టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న షమీ.. డిసెంబర్ 26 నుంచి ఆసీస్‌తో జరగనున్న నాలుగో టెస్టుతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
కాగా చీలమండ గాయం నుంచి కోలుకున్న షమీ ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌తో తిరిగి మైదానంలో అడగుపెట్టాడు. ఈ టోర్నీలో బెంగాల్‌కు షమీ ప్రాతినిథ్యం వహించాడు. షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. అయితే షమీ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికి ఎన్సీఏ నుంచి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందలేదు.
అతడికి ఒకట్రెండు రోజుల్లో ఎన్సీఏ వైద్య బృందం ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వినికిడి. అక్కడ అతడు ఉత్తీర్ణత సాధిస్తే వెంటనే ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు షమీ దూరం కావడం ఖాయమైంది.
ఇదే విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో జరిగే మూడో టెస్టులో మహ్మద్ షమీ సేవలు భారత్‌కు ఎంతో అవసరమని అలీ అభిప్రాయపడ్డాడు.
"మహ్మద్ షమీ ఆఖరి రెండు టెస్టుల్లో ఆడనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అతడిని నాలుగో టెస్టు నుంచి ఆడిస్తే భారత్‌కు ఏమి ప్రయోజనం ఉండదు. షమీని ఇప్పుడే ఆస్ట్రేలియాకు పంపండి. బ్రిస్బేన్‌లో జరిగే మూడో టెస్టులో షమీని ఆడించిండి.
అంతేతప్ప మెల్‌బోర్న్ టెస్టులో ఆడించాలనుకుంటే దయచేసి అతడిని ఆస్ట్రేలియాకు పంపించవద్దు. ఎందుకంటే షమీ సేవలు భారత జట్టుకు ఇప్పుడు ఎంతో అవసరం. భారత పేస్ ఎటాక్‌కు అతడు నాయకత్వం వహిస్తాడని" బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: 'రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి.. అతడి సత్తా ఏంటో మనకు తెలుసు'
Comments
Please login to add a commentAdd a comment