Mohammed Shami Completes 400 Wickets In International Cricket Of All Formats - Sakshi
Sakshi News home page

IND Vs AUS 1st Test: అశ్విన్‌దే కాదు షమీది కూడా రికార్డే

Published Thu, Feb 9 2023 9:20 PM | Last Updated on Fri, Feb 10 2023 9:57 AM

Mohammed Shami Completes 400 Wickets International Cricket All Formats - Sakshi

నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 450 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ  ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా  టెస్టులలో  అతి తక్కువ మ్యాచ్‌ల్లో (89 మ్యాచ్‌లు) 450 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే అశ్విన్‌తో పాటు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ కూడా ఒక రికార్డు అందుకున్నాడు. 

అదేంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి షమీ 400 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో తొలి టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ను ఔట్‌ చేయడం ద్వారా షమీ 400వ వికెట్‌ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి  400 ప్లస్ వికెట్లు సాధించిన భారత బౌలర్లలో చోటు సాధించాడు.

ఈ జాబితాలో షమీ  9వ స్థానంలో నిలిచాడు. అయితే భారత పేసర్ల విషయంలో  చూస్తే మాత్రం షమీ.. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, శ్రీనాథ్, ఇషాంత్ ల తర్వాత ఐదో స్థానంలో ఉన్నాడు. మిగతా వాళ్లంతా స్పిన్నర్లు. షమీ ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్ లో 61 టెస్టులు ఆడి  217 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేలలో 159 వికెట్లు, 23 టీ20లలో  24 వికెట్లు తీశాడు. 

అనిల్ కుంబ్లే - 953 వికెట్లు
హర్భజన్ సింగ్ - 707 
కపిల్ దేవ్ - 687 
ఆర్. అశ్విన్ - 672
జహీర్ ఖాన్ - 597
జవగల్ శ్రీనాథ్ - 551
 రవీంద్ర జడేజా - 482 
ఇషాంత్ శర్మ - 434 
మహ్మద్ షమీ -  400 వికెట్లు 

చదవండి: Ravindra Jadeja: పాంచ్‌ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా

'జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement