బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
కాన్పూర్‌లో వెంటాడిన వరణుడు
డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడింది. చెన్నై మ్యాచ్‌లో 280 పరుగులతో బంగ్లాను మట్టికరిపించి శుభారంభం అందుకున్న టీమిండియాను.. కాన్పూర్‌లో వరణుడు వెంటాడాడు. వర్షం కారణంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. రెండు, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దైపోయింది.
డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు
ఈ నేపథ్యంలో భారత్- బంగ్లా రెండో టెస్టు డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, టీమిండియా మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ‘బజ్‌బాల్’ క్రికెట్‌ను తలదన్నే ఫార్ములాతో అద్భుతం చేసింది. వర్షం లేకపోవడం.. మైదానం పొడిగా ఉండటంతో నాలుగో రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.
భారత బౌలర్ల విజృంభణ
బంగ్లాదేశ్ సోమవారం... తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 107/3ను మొదలుపెట్టగా.. ఆది నుంచే భారత బౌలర్లు విజృంభించారు. బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లా ఓపెనర్లను అవుట్ చేయగా.. పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు కూల్చారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.
‘బజ్‌బాల్’ క్రికెట్‌కే వణుకుపుట్టించే వేగంతో
ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆకాశమే హద్దుగా బంగ్లా బౌలింగ్‌ను చితక్కొట్టింది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా.. ‘బజ్‌బాల్’ క్రికెట్‌కే వణుకుపుట్టించే వేగంతో 50, 100. 200 పరుగుల మైలురాళ్లను దాటింది. వచ్చిన ప్రతి బ్యాటరూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచి వీలైనన్ని పరుగులు పిండుకున్నారు.
ఈ క్రమంలో 34.4 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 285 పరుగులు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మీద 52 పరుగుల ఆధిక్యం సంపాదించి. ఈ క్రమంలో బంగ్లా నాలుగో రోజే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.
ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం
ఇక ఆఖరి రోజు ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన రోహిత్ సేన.. ఆది నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. నైట్ వాచ్‌మన్ మొమినుల్ హక్(2) వికెట్ తీసి శుభారంభం అందించగా.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం(50)ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపాడు. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ముష్ఫికర్ రహీం(37)ను బుమ్రా అవుట్ చేశాడు.
చకచకా పడగొట్టేశారు
మొత్తంగా బుమ్రా, అశూ, జడ్డూ మూడేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతా కలిసి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మీద బంగ్లాదేశ్ ఆధిక్యం 94 పరుగులు కాగా.. రోహిత్ సేన విజయ లక్ష్యంగా 95 పరుగులుగా మారింది.
ఫోర్‌తో విజయం ఖరారు చేసిన పంత్
ఇక త్వరగా మ్యాచ్ ముగించేయాలని భావించిన టీమిండియా దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టింది. దీంతో రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. యశస్వి జైస్వాల్(51) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శుబ్‌మన్ గిల్ 6 పరుగులకే పరిమితం కాగా.. కోహ్లి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. డ్రా అవుతుందని ఊహించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పక్కా ప్రణాళికతో గెలుపొందడం అభిమానులను ఖుషీ చేసింది.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు
వేదిక: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్
టాస్: టీమిండియా.. బౌలింగ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగుల ఆలౌట్
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3
ఫలితం: ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం
చదవండి: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్..
Rishabh Pant hits the winning runs 💥
He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏
Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF— BCCI (@BCCI) October 1, 2024
Comments
Please login to add a commentAdd a comment