పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే తీరును కనబరిచింది.
ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది.
రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్‌లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.
ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటించాడు.
"ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్‌లో లేవు. దయచేసి భారత్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు.
శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.
ప్రస్తుతం బారత జట్టు మెన్‌జ్‌మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్‌లా చెలరేగాడు.
అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment