుధాబి మాడ్యూల్’కేసు దర్యాప్తులో భాగంగా గత సోమవారం నుంచి నగరంలో సోదాలు చేపట్టి పలువురిని విచారించిన ఎన్ఐఏ...ఆధారాలు లభించడంతో మహ్మద్ అబ్దుల్లా బాసిత్ (24), మహ్మద్ అబ్దుల్ ఖదీర్ (19)లను అరెస్టు చేసింది. అనంతరం ట్రాన్సిట్ వారంట్‌పై ఢిల్లీ తరలించింది. అలాగే మరో ఆరుగురు అనుమానితుల్ని విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. సోమవారం ఇద్దరు నిందితుల్నీ ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరు పరిచి తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనుంది. అబ్దుల్లా బాసిత్ అరెస్టు కావడం గత రెండున్నరేళ్లలో ఇది రెండోసారి. ఈ కేసులో ఎన్ఐఏ 2016 జనవరిలో షేక్ అజర్ ఉల్ ఇస్లామ్, అద్నాన్ హసన్, మహ్మద్ ఫర్హాన్ షేక్‌లను అరెస్టు చేసింది. నగరంలోని హఫీజ్ బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్‌ను అద్నాన్ హసన్ గతంలోనే ఆకర్షించాడు. దీంతో 2014 ఆగస్టులో మరికొందరితో కలసి సిరియా వెళ్లేందుకు బాసిత్ ప్రయత్నించి కోల్‌కతాలో దొరికాడు. అప్పుడు వారందరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా తీరు మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు పీఓకే వెళ్లేందుకు ప్రయత్నించి 2015లో నాగ్‌పూర్‌లో దొరికారు. దీంతో సిట్ పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. గతేడాది ఓ జాతీయ చానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో బాసిత్ ఉగ్రవాద ఆకర్షిత భావ జాలం ప్రదర్శించడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఒకప్పుడు ఐసిస్ సానుభూతిపరుల నుంచి నిధులు పొందిన బాసిత్ ఇటీవల సొంతంగా నిధులు సమీకరించి విదేశాలకు పంపినట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. అబుధాబి మాడ్యుల్ కేసు దర్యాప్తులో వెలుగులోకొచ్చిన అంశాల ఆధారంగా ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ రంగంలోకి దిగడంతో బాసిత్‌తోపాటు ఖదీర్, మరో ఆరుగురి ఉదంతం బయటపడింది. ఆధారాలు లభించడంతో బాసిత్, ఖదీర్ లను అరెస్టు చేసి మిగిలిన వారిని విచారణ కోసం ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. -
చెన్నైలో ఉద్రిక్తత.. మేమున్నామంటూ!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్ధితిపై ఆందోళనలు నెలకొనడంతో రాజధాని చెన్నైలో రోడ్లపై వాహనాల జాడ కనిపించడం లేదు. నగరంలో ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఎలాంటి వసతి లేక అవస్ధలు పడుతున్న వారికి సాయం చేసేందుకు ఓ వాలంటీర్ల బృందం ముందుకొచ్చింది. బసిత్, బాలాజీ ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు వాలంటీర్లు నగరంలో ఎవరైనా ఎమర్జెన్సీని ఎదుర్కొన్నా, అత్యవసరంగా ప్రయాణించాల్సివున్నా తమను సంప్రదించాలంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశారు. వీరు ఇరువురు చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరికైనా అత్యవసరమైన పరిస్ధితి ఉంటే వారి లొకేషన్ ను వాట్సాప్ ద్వారాగాని, ఎస్ఎంఎస్ ద్వారాగాని తమకు పంపింతే.. సాయం అందించడానికి ప్రయత్నిస్తామని వారు పోస్టులో పేర్కొన్నారు. అవది, పొరూర్, చ్రోమేపేట్, తాంబరం, పాది-అంబత్తూర్లలో ఇప్పటికే 18మంది వాలంటీర్లు అత్యవసర పరిస్ధితి ఎదుర్కొంటున్నవారికి సాయం అందిస్తూ.. మరింత మంది వాలంటీర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.