బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో తలపడనుంది. సొంతగడ్డపై అక్టోబరు 16 నుంచి కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్ మొదలుపెట్టనుంది. అనంతరం నవంబరులో బోర్డర్ గావస్కర్ ట్రోపీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఫైనల్‌గా ఆసీస్‌తో
అక్కడ భారత జట్టు కంగారూ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. ఇక ఆసీస్‌తో ఈ సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-2లో టీమిండియా ప్రయాణం ముగియనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరువైన రోహిత్ సేన.. ఆసీస్‌పై మరోసారి పైచేయి సాధించి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.
ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదంటూ..
అయితే, ఈ మెగా సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, అతడు ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని.. ఆసీస్‌తో సిరీస్‌కూ దూరమయ్యాడని వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ విషయంపై షమీ ఘాటుగా స్పందించాడు.
సిరీస్‌కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?
‘‘ఎందుకీ నిరాధారణ వార్తలు? పూర్తిగా కోలుకోవడానికి నా శక్తినంతా ధారపోస్తూ.. తీవ్రంగా శ్రమిస్తున్నాను. బీసీసీఐ గానీ.. లేదంటే నేను గానీ.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి నేను తప్పుకొన్నానని చెప్పలేదు కదా!
మీ పబ్లిసిటీ కోసం దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి. ఎవరో పనికిమాలిన వ్యక్తులు, తమకు తోచింది మాట్లాడే వ్యక్తులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా నకిలీ వార్తలను సృష్టించకండి. ముఖ్యంగా.. నేను ఏదేనా స్వయంగా చెప్పిన తర్వాతే ఓ అంచనాకు రండి’’ అని షమీ సోషల్ మీడియా వేదికగా గాసిప్‌రాయుళ్లకు చురకలు అంటించాడు.
చీలమండ గాయానికి సర్జరీ
కాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మహ్మద్ షమీకి.. ఈ టోర్నీ తర్వాత చీలమండ గాయం తీవ్రమైంది. దీంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఇంతవరకు మళ్లీ బరిలోకి దిగలేదు. దాదాపు పది నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment